షాబాన్ నెల యెుక్క వాస్తవికత

సంకలనం,కూర్పు : షేక్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామీఈ.

ఖుర్ఆన్&హదీసుల వెలుగులో 3వ భాగం
షాబాన్ నెల యెుక్క చేయవలసిన ఆచారాలు తెలుసుకుందాం! ఇన్ షా అల్లాహ్
నా ధార్మిక సహోదర సహోదరిమణులారా! అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు –
అల్లాహ్ సుబానవతాఆలా ఇలా ఉపదేశించాడు.

وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.(Quran – 51 : 56)

 

షాబాన్ నెల ఇది ఇస్లాం నెలలో 8వ నెల ఈ నెల యెుక్క విశిష్టత ఏమిటంటే ఎంతో ఘనత కల్గిన రంజాన్ నెలను తనతో పాటు తెస్తుంది. అంటే ఈ నెల తరువాత వచ్చేది రంజాన్ నెల.

షాబాన్ మాసంలో ఇస్లాం అనుమతిస్తున్న మనం చేయవలసిన సత్కార్యాల్లో అతి ముఖ్యమైనది ఉపవాసం. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ లో అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు. చూసేవారికి నెలంతా ఉపవాసమున్నారా అనిపించేది.

షాబాన్ నెల ఇది ఇస్లాం నెలలో 8వ నెల ఈ నెల యెుక్క విశిష్టత ఏమిటంటే ఎంతో ఘనత కల్గిన రంజాన్ నెలను తనతో పాటు తెస్తుంది. అంటే ఈ నెల తరువాత వచ్చేది రంజాన్ నెల.

షాబాన్ నఫిల్ ఉపవాసాల మాసం

ఈ క్రింది హదీసులు చదవండి:
عن عَائِشَةَ تَقُولُ: ” كَانَ أَحَبَّ الشُّهُورِ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يَصُومَهُ: شَعْبَانُ، ثُمَّ يَصِلُهُ بِرَمَضَانَ ”
ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పారు: ప్రవక్తకు ఉపవాసం ఉండటానికి చాలా ప్రీతికరమైన మాసం షాబాన్ మాసం, ఈ మాసంలో ఉపవాసం పాటిస్తూ రమజాను వచ్చేసేది.అబూదావూద్ 2431.
وعن عائشة رَضِيَ اللهُ عنها قالت: لَمْ يكن النبي – صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ – يَصُومُ مِنْ شَهْرٍ أكْثَرَ مِنْ شَعْبَانَ، فَإنَّهُ كَانَ يَصُومُ شَعْبَانَ كُلَّهُ
ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ నెలలో (నఫిల్) ఉపవాసాలు పాటించినంతగా మరే ఇతర నెలలోనూ పాటించేవారు కాదు. నిశ్చయంగా ఆయన షాబాన్ నెలసాంతం ఉపవాసం పాటించేవారు. వెరొక ఉల్లేఖనం ప్రకారం షాబాన్ నెలలోని కొన్ని రోజులు మినహాయించి మిగతా రోజులన్నీ ఆయన ఉపవాసం పాటించేవారు.
బుఖారీ 1969, ముస్లిం 1156

మానవులకర్మలు పైకి లేపబడే మాసం

ప్రవక్త షాబాన్ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటించటానికి గల కారణాన్ని వేరొక హదీసు ఈ విధంగా వివరించింది:
«ذَلِكَ شَهْرٌ يَغْفُلُ النَّاسُ عَنْهُ بَيْنَ رَجَبٍ وَرَمَضَانَ، وَهُوَ شَهْرٌ تُرْفَعُ فِيهِ الْأَعْمَالُ إِلَى رَبِّ الْعَالَمِينَ، فَأُحِبُّ أَنْ يُرْفَعَ عَمَلِي وَأَنَا صَائِمٌ»
ఇది రజబ్ మరియు రమజాను మధ్యలోని మాసం, ప్రజలు దాని పట్ల అశ్రద్ధగా ఉంటారు.దాసుల కర్మలు షాబాన్ మాసంలో అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి. నేను ఉపవాసంలో ఉన్న స్థితిలోనే నా కర్మలు అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడాలన్న కోరిక నాది. నసాఈ 2357, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు.

ప్రతి సోమవారము మరియు గురువారాల్లో మానవుల ఆచరణలు ప్రవేశపెట్టబడతాయి. ఈ హదీసు పైన కూడా శ్రద్ద వహించాలి.
హజ్రత్ అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు:
సోమ మరియు గురువారాల్లో (అల్లాహ్ సన్నిదిలో దాసుల) ఆచరణలు ప్రవేశపెట్టబడతాయి. అందుకని నేను ఉపవాసిగా ఉన్న స్ధితిలో నా ఆచరణ ప్రవేశపెట్టడాన్ని నేనిష్టపడతాను.తిర్మిజి- హసన్ , రియాదుస్ సాలిహీన్ :1257#
పై హదీసులో రెండు లాభాలున్నాయి.

