”ఎవరయితే తన ప్రభువుకు భయ పడుతూ ఉండేవారో, వారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు పంప బడతారు. తుదకు వారు అక్కడకు చేరుకునేటప్పటికే దాని ద్వారాలు తెరవ బడి ఉంటాయి. స్వర్గం పర్యవేక్షకులు వారినుద్దేశించి, ‘మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా ఉండండి. శాశ్వతంగా ఉండేందుకు ఇందులో ప్రవేశిం చండి” అంటారు. (అజ్జుమర్: 73)
అప్పుడు వారు ఇలా అంటారు: ”అల్లాహ్‌కే ప్రశంసలు. ఆయన మాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మమ్మల్ని ఈ భూమికి వారసులుగా చేశాడు. ఇక స్వర్గంలో మేము కోరిన చోటల్లా ఉంటాము. మొత్తానికి (మంచి) కర్మలు చేసే వారికి లభించే ప్రతిఫలం ఎంత గొప్పది”. (74)
కొంప ముంచిన అమరత్వ కాంక్ష:
జీవితం, తిరుగు లేని జీవితం, అంతు లేని జీవితం, అమరత్వ కాంక్షే మనిషి మొది తప్పు చేసేలా చేసింది. ”మరి షైతాన్ అతన్ని కవ్వించాడు. ‘ఓ ఆదమ్! నేను నీకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించే వృక్షాన్ని, ఎన్నిటికీ పాత బడని సామ్రాజ్యాన్ని చూపించనా?” అన్నాడు. (తాహా: 120)
ఎంత సంపాదించినా కూటికే, ఎంత జీవించినా కాటికే.
ఆ రోజు మొదలు ఈ రోజు వరకు షైతాన్ మనిషికి రకరకాల ఆశలు చూపించి ఊరిస్తూనే, ఉడికిస్తూనే, ఇరికిస్తూనే ఉన్నాడు. అదే స్వర్గ అన్వేషణలో మనిషి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఆందోళన, అశాంతి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మనిషి బలమైన కాంక్షల్లో అమరత్వ కాంక్ష కూడా ఒకటి. దాన్ని పొందడానికి ప్రయత్ని స్తూనే అతను కాటికి చేరుకుాండు. అల్లాహ్ ఇలా అంటున్నాడు: ”అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుాంరు” (తకాసుర్: 1,2)
ఎవరు ఎంత కాలం, ఎన్ని భోగ భాగ్యాలతో జీవించినా ఏదోక రోజు మరణించాల్సిందే. ”భూమి మీద ఉన్న ప్రతిదీ నశిస్తుంది”. (అర్రహ్మాన్: 26)
యాజమాన్య కాంక్ష.
మనిషిలోని బలమైన కోరికల్లో మరో కోరిక ధన, యాజమాన్య కాంక్ష. అతను వస్తు సంపదలను, వ్యక్తులను, బంధాలను తన సొంతం చేసుకో వాలనుకుాండు. అందమైన అద్దాల మేడ తనకుండాలని, విస్తారమయిన వ్యాపారం తనకుండాలని, రవి అస్తమిమచని రాజ్యం తనకుండాలనుకుంటాడు. ప్రతి మేలిమి వస్తువు అతని ముంగిట తల వంచా లని, ప్రతి వస్తువు మీద అతని పెత్తనం చెల్లాలని, అతనికి నచ్చింది, అతను మెచ్చింది ప్రతిదీ అతని వశం కావాలన్నది అతని జీవిత కలగా ఉంటుంది.
”బాగా తెలుసుకోండి! ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, తమాషా అలంకార ప్రాయం, పరస్పరం బడాయిని చాటుకోవడం, సిరిసంప దలు, సంతానం విషయంలో ఒండొకరిని మించి పోవడానికి ప్రయ త్నించడం మాత్రమే…. మొత్తానికి ప్రాపంచిక జీవితం మభ్య పెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు”. (అల్ హదీద్: 20)
గౌరవానికి, అగౌరవానికి ప్రమాణం ఉన్నత హోదాలు, ధన సంపదలు, విస్తారమయిన ప్రజా సంబంధాలు కాదు. ”మానవులంతా ఒకే వర్గం తయారవుతారనే మాటే గనక లేకుంటే, కరుణామయుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించే వారి ఇళ్ళ పైకప్పులను, వారు ఎక్కే మెట్లను (కూడా) మేము వెండితో చేసి ఉండేవారము. వారి ఇళ్ల తలు పులను, వారు దిండ్లకు ఆనుకుని కూర్చునే పీఠాలను కూడా (వెండితో చేసి ఉండే వారము. బంగారు వస్తువులుగా కూడా చేసి ఉండేవారము. ఇదంతా ఐహిక జీవితపు లాభం మాత్రమే”. (అజ్జుఖ్రుఫ్: 33-35)
అమరత్వ కాంక్ష, యాజమాన్య కాంక్ష తీరే మార్గం లేదా?
