మానవ జీవిత లక్ష్యం

మానవ జీవిత లక్ష్యం – మానవుడు వైజ్ఞానికంగా గొప్ప అబివృద్ధిని సాధించాడు. నక్షత్రాల ఆవల లోకానికి నిచ్చెనలు వేస్తు న్నాడు. అపరిచిత, సుపరిచిత ప్రాంతాలను తన కైవసం చేసుకునేందుకు ఉరకలేస్తున్నాడు. సమాచార ప్రసారానికి అతి వేగమయిన పరికరాలను కనుగొని ప్రపంచాన్ని ఓ గదిగా మార్చగలిగాడు. ఇన్ని విజయాలను సొంతం చేసుకున్న మానవుడు ఇన్ని ప్రగతి ఫలాలను అనుభవిస్తున్న మానవుడు తన ఉనికి గురించి, ఉనికి లక్ష్యం గురి ంచి తెలుసుకోక పోవడం, కనీసం తెలుసుకునేందుకు ప్రయత్నించక పోవడం ఎంతో విచారకరం. కనిపించేదే, విని పించేదే, పంచేంద్రియాల పరిధిలో వచ్చేదే నిజమని అనుకుంటే ప్రమాదం.
హేతువు మాటున చురకత్తి కదులుతుంది.
మనిషి బుద్ధి మార్గం తప్పుతుంది.
ఏదోక మాయ మనస్సుని క్రమ్ము కుంటుంది.
సత్యదర్శనం కరువవుతుంది.

మానవ జీవిత లక్ష్యం

ఓ మానవులారా..! నిశ్ఛయంగా మీ అందరి దేవుడు ఒక్కడే ఆ కరుణా మయుడు , ఆ కృపాకరుడు తప్ప మరో దేవుడు లేడు. దివ్య ఖుర్ఆన్ ( 2 : 163 )

కాబట్టి ఒక నిమిషం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుం దాం! మనం దేని కోసం పుట్టించ బడ్డాము? మన జీవిత లక్ష్యం ఏమిటి? సునిశిత మతి ఉంటే ఒక సూచన చాలు. లోతులు ముట్టే ఒక ఆలోచన చాలు.

సాధారణంగా ‘మానవ జీవిత లక్ష్యం ఏమిటి? అని మనం ఏ నలుగురిని అడిగామనుకోండి, వైవిధ్యమయిన సమాధానాలు వినబడతాయి. కారణం- ఆయా వ్యక్తుల ఆశయాలు, ఉద్దేశాలు ప్రాపంచికమయినవి, పరిమితమయినవి మాత్రమే కావడం. వారు పరలో కం గురించి అక్కడ వారి కర్మలకుగాను వారికి లభించే శిక్షా బహు మానాల గురించి ఆలోచించకపోవడమే.

మానవ జీవితం సప్త రంగులహరి విల్లు. మనిషి జీవితాన్ని ఏడుభాగా ల్లో విభజించవచ్చు.1) కుటుంబం. 2) ఆర్థికం 3) ఆరోగ్యం 4) ఆధ్యా త్మికం 5) వ్యక్తిగతం 6) వ్యాయా మం 7) సామాజికం. నేడు మనం కేవలం ఆధ్యాత్మిక లక్యం గురించి తెలుసుకోబోతున్నాము. ఎందు కంటే అదే మిగతా అన్నింటికి కేంద్రబిందువు గనక.

నిజమైన దేవుడు ఎవరు? అని ఈ ప్రపంచంలో ఉన్న సగటు వ్యక్తిని ప్రశ్నించండి., విభిన్న సమాధానాలు వస్త్ఘాయి. ఉదాహరణకు:– కొందరు దేవుడు ఒక్కడే అని, మరికొందరు ముగ్గురు అని, ఇంకొందరు ముక్కోటి అని ఇలా అనేక రకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు. దేవుడు మానవుడిగా అవతరిచాడు అని కొందరు అంటే, మనవున్నే దేవునిగా మార్చినవారు మరికొందరు సృష్టికర్త వేరు, సృష్టి వేరు అని ద్వైతవాదులు అంటే సృష్టి మరియు సృష్టికర్త రెండూ ఒక్కటే అనేవారు అద్వైతవాదులు ఇవన్ని విని అసలు దేవుడే లేడు అని వాదించే నాస్తికులు ఉన్నారు.
నిజమైన దేవుడు ఎవరు? అన్న ప్రశ్న ఎంతో కన్ఫ్యూషన్ కు గురైంది అనేది వాస్తవం. ఈ కన్ఫ్యూషన్ దూరం చేయవలసిన భాద్యత ఎవరిది? ఆలోచించండి !

ఒక చిన్న ఎలక్ర్టానిక్ పరికరాన్ని తయారు చేసిన శాస్త్రవేత్త కూడా దాన్ని ఎలా ఉపయోగిస్తే లాభం, ఎలా ఉపయోగిస్తే నష్టం అన్న విషయాలను తెలియజేయడానికి ఒక విషయ సూచిక (instruction manual ) ను తప్పకుండా ఇస్తాడు.
మరి ఇంత అద్భుతమైన విశ్వాన్ని, అందులో సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మానవునికి ఎటువంటి మార్గదర్శకత్వాన్ని చూపించకుండా ఉంటాడా. ఒకవేళ చూపించకుండా ఉంటే తీర్పుదినం నాడు మనిషి దేవుడితో తప్పకుండా ఇలా వాదిస్తాడు ..
“ఓ దేవుడా! నీవు నాకు ఎటువంటి మార్గదర్శకత్వాన్ని చూపించలేదు,,,,అందుకే నేను నా ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడిపాను,నా ఇష్టం వచ్చినదాన్ని దేవునిగా చేసుకుని ఆరాధించాను, నీవు నాకు సత్యమేదో అసత్యమేదో,, ధర్మమేదో అధర్మమేదో తెలియజేసి ఉంటె నేను సన్మార్గంలో నడిచి ఉండేవాణ్ణి”అని అంటాడు
అందుకే సర్వజ్ఞుడైన సృష్టికర్త ప్రతి యుగంలో, ప్రతి జాతిలో మానవునికి ఋజుమార్గం చూపడానికి ఒక ప్రవక్తను (సందేశాహరుణ్ని) ప్రభవింపజేస్తాడు ఈ ఖుర్ ఆన్ వాక్యాన్ని గమనించండి:::
“వలికుల్లి ఉమ్మతిం రసూల్ “(10:47) మేము ప్రతి జాతిలోను ఒక ప్రవక్తను పంపాము
ఖుర్ ఆన్ హదీసు గ్రంథం ప్రకారం ఆది నుండి నేటి వరకు దేవుడు 1,24000 మంది ప్రవక్తలను ప్రభవింపజేసాడు.

మనిషి తన నిజ సృష్టికర్తను గురించి ఎందుకు అన్వేషించాలి… ?

ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తాడు. స్వీయపరిశీలన చేయకుండా గుడ్డిగా ఏ వస్తువూ తీసుకోడు.
ఉదాహరణకు:- బట్టల షాపుకు, లేదా చెప్పుల షాపుకు వెళ్ళి,చూడకుండా, పరిశీలించకుండా ఏదైనా వస్తువును కొంటారా… ? ఖచ్చితంగా అలా చేయరు.ఎందుకంటే అలా చేస్తే నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఒక ఒక కేజీ కూరగాయలు తీసుకునే విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటారు ….
కాని ఒక్క సృష్టికర్త విషయంలో మాత్రం స్వీయపరిశీలన చేయకుండా మన పూర్వీకుల పై, పండితులపై, పాస్టర్లపై, మౌల్వీలపై, గుడ్డిగా ఆధారపడటం వల్ల వారు మనల్ని సత్యానికి దూరంగా తీసుకొని వెళ్తున్నారు.అందువల్ల మనం నిజ దేవుడు ఎవరు అన్న సత్యాన్ని తెలుసుకోలేక అసత్య దైవాలను ఆరాధిస్తూ … ఇదే మన సంస్కృతి అన్న భ్రమలో ఉన్నాము. ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలించే మనము,,,ఎవరైతే మనల్ని పుట్టించాడో,, ఎవరైతే మనకు ఈ పరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాడో, ఆ సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి మాత్రం ఈ పరిశీలనా జ్ఞానాన్ని ఉపయోగించడం లేదు. ప్రాపంచిక సరదాల కోసం ఎంతో సమయాన్ని వృధా చేసే మనము ఆ సృష్టికర్తను గురించి అన్వేషించడానికి మాత్రం సమయాన్ని తీయడానికి ప్రయత్నించడం లేదు. సోదరులార! అందుకే ఆ సృష్టికర్త గురించి ఆలోచించాలి, పరిశీలించాలి. ఆ సృష్టికర్తను అన్వేషించడానికి సమయాన్ని కేటాయించాలి.