1)ప్రజలు అశ్రద్ధగా ఉన్నప్పుడు అల్లాహ్ ఆరాధన ఘనత చాలా గొప్పగా ఉంది. ప్రత్యేకంగా ఉపవాసం, ఇందులో బాహ్యతనం లేదు. ఇఖ్లాస్ (చిత్తశుద్ధి) ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సత్కార్యం అందరూ చేస్తున్నప్పుడు వారిని చూసి చేయని వాడు కూడా ఆ సత్కార్యం చేయడానికి పూనుకుంటాడు, కాని ఎవరు చేయని సమయంలో సత్కార్యం చేయాలని ఆలోచన రావడం, ఆలోచన వచ్చినా నేను ఒక్కణ్ణి చేస్తే ఎవరేమంటారో అనే దురాలోచనకు దూరమైన ప్రత్యేక శ్రధ్ధతో, అల్లాహ్ సంతృష్టి ఉద్దేశ్యంతో చేయడం ఎంతో గొప్ప విషయే కాకుండా అత్యధిక పుణ్యానికి కూడా అర్హత కల్పిస్తుంది. ఇలాంటి వారికి ప్రవక్త ఎంత గొప్ప శుభవార్త ఇచ్చారో ఈ హదీసు చదవండి:
إِنَّ مِنْ وَرَائِكُمْ زَمَانَ صَبْرٍ، للمُتَمَسِّكِ فِيهِ أَجْرُ خَمْسِينَ شَهِيدًا
మీ తర్వాత ఓర్పుసహనాల ఓ కాలం రానుంది, ఆ కాలంలో ధర్మంపై స్థిరంగా ఉన్న వ్యక్తికి 50 మంది అమరవీరుల పుణ్యం ఉంటుంది.
తబ్రానీ కబీర్ 10394, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 2234లో సహీ అన్నారు.
అబూ దావూద్ 4341లోని హదీసులో ఉంది:
మీ తర్వాత ఓర్పు సహనాల ఓ కాలం రానుంది, అప్పుడు (ధర్మంపై స్థిరంగా ఉంటూ) సహనం వహించడం నిప్పులను చేత్తో పట్టుకోవడంతో సమానం. అప్పుడు సత్కార్యాలు చేసే వ్యక్తికి మీలోని 50 మందికి లభించే పుణ్యం లభిస్తుంది.

2)ఈ మాసంలో సత్కార్యాలు అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి.
అల్లాహు అక్బర్! గమనించండి: సాయంకాలం యజమాని ముందు పొద్దంతా చేసిన పని గురించి లెక్క చెప్పవలసి ఉంది అని తెలిసినప్పుడు ఆ పొద్దంతా ఎలా పనిచేస్తాడు ఆ గుమాస్త? మరి ప్రతి రోజు ఫజ్ర్ మరియు అస్ర్ లో రెండు సార్లు
వారంలో ప్రతి సోమ, గురు రెండు రోజులు సంవత్సరంలో ఈ షాబాన్ మాసంలో మన కర్మలన్నీ అల్లాహ్ ముందు ప్రవేశపెట్టబడుతున్నప్పుడు మనం పాపాలకు ఎంత దూరంగా ఉండాలి. సత్కార్యాలు ఎంత ఎక్కువగా చేస్తూ ఉండాలి అర్థమవుతుంది కదా!
కాని ప్రజల సులభతరానికి, వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఎంతగా కాంక్షించేవారంటే, షాబాన్ 15రోజులు గడిసిన తర్వాత ఉపవాసం పాటించకూడదని ఆదేశించారు.
عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «إِذَا انْتَصَفَ شَعْبَانُ، فَلَا تَصُومُوا»
ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: షాబాన్ సగం గడిచిపోయాక ఉపవాసం ఉండకండి.
అబూదావూద్ 2337

హదీసు వ్యాఖ్యానకర్తలు చెప్పారు: ప్రజలు షాబాన్ చివరి వరకు ఉపవాసాలు పాటించి, రమజానులో ఫర్జ్ (విధి) ఉపవాసాలు పాటించడంలో బలహీనులు కాకూడదని సగం షాబాన్ తర్వాత ఉపవాసాలు పాటించడం నుండి వారంచబడినది.
అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని మరియు సంపూర్ణ ఇస్లామ్ జ్ఞానాన్ని మరియు దాని మీద జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.

Related Post