మీరు శాశ్వత జీవితాన్ని కోరుకుంటున్నారా? మీరు వృధాప్యమే వద్దను కుంటున్నారా? రోగాలను నుండి శాశ్వత రక్షణ కోరుకుంటున్నారా? బాధల నుండి ముక్తి పొందాలనుకుంటున్నారా? దానికి మార్గం ఒక్కటే. అదే స్వర్గధామం! అక్కడ శాశ్వత జీవితం ఉంటుంది. పుష్కల ఆరోగ్యం ఉంటుంది. శాశ్వత యవ్వనం ఉంటుంది. శాశ్వత సంతోషం ఉంటుంది. జీవించాలనుకున్న వారు స్వర్గం కోసం జీవించాలి, మరణించాలనుకున్నవారు స్వర్గాన్ని పొందడానికి మరణించాలి. అల్లాహ్ ఇలా అంటున్నాడు: ”పోటి పడేవారు ఈ విషయంలో పోటీ పడాలి”. (అల్ ముతఫ్ఫిఫీన్: 26)
స్వర్గాన్ని పొండానికి మనం మన సర్వశ్వాన్ని ధార బోసినా లాభం తప్ప. నష్టమేమి లేదు. ”మీ మనసు కోరిందల్లా, మీరు అడిగిందల్లా అందులో మీకు లభిస్తుంది. క్షమాశీలి, దయాకరుడు (అయిన అల్లాహ్) తరఫున లభించే ఆతిథ్యమిది”. (ఫుస్సిలత్: 31)
స్వర్గంలో ఏముంటుంది?
స్వర్గంలో రంగు ఉంటుంది. స్వర్గంలో రుచి ఉంటుంది. స్వర్గంలో కస్తూరీ పరిమళం ఉంటుంది. స్వర్గంలో సౌదర్యం ఉంటుంది. స్వర్గంలో మనసుని రంజింపజేసే రకరకాల వస్తులుంటాయి. స్వర్గంలో గౌరవం, కీర్తి ఉంటుంది. స్వర్గంలో ప్రశాంతత ఉంటుంది. స్వర్గంలో ప్రైవసీ ఉంటుంది.
స్వర్గంలో ఏమి ఉండదు?
స్వర్గంలో బాధ ఉండదు, స్వర్గంలో రోగం ఉండదు. స్వర్గంలో నొప్పి ఉండదు, స్వర్గంలో ఆవేదన ఉండదు, స్వర్గంలో ఆందోళన ఉండదు. స్వర్గంలో దగా, మోసం ఉండదు. స్వర్గంలో కష్టం ఉండదు. స్వర్గంలో అసూయ, రాగ ధ్వేషాలుండవు. స్వర్గంలో విడిపోతామన్న భయం ఉండదు. స్వర్గంలో మనకు వరానుగ్రహాలను కాజేస్తారేమోనన్న శంక ఉండదు.
స్వర్గం ఎలా ఉంటుంది?
స్వర్గం చాలా అందంగా ఉంటుంది. ఎంతగానంటే, ”ఏ చూపు చూడ నంత, ఏ చేవి విననంత, ఏ ప్రాణి హృదయంలో ఊహా చిత్రం సయితం మెదలనంత. స్వర్గ వస్త్రాలు చాలా అందంగా ఉంాయి. స్వఛ్చమ యిన పట్టు వస్త్రాలు. 70 జతలు తొడిగినా లోపలి అవయవాలు కని పించేటంత. స్వర్గపు సెలయేర్లు చాలా అందంగా ఉంాయి. స్వచ్ఛమ యిన పాల నదులు, తేనె నదులు. ఆ నదులకు ఇరువైపు అలంకరించ బడిన ముత్యాలు పగడాలు. వాటి లోపలి కంకర్రాళ్ళు మణి మాణిక్యాలు. స్వర్గపు సుకన్యలు చాలా అందంగా ఉంారు. స్వర్గ తలు పులు చాలా అందంగా ఉంటాయి. స్వర్గపు భవనాలు, కోటలు, బిడారులు చాలా అందంగా ఉంటాయి. ఆ తర్వాత….
