ఆశయ సిద్ధికై ఆరాటం

రమజాను పూర్తి మాసపు ఉపవాసాలు ఇస్లామీయ మూల సిద్ధాంతాల్లోని ఓ మౌలిక సిద్ధాంతం. ఖుర్‌ఆన్‌ – ”ఇక మీదట ఈ మాసాన్ని పొందిన వారు విధిగా పూర్తి మాసపు ఉపవాసాలు పాటించాలి”. (అల్‌ బఖరహ్‌: 185) అని ఉపదేశిస్తే, ”ఎవరయితే ఎలాంటి అనివార్య కారణం, అస్వస్థత లేకుండా రమజాను ఒక ఉపవాసాన్ని విడనాడుతారో దానికి బదులుగా అతను జీవితాంతం ఉపవాసం పాటించినా సరి తూగదు”. (బుఖారీ) అంటూ రమజాను పూర్తి మాసపు ఉపవాసాల పామ్రుఖ్యతను నొక్కి వక్కాణించారు పవ్రక్త (స). స్వయంగా ఆయన (స) 9 రమజానుల ఉప వాసాలు పాటించారు.

మన పైన స్వర్గం అలంకరించ బడుతుంటే, మన కింద నరకాగ్ని రాజేయ బడుతుంటే మనమెలా పశ్రాంతగా పడుకుాంము చెప్పండి!

ఈ కారణంగానే ”ఎవరయితే ఎలాంటి అనివార్య కారణం, అస్వస్థత లేకుండా రమజాను ఒక ఉపవాసాన్ని విడనాడుతారో వారు వ్యభిచారికన్నా, తాగుబోతు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వ్యక్తి కన్నా హీనులు. అంతేకాదు ఇస్లాం ధర్మ విషయంలో వారి నిజాయితీ సంశయాత్మకమయినది. అలాంటి వారిని సజ్జన మన పూర్వీకులు ధర్మ భ్రష్టులుగా ఎంచేవారు” అన్నారు ఇమామ్‌ జహబీ(ర.అ). ఇక ఎవరయితే రమజాను ఉపవాసాలు విధి అన్న విషయంలో వాగ్వివాదానికి దిగుతారో వారు ఇస్లాం నుండి బహిష్కరించబడిన వారవుతారు అన్నది నిఖరం.

ఈ మహత్తర ఆరాధన గత సముదాయాల్లో ఉన్నప్పటికీ, నేడు ముస్లిం సమాజం పాటిస్తున్న ఉపవాసాలు గత సముదాయాలాంటి ఉపవాసాలు కాజాలవు. ఉపవాసం అన్న భావనకు రూపాలు వేర్వేరుగా ఉండేవి. నాటి నుండి నేటి వరకూ యూద, కైస్త్రవులు, ఇతర మతస్తులు ఉపవాసం విషయంలో దేశ, కాలాల్ని బట్టి విభేధించుకుంటూనే ఉన్నారు. అయితే విశ్వ వ్యాప్తంగా నివసిస్తున్న విశ్వాసులు-ముస్లింలందరూ అంతిమ దైవ పవ్రక్త ముహమ్మద్‌ (స) వారిపై హిజీ శకం 2వ సంవత్సరం ఉపవాసం విధి అయింది మొదలు నేటి వరకూ ఏక రీతిన ఉపవాసం పాటిస్తున్నారు. పళ్రయం వరకూ ఈ పద్ధతి మారదు కూడా. రండి! ఉపవాస ఆశయాల్ని తెలుసుకుందాం!

పథ్రమ ఆశయం-తఖ్వా:

ఉపవాస ఆశయాలు కొన్నున్నాయి. ఈ మహత్తర ఆశయాల్ని మనం చేరుకున్న నాడే మనం పొందిన సువర్ణ మాసం రమజాను సార్థకం అవుతుంది. ఉపవాస ఆశయాల్లో అగ్ర తాంబూ లం తఖ్వా-దైవబీతికే. ”మీరు భయ భక్తుల కలిగి మసలుకుంటారని భావించబడుతోంది”. (అల్‌ బఖరహ్‌: 183)

తఖ్వా నిర్వచనం:

‘చెయ్యమన్న వాటికి శిరసా వహించడం, చెయ్య కూడదన్న వాటికి దూరంగా ఉండటమే తఖ్వా’ అని ఉమర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ (ర) సెలవిస్తే, ‘మహోన్నత పభ్రువు యెడల భీతి, అవతరించిన దాని (ఖుర్‌ఆన్‌) యెడల పాటించాలన్న పీత్రి, తక్కువ ఒనరులతో సంతృప్తి, మరణించే నాటి కోసం అవిరళ కృషి-ఇదే తఖ్వా’ అన్నారు అలీ బిన్‌ అబీ తాలిబ్‌ (ర).
‘ఇరువైపులా దట్టమైన ముళ్లున్న ఇరుకయినా దారి గుండా వెళుతున్నప్పుడు మనం ఎలాగయితే మన బట్టలు ఆ కంపల్లో ఇరుక్కో కుండా ఒదిగి పట్టుకుంటూ చాలా జాగత్త్రగా ఆ బాట బారి నుండి బయట పడతామో, అలాగే పాపం అనే పరికి కంపల్లో మాన జీవితం ఇరుక్కోకుండా కాపాడుకోడమే తఖ్వా’ అన్నారు ఉబై ఇబ్ను కఅబ్‌ (ర).
తఖ్వాకు గల ఓ అర్థం-‘మనిషికి హాని చేసే వస్తువుకు, విషయానికి దూరంగా ఉండటం’. తఖ్వా మనలో చోటు చేసుకుంటే పైన పేర్కొనబడిన అన్ని ఉద్దేశాలను నెరవేరడమే కాక, మహా భయంకరమయిన నరకాగ్ని బారి నుండి సయితం ఉపవాసం మనల్ని కాపాడుతుంది: ”ఎవరయితే అల్లాహ్‌ మార్గంలో ఒక్క రోజు ఉపవాసం పాటిస్తారో దానికి పత్రిఫలంగా అల్లాహ్‌ ఆ వ్యక్తి ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాలంత దూరం చేస్తాడు”. (ముత్తఫ ఖున్‌ అలైహి)
కాబట్టి ‘కోరికలు కళ్లెం లేని గుర్రాల్లా పెట్రేజగి పోవాలనుకున్నప్పుడల్లా ‘తఖ్వా’ అన్న ముకుతాడుతో వాటిని అదుపు చేయాలి’ అన్నారు ఇబ్నుల్‌ జౌజీ (ర).

రెండవ ఆశయం-కృతజ్ఞతాభావం:

”మీరు కృతజ్ఞతలు తెలుపుకుాంరని ఆశించ బడుతోంది”. (అల్‌ బఖరహ్‌: 185)
ఉపవాసం స్వల్ప కాలం వరకు మనల్ని ఆహార పానీయాలకు దూరం చేసి అల్లాహ్‌ అపార అనుగ్రహాల్ని నెమరు వేసుకునేలా తీర్చిదిద్దుతుంది. ఆరోగ్యమే మహా భాగ్యం సందే హం లేదు. అయితే మన ఆరోగ్యాన్ని మనం అల్లాహ్‌ విధేయతలో గడిపితే కృతజ్ఞత. అయన అవిధేయతా కార్యాల్లో వృధా పరిస్తే కృతఘ్నత. ”తినడానికి కూడు, ఉండానికి గూడు, తొడుక్కొవడానికి గుడ్డ ఉండి మన వారి మధ్య మనం ఉంటూ మన ధర్మాన్ని పాటించుకునే సౌకర్యం మనకుంటే మన దగ్గర పప్రంచ సకల సంపదలు ఉన్నట్లే” అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). (బుఖారీ) దానిగ్గాను మనం ఆల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ముఖ్యంగా మరొక్క మారు రమజాను మాసాన్ని పొందే అవకాశం అల్లాహ్‌ మనకు పస్రాదించనందుకు మనం ఆయనకు వేన వేల కృతజ్ఞతలు చెల్లించుకోవాలి.

మనం ఎంతగానయితే కృతజ్ఞతను కలిగి ఉంటామో అల్లాహ్‌ అంతగానే మనల్ని కరుణిస్తాడు: ”ఒకవేళ మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటే నేను మీకు మరింత పస్రాదిస్తాను”. (ఇబాహ్రీమ్‌;7) కృతజ్ఞత అనేది మనసా, వాచా, కర్మణ జరగాలి. ”మీకు లభించిన సర్వస్వం అల్లాహ్‌ పస్రాదితం” (నహల్‌:53) అని మనస్ఫూర్తిగా నమ్మాలి. ”నీ పభ్రువు అనుగహ్రాన్ని కొనియాడు”. (అజ్జుహా: 11) అన్న అల్లాహ్‌ ఆదేశాన్ని అనుసరించి మాట ద్వారా దాన్ని వ్యక్త పర్చాలి. ”ఓ దావూద్‌ కుటుంబీకుల్లారా! ఇందుకు కృతజ్ఞతగా సదాచరణ చెయ్యండి”. (సబా: 13) అన్న అల్లాహ్‌ ఉపదేశాన్ని పాటిస్తూ కియ్రా పరమయిన-నమాజు, రోజా, జకాత్‌, హజ్జ్‌ తదితర ధర్మ విధుల్ని సజావుగా నిర్వర్తించాలి. ఆశయ సిద్ధికై ఆరాటం!