పెన్సిల్‌ ఉపమానం:

ప్రతి వ్కక్తీ కొనగలిగేంతటి చౌకబారు వస్తువు పెన్సిల్‌. అ) మామూలపాటి ఈ పెన్సిల్‌ తనంటత తానుగా ఉనికి లోకి వచ్చిందా? లేదా దాన్ని తయారు చేసినవాడొకడున్నాడా?
‘పెన్సిల్‌ తనంతట తానుగా ఉని కిలోకి రాలేదు’ అన్నది మీ అందరి సమాధానం. తేలికపాటి పెన్సిల్‌ తనంతట తానుగా తయా రవ్వలేదు అంటే, ఈ సృష్టిబ్రహ్మాం డం, అందులోని మనం ఇట్టే యాదృచ్ఛికంగా, ఒక విస్పోటనం ద్వారా ఉనికిలోకి వచ్చేశాయను కోవడం ఎంత వరకు సహేతుకం?
”అది సరేగాని, మీరు వదిలే రేతస్సు గురించి ఎప్పుడయినా ఆలోచించారా? ఏమిటి, దాంతో మనిషిని సృష్టించేది మీరా? లేక మేము సృష్టిస్తున్నామా?… సరే! మీరు నాటే వస్తువును(విత్తనాన్ని) గురించి ఎప్పుడయినా ఆలొచిం చారా? ఏమిటి, దాన్ని మీరు పండిస్తున్నారా? లేక దానిని పండించేది మెమా?…..” (అల్‌ వాఖిఅహ్‌: 58-64)
దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు (Rigveda 6:45:16)
“देवो महा असि” (దేవుడు ఒక్కడే గొప్పవాడు)
దావ్య భూమి జనయాన్ దేవ ఏకః భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడు ఒక్కడే
(Swetha swatharopanishath 3:2)
“एकम यवद्वितीयम” దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు (Chandogya Upanishath 6:2:1)
భూదిగంతముల నివాసులరా! నావైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. (యషయా 45:22)

ఏసు అంటున్నారు :మీరు ఈలోక మందు ఎవ్వరినీ తండ్రి (దేవుడు)అని పేరు పెట్టి పిలవకండి .మన తండ్రి (దేవుడు)ఒక్కడే . ఆయన పర లోక మందు వున్నాడు. (మత్తయ 23 :9 )
మన ధార్మిక గ్రంధాలైన వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, మరియు ఖుర్ ఆన్, దేవుడు ఒక్కడే అని ఘోషిస్తున్నా ప్రజలు ఆ ఒక్క దువుణ్ణి ఎందుకు ఆరాధించడం లేదు?
మనం దేవుని విషయంలో మన పెద్దవాళ్ళ పైన, టీచర్ల పైన ,ధార్మిక పండితుల పైన ఆధార పడుతూ మన ధార్మిక గ్రంధాలకు చాలా దూరంగా ఉన్నాము. దేవుని ఔన్యత్యము, గుణగణాలు, శక్తి మరియు ఆయన హక్కుల విషయంలో అవగాహనా రాహిత్యం నేడు ఎక్కువ కనపడుతుంది. ఈ అవగాహనా రాహిత్యం వల్లనే దేవునికి భార్యా, పిల్లలు మరియు మానవ రుగ్మతలు ఉన్నాయి అనే భావన నేడు సమాజంలో కనపడుతుంది.
సృష్టి, ఏ కర్తా లేకుండా ఉనికిలోకి వచ్చేసింది అన్నదీ సత్య దూరమే. సృష్టికి అనేక కర్తలు ఉన్నారు అనడమూ వ్యర్థ ఆలోచనే.

దేవుడు కనిపిస్తాడా ?

