దశ దినాలు మరియు ఖుర్బానీ ప్రాశస్త్యం

అంతిమ దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ''కాలం తిరిగి యధాస్థితికి-అల్లాహ్‌ భూమ్యా కాశాలను సృష్టించిన నాటి స్థితికి వచ్చేసింది. ఏడాదిలో పన్నెండు మాసాలుంటాయి. వాటి లో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (పవిత్ర మైనవి) వాటిలో మూడు మాసాలు ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. అవే- జుల్‌ ఖఅద, జుల్‌హిజ్జ, ముహర్రం, నాల్గవ మాసం రజబ్‌. ఇది జమాదివుల్‌ ఆఖిర్‌ - షాబాన్‌ నెలలకీ మధ్య ఉంటుంది''. (బుఖారి)

అంతిమ దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”కాలం తిరిగి యధాస్థితికి-అల్లాహ్‌ భూమ్యా కాశాలను సృష్టించిన నాటి స్థితికి వచ్చేసింది. ఏడాదిలో పన్నెండు మాసాలుంటాయి. వాటి లో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (పవిత్ర మైనవి) వాటిలో మూడు మాసాలు ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. అవే- జుల్‌ ఖఅద, జుల్‌హిజ్జ, ముహర్రం, నాల్గవ మాసం రజబ్‌. ఇది జమాదివుల్‌ ఆఖిర్‌ – షాబాన్‌ నెలలకీ మధ్య ఉంటుంది”. (బుఖారి)

షేక్ హబీబుర్రహ్మన్ జామాయీ

దైవదాసులు పుణ్యాలు చేసి అత్యంత శ్రేష్ఠ మయిన సామగ్రి అయిన ‘తఖ్వా’ను మూట కట్టుకోవాలనీ, వారి జీవితాలు పునీతమవ్వాల నీ ఆ పరమదాత కొన్ని వసంత రుతువుల్ని కేటాయించాడు. ఆ శుభవంత మమయిన, పవిత్రమయిన రుతువుల్లో ఓ పుణ్య రుతువే జుల్‌ హిజ్జ మాసపు మొదటి పది రోజులు. ఆ విషయానికొస్తే, ప్రవక్త (స)వారి కాలం నాటి నుండి సజ్జనులయిన మన పూర్వీకులు మూడు పదులను గొప్ప విగా భావించే వారు.1) జుల్‌హిజ్జా మొదటి పది రోజులు. 2) రమజాను మాసపు చివరి పది రోజులు. 3) ముహర్రమ్‌ మాస పు తొలి పది రోజులు.

అల్లాహ్‌ కొన్ని ప్రత్యేక సమయాలను ఇతర సమయాలపై, కొన్ని నెలలను ఇతర నెలలపై, కొన్ని దినాలను, రాత్రులను ఇతర దినాలు, రాత్రులపై ప్రాముఖ్యత నిచ్చి శుభప్రదమై నవిగా ఖరారు చేశాడు. ఆ ప్రత్యేక దినాలలో చేయబడే పుణ్యకార్యాలు అనేక రెట్లు గణింప బడతాయి. ఆ ప్రత్యేక, శుభప్రదమైన దినాల లో జుల్‌హిజ్జ మాసపు పది దినాలు కూడా ఉన్నాయి. అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: ”నిశ్చ యంగా నెలల సంఖ్య అల్లాహ్‌ా దగ్గర – అల్లాహ్‌ా గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచే (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం”. (తౌబా:36)

అంతిమ దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”కాలం తిరిగి యధాస్థితికి-అల్లాహ్‌ భూమ్యా కాశాలను సృష్టించిన నాటి స్థితికి వచ్చేసింది. ఏడాదిలో పన్నెండు మాసాలుంటాయి. వాటి లో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (పవిత్ర మైనవి) వాటిలో మూడు మాసాలు ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. అవే- జుల్‌ ఖఅద, జుల్‌హిజ్జ, ముహర్రం, నాల్గవ మాసం రజబ్‌. ఇది జమాదివుల్‌ ఆఖిర్‌ – షాబాన్‌ నెలలకీ మధ్య ఉంటుంది”. (బుఖారి)

జుల్‌ హిజ్జ మాసపు పది దినాల ప్రాముఖ్యత:

1) అల్లాహ్‌ా ఈ దినాలపై ప్రమాణం చేయ టం: ”ఉషోదయం సాక్షిగా! పది రాత్రుల సాక్షిగా!”. (అల్‌ ఫజ్ర్‌:1-2)
‘పది రాత్రులు’ అంటే జుల్‌ హిజ్జ నెలలోని మొదట పది రాత్రులని అత్యధిక మంది ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు.
2) సంవత్సరంలోని ఇతర దినాల కంటే జుల్‌ హిజ్జ మాసపు మొదటి పది రోజులు ఉత్తమ మైనవి: ”జుల్‌ హిజ్జ నెలలోని ప్రథమ థకం లో చేసిన పుణ్య కార్యాలు అల్లాహ్‌ాకు అన్నిటి కన్నా ఎక్కువ ప్రియమైనవి, ఆ ఖరికి దైవ మార్గంలోజరిపిన పోరాటం కూడా దీనంతగా ప్రియమైనది కాదు. అయితే మనిషి తన ధన, ప్రాణాలు పణంగా పెట్టి అమరగతి నొందే పోరాటం సంగతి వేరు” అని మహా ప్రవక్త (స) ప్రవచించారు. (బుఖారి)
3) జుల్‌ హిజ్జ మాసపు తొలి పది రోజుల లోనే ‘అరఫా’ రోజు ఉంది: హజ్‌కి అసలైన రోజు అరఫా రోజు. అనగా పాపాల క్షమా పణ, నరకం నుంచి విముక్తి పొందే రోజు.
4) జుల్‌ హిజ్జ మాసపు తొలి పది రోజులలో నే ‘యౌమున్నహర్‌’ (ఖుర్బానీ దినం): దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”దినాలలో అన్నింటికంటే ఉత్తమమైన దినం యౌము న్నహర్‌ -ఖుర్బానీ దినం”. (అబూ దావూద్‌, నసాయి) ఈ హదీసు ఆధారంగా కొంత మంది పండితులు దినాలలో అన్నింటికంటె ఉత్తమమైన దినం యౌమున్నహర్‌. అనగా జుల్‌ హిజ్జ మాసపు పదవ రోజు (పండగ రోజు) అనంటారు.
5) జుల్‌ హిజ్జ మాసపు తొలి పది రోజులలో ని ప్రార్థనలు: ఇబ్నెహజర్‌ (ర) ఇలా అన్నారు: ”ముఖ్యమైన ప్రార్థలన్నీ ఉదా: నమాజు, ఉప వాసం, సదఖా, హజ్‌ మొదలగు ప్రార్థలన్నీ ఈ పది రోజులలో జమ అవుతాయి. మిగతా రోజుల్లో అలా జరగదు”.(ఫత్‌హుల్‌ బారీ)

జుల్‌ హిజ్జ తొలి పది రోజులలో చేసే ముస్తహబ్‌ పనులు

1) హజ్‌ ఉమ్రాకు సంబంధించిన కార్యాలను నెరవేర్చటం.
2) ‘అరఫా’ రోజు ఉపవాసం ఉండటం: దైవ ప్రవక్త (స) అరఫా రోజు యొక్క ప్రాముఖ్యత చెబుతూ ఇలా ప్రవచించారు: ”అరఫా దిన మున ఉండే ఉపవాసం రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళనం చేస్తుంది.” (ముస్లిం)
3) ఫర్జ్‌ నమాజులను, వాటి సమయాలలో నెరవేర్చటం ప్రతి ముస్లిం తప్పనిసరి విధి. నఫిల్‌ నమాజులను కూడా ఎక్కువగా పాటిం చాలి.ఎందుకంటే,అల్లాహ్‌ా ప్రసన్నత పొందేం దుకు ఇవి ముఖ్య కారకాలు గనక. దైవప్రవక్త (స), అల్లాహ్‌ా మాటను తెలియజేస్తూ ఇలా అన్నారు: ”నా దాసుడు నఫిల్‌ నమాజుల వలన నాకు అతి దగ్గరగా అవుతుంటాడు, చివరికి నేనతన్ని ఇష్ట పడతాను…..”. (బుఖారి)
4) జిక్ర్‌ చేయటం: (దైవనామ స్మరణ): దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”పుణ్య కార్యాలు అమితంగా ఇష్టపడే దినాలలో జుల్‌ హిజ్జ మాసపు పది దినాలు కాకుండా అల్లాహ్‌ దృష్టిలో వేరే దినాలేమీ లేవు. కాబట్టి ఈ సమయంలో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’ ‘అల్లాహు అక్బర్‌’ అల్‌ హమ్దులిల్లాహ్‌ా’ ఎక్కు వగా పఠించండి”. (అహ్మద్‌)
5) సదఖా చేయటం: సదఖా చేయటం సత్కా ర్యాలలో ఒకటి. ఈ రోజులలో చేయటం ముస్తహబ్‌. అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: ”ఓ విశ్వాసులారా! వ్యాపార లావాదేవీలుగానీ, స్నేహబంధాలుగానీ, సిఫార్సులుగానీ, ఉండని ఆ రోజు రాక ముందే మేము మీకు ప్రసాదిం చిన దానిలో నుంచి ఖర్చు చేయండి. వాస్తవా నికి తిరస్కారులే దుర్మార్గులు”.(అల్‌బఖర:254)
6. ఖుర్బానీ ఇవ్వటం; దైవప్రవక్త (స) ప్రతి సంవత్సరం ఖుర్బానీ ఇచ్చేవారు. ఆయన (స) ఇలా సెలవిచ్చారు: ”ఖుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి కూడా ఖుర్బానీ ఇవ్వని వాడు మా ఈద్గాహ్‌ాకు రాకూడదు”. (ఇబ్నెమాజహ్‌ా)