స్వర్గంలో ప్రతి వస్తువు మన స్వాధీనంలో ఉంటుంది. స్వర్గ భోగ భాగ్యాలు శాశ్వతంగా ఉంాయి. అంతం కాని అధికారం ఉంటుంది. స్వర్గంలో శాంతి, సుస్థిరతలు ఉంటాయి. స్వర్గంలో మనసుకు నచ్చింది ఉంటుంది. మనసుకు మెచ్చింది చెయ్యవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, స్వర్గ అన్వేషణే మన ధ్యేయం, అల్లాహ్‌ను రాజీ పర్చుకుని స్వర్గాన్ని సొంతం చేసుకోవడమే మన జీవతాశయం. అల్లాహ్ ఇలా అంటున్నాడు: ”నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ధన, ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నాడు”.(తౌబహ్: 111)
ఆ పిదప ఏం జరుగుతుంది?
”ఎవరయితే తమ ప్రభువుకు భయ పడుతూ ఉండేవారో, వారు బృందాలు బృందాలుగా స్వర్గం వైపునకు తరలింప బడతారు. తుదకు వారు అక్కడకు చేరుకనేటప్పటికీ దాని ద్వారాలు తెరవ బడి ఉంాయి”. (అజ్జుమర్: 73)
క్రమం తప్పకుండా నమాజు చదివే వారు, ఉపవాసాలు ఉండేవారు, జకాత్ చెల్లించే వారు, హజ్జ్ చేసేవారు, నిరుపేదల్ని ఆదుకునే వారు, వితంతువుల బాగోగులు గమనించే వారు, అనాథలకు ఆశ్రయం ఇచ్చే వారు, జిహాద్ చేసేవారు… అందరూ ఆ బృందాల్లో ఉంటారు.
ఆ బృందాల అధినాయకుడు ఎవరు? జెండా ఎవరిది?
స్వర్గంలో ప్రవేశించక పూర్వమే ప్రియ ప్రవక్త ముహమ్మద్(స) వారి పవిత్ర దర్శనం జరుగుతుంది. ప్రవక్త (స) ఇలా అన్నారు: ఆదం సంత తికి చెందిన సమస్త జనులు ప్రళయ దినాన నా జెండా క్రింద ఉంటారు. నా కోసం మాత్రమే స్వర్గపు తలుపు మొదట తెరవ బడుతుంది”. (సహీహుల్ జామె)
ఆనక ఏం జరుగుతుంది? ”ప్రళయ దినాన స్వర్గపు తలుపు నా కోసం తెరవ బడుతుంది. స్వర్గ పర్యవేక్షకుడు ఇలా అంటాడు: ”ఎవరు మీరు?” నేనాంను – ముహమ్మద్ (స). అతను అంటాడు: ”నాకు మీ గురించి ఆదేశించ బడింది – మీకు ముందు ఎవ్వరి కోసం కూడా స్వర్గపు తలుపు తెరవ కూడదు” అని. (ముస్లిం)
”స్వర్గ పర్యవేక్షకులు వారినుద్దేశించి, ‘మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా ఉండండి.శాశ్వతంగా ఉండేందుకు అందులో ప్రవేశించండి”. (అని ఘన స్వాగతం పలుకుతారు). (అజ్జుమర్: 73)
నిత్య ఆనంద నిలయం స్వర్గం:
స్వర్గం-అక్కడ ఎటు చూసినా ప్రేమ. ఎక్కడకెళ్ళినా శాంతి. ఎప్పుడూ సంతోషం. అక్కడ అవమానం, అనుమానం ఉండదు. అక్కడ అవ హేళన, అసహ్యం ఉండదు. అక్కడ అసూయ, ధ్వేషం ఉండదు. అందరికి అందరి తరఫున ఎంత ప్రేమ కావాలో అమత ప్రేమ దొరుకు తుంది. అక్కడ రంగు,భాష, ప్రాతం, దేశం అన్న కృత్రిమ గీతలుండవు.
