సత్యానికి బధ్దులై జీవించండి – లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యదేవుడు మరొకడు లేడు) ముహమ్మదుర్రసూలుల్లాహ్ (హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త) అని మనఃపూర్వకంగా సాక్షమిచ్చి అల్లాహ్ అభీష్టాన్ని అనుసరించేవారు, మహనీయ ముహమ్మద్ (స) అడుగుజాడల్లో నడిచేవారు విశ్వాసులుగా, ముస్లిములుగా పరిగణించ బడతారు.
”ఈమాన్” (విశ్వాసం) వాస్తవికత రీత్యా ఒక ఒప్పందం. ఒక బేరం. ఒక ఒప్పుకోలు. తత్ఫలితంగా అల్లాహ్‌ను తన ప్రభువుగా విశ్వసిం చిన ముస్లిం ‘నేను’ అన్న అభిమతాన్ని విడనాడి, ‘నాది’ అన్న మమ కారాన్ని మరచి అల్లాహ్ అభీష్టానికి బద్ధుడయి మెలుగుతాడు. అతని ప్రవర్తనలో అతని నైజంలో ఎక్కడా స్వేఛ్చాయుత విధానం కానరాదు. తాను ఏమి చేయాలో ఏమి చేయకూడదో తానే స్వయంగా నిర్ణయిం చుకోకుండా తన ప్రభువు ఇఛ్చకు, అభీష్టానికి అనుగుణంగానే మస లుకుాండు.మహనీయ ముహమ్మద్ (స.అ.సం)వారి అనుకరణలోనే జీవిస్తాడు. నిజ ముస్లిం ఆలోచన రీత్యాను, ఆచరణ రీత్యాను, తన ఇస్లామీయ జీవన వైఖరి ద్వారా, తన సత్ప్రవర్తన ద్వారా దైవతిరస్కార జీవన వైఖరి నుండి పూర్తి భిన్నంగా అగు పడతాడు. ఎందువల్లనంటే, అతను అల్లాహ్‌ానే తన జీవన్మరణాలకు , శక్తిసామార్థ్యాలకు, ధనం వనరులూ సాధనాలకు సంపూర్ణ అధికారిగా, సిసలయిన యజమాని గా నిజస్వామిగా భావిస్తాడు కనుక.
ఈ యదార్థాన్ని గురించే విశ్వప్రభువు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ”వాస్తవానికి అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను, వారి ధన సంపత్తిని స్వర్గం మూల్యంగా కొనుకున్నాడు. వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు. చంపుతారు.చంపబడతారు”.(అత్ తౌబా:111)
పై వాక్యంలో కొన్ని వాస్తవాలను వెల్లడి చేయడం జరిగింది. అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ధన, ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొనుక్కు న్నాడు. కాస్త ఆలోచించండి .విశ్వాసుల వద్ద ఉన్న సకల వస్తువులను సృష్టించినవాడు అల్లాహ్‌యే అయినప్పుడు,విశ్వాసులు వినియోగించే శక్తి సామార్థ్యాలనూ, ధన సంపత్తినీ వారికి అనుగ్రహించిన వాడూ అల్లాహ్‌యే అయినప్పుడు క్రయవిక్రయాల ప్రశ్న ఎలా తలెత్తుతుంది? వాస్తవానికి విశ్వాసులు అల్లాహ్‌కు అమ్మానికి తమ వద్ద తమదంటూ ఏమీ లేదు. అలాగే విశ్వాసుల నుండి అల్లాహ్ కొనడానికి ఆయనకు చెందనిదంటూ ఏమీ లేదు. వాస్తవికత రీత్యా మనమందరమూ అల్లాహ్ దాసులమే. మన వద్ద ఉన్నదంతా అల్లాహ్ అనుగ్రహించినదే. మనం అల్లాహ్ కరుణా కటాక్షాలపైనే ఆధారపడి జీవిస్తున్నాము. అయితే మన వద్ద మనకే స్వంతమయిన వస్తువు మనలో ఒకటుంది. అదే మన ‘ఇఛ్చ’. అంటే మనం ఏదైనా సంకల్పించుకోవడానికీ, మనం ఏదైనా చేయడానికీ, మనం దేన్నయినా ఎన్నుకోవడానికీ మనకు’స్వేఛ్చా యుత సత్తా’ లభించింది.
