బాధ్యతను విస్మరించడం కూడా దోషమే

జనసంక్షేమమే అధికారుల అసలు లక్ష్యం. మేమున్నది కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే’ అంటూ వారికి కొన్ని రోజులు ఆశ్రయం కల్పించి, ఆర్థిక సహాయం అందజేసి వారి గమ్యస్థానానికి పంపే ఏర్పాటు చేశాడు. ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) పాలనలో ఇలాంటి అనేక సంఘటనల్ని మనం గమనించవచ్చు. అందుకే ఆయన పాలనాకాలం ముగిసి దాదాపు వేయిన్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ చరిత్రలో ఆ కాలం సువర్ణాక్షరాలతో లిఖించబడి, నేటికీ పాలకుల బాధ్యతలను గుర్తు చేస్తూనే ఉంది.

జనసంక్షేమమే అధికారుల అసలు లక్ష్యం. మేమున్నది కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే’ అంటూ వారికి కొన్ని రోజులు ఆశ్రయం కల్పించి, ఆర్థిక సహాయం అందజేసి వారి గమ్యస్థానానికి పంపే ఏర్పాటు చేశాడు. ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) పాలనలో ఇలాంటి అనేక సంఘటనల్ని మనం గమనించవచ్చు. అందుకే ఆయన పాలనాకాలం ముగిసి దాదాపు వేయిన్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ చరిత్రలో ఆ కాలం సువర్ణాక్షరాలతో లిఖించబడి, నేటికీ పాలకుల బాధ్యతలను గుర్తు చేస్తూనే ఉంది.

‘ఉమర్ ది గ్రేట్’ అని గాంధీ ప్రశంసించిన ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అహర్నిశలూ ప్రజా సంక్షేమం కోసమే పరితపించిన ప్రజారంజక పాలకుడు ఆయన. తన పాలనలో ప్రజలకు ఏ మాత్రం బాధ కలిగినా దైవం ముందు దోషిగా నిలబడవలసి వస్తుందన్న బాధ్యతా భావంతో జవాబుదారీతనంతో రేయింబవళ్లు పరిశ్రమించిన ప్రజాపాలకుడాయన.

ఒకసారి ఖలీఫా హజ్రత్ ఉమర్(ర) మారువేషం ధరించి గస్తీకి బయలుదేరారు. ఊరి చివరకు చేరుకునేసరికి అక్కడొక గుడారం కనిపించింది. మిణుకు మిణుకుమంటూ ఓ గుడ్డిదీపం వెలుగుతోందక్కడ. గుడారంలోంచి ఒక స్త్రీ మూలుగులు వినిపిస్తున్నాయి. గుడారం ముందు ఓ వ్యక్తి నిస్సహాయంగా పచార్లు చేస్తున్నాడు. హజ్రత్ ఉమర్ కాసేపు అక్కడే నిలబడి అదంతా గమనించారు. అంతకంతకూ లోపలి నుండి స్త్రీ మూలుగులు అధికమవుతున్నాయి. మొత్తానికి ఈ ఇంటి వాసులు ఏదో బాధలోనే ఉన్నారని అర్థం చేసుకున్న ఉమర్ ఆ వ్యక్తిని సమీపించారు. విషయం ఏమిటని ఆరా తీశారు. దానికి ఆ వ్యక్తి ‘అయ్యా! మేము బాటసారులం. పొద్దుపోవడంతో ఇక్కడ విడిది చేశాం. నా భార్య గర్భవతి. ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. తోడుగా ఎవరూ లేరు. చేతిలో పైకం కూడా లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు’ అంటూ తన గోడును వెళ్లబోసుకున్నాడు. విషయం తెలుసుకున్న హజ్రత్ ఉమర్ (ర) ‘నువ్వేమీ కంగారుపడకు. నేనిప్పుడే వస్తాను’ అంటూ పరుగు పరుగున ఇంటికి చేరుకున్నారు.