ఒక్క నిమిషం ఆలోచించండి! మనిషి చేసుకున్న ఈ ప్రాపంచిక విభజన ఎంత అన్యాయపూరితమెనది, ఎంత ఘోరమైనది? అతను ప్రపంచాన్ని ఎన్ని భాషల్లో, ఎన్ని రంగుల్లో, ఎన్ని కులాల్లో, ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని దేశాల్లో విభజించాడు? వంశం, దేశం, మతం పేరు తో ఎంత విధ్వంశ్వాన్ని సృష్టిస్తున్నాడు? ఒక అగ్ర దేశం మరో దేశాన్ని ఆక్రమించుకోవాలంటే, ఎన్ని ఊర్లు బుగ్గి పాలవుతున్నాయో? ఎందరి మానాలు మంట గలుస్తున్నాయో? ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయో? ఎంత మంది పసి పిల్లలు చిదిమి వేయ బడుతున్నారో? రాస్తే సీరా ఇంకి పోతుంది, చెబితే పెదాలు ఎండి పోతాయి. స్వర్గంలో ఇవేమీ ఉండవు. ఎవరికీ ఎవరి నుండి ఎలాిం ఇబ్బంది ఎదురవ్వదు. అక్కడ ఏ ఆర్గనైజేషన్ ఉండదు. అక్కడ ఏ సోసౖీె ఉండదు. అక్కడ ఏ సంస్థా ఉండదు. ఎలాిం ముందస్తు డిమాండ్ లేకుండానే ప్రతి ఒక్కరికి వారి హక్కు, వారు కోరుకున్నది దక్కుతుంది. ”ఓ మానవుడా! ఉదాత్తుడయిన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడ వేసింది. యదార్థా నికి ఆయనే నిన్ను ప్టుించాడు. నిన్ను చక్కగా తీర్చి దిద్దాడు. ఆపైన నిన్ను తగు తీరిలో పొందికగా మలిచాడు. తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు”. (అల్ ఇన్ఫితార్: 6-8)
స్వర్గ వాసులు స్వర్గంలో ఎలా ప్రవేశిస్తారు?
”స్వర్గంలో ప్రవేశించే తొలి బృందం – పూర్ణ చంద్రునిలా ప్రవేశిస్తారు”. (బుఖారీ,ముస్లిం)
”స్వర్గ వాసులకు కాలకృత్యాల అవసరం ఉండదు. వారికి ఉమ్ము రాదు. వారి దువ్వెనలు బంగారు దువ్వెనలయి ఉంటాయి. వారి శరీరం నుండి వెలువడే చెమట కస్తూరీ సువాసన గుభాళింపు కలిగి ఉంటుంది. అందరూ ఆది మానవుడు మరియు ప్రవక్త అయిన ఆదమ్ (అ) అంతి ఎత్తు, అందం కలిగి ఉంటారు” (బుఖారీ)
”స్వర్గంలో ప్రవేశించే వారు అపార అనుగ్రహాల మధ్య ఉంటారు. లేమి అనేది ఉండదు. వారు తొడిగిన దుస్తులు మాసి పోవు. వారి యవ్వనం తరగదు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
స్వర్గంలో ముందు ఎవరు ప్రవేశిస్తారు?
లక్షాది కారులయిన ముస్లింలు కాదు. కోట్లకు పడగలెత్తిన కుబేరులు అంతకన్నా కాదు. కడు నిరుపేదలు. కటిక దారిద్య్రంలో కత్తి మీద సాములా విశ్వాసాన్ని కాపాడుకుంటూ బతికినవారు. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నిశ్చయంగా ఎప్పుడూ దేశ దిమ్మరులు తిరుగుతూ ఉండే, (ఒక చోట స్థిర నివాసం లేని) ముహాజిర్లలోని నిరుపేదలు, ధనికుల కన్నా 40 సంవత్సరాల ముందు స్వర్గంలో ప్రవేశిస్తారు”. (ముస్లిం)
స్వర్గపు పాత్రలు:
”రెండు రజిత (వెండి) స్వర్గాలు. వాటిలోని ప్రాతలు, సమస్తం వెండివి అయి ఉంటాయి. రెండు పసిడి స్వర్గాలు. అందులోని పాత్రలు, సమస్తం వెండివి అయి ఉంటాయి”. (బుఖారీ, ముస్లిం)
స్వర్గ సుకన్యలు:
”ఒకవేళ స్వర్గ సుకన్య ప్రపంచ వాసుల ముందుకు వస్తే, భుమ్యాకాశాల మధ్యనున్న సమస్తాన్ని ప్రకాశమానం చేసేస్తుంది. కస్తూరీ సువా సనతో వాటిని నింపేస్తుంది. ఆమె తలపై గల దుపట్టా ప్రపంచం, ప్రపంచంలోని సకల వస్తువులకంటే ఎంతో మేలయినది”. (బుఖారీ)
