చరితార్థులం అవ్వాలి మనం

మేలు చెయ్యి, మేలు జరుగుతుంది:

ముస్లింలలో అనేక మందిని అల్లాహ్‌ మహా గొప్పగా అనుగ్రహించి ఉన్నాడు. సంపద పరంగా, స్థాయి, హోదా పరంగా వారు మంచి పొజీషన్‌లో ఉన్నారు. వారు పూనుకుంటే గట్టి మేలు తలపెట్ట గలరు. సొంత స్వార్థం మానుకుని దేశ పౌరులకు తోడు పడగలరు. కానీ అనేక మంది ముస్లిం స్థితిమంతులు, హోదా, అంతస్థు గల వారు తమ సంపదను పేరు ప్రఖ్యాత ప్రాకులాట కోసం చాలా పెద్ద స్థాయిలో కవి సమ్మేళనాలు నిర్వహించడం, టోర్నమెంట్లు జరిపించడం, రాజకీయ నేతలకు పిలిచి పార్టీలు ఇవ్వడం, కోట్లు ధారబోసి పార్టీ సీటు కొనడం వంటివి చేస్తూ ఉండటం మిక్కిలి విచారకరం!

ఏక సమయంలో ఇటు ఇస్లాం ధర్మానికి, అటు సెక్యూలరిజానికి విశ్వాస పాత్రులుగా ఉంటాము అన్న మాటకు మించిన మోస పూరిత మాట మరొకటి లేదు. సెక్యూలరిజమ్‌ అంటేనే మత రాహిత్యం. ఇది దాని ప్రాథమిక సూత్రం, అజ్ఞానపు ఆలోచన అని తెలుసుకోండి.

కీర్తి పత్రిష్టలే ముఖ్యం అనుకుంటే వాటిని పస్రాదించే వాడు కేవలం అల్లాహ్‌ మాతమ్రే అని గుర్తుంచుకోