అజ్ఞానం – విజ్ఞానం

 జ్ఞానం వేలుగైతే అజ్ఞానం చీకటి.  విజ్ఞానం వికసించాలన్నా, సైన్స్‌ భావాలు పరిఢవిల్లాలన్నా, సాంకేతిక పరమైన ఆలోచనలు మొగ్గ తొడగాలన్నా -భావ స్వాతంత్య్రం ఎంతో అవసరం.

జ్ఞానం వేలుగైతే అజ్ఞానం చీకటి. విజ్ఞానం వికసించాలన్నా, సైన్స్‌ భావాలు పరిఢవిల్లాలన్నా, సాంకేతిక పరమైన ఆలోచనలు మొగ్గ తొడగాలన్నా -భావ స్వాతంత్య్రం ఎంతో అవసరం.

ఒక విషయం గురించి ఏమీ తెలియనప్పుడు అజ్ఞానం ఉందంటాం. ఆ అజ్ఞానం ఏదో ఒక నమ్మకానికి దారి తీస్తుంది. ఆయా విషయాల గురించి నిజాలు తెలిసిన తర్వాత అజ్ఞానం తొలగి విజ్ఞానం చోటు చేసుకుంటుంది. అయితే నిజం వెలుగు చూసిన తర్వాత కూడా పూర్వ నమ్మకాన్నే పట్టుకు వ్రేలాడితే దాన్ని మూడ నమ్మకం, అంధ విశ్వాసం అంటాము. అలా మూఢ నమ్మకాలకు కొమ్ము కాసేవారు పవిత్రం కాని దానికి పవిత్రతను అంటగటతారు. దైవం కాలేని వాటిని దైవంగా ప్రతిష్టింపజేస్తారు. నిజ ప్రభువు అయిన అల్లాహ్‌ాకు ఇవ్వాల్సిన స్థానాన్ని, ఘనతాగౌరవాలను ప్రవక్తలకు, పుణ్య పురుషులకు ఆపాదిస్తారు. పర్యవసానం అంధ విశ్వాసం పరవళ్ళు తొక్కుతుంది. ఇటు వంటి అజ్ఞానాంధకారాల్లో కొట్టుమిట్టాడే వ్యక్తి ఆకాశంలో మెరుపు తీగ కనిపిస్తే దాన్ని ఏదోక దేవత ఝుళిపించిన కొరడాగా భావిస్తాడు. సూర్యచంద్ర గ్రహణాలను చూసి దేవతలకేదో విపత్కర పరిస్థితి ఏర్పడిందని తలపోస్తాడు. ‘మశూచి రోగాన్ని’ పోలేరమ్మగా, చికెన్‌ ఫోక్స్‌ను ‘అమ్మోరుగా భావించి అలౌకికానందంతో హారతు పడతాడు. వర్షాలు పడటానికి జల యజ్ఞం అంటూ వందల కొలది నెయ్యి డబ్బాలు నిప్పుల్లో ధారబోస్తాడు. జబ్బులు తగ్గడానికి వాతలు పెడతాడు. క్షుద్ర పూజలంటూ పసికందుల్ని బలిగొంటాడు. ద్రాక్ష రసాన్ని ఏసు రక్తగంగా, జొన్న రొట్టెను ఆయన మాంసంగా అభివర్ణించుకొని నర మాంస భక్షకుడిగా మారతాడు.

‘పవిత్రత’ పేరుతో మొదలయిన ఈ బహుదైవారాధనా భావం స్వార్థపరులైన మత నాయకులకు, పీఠాధిపతులకు, పోపులు, బిషప్పు లకు, పీష్వాలకు, పీర్లు, ముర్షిద్‌లకు – ముఖ్యంగా రాజులకు సువర్ణావకాశంగా పరిణమించింది. ప్రజల బలహీనతను పసిగట్టిన అవకాశవాదులు ఇటువంటి మూఢ నమ్మకాలను మరింత వ్యవస్థీకృతం చేశారు. ‘గాడ్‌ కింగ్‌’ అన్న సిద్ధాంతాన్ని ప్రవేశ పెట్టారు. ప్రజలకు – ప్రభువుకు మధ్య తాను వారధి లాంటి వాడనని ఒకడంటే, తన ప్రసన్నతలోనే దైవ ప్రసన్నత ఇమిడి ఉందని ఇంకొకడన్నాటాడు. వేరొకడు మరింత ముందుకెళ్ళి తానే భగవత్‌ స్వరూపూణ్ణని, అవతార పురుషుణ్ణని ప్రకటించుకున్నాడు. ఈ ‘గాడ్‌ కింగ్‌’ అనే సిద్ధాంతం మూలంగా అధికార, రాజకీయ వ్యవస్థలో చెడు తారా స్థాయికి చేరుకుంది.

జ్ఞానం వేలుగైతే అజ్ఞానం చీకటి. విజ్ఞానం వికసించాలన్నా, సైన్స్‌ భావాలు పరిఢవిల్లాలన్నా, సాంకేతిక పరమైన ఆలోచనలు మొగ్గ తొడగాలన్నా -భావ స్వాతంత్య్రం ఎంతో అవసరం. కానీ ఈ స్వేచ్ఛా వాయువులు అన్నీ దేశాల్లోలాగే అరబ్బులో, భారత దేశంలో, గ్రీకు దేశంలో సయితం అందని ద్రాక్షగానే ఉండేవి. ఏథెన్స్‌ నగర యువ కుల్లో స్వేచ్ఛా భావాలను పెంచి పోషిస్తున్నాడన్న అభియోగంపై సోక్రటీస్‌ బలవంతంగా విషం త్రాగాల్సి వచ్చింది. భారత దేశంలో శూద్రులు వేదాలు చదవకూడదు, వినకూడదు అన్న నిషేధాజ్ఞలాగే గీకు దేశంలో సయితం ఇతరత్రా గ్రంథాలు చదవకూడదన్న ఆంక్షలు విధించబడ్డాయి. ఎందరో కళా పిపాసులు, తాత్వికులు దేశ బహిష్కరణ గావించబడ్డారు. కారాగారాల్లో కుక్కివేయబడ్డారు. ఉరికంబాలకు వ్రేలాడదీయబడ్డారు. యూరి ఫాయిడ్స్‌, సోక్రటీస్‌, అరిస్టాటిల్‌, ఫిరియాస్‌ మొదలగువారు ఈ కోవకు చెందినవారే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం ఎక్కడా శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించిన స్వేచ్ఛ ఉన్నట్టు కనబడదు. మరలాంటప్పుడు స్వయంగా అరబ్బుల్లో ఈ ఆలోచన ఎలా పుట్టింది? సాధారణంగా మిగతా ప్రపంచం ఏ వెనుకబాటుతనానికి, స్తబ్ధతకు లోనై ఉండేదో అదే భావ దారిద్య్రం, దాస్యానికి అరబ్బులు కూడా గురై ఉన్నప్పుడు వారెలా అందరికి మార్గదర్శకం కాగలిగారు?

సమాధానం – తౌహీద్‌. అదే వారి మనో వికాసానికి, క్రియాత్మక విప్లవానికి హేతువు అయ్యింది. మిగిలిన జాతుల్లో ‘షిర్క్‌’ – అజ్ఞానం ఉండగా, అరబ్బుల దగ్గర ‘తౌహీద్‌’ – విజ్ఞా నం ఉండేది. ఈ వ్యత్యాసమే చరిత్రలో అసాధారణమైన పరివర్తనకు కారకం అయింది. ఇది ముస్లింలు సాధించిన విజయం కాదు; ఇస్లాం, ఖుర్‌ఆన్‌ ద్వారా వారికి ప్ర్రాప్తమయిన మహదానుగ్రహం. క్రీస్తు శకం 7వ శతాబ్దిలో మహా ఇస్లాం ద్వారా ఓ గొప్ప విప్లవం వచ్చింది. అది బహుదైవోపాసన, గాడ్‌ కింగ్‌ పెత్తనంతో కూడుకున్న వాతావరణాన్ని ప్రక్షాళించి ఏకేశ్వరోపాసనా భావ విప్లవానికి, స్వేచ్ఛకు అగ్ర స్థానాన్ని కేటాయించింది. ఆ విధంగా మానవ చరిత్రలో ప్రకృతికి సంబంధించిన స్వేచ్ఛా పరిశోధనల నూతన యుగం మొదలయింది. ఈ యుగం వెయ్యేళ్ళ నిరంతర సాధనానంతరం – నేటి – ఆధునిక సైన్స్‌ మరియు సాంకేతిక పరిజ్ఞానం థకు చేరుకుంది. కాబట్టి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆధునిక సైన్స్‌ ఇస్లామీయ (తౌహీద్‌) విప్లవ ప్రభావమే. కాబట్టి –

భావి భాగ్య విధాతల్లారా! అందరూ నడిచిన బాటలో నడవడం తేలిక. అదే థాబ్దాలుగా మనం చేెస్తున్న పని. ఈ రంగంలో మీరు కొత్త అధ్యాయాని కి నాంది వాచకంగా నిలవాలి. నూతన బాటలు వేయాలి. అలా చేయడమంటే గొప్ప సాహసం, తెగింపు మీలో ఉండాలి. ముళ్ళు తొక్కాలి, తుప్పల మీదుగా సాగాలి మీరు. ముళ్లు గుచ్చుకుంటాయి, కాళ్ళు గీచుకుపోతాయి. మీరు నడిచే బాట జనానికి ఉపయోగకరం అని తెలేదాకా జనం కూడా ఎద్దేవ చేయవచ్చు. ఒకసారి ఉపయోగం అని తేలాక ఆ బాటను మీ పేరుతోనే శాశ్వతంగా గుర్తుంచుకుంటారు. ఏది ఏమైనా ‘అజ్ఞానం – షిర్క్‌ -కుఫ్ర్‌’కి ఇష్టమున్నా లేకపోయినా ‘విజ్ఞానం – తౌహీద్‌ – ఇస్లాం’ ముందు తలవంచి ఓడిపోక తప్పదు. ఈ విషయాన్నే పరమోన్నతుడైన అల్లాహ్‌ా ఇలా తెలియ జేస్తున్నాడు:
”వారు (సత్య విరోధులు) తమ నోళ్ళతో (ప్రింటింగ్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇతరత్రా ప్రసార, ప్రచార సాధనాల ద్వారా) అల్లాహ్‌ జ్యోతిని ఊది ఆర్పివేయజూస్తున్నారు. అల్లాహ్‌ మాత్రం తన జ్యోతిని పరిపూర్ణం చేసి తీరతాడు – అవిశ్వాసులకు, సత్య తిరస్కారులకు అది ఎంత సహించరానిదైనా సరే!”. (అస్సఫ్‌: 8)

వందల, వేల, లక్షల మంది లాగా ఏ గుర్తింపూ లేకుండా – ‘జీవించి ఉండగానే అజ్ఞానుల్లా అనామకంగా మరణించినవారి’లా జీవించడమా? ‘మరణించిన తర్వాత కూడా విజ్ఞుల్లా జీవించి ఉండే వారి’ జాబితాలో చేరడానికి ప్రయత్నించడమా? మనమే తేల్చుకోవాలి మరి!

Related Post