స్వర్గపు బిడారు:
”విశ్వాసి కోసం స్వర్గంలో ఒక బిడారు ఉంటుంది. అది ఒకే ఒక్క ముత్యంతో తయారు చేయబడి ఉంటుంది. దాని పొడుగు 60 మైళ్ల దూరమయి ఉంటుంది. అందులో విశ్వాసి భార్యలుంటారు. అయితే ఒకరు ఇంకొరిని చూడలేరు”. (ముస్లిం)
స్వర్గపు వృక్షం:
”నిశ్చయంగా స్వర్గంలో ఒక వృక్షం ఉంది. చాలా వేగవంతమయిన సవారిపై ఉన్న వ్యక్తి వంద సంవత్సరాలు పరుగులు తీసినా దాన్ని దాట లేడు”. (ముస్లిం)
చివర్లో స్వర్గానికెళ్ళే స్వర్గవాసి:
”ప్రపంచం అంతి స్వర్గాన్ని అతనికిచ్చి ఇలా అనబడుతుంది: ”ఇదంతా నీదే. దీనితోపాటు పదింతలు పెంచి నీకు ఇవ్వ బడుతుంది. ఇక్కడ నీ మనసుకు నచ్చింది నీకు దక్కుతుంది. నీ కన్ను పడిన ప్రతిదీ నీదవు తుంది”. (బుఖారీ, ముస్లిం)
స్వర్గపు అన్ని తలుపుల గుండా పిలుపు అందుకునే అదృష్టవంతులు:
”ఒక విశ్వాసికి ముగ్గురు పిల్లలుండి, వారు యవ్వన స్థాయికి చేరుకోక ముందే మరణిస్తే – అతని ఆ పిల్లలు స్వర్గపు ఎనిమిది తలుపుల్లో ఏ తలుపు నుండి అతను ప్రవేశించాలనుకుంటే ఆ తలుపు దగ్గర అతన్ని స్వాగతించ డానికి నిలబడి ఉంారు”. (ఇబ్ను మాజహ్)
”ఏ స్త్రీ అయితే తనపై విధిగావించ బడిన అయిదు పుటల నమాజు క్రమం తప్పకుండా పాటిస్తుందో, తనపై విధిగావించబడిన (రమజాన్) పూర్తి మాసపు ఉపవాసాలు నిష్ఠగా పాటిస్తుందో,తన శీలాన్ని కాపాడు కుంటుందో, తన భర్తకు విధేయత చూపుతుందో-ఆమెతో ఇలా అనబడుతుంది: ”స్వర్గపు ఎనిమిది ద్వారాలోని నీకిష్టమయిన మార్గం గుండా నువ్వు స్వర్గంలో ప్రవేశించు” అని. (సహీహుల్ జామె)
”మీలో ఎవరయితే చక్కగా వుజూ చేసి, వుజూ పూర్తయ్యాక – అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూ లుహూ, అల్లా హుమ్మజ్అల్నీ మినత్తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముత తహ్హిరీన్” అని చెబుతారో అతని కోసం స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరుచుకుాంయి.అతనికి నచ్చిన మార్గం గుండా స్వర్గంలో ప్రవేశించ వచ్చు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
”ఎవరయితే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, వ అన్న ఈసా అబ్దుల్లాహి వబ్ను అమతిహీ వ కలిమతుహు అల్ఖాహా ఇలా మర్యమ వ రూహుమ్మిన్హు వ అన్నల్ జన్నత హఖ్ఖున్, వ అన్నన్నార హఖ్ఖున్” – అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ముహమ్మద్ (ఆ) అల్లాహ్‌ా సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈసా (అ) అల్లాహ్‌ా దాసుడు మరియు ఆయన దాసి కుమారుడని, ఆమె వైఫున కు పంపబడిన ఆయన వాక్యం అని, ఆయన తరఫున ఊద బడిన ఆత్మ అని సాక్ష్యమిస్తున్నాను, మరియు స్వర్గం సత్యం, నరకం సత్యం అని సాక్ష్యం ఇస్తున్నాను అనాంరో, వారిని అల్లాహ్ స్వర్గంలో ప్రవేశింప జేస్తాడు. స్వర్గపు ఎనిమిది మార్గాల గుండా దేని నుండయినా వారు స్వర్గంలో ప్రవేశించవచ్చు”. (ముస్లిం)