ఈ పరిమిత ‘స్వేఛ్చ’ కారణంగా ‘ అల్లాహ్‌యే మన ధన ప్రాణాలకు సిసలయిన యజమాని అన్న వాస్తవికత మారదు. మనం కోరుకుంటే అసలు వాస్తవికతను స్వీకరించనూ వచ్చు లేదా నిరాకరించనూ వచ్చు. అయితే విశ్వాసి, ముస్లిం అల్లాహ్ పక్షాన ఎలాంటి బలవంతం లేకుండా తన స్వంత విషయంలోనూ, శక్తిసామార్థ్యాలలోనూ, బుధ్దీ వివేకాలలోనూ, ధన సంపత్తిలోనూ అల్లాహ్‌కు గల అధికారాలను స్వీకరించి ఆయన అభీష్టానికి అనుగుణంగా జీవితం గడుపుతాడు. అల్లాహ్ ఇష్టానికి వ్యతిరేకంగా విచ్చలవిడిగా విశృంఖలత్వంగా వ్యవ హరించడు. అతను తన వాక్కు ద్వారా, తన ప్రవర్తన ద్వారా ”నా నమాజ్, నా ఆరాధనా విధులన్నీ, నా జీవితం, నా మరణం, సర్వం నిఖల జగతికి ప్రభువ యిన అల్లాహ్ కొరకే” (6 అల్ అన్ఆమ్: 162) అంటూ అల్లాహ్‌తో తనకున్న అనుబంధాన్ని ఎలాంటి సంశయానికి లోనవకుండా వ్యక్త పరుస్తాడు.
విశ్వాసులు బలవంతంగా కాకుండా తమ ఇష్ట పూర్వకంగా అల్లాహ్ అనుగ్రహాలను అల్లాహ్ అనుగ్రహంగా అంగీకరిస్తారు. అల్లాహ్ అనుగ్రహాల యెడల స్వేఛ్చాయుత స్వాములుగా కాకుండా అమానతు దారులు గా వినియోగించుకోవడానికి ఒప్పుకుాంరు. అల్లాహ్ వారికి ఇచ్చిన స్వేఛ్చను వారే ఐఛ్చికంగా మనఃపూర్వకంగా పరిత్యజిస్తారు. అల్లాహ్ దాస్య మార్గంలో ఎన్ని ఆటంకాలు ఎదురయినా , దైవ విరోధులు సత్య తిరస్కారులు అవిశ్వాసులు ఎన్ని అవరోధాలను సృష్టించినా అలసత్వాని కి, పిరికితనానికి లోనవకుండా అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు. అల్లాహ్ కొరకు, ఆయన ధర్మం కొరకు, స్వర్గం కొరకు తమ సమయం, తమ సొమ్ము, తమ స్వప్రయోజనాలు, తమ ప్రణాలు సయితం త్యాగం చేయ డానికి వెనుకాడరు. నిజమయిన విశ్వాసులు నిజంగానే అల్లాహ్ వారికి అనుగ్రహించిన ప్రాణాలను,సిరిసంపదల్ని అల్లాహ్ కొరకే త్యాగం చేసి, వీటికి ఆయనే సిసలయిన స్వామి అని మనసా,వాచా,కర్మణా నిరూపిస్తారు. తమ ప్రభువు అల్లాహ్‌ాతో చేసిన ఒప్పందాన్ని నెరవేరుస్తారు.
కారుణ్య ప్రభువు అల్లాహ్ విశ్వాసులు, ముస్లిములు చేసిన త్యాగాలకు ప్రతి మూల్యంగా మరణానంతర జీవితంలో స్వర్గం ప్రసాదిస్తాడు.
ఈమాన్ వాస్తవికతను అంగీకరించినవారు, అల్లాహ్ వాగ్దానాలను స్వీకరించినవారు, సున్నితమయిన సమయంలో అల్లాహ్ ప్రసాదించిన ప్రాణాలను, ధనాన్నీ , సర్వస్వాన్నీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండే వారు- ఇలాంటి వారే నిజమయిన విశ్వాసులు, నిజమయిన ముస్లిములు అల్లాహ్ స్వర్గానికి సిసలయిన వారసులు.
ఈమాన్(విశ్వాసం) ఇస్లాం (దైవ విధేయత)కు విరుద్ధమయిన జీవన వైఖరి, కుఫ్ర్ (దైవ తిరస్కారం, అవిధేయత). విశ్వాసులు,ముస్లిములు అల్లాహ్ కన్నా, ఆయన సందేశహరుడు ముహమ్మద్(స.అ.సం)కన్నా, అల్లాహ్ ధర్మం కన్నా ఎక్కువగా తమ ఆత్మీయులకు రక్త సంబంధీకులకు, సిరిసంపదలకు ససేమిరా ప్రాధాన్యతనివ్వకూడదు. తమ ప్రభువు అల్లాహ్‌ా ఆగ్రహానికి గురికాకుండా అప్రమత్తంగా మసలు కోవాలి.