 

మూడవ ఆశయం – సన్మార్గ భాగ్యం:

”తద్వారా వారు సన్మార్గ భాగ్యం పొంద గల్గుతారు”. (బఖరహ్‌: 18) రుష్ద్‌ అంటే స్థిరత్వం, నిలకడ, నిగహ్రం, అదుపు అన్న అర్థాలు వస్తాయి.

నయన నిగహ్రం:

మనసును చలింపజేసే విషయాలపై చూపులు చల్లకుండా కాపాడుకోవాలి. ఎక్కువ సమయం ఖుర్‌ఆన్‌ను చూస్తూ చదవడం వల్ల, సృష్టి అందాలను తికిస్తూ సృష్టికర్త మహిమను కొనియాడటం వల్ల ఈ నయన నిగహ్రం మనిషికి అలవడుతుంది.
‘చూపుల్ని ఎలా కాపాడుకోవాలి?’ అని జునైద్‌ (ర) ఒకరు పశ్న్రిస్తే – ”ఏ వస్తువు వైపైతే నీ చూపు వెళుతుందో ఆ వస్తువు నీకన్నా ముందు నీ పభ్రువు దృష్టిలో ఉంటుంది అన్న ధ్యాసే నిన్ను నయన నిగహ్రం గల వ్యక్తి నిలబెడుతుంది” అన్నారు.

నాలుకను అదుపులో ఉంచుకోవడం:

”నిరతం నీ నాలకపై అల్లాహ్‌ నామం నానుతూ ఉండేలా చూసుకో” అని పవ్రక్త (స) తన ఓ సహచరుణ్ని ఉపదేశించారు. మన నాలుకపై అల్లాహ్‌ నామ స్మరణ లేదంటే ఖచ్చితంగా ఏదోకటి ఉండి తీరుతుంది. అలా ఉండకూడదు అంటే మాత్రం మనం మన నాలుకను ఖుర్‌ఆన్‌ పారాయణం ద్వారా, హదీసు పుస్తక పఠనం ద్వారా, మంచి పుస్తక అధ్యాయనం ద్వారా నిమగ్నం చేసుకోవాలి. ”మీలో ఒకరు ఆ రోజు ఉపవాసం ఉన్నారంటే వారు అశ్లీల పదాలను వల్లించకూడదు, అబద్ధమాడకూడదు” అన్నారు పవ్రక్త (స). (ముత్తఫఖున్‌ అలైహి) ”ఉపవాసం అంటే కేవలం అన్నపానీయాలకు దూరంగా ఉండటం మాతమ్రే కాదు, అబద్దానికి, అసత్యానికి, అనవసర మాటకు, మాటి మాటికీ ఒట్టు వేయడానికి దూరంగా ఉండాలి” అన్నారు ఉమర్‌ (ర).

వీనులను అదుపులో ఉంచుకోవడం:

మంచిని అనాలి, మంచిని కనాలి, మంచిని వినాలి. మృదు మధుర ఖుర్‌ఆన్‌ స్వర్ణకార ధ్వనుల్ని మనం శవ్రణానందంగా ఆలకించాలి, హదీసు రజిత రసాస్వాదన చేయాలి. గొప్ప గొప్ప పండితుల హితోపదేశాలకు చెవొగ్గాలి. సంగీతం వాయిద్యాల రణగోణ ధ్వనుల శబ్ద కాలుష్యం నుండి మన వీనుల్ని కాపాడుకోవాలి. ”నువ్వు ఉపవాసం ఉంటే నీతోపాటే నీ వీనులు, నీ చూపులు, నీ నాలుక కూడా అబద్దం నుండి, పాప కార్యాల నుండి ఉపవాసం ఉండాలి” అన్నారు జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర). ఇదే విషయాన్ని మరింత విపులీకరించారు పవ్రక్త(స): ”ఎవరయితే ఉపవాసం ఉండి అబద్దం అడటం, దాని పక్రారం పని చేయడం మానుకోరో వారి ఆకలి దాహాల పట్ల అల్లాహ్‌కు ఎలాంటి శద్ధ్ర లేదు” (బుఖారీ)

మేధో నిగహ్రం:

బుద్ధికున్న పేర్లు అనేకం. వివేకం, ఇంగిత జ్ఞానం, సమయస్ఫూర్తి. వృక్షానికి శోబనిచ్చేది పుష్ప సంపదయితే, మనిషికి శోభనిచ్చేది బుద్ధి సంపద. తావి లేకపోతే పుష్పం ఎలాగయితే పుష్పంగా ఉండదో,ధర్మజ్ఞానం లేకపోతే బుద్ధి కూడా గాడి తప్పి బుద్ధిగా ఉండదు. జ్ఞానం అన్నది నిజకర్తను గుర్తించేది, ఆయన ఆదేశాల కనుగుణంగా జీవించేలా పేర్రేపించేది. పరలోక చింతనను కలిగించేది. దీన్నే కుశల బుద్ధి అంటారు. దీనికి భిన్నంగా అహంకరించేది, పరిహసించేది, అధికార మదంతో హూంకరించేది కుటిల బుద్ధి. ఉపవాసం బుద్ధిని సవ్యమయిన బాటలో పయనింపజేసి కస్తూరీ సువాసనల్ని వెదజల్లే నిండు తావి గల పుష్పంగా తయారు చేస్తుంది. ఇజాల, మిథ్యా సిద్ధాంతాలక నుండి కాపాడి నిజానికి కట్టుబడేలా తీర్చి దిద్దుతుంది. ‘యోచన వెలుగయితే, స్థబ్దత చీకటి. అజ్ఞానం మార్గభష్ట్రత్వం’.

శారీరక క్రమబద్ధత:

తీసుకునే ఆహారం హలాల్‌ (ధర్మస్మతమయినా) అతికి దూరంగా ఉంచుతూ శరీరాన్ని మితాహారానికి అలవాటు చేస్తుంది ఉపవాసం.కోరిక అది ధర్మం అనుమతించినదయినా అల్లాహ్‌ ఆజ్ఞ అందగానే, ఆయన ఆగి ఉండమన్నంత కాలం దాన్నుండి ఆగి ఉండేలా తర్ఫీదు ఇస్తుంది. ఉపవాస ఉద్దేశ్యమే కోరికలో దాగి ఉన్న మృగ వాంఛను అదుపు చెయ్యడం. మనిషి మనసును దైవ భీతి, పరలోక భీతి, స్వర్గ పీత్రితో బల పర్చడం. ఒక్క మాటలో చెప్పాలంటే, తినడానికే బతికేలా కాకుండా మనిషి జీవించగలిగేంత మాత్రమే తినేలా అది మనలో క్రమ బద్ధతను నూరి పోస్తుంది.

 

నాల్గవ ఆశయం – పాప పక్ష్రాళనం:

”రమజాను మాసాన్ని పొంది కూడా క్షమాభిక్ష పొందలేకపోయిన వ్యక్తి ముక్కుకు మట్టి తగులుగాక!” (బుఖారీ) ”అతనికి మించిన దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు” (బుఖారీ) అన్న పవ్రక్త వారి పవ్రచనాల ద్వారా తెలిసేదేమిటంటే, రమజాను మాసం క్షమాభిక్ష, పాప ప్రక్షాళనా మాసం. ఉపవాసానికి బదులు పాప ప్రక్షాళనం. తరావీహ్‌కి బదులు పాప ప్రక్షాళనం. లైలతుల్‌ ఖద్‌క్రి బదులు పాప ప్రక్షాళనం. ఇంతటి మహత్తర అవకాశాన్ని సయితం ఒకడు సద్వినియోగ పర్చుకోలేక పోయాడంటే అతని మించిన దరిదుడ్రు ఎవరుంటారు చెప్పండి! మన పైన స్వర్గం అలంకరించ బడుతుంటే, మన కింద నరకాగ్ని రాజేయ బడుతుంటే మనమెలా పశ్రాంతగా పడుకుాంము చెప్పండి!
అల్లాహ్‌ మనందరని రమజాను మాసానికి సంబంధించిన ఒక్కో ఘడియను సద్వినియోగ పర్చుకునే తన పియ్రతమ దాసుల జాబితాలో చేర్చి, స్వర్గ ఎనిమిది ద్వారాల గుండా స్వర్గ ఆహ్వానం పొందే భాగ్యవంతుల్లో చేర్చి, జన్నతుల్‌ పీర్‌దౌసిల్‌ ఆలాలో మహా పవ్రక్త ముమహమ్మద్‌ (స) వారి పవిత్ర సాంగత్యాన్ని అను గహ్రించి, అల్లాహ్‌ దివ్వ ధర్శనంతో మన జీవితాల్ని ధన్యం చేయుగాక! ఆమీన్‌.
రమజాను మాసం ఓ మహదావకాశం! యూజ్‌ ఇట్ ఆర్‌ లూజ్‌ ఇట్, ఛాయిజ్‌ ఈజ్‌ యువర్‌!!

Related Post