నామకరణం: సూరతుల్ అన్‌ఫాల్
‘అన్‌ఫాల్’ అని ఈ సూరహ్‌కు నామకరణం చెయ్యడానికి గల కారణం – మొదటి ఆయతులో వచ్చిన ‘అన్‌ఫాల్’ ప్రస్తావనే. అన్ఫాల్ అన్నది నఫల్ బహువచనం. అర్థం అదనపు వస్తువు. దీన్నే యుద్ధ ప్రాప్తి అని కూడా అంటా రు. పూర్వం సముదాయాలపై యుద్ధ ప్రాప్తి నిషిద్ధంగా ఉండేది. కానీ ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయనికి దీన్ని హలాల్ చెయ్యడం జరిగింది. ఇది అదనంగా అందిన వస్తువు.
సూరహ్ పరిచయం:
1) ఇది మదనీ సూరహ్. 30 మరియు 36 ఆయతులు తప్ప-ఇవి మక్కీ ఆయతులు.
2) ఇది మసాని సూరాలలోని ఒకటి.
3) దీని ఆయతుల సంక్య 75.
4) క్రమానుసారం ఇది 8వ సూరహ్.
5) ఇది సూరహ్ బఖరహ్ తర్వాత అవతరించింది.
6) ఈ సూరహ్‌లో కుటుంబ ఆదేశాలు, యుద్ద, సంధి, యద్ధప్రాప్తి ఆదేశాలున్నాయి.
7) ఇది 10వ భాగంలో ఉంది. ఇందులో 1 హిజ్బ్ రెండు రుబువులున్నాయి.
ముఖ్యాంశాలు:
ఇది మదనీ సూరాలలోనిది. ఇందులో యుద్ధ సమయంలో విశ్వాసులు పాటించాల్సిన యుద్ధ నీతి ప్రస్తావన ఉంది. సంధి కోసం అవలంబించాల్సిన విధి విధానాలున్నాయి. యుద్ధ ప్రాప్తిని ఎవరు, ఎవరికి ఎంత ఇవ్వాలన్న వివరణలూ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా పాటించడం ప్రతి ముస్లిం మీద తప్పనిసరి.
అవతరణ నేపథ్యం:
బద్ర్ యుద్ధానంతరం దైవదూత జిబ్రీల్ (అ) ప్రవక్త (స) వారి దగ్గరకు వచ్చి: ”ఏమి? మీరు ఆయుధాలను ప్రక్కబెట్టేశారా? మేమేమో నమ్మద్రోహానికి పాల్పడివారిని ఓ పట్టు పట్టాలని ఉన్నాము. పదండీ! అల్లాహ్ బనూ ఖురైజా విషయంలో వారికి బుద్ధి చెప్పాల్సిందిగా అల్లాహ్‌ా అనుమతినిచ్చాడు” అన్నారు. అప్పుడు ఈ ఆఉతుల అవతరించింది, మరియు ఒకవేళ నీకు ఏ జాతి వారి వల్లనైనా నమ్మకద్రోహం జరుగుతుందనే భయం ఉంటే – మీరు ఇరుపక్షం వారు సరిసమానులని తెలుపటానికి – (వారి ఒప్పందాన్ని) వారి వైపుకు విసరివేయి. నిశ్చయంగా, అల్లాహ్ నమ్మకద్రోహులంటే ఇష్టపడడు. (58) బనూ ఖురైజాకి చెందిన యూదులు యుద్ధ సమయంలో తోడుంటామని మాటి చ్చి మాట తప్పారు.
2) సఅద్ బిన్ జుబైర్ (ర) కథనం ప్రకారం – బద్ర్ సంగ్రామ సందర్భంలో ప్రతి వీశ్వాసి 10 మంది అవిశ్వాసులతో పోరాడటం తప్పని సరిగా చెయ్యడం జరిగిందిఓ ప్రవక్తా! విశ్వాసులను యుధ్ధానికి ప్రోత్సహించు. మీలో ఇరవైమంది స్థైర్యంగల వారుంటే, వారు రెండువందల మందిని జయించ గలరు. మరియు మీరు వందమంది ఉంటే వేయిమంది సత్యతిరస్కారులను జయించ గలరు. ఎందు కంటే వారు (సత్యాన్ని) గ్రహించలేని జాతికి చెందిన వారు. (65) బద్ర్ సంగ్రామానంతరం కాసింత వెసులుబాటును ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అల్లాహ్ మీ భారాన్ని తగ్గించాడు, ఎందుకంటే వాస్తవానికి, మీలో బలహీనత ఉన్నదని ఆయనకు తెలుసు. కాబట్టి మీలో వందమంది స్థైర్యం గలవారు ఉంటే వారు రెండువందల మందిని జయించ గలరు. మరియు మీరు వేయిమంది ఉంటే, అల్లాహ్ సెలవుతో రెండువేల మందిని జయించ గలరు. మరియు అల్లాహ్ సహనం గలవారితో ఉంటాడు. (66)