లైసక మిస్లిహీ షైయవ్ (ఖుర్ ఆన్ – 42:11)
ఆయన్ని పోలిన వస్తువు ఏది లేదు.
2) లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ (ఖుర్ ఆన్ 6:103)
ఎవరి చూపులు కూడా ఆయనను అందుకోజాలవు కానీ ఆయన అందరి చూపులను పర్యవేష్టించి ఉన్నాడు
“नातस्य प्रतिमा अस्थि” (దేవునికి ప్రతిమ లేదు)
న సంద్రుశే తిష్ఠతి రూపమస్య నచాక్షుశా పశ్యతి కశ్చనైనమ్ (దేవుణ్ణి కళ్ళతో చూడలేము )
ఎవరి నైతే నీ కన్నులు చూడ లేవో ,ఎవరైతే నిన్ను చూస్తున్నారోఆయనే సృష్టి కర్త , వీరు (జనులు)ఆరాదించేదేది దేవుడు కాడు. కేన ఉపనిషత్ ( 1 : 7 )
దేని నైతే నీవు నీ మనస్సు తో ఉహించ లేవో ఎవరికైతే నీ మనస్సులో ఉన్న రహస్యాలు సైతం తెలుసో ఆయనే సృష్టి కర్త , వీరు (జనులు)ఆరాదించేదేది దేవుడు కాడు. కేన ఉపనిషత్ ( 1 : 6 )
నేను సర్వజ్ఞుడను, పురాతనుడను, సర్వలోక ప్రభువును, సమస్త ప్రపంచానికి ఆధారమైనవాడను. ఆలోచిమ్పసక్యముకాని రూపం గలవాడను, స్వయం ప్రకాశుడను, జ్ఞానిని. (భగవద్గీత 8:9)
నేను ఇట్టిదని నిర్దేశింపశక్యముకాని, ఇంద్రియాలకు గోచరమ కాని, ఆలొచింపశక్యముకాని రూపం గలవాడిని, బలహీనతలు లేని వాడిని , సర్వజ్ఞానిని. (భగవద్గీత 12:3-4)
మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు.Bible, (Isaiah 5:37)
కావున మీరు ఎవనితో దేవునిని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? (Bible, Isaiah 40:18)

దేవుడు మానవుడిగా పుడతాడా!

దేవుడు భూమ్మీదకు వచ్చి, మానవుడిగా అవతారమెత్తుతాడన్న భావన ఇస్లాం అంగీకరించాడు. ఇలా దేవుడే మనిషి రూపుదాల్చుతాడనే సిద్ధాంతం మరికొన్ని మతాలలో కూడా ఉంది. దీన్ని ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు దీనికొక కారణం కూడా చెబుతారు. అదేమంటే… సర్వశక్తి సంపన్నుడైన దేవుడు ఎంతో పవిత్రుడు. మానవులకు ఎదురయ్యే కష్టాలు… అంటే నొప్పికలిగితే ఎలా ఉంటుంది, సమస్యలెదురైతె ఎంత బాధకలుగుతుంది, మొదలైనవి ఆయనకు తెలీదు.
అందుకే దేవుడు మానవరూపం దాల్చి వాటన్నింటినీ తెలుసుకుని మానవులు ఏం చేయాలో, ఏం చేయకూడదో మార్గ దరసాకాలు ఏర్పాటు చేస్తాడు. పైపైన తర్కం సరైనదేననిపిస్తుంది. అంటే దేవుడెంతో పరిశుద్ధుడనీ, మానవుల కష్టాలు తెలుసుకుని, వారికి అవసరమైన మార్గదర్శకాలు ఏర్పరుస్తాడనే తర్కం వినడానికి బాగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ పుట్టే ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే… నేనొక వీసీఆర్ (వీడియో కేసెట్ రికార్డర్) ని తయారు చేసాననుకోండి, ఆ వీసీఆర్’కు ఏది తగునో, ఏది తగదో తెలుసుకోవాలంటే స్వయంగా నేను ఆ వీసీఆర్ గా మారిపోవాలా? నేను వీసీఆర్ సృష్టికర్త ను అయినందువల్ల దాని మంచి చెడ్డలు నాకు తెలుస్తాయి. కాబట్టి నిబంధనలు నిర్ణయించడానికి నేను దాని రూపంలోకి మారిపోనక్కరలేదు. మరేం చేయాలి?

