సూరతుల్‌ కహఫ్‌

నామకరణం: సూరతుల్‌ కహఫ్‌

ఈ సూరహ్‌కు ‘అల్‌ కహఫ్‌’ అని నామకరణం చెయ్యడానికి గల కారణం – ఇందులో పేర్కొన బడిన మాహద్భుత సంఘటన కహఫ్‌ (గుహ) వారి గాథే. యువకులయిన కొందరు విశ్వాసులు అప్పి నియంత రాజు నుండి తమ విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తం ఆడవి దారి ప్టారు. అక్కడ ఓ గుహలో వారు ప్రవేశించగా అల్లాహ్‌ వారిని 309 సంవత్సరాల వరకూ నిద్ర పుచ్చేశాడు. పరిస్థితులు చక్కబడ్డాక వారిని తిరిగి మళ్ళీ బతికించడం జరిగింది.

అబుద్దర్దా (ర) గారి కథనం – సూరతుల్‌  కహఫ్‌లోని తొలి 10 ఆయతులు కంఠస్థం చేసుకున్న వ్యక్తి దజ్జాల్‌ ఉపద్రవం నుండి కాపాడ బడతాడు.

సూరహ్‌ పరిచయం:

1) ఇది మక్కీ సూరహ్‌. 28, మరియు 107 నుండి 110 వరకూ ఆయతులు మదీనాలో అవతరించాయి.

2) ఇది మియీన్‌ సూరాలలోనిది.

3) ఆయతుల సంక్య 110.

4) క్రమానుసారం ఇది 18వ సూరహ్‌.

5) ఇది సూరహ్‌ గాషియహ్‌ తర్వాత అవతరించింది.

5) ఇది (الحمد لله)  ప్రశంస పదాలతో మొదలవుతుంది.

ముఖ్యాంశాలు:

ఇది ఇతర మక్కీ సూరాల మాదిరిగానే తౌహీద్‌, రిసాలత్‌, ఆఖిరత్‌ గురించి మ్టాడుతుంది. ఇది (الحمد لله )తో మొదలయినయే అయిదు సూరాలలో ఒకటి. (الحمد لله)తో మొదలయ్యే సూరాలు 1) అల్‌ ఫాతిహా 2) అల్‌ అన్‌ఆమ్‌ 3) అల్‌ కహఫ్‌ 4) అస్సబా 5) ఫాతిర్‌. ఇవన్నీ అల్లాహ్‌ ఘనతా విశిష్ఠతలను చాటుతూ మొదలవుతాయి. ఇందులో గుహ వారి గాథ, మూసా (అ) మరియు సజ్జన దాసును (ఖిజర్‌-అ) వారి గాథ, ఇద్దరు మిత్రుల గాథ,  జుల్‌ ఖర్‌నైన్‌ గాథ మొద లయినవి ఉన్నాయి.

అవతరణ నేపథ్యం:

1) అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) గారి కథనం – మక్కా అవిశ్వాస నాయకులయిన ఉత్బా బిన్‌ రబీఅహ్, షైబా బిన్‌ రబీఅహ్‌, అబూ జహల్‌ మొదలయిన వారు ప్రవక్త (స) వారికి వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు పన్ని ఆయన్ను అన్ని విధాలా హింసించే ప్రయత్నం చేసేవారు. ఈ విషయం ప్రవక్త (స) వారికి చాలా బాధేసింది. అప్పుడు ఈ ఆయతులు అవతరించాయి. ఈ సందేశాన్ని విశ్వసించని వారి వైఖరి వల్ల దుఃఖపడి బహుశా నీవు నీ ప్రాణాన్నే కోల్పోతావేమో! (6)

2) సల్మాన్‌ ఫారసీ (ర) ఇలా అన్నారు: ఉయైనా బిన్‌ హిస్‌న్‌ మరియు అఖ్‌రా బిన్‌ హాబిస్‌ అను నవ ముస్లింలు ప్రవక్త (స) వారి దగ్గరకు వచ్చి మీరు సభలో కూర్చున్నప్పుడు బీదవాళ్ళ సల్మాన్‌, అబూ జర్‌ మొదలయిన వారిని కాస్త ఎడంగా పెట్టండి. మేము మీ దగ్గర కూర్చుని మీతో మాట్లాడాలనుకుంటున్నాము అన్నారు. అప్పుడు ఈ ఆయతులు అవతరించాయి.  మరియు (ఓ ప్రవక్తా!) ఎవరు ఆయన ముఖదర్శనం (ప్రసన్నతను) కోరుతూ, ఉదయం మరియు సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తున్నారో, వారి సహచర్యంలోనే, సహనం వహించి ఉండు. ఇహలోక ఆడంబరాలను అపేక్షించి నీ దృష్టిని వారి నుండి దాట నివ్వకు (వారిని ఉపేక్షించకు). మరియు అలాంటి వానిని అనుసరించకు (మాటవినకు), ఎవడి హృదయాన్ని మా ధ్యానం నుండి తొల గించామో మరియు ఎవడు తన మనోవాంఛ లను అనుసరిస్తున్నాడో మరియు ఎవడి వ్యవహారాలు (కర్మలు) వ్యర్థమయ్యాయో! (28)

3) మక్కా అవిశ్వాసులు కొందరిని మదీనాకు పంపించి అక్కడి నుండి గత చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకొని రావాల్సిందిగా  పురమాయించారు. అలా వచ్చిన వారు మూడు విషయాల్ని అడిగారు. 1) ఆత్మ గురించి చెప్పండి. 2) గుహ వారి గురించి చెప్పండి. 3) జుల్‌ ఖర్‌నైన్‌ గురించి చెప్పండి. ఈ మూడింలో ఆత్మ గురించి సూరహ్‌ ఇస్రాలో చెప్ప బడితే, మిగిలిన రెండు విషయాల గురించి ఈ సూరహ్‌ాలో చెప్ప బడింది.

ఈ సూరహ్‌ ఘనత:

అబుద్దర్దా (ర) గారి కథనం – సూరతుల్‌  కహఫ్‌లోని తొలి 10 ఆయతులు కంఠస్థం చేసుకున్న వ్యక్తి దజ్జాల్‌ ఉపద్రవం నుండి కాపాడ బడతాడు.

హజ్రత్‌ ఆయిషా (ర) గారి కథనం – ఈ సూరహ్‌ చివరి పది ఆయతులు కంఠస్థం చేసుకున్న వ్యక్తి తల నుండి కాలి గోటి వరకు ఒక విధమయినటువిం కాంతిని ప్రసాదించడం జరుగుతుంది.

 

 

Related Post