ఖుర్బానీ ప్రాశస్త్యం

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశించారు: ”జుల్‌ హిజ్జ పదవ తేది (పండుగ రోజు) ఆదం పుత్రుడు ఇచ్చే ఖుర్బా నీకన్నా అల్లాహ్‌ా దృష్టిలో మరే పుణ్య కార్య మూ గొప్పది కాదు. ఖుర్బానీ జంతువులు ప్రళయం నాడు తమ కొమ్ములు, ఖురములు
మరియు వెంట్రుకలతో సహా వచ్చి సాక్ష్యమి స్తాయి. అలాగే ఖుర్బానీ పశువు రక్తం నేలపై పడక ముందే అల్లాహ్‌ దగ్గర దాని ఖుర్బానీ ఎంతో ఘనతాదరణలతో స్వీకరించబడు తుంది. కనుక మీరు సంతోషంగా, మనస్ఫూ ర్తిగా ఖుర్బానీ ఇస్తూ ఉండండి”. (తిర్మిజీ).

ఖుర్బానీ గురించి ముఖ్యమైన ఆదేశాలు

1) ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్నవారు జుల్‌ హిజ్జ మాసపు నెలవంకను చూసినప్పటి నుంచి ఖుర్బానీ ఇచ్చేంత వరకు గోళ్ళు, వెం ట్రుకలు ఏమీ కత్తిరించుకోకూడదు. (ముస్లిం)
2) ఖుర్బానీ ఇచ్చే జంతువు లోపాల నుండి సురక్షితంగా ఉండాలి. ఒంటి కన్ను పశువు, కుంటి పశువు, రోగగ్రస్తు పశువు, ఎముక ల్లో సత్తువ లేకుండా బాగా ముసలిదైపోయిన పశువు ఇవ్వకూడదు.
3) పండుగ నమాజ్‌ అనంతరం నుండి జుల్‌ హిజ్జ 13వ తేదీ సాయంత్రం వరకు ఖుర్బానీ ఇవ్వచ్చు. అనగా నాలుగు రోజులు (పండుగ రోజు, ఆ తర్వాత మూడు రోజులు) అయితే పండుగ నమాజ్‌ అనంతరం జిబహ్‌ా చేయ టం ఉత్తమం.
4) ఖుర్బానీ కోసం ప్రత్యేకంగా ఒక పశువుని ఖుర్బానీ ఇచ్చే స్తోమత లేనివారు ఏడుగురు కలిసి ఒక ఆవుని లేక పది మంది కలిసి ఒక ఒంటెను ఖుర్బానీ ఇవ్వవచ్చు.
5) ఖుర్బానీ ఇచ్చేవారు స్వయంగా తమ చేతులతో పశువుని ఖుర్బానీ చేయటం ఉత్త మం.
6) స్త్రీలు కూడా తమ స్వహస్తాలతో ఖుర్బానీ చేయవచ్చు.
7) ఖుర్బానీ మాంసం స్వయంగా తినడమేకాక సదఖా కూడా చేయాలి. అల్లాహ్‌ా ఇలా సెలవి చ్చాడు: ”వాటిని మీరు తినండి, అడగని అభా గ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తిని పించండి”. (హజ్‌:36) ఈ ఆయత్‌ ఆధారం గా కొంత మంది పండితులు ఖుర్బానీ మాం సాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఒక భాగం: ఖుర్బానీ ఇచ్చినవారి కోసం. రెండవ భాగం: యాచకులకు, నిరుపేదలకు, అగత్య పరుల కోసం. మూడవ భాగం: తమను కలు సుకునే బంధుమిత్రులకు, ఇరుగుపొరుగు వారి కోసం బహుమానంగా.
8) అజ్‌హా పండుగనాడు ఈద్గాహ్‌ాకు ఏమి తినకుండా, తక్బీర్లు పఠిస్తూ వెళ్ళాలి. స్త్రీలు కూడా వెళ్ళాలి.
9) ఖుర్బానీ చర్మం అమ్మి సొమ్ము చేసుకో కూడదు, అలాగే కసాయి వానికి కూలిగా ఇవ్వకూడదు.తమ అవసరాల కోసం ఉపయో గించాలి, లేదా దానమైనా చేయాలి.

 

Related Post