నేనొక సూచనల పుస్తకం రాయాలి. క్యాసెట్ లోని ప్రోగ్రాం చూడాలంటే వీసీఆర్ లో కేసెట్ పెట్టి ప్లే బటన్ నోక్కాలనీ, ఆపాలంటే ‘స్టాప్’ నోక్కాలనీ, ముందుకు పోవాలంటే ఫాస్ట్ ఫార్వార్డ్ నోక్కాలనీ, పైనుంచి కిందికి పడేస్తే అది చెడిపోతుందనీ, పని చేయదనీ చెబుతూ ఒక సూచనల పుస్తకం రాస్తే సరిపోతుంది. అంటే గానీ దాన్ని సృష్టించేవాడే దాని రూపంలోకి మారిపోనక్కర లేదు.
అలాగే సర్వసక్తే సంపన్నుడైన దేవుడు కూడా మానవజాతికి సృష్టికర్త కాబట్టి వారికేది మంచో, ఏది చెడో తెలుసుకోవడానికి మనిషి అవతారం ఎత్తనక్కరలేదు. మరేం చేయాలి? మానవులలో ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎంపిక చేసుకొని ఆయనకు ఉన్నత స్థాయిలో జ్ఞానం ఇచ్చి, ఆయన ద్వారా ప్రజలకు మార్గదర్శకాలు అందించవచ్చు.
దేవుడు గ్రంధాలూ అవతరింపజేయడానికి ప్రజల కొరకు ప్రవక్తలు పంపిస్తాడే కాని ఆయన క్రిందకు రాడు. ఈ పరంపరలో తన చిట్టచివరి ప్రవక్త అయిన ముహమ్మద్ (స.అ.సం) (సత్యమైన ఆత్మ) పై ఖుర్ ఆన్ గ్రంధాన్ని అవతరింప జేయడం జరిగింది. అంతేగాని దేవుడు మానవ అవతారం ధరించి ఈ భూమి పైకిరాడు.
నిశ్చయంగా ఇది (ఈ ఖుర్ ఆన్) సకల లోకాల ప్రభువు అవతరింపజెసినది. విశ్వసనీయుడైన దైవ దూత దీన్ని తీసుకు వచ్చాడు.
ఓ ముహమ్మద్ (స. అ. సం) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావడానికి ఇది (ఖుర్ ఆన్)నీ హృదయం పై అవతరించింది. (ఖుర్ ఆన్ 26:192-194)
ఆ దేవుడు ఎప్పటికి శరీర ధారణ చేయడు (మానవ అవతారం ధరించడు) యజుర్వేదం (40:8)
నాశరహితమైనట్టియు, సర్వోత్తమ మైనట్టియు,సర్వ శ్రేష్టమైనట్టియు, నా రూపము తెలియని అవివేకులైన ఈ జనులు అవ్యక్త రూపుడగు నన్ను (చూడడానికి వీలులేని రూపం) మానవ అవతారం దాల్చిన వానిగా భావించుచున్నారు.(భగవద్గీత 7:24)
నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు.(1 వ రాజులు 8:27)
దేవుడు నరపుత్రుడు కాడు. (సంఖ్యా కాండము 23:19)

మనిషి జీవితం లక్ష్య రహితమా?

ఆ) పెన్సిల్‌ రాయడం దానిలక్ష్యం గా తనకు తానే నిర్ణయించుకుందా, నిర్ణయించినవాడొకడు న్నాడా? ‘దాని తయారు చేసిన వాడే దాన్ని తయారు చేయక ముందే దాని లక్ష్యాన్ని నిర్ణయిం చాడు’ అనేది మీ సమాధానం. మరి చిన్న పెన్సిల్‌కే ఒక లక్ష్యాన్ని ఆ వస్తువు నిర్మాత నిర్దేశించిన ప్పుడు, సృష్టికే తలమానికమయిన మనిషి, మనిషి కోసం నిర్మించ బడిన ఈ విశ్వ వ్యవస్థ ఇట్టే అర్థ రహితంగా, లక్ష్యరహితంగా,గమ్య రహితంగా ఉనికి ఇవ్వడం జరిగిందా?
దివ్యఖుర్‌ఆన్‌, మోమినూన్‌ అధ్యా యం: 115వ వచనంలో మనందరి సృష్టికర్త మనల్ని ఇలా ప్రశ్ని స్తున్నాడు: ”మేము మిమ్మల్ని ఏదో ఆషామాషిగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా వద్దకు మరలి రావడమనేది జరగని పని అని భావిస్తున్నారా?”
”(ఆ విషయానికొస్తే) మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వాటిని -ఏ ఒక్కటినీ లక్ష్యరహితంగా పుట్టించలేదు. యాదృచ్ఛికంగా పుట్టామన్నది అవిశ్వాసుల భ్రాంతి మాత్రమే”. (స్వాద్‌: 27)
అంటే సృష్టికర్త మనిషిని ఈ భూమి మీద పుట్టించి, అతని జీవితానికవసర మయిన వస్తువులన్నింటిని సమకూర్చి పెట్టాడు. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు – ఒక్కటేమిటి, పరమాణవు మొదలు పంచభూతాల వరకూ అన్నీ మనిషి సేవ కోసమే పుట్టించాడు.

మనిషిని దేని కోసం పుట్టించి నట్టు?