గొప్ప పుణ్యం మూటగట్టుకునే సువర్ణావకాశం వచ్చిందని విషయమంతా సతీమణికి వివరించారు. భర్తకు తగ్గ ఆ భార్యామణి క్షణం కూడా ఆలోచించలేదు. కొన్ని తినుబండారాలతోపాటు, కాన్పుకు కావలసిన వస్తువులన్నీ సర్దుకొని వెంటనే భర్త వెంట బయలుదేరింది. ఆగమేఘాలపై ఇద్దరూ ఆ ఊరి బయటి గుడారానికి చేరుకున్నారు. హజ్రత్ ఉమర్ (ర) సతీమణి తాను ఖల్‌ఫా భార్యనన్న ఆలోచనే లేకుండా మంత్రసాని అవతారం ఎత్తి ఆమెకు పురుడు పోసింది. దైవానుగ్రహం వల్ల ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సుఖప్రసవం జరిగి పండంటి శిశువు జన్మించాడు. అటు సతీమణి గుడారం లోపల ప్రసూతిపనుల్లో నిమగ్నమై ఉంటే ఇటు ఖలీఫా ఉమర్ (ర) పొయ్యి రాజేసి నీళ్లు కాయడం, ఇతరత్రా పనుల్లో ఆ మహిళ భర్తకు సహకరిస్తున్నారు. అంతలో లోపలి నుండి ‘మహారాజా! మీ మిత్రునికి పండంటి బాబు గలిగాడు. శుభాభినందనలు తెలపండి’ అన్నారు హజ్రత్ ఉమర్ (ర) సతీమణి. తమకు పండంటి బాబు కలిగాడన్న ఆనందంతో పాటు ఇప్పటి వరకూ ప్రసూతి సేవలు అందిస్తున్నది రాజదంపతులన్న విషయం తెలిసేసరికి అతనికి నోట మాట రాలేదు.

ఆనందం, ఆశ్చర్యం, అద్భుతం, భయం తదితర మిశ్రమ భావోద్వేగాలకు గురైన ఆ వ్యక్తి కాసేపటి తరువాత కోలుకుని ‘అయ్యా తమర్ని గుర్తించ లేకపోయాను క్షమించండి’ అంటూ ప్రాధేయపడ్డాడు. ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) అతన్ని ఓదారుస్తూ ప్రజల కష్టాలు తీర్చడం వారికి కనీస సౌకర్యాలైనా కల్పించడం పాలకుల బాధ్యత. ప్రజల బాగోగులు పట్టనివాళ్లు పాలకులు గా, ప్రజాప్రతినిధులుగా ఉండడానికి అనర్హులు. ప్రజాసంక్షేమమే పాలకుల అసలు ధ్యేయం. మీ విషయంలో నేను చేసిందేమీ లేదు. అది నా బాధ్యత, విధ్యుక్త ధర్మం. దీన్ని నిర్వర్తించకపోతే, ప్రజల దృష్టిలోనే కాదు, దైవం దృష్టిలో కూడా నేను దోషిగానే లెక్క. పాలకుడిగా నాకు దక్కిన అధికారం నేను, నా వాళ్లు అనుభవించడానికి కాదు. దాన్నొక అమానతుగా దైవం నాకు అనుగ్రహించాడు.

జనసంక్షేమమే అధికారుల అసలు లక్ష్యం. మేమున్నది కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే’ అంటూ వారికి కొన్ని రోజులు ఆశ్రయం కల్పించి, ఆర్థిక సహాయం అందజేసి వారి గమ్యస్థానానికి పంపే ఏర్పాటు చేశాడు. ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) పాలనలో ఇలాంటి అనేక సంఘటనల్ని మనం గమనించవచ్చు. అందుకే ఆయన పాలనాకాలం ముగిసి దాదాపు వేయిన్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ చరిత్రలో ఆ కాలం సువర్ణాక్షరాలతో లిఖించబడి, నేటికీ పాలకుల బాధ్యతలను గుర్తు చేస్తూనే ఉంది. నేటి మన పాలకులు ఆ మహనీయుని జీవితాన్ని అధ్యయనం చేసి అందులో ఎంతో కొంత కనీస స్థాయిలోనైనా ఆచరణలో పెట్టగలిగితే, నేటి మన సమాజం అన్ని రంగాల్లో సాఫల్యతను సాధించగలరని ఘంటాపథంగా చెప్పవచ్చు.

Related Post