New Muslims APP

బద్ర్‌ సంగ్రామం – సత్యానికి అసత్యానికి మధ్య భీకర పోరు

హిజ్రీ 2వ సంవత్సరం – ‘మహా ప్రవక్త (స)కు, ముస్లింలకు మదీనాలో ఒక సురక్షితమైన ఇస్లామీయ కేంద్రం సంప్రాప్తమయింది. వారు ఇప్పుడు ఒక సంఘటీత సమాజంగా రూపొందార’ని తెలుసుకున్న ఖురైషులు తీవ్ర కోధ్రావేెశంతో చిందులేయ సాగారు. ముహాజిర్లను రకరకాలుగా భయపెట్టనారంభించారు. ఈ కారణంగా అల్లాహ్‌ ముస్లింలకు యుద్ధానుమతి ఇచ్చాడు. సిరియా నుండి తిరుగు ప్రయాణమై మదీనా మీదుగా వెళుతున్న ఖురైష్‌ వర్తక బృందాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశ్యంతో సమాయత్తమయ్యారు. (కారణం – ఈ బృందానికి నాయకుడైన అబూ సుఫ్యాన్‌ ఈ వ్యాపార లాభాన్ని ముస్లింలను, ఇస్లామీయ ఉద్యమాన్ని సర్వ నాశనం చేయడానికి ప్రత్యేకించబోతున్నానని ప్రకించాడు.) ‘అటు ముష్రికులు ఒకేసారి ముస్లింలందరినీ అంత మొందించాలన్న సంకల్పంతో మక్కా నుండి బయలు దేరారు’ అన్న వార్త ముస్లింలకు చేెరింది. ఈ కారణంగా కూడా ప్రవక్త (స) 313 మంది ముస్లిం యోధులను వెంటబెట్టుకుని ముష్రికులతో తాడో వేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. సైనికులందరికీ కలిపి రెండో, మూడో గుర్రాలు, డెభ్భయి ఒంటెలు మాత్రమే ఉన్నాయి. (సలహా సంప్రదింపుల తర్వాత) మహా ప్రవక్త (స) ‘బద్ర్‌ బావి’ దగ్గర గుడారాలు వేయమన్నారు. అటువైపు నుండి మక్కా ముష్కర మూక బయలుదేరింది. వారి సంఖ్య ఇంచు మించు 1300 ఉంటుంది. వారికి తోడుగా 100 గుర్రాలు, 700 లకు వైగా ఒంటెలున్నాయి. వారం దరికి నాయకుడు అబూ జహల్‌. వారంతా మక్కా నుంచి మదీనాకు బయలుదేరారు.

 బద్ర్‌ సంగ్రామం (సత్యానికి అసత్యానికి మధ్య భీకర పోరు)

”దైవ సాక్షిగా చెబుతున్నాము. దైవ ప్రవక్తా! మీరు మమ్మల్ని తీసుకునో సముద్రంలో దూకినా మేమందుకు సిద్ధంగా ఉన్నాము. మాలోని ఏ ఒక్కడూ వెనుకంజ వేసేవాడు కాడు. మీరు తలచిన వారితో యుద్ధం చేయండి. అన్నింకీ మేము సిద్ధమే”.

ముప్పు ముంచుకొస్తూ ఉంది అని గ్రహించిన ప్రవక్త (స) సైనికులందరినీ సమావేశపరచి సమాలోచన జరిపారు. ”దైవ ప్రసన్నత కోసం, ధర్మ రక్షణ కోసం ప్రాణాలైనా త్యజించి పోరాడుతాం” అని ముహాజిర్లలోని ప్రతి వ్యక్తీ తన అభి ప్రాయాన్ని బాహాటంగా ప్రకించాడు:
ఆ తర్వాత అన్సారులు ఇలా అన్నారు: ”దైవ సాక్షిగా చెబుతున్నాము. దైవ ప్రవక్తా! మీరు మమ్మల్ని తీసుకునో సముద్రంలో దూకినా మేమందుకు సిద్ధంగా ఉన్నాము. మాలోని ఏ ఒక్కడూ వెనుకంజ వేసేవాడు కాడు. మీరు తలచిన వారితో యుద్ధం చేయండి. అన్నింకీ మేము సిద్ధమే”.
ముస్లింలంతా దైవ సమక్షంలో మోకరిల్లి సహాయం కొరకు కడు దీనంగా మొర పెట్టుకోసాగారు. ప్రవక్త (స) గారు దుఆ చేయడంలో ఎంతగా లీనమై ఉన్నారంటే, ఆయన భుజం మీద నుండి దుప్పి జారి క్రిందపడిపోయిన ధ్యాస కూడా లేదు.

హిజ్రి శకం 2వ సంవత్సరం రమజాను నెల 17వ తేది ఉదయం వేళ రెండు సైన్యాలు ముఖాముఖి అయినాయి. మహా ప్రవక్త (స) ఆజ్ఞపై ముస్లిం యోధులు బారులు తీరి నిలబడ్డారు. ఒక్కొక్క వ్యక్తితో సమరం మొదలయింది. అల్లాహ్‌ ముస్లింలకు ఆకాశం నుండి మద్దతు పంపాడు. ముస్లిం యోధుల పంక్తుల మధ్య దైవ దూతలు సంచరించసాగారు. అవిశ్వా సుల్లో గుబులు పుట్టింది. వారు భయ కంపితులయ్యారు. మెల్లమెల్లగా వారు యుద్ధ మైదానం నుండి జారుకోసాగారు. వారి పరాజయ సూచనలు ప్రస్ఫుటంగా కన్పించసాగాయి. మిగిలినవారు ముస్లిం యోధుల ధాికి నిలువలేక కాళ్ళకి బుద్ధి చెప్పారు. విజయం ముస్లింలకు వరించింది. సత్యం గెలిచింది. నిజమైన నిజం నెగ్గింది.

ఈ యుద్ధంలో అనేక మంది ఖురైషులు మరణించారు. వారిలో అబూ జహల్‌ ప్రముఖుడు. ఇతన్ని అన్సార్‌కి చెందిన ఇద్దరు కుర్రాళ్ళు వధించారు. హతులైన ఖురైషీ సైనికుల సంఖ్య 70కి చేరుకుంది. మరో 70మంది ఖైదీలయ్యారు. ముస్లింల లో 14మంది అమరగతులయ్యారు. యుద్ధ ఖైదీలను ప్రవక్త (స) మదీనా తీసు కెళ్ళారు. సహచరులంతా వారి ఎడల సహృ దయంతో మెలిగారు.

తర్వాత వారిలోని చాలా మందిని పరిహారం తీసుకుని వదిలేశారు. ఆ ఖైదీలలో ప్రవక్త (స) గారి పెదనాన్న అబ్బాస్‌ మరియు ప్రవక్త (స) కూతురు జైనబ్‌ (ర) భర్త అబుల్‌ ఆస్‌ కూడా ఉన్నారు. ప్రవక్త (స) తన కూతుర్ని మదీనా పంపాలన్న షరతుపై అతన్ని విడుదల చేశారు. ఇంకా కొంత మంది పరిహారం చెల్లించలేని నిరుపేదలు న్నారు. అలాంటి వారు బంధ విముక్తి కోసం ఒక్కొక్కరు పదేసి మంది మదీనా బాలబాలికల కు చదవడం, వ్రాయడం నేర్పించాలని సూచించారు. యుద్ధం తర్వాత ప్రవక్త (స) సమర సొత్తు (మాలె గనీమత్‌)ను యుద్ధ వీరుల మధ్య పంచి పెట్టారు. దైవం నిర్ణయించిన 5వ భాగాన్ని దైవ ప్రవక్త (స) తీసుకున్నారు.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.