దివ్యఖుర్‌ఆన్‌ 51వ అధ్యాయం, 56వ సూక్తిలో ఇలా సెలవియ్యబడింది: ”నేను మానవులను, జిన్నాతులను కేవలం నా ఆరాధన కోసం మాత్రమే పుట్టించాను”.
అంటే, సూర్యచంద్రనక్షత్రాలను పుట్టించి వాటి కోసం కొన్ని నియమనిబంధల్ని నిర్ణయించినట్లే మానవులకు కూడా కొన్ని నియమనిబంధనలుపెట్టాడు. వారందరి కోసం క్రమశిక్షణతో కూడిన జీవన సంవిధానాన్ని కేటాయిం చాడు. ఆయన నిర్దేశించిన ధర్మం ప్రకారం జీవిస్తే – మనిషి కుటుంబ జీవ నమయినా, అర్థిక, వ్యాయామ, సామాజిక, ఆరోగ్య, వ్యక్తిగత రంగాలన్నీ సక్రమంగా ఉంటాయి. ఆయా రంగాల్లో అతడు పడే శ్రమ దైవాజ్ఞబద్ధ మయి ఉన్నంత కాలం పుణ్యప్రదంగా, సత్కార్యంగా పరిగణించబడుతుంది. అది తోటి సోదరునితో అతని నగుమోము సంభాషణ అయినా, ప్రేమతో భార్యకు తినిపించిన ఒక ముద్దయినా ఆరాధనగా భావించబడుతుంది. కవి మాటల్లో చెప్పాలంటే,

ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలితముండబోదురా
సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమురా!
దేవుడొక్కడని విశ్వసించిన జీవితమగును శాంతిమయం.
దైవదాస్యం చేసిననాడు కలుగును ఇహపర సాఫల్యం!
నీకు కలుగును ఇహపర సాఫల్యం!

ఎవరిని ఆరాధించాలి ? సృష్టినా లేక సృష్టికర్తనా ?

ఓ మానవులారా, మిమ్ముల్ని, మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువునే ఆరాధించండి.(ఖుర్ ఆన్ 2:21);
మీరు సూర్యచంద్రులను ఆరాధించకండి. వాటిని సృష్టించిన దేవున్ని ఆరాధించండి.(ఖుర్ ఆన్ 41:37);
స్వయంగా మీరే చెక్కుకున్న వస్తువులను మీరు పూజిస్తున్నారా. వాస్తవానికి అల్లాహ్యేయే మిమ్ముల్ని సృష్టించాడు (ఖుర్ ఆన్ 37:95);
అల్లాహ్ ను విడిచి ప్రజలు వేడుకొంటున్న ఇతర శక్తులు ఏ వస్తువులకు సృష్టికర్తలు కావు. స్వయంగా వారే సృష్టించబడినారు.(16:20);
సర్వశక్తిగల దేవుడికి ఇతరులను బాగ్యస్వాములుగా చేసే వారికీ ఆ దేవుడు స్వర్గాన్ని నిషేధం చేశాడు. వారి నివాసం నరకం. (దివ్యఖుర్ఆన్ 5:72)
సృష్టిని ఆరాధించే వారు అంధకారానికి (శాశ్వత నరకానికి ) పోతారు.చేతితో తయారైన బొమ్మలను విగ్రహాలను ఆరాధించే వారు
ఇంకా లోతైన అంధకారానికి (నరకానికి) పోతారు. యజుర్వేదం (40:9)
తమ యొక్క ప్రక్రుతిచే ప్రేరేపింపబడినవారై విషయాదులందలి కోరికలచే వివేకమునుగోల్పోయి, దేవతారాధన సంబంధమైన ఆయా నియమముల నవలభించి ఇతర దేవతలను ఆరాధించు చున్నారు. (భగవద్గీత 7:20)
నరులను ఆశ్రయించి శరీరులను తన కాధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకోనువాడు శాపగ్రస్తుడు. (యిర్మియా 17:5)
సర్వశక్తిమంతుడైన నిజదేవున్ని విడిచి అనేక బలహీనతలు గల సృష్టి రాశులను ఆరాధించడం దేవుని దృష్టిలో క్షమించరాని పాపం. ఇదే స్ధితిలో మనషికి మరణం సంభవిస్తే అతడు శాశ్వతమైన నరకాగ్నిలో పడవేయబడతాడు. అక్కడ శాశ్వతంగా ఉంటాడు.
ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచి పెట్టి తన ఇష్టము వచ్చినట్టు ప్రవర్తించునో అట్టివారు పురుషార్దసిద్దిని గాని, సుఖమునుగాని, ఉత్తమ గతియగు మోక్షము గాని పొందనేరడు (Bhagvad Geetha 16:23)
కామము,క్రోధము,లోభము అను ఈ మూడునూ మూడు విధములగు నరక ద్వారములు. ఇవి జీవులకు నాశనము కలుగ జేయును, కాబట్టి ఈ మూడింటిని విడనాడ వలెను. (భగవద్ గీత 16:21)

నేడు నీకాజ్ఞాపించు సమస్త ఆజ్ఞలు కట్టడములు,నీవు అనుసరించని యెడల నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. (ద్వితియోపదేశ కాండము 28:15)
మా వాక్యాలను తిరస్కరించిన వారికోసం మేము నరకాగ్ని సిద్దం చేసే ఉంచాము. (ఖుర్ ఆన్ 4:57)

మన ఆరాధ్య దైవం ఎవడు?

ఒకడే దేవుడు ఒకడే కర్త సృష్టికి ఒకడే యజమాని. ఒకటే మార్గం ఒకటే గమ్యం – ఇదే సత్యం’ అని మనం తెలుసుకున్నాము? ఈ మాట ఏకేశ్వరోపాసకులు మొదలు బహుదైవారాధకుల వరకూ, క్రైస్తవులూ, యూదులు, ఫారసీలు మొదలు సృష్టి పూజారుల వరకూ అందరూ చెబుతున్నప్పుడు ఎవరు ప్రతిపాదించిన దైవాన్ని నిజ దైవం గా ఎంచాలి? ఎవరు అవలంబించే జీవన సంవిధానాన్ని అవ లంబించాలి? ఏ మార్గం మనల్ని స్వర్గానికి చేర్చగలదు. అన్న ప్రశ్న తలెత్తుతుంది. ”ఇక్కడయితే ప్రతి పక్షం తానే సత్య పక్షం” అని బల్ల గుద్ది మరీ చెబుతుందాయే!
ఎవరైతే ఈ భూమి ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని సృష్టిస్తున్నారో
ఎవరైతే ఈ భూమి ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని పోషిస్తున్నారో
ఎవరైతే ఈ భూమి ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాని కి మరణాన్ని ఇస్తున్నారో
ఎవరైతే ఈ భూమి ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్త జీవుల కర్మల లెక్క తీసుకుంటాడో.
ఆయననే తెలుగు బాషలో దేవుడు అని, సంస్కృతం లో సర్వేశ్వరుడు అని, ఇంగ్లీష్ బాషలో గాడ్ అని,
హిబ్రు బాషలో యహోవా అని, ఆయననే అరబ్బి భాషలో “అల్లాహ్” అని పిలుస్తారు
ఓ మానవులారా..! నిశ్ఛయంగా మీ అందరి దేవుడు ఒక్కడే ఆ కరుణా మయుడు , ఆ కృపాకరుడు తప్ప మరో దేవుడు లేడు. దివ్య ఖుర్ఆన్ ( 2 : 163 )
అల్లాహ్ – ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.ఆయన సజీవుడు సర్వ సృష్టికి మూలాధారం. (Quran 3:2)

విశ్వాన్ని, విశ్వంలో ఉన్న అణువణువును మనం సునిశితంగా పరి శీలించినట్లయితే, స్వయంగా మన దేహాన్ని, దాని నిర్మాణ విధానాన్ని గమనించినట్లయితే మూడు విషయాలు బోధ పడతాయి.

1) సృష్టి, 2) స్థితి, 3) లయ.
1) సృష్టి: ”ఆయనే ఆకాశాలనూ భూమిని సత్యబద్ధంగా సృష్టించాడు. ఏ రోజు ఆయన ‘అయిపో’ అని ఆజ్ఞాపించాడో అప్పుడు అది అయిపోతుంది. ఆయన మాట సత్యమయినది, ప్రభావ పూరితమ యినది”. (ఆల్‌ అన్‌ఆమ్‌:73)
”ఆయనే తాను కోరిన విధంగా మాతృ గర్భాలలో మీ రూపు రేఖలను మలుస్తాడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడా”. (అల్‌ ఇమ్రాన్‌: 6)
2) స్థితి: ”ఆత్మ సాక్షిగా! దాన్ని తీర్చి దిద్దిన వాని సాక్షిగా! మరి ఆయన దానికి చెడును, చెడు నుండి తప్పించుకుని మసలు కునే ప్రేరణను ఇచ్చాడు” (అష్షమ్స్‌: 6,7)
”ప్రతి వస్తువుకూ దాని ప్రత్యేక రూపు ఇచ్చి, తర్వాత దానికి మార్గం చూపేవాడే మా ప్రభువు”. (తాహా: 50)
అంటే మనిషికి శోభనిచ్చే రూపు ను, పశువుకు తగిన ఆకారాన్ని,విశ్వంలోని వస్తువులన్నింటికీ వాటికి అతికినట్లు సరిపోయే రూపురేఖలను ప్రసాదించిన వాడు. ప్రతి ప్రాణికీ దానిస్వభా వస్వరూపాల రీత్యా బ్రతుకు తెరువును నేర్పినవాడు. మనుగ డకు అవసరమయిన వాటిని సమకూర్చుకునే తెలివీ తెటలను ఇచ్చినవాడు. వాటి ప్రకారమే ఆ ప్రాణులు తమ జీవనపథాన్ని నిర్ణయించుకుంటాయి.
3) లయ: ”ఆయనే ఆకాశాలు మొదలుకుని భూమి వరకూ (ప్రతి) పనిని నడుపుతున్నాడు”. (అస్సజ్దా: 5)
”భూమిలో సంచరించే ప్రాణుల న్నింటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాహ్‌దే. అవి ఆగి ఉండే స్థానాలు, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు”. (హూద్‌:6)

మరి ఆయన పేరేమిటి?

”నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్‌యే. ఆయన ఆకాశాలను, భూమి నీ ఆరు రోజులలో సృష్టించాడు. తర్వాత అర్ష్‌ను అధీష్టించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు, ఆయన అను మతి లేకుండా (ఆయన సమక్షం లో) సిఫారసు చేయగలవాడెవడూ లేడు. ఆ మహితాత్ముడయిన అల్లాహ్‌ాయే మీ అందరి ప్రభువు. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధిం చండి”. (యూనుస్‌: 3)
ఇక ఆయన గుణగణాలేమిటి? అంటారా…

సకల దౌర్బల్యాలకు అతీతుడు అల్లాహ్‌:

”అల్లాహ్‌, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునకుగానీ, నిద్ర గాని పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనం లో ఉంది. ఆయన అనుమతి లే కుండా ఆయన సమక్షంలో సిఫా రసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనక ఉన్న దానినీ ఆయన ఎరుగును.ఆయన కోరినది తప్ప ఆయనకున్నజ్ఞానం లోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టు ముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసి పోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు”. (అల్‌ బఖరా: 255) ”భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. జీవన్మరణాల ప్రదాత ఆయనే. ఆయన ప్రతిదీ చేయగల అధికారం కలవాడు.ఆయనే మొదటి వాడు, చివరివాడు. ఆయనే బాహ్యం, ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు”. (అల్‌ హదీద్‌: 2,3)
ఆయనే ఆది. ఆయనకంటే ముందు ఏదీ లేదు. ఆయనే అంతం.ఆయన తర్వాత ఏదీ ఉండదు.
(నా దాసులకు ఈ విషయాన్ని) తెలియజెయ్యి: ”ఆయన అల్లాహ్‌ ఒక్కడే. అల్లాహ్‌ నిరపేక్షాపరుడు. ఆయన ఎవరినీ కనలేదు. ఆయనా ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడు”. (అల్‌ ఇఖ్లాస్‌: 1-4)
”ఆయన్ను పోలిన వస్తువేదీ లేదు”. (షూరా: 11)
”భూమండలంలో ఉన్న వృక్షాలన్నీ కలములుగా, సముద్రాలన్నీ సిరాగా మారిపోయినా, ఆపైన మరో ఏడు సముద్రాలను కలుపుకున్నా (అవి పూర్తయిపోతాయేగాని) అల్లాహ్‌ా వచనాలు పూర్తి కావు. నిస్సందేహంగా ఆయన సర్వాధికుడు, వివేకవంతుడు”. (లుఖ్మాన్‌: 27)
ఆయన గుణగణాలను అంతిమ దైవగ్రంథమయిన ఖుర్‌ఆన్‌ వెలుగులో తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన తన దాసులనుద్దేశించి ఏమంటు న్నాడో కూడా తెలుసుకుందాం!

”ఓ ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువు నే ఆరాధించండి. తద్వారానే మీరు సురక్షితంగా ఉండగలరు. ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లుఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి”. (అల్‌ బఖరా: 21,22)
మనందరి ఆరాధ్య దైవం అయిన అల్లాహ్‌తో కలుసుకోవాలనీ, ఆయన దివ్య దర్శనంతో పునీతులమవ్వాలని మనలో ఎవరు కోరుకోరు చెప్పండి! మరి మన తదుపరి కర్తవ్యం ఏమిటి? అదీ ఆయన మాటల్లో నే వినండి: ”కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్న వాడు సత్కార్యాలు చేయాలి, తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగ స్వామ్యం కల్పించకూడదు”. (కహఫ్‌:110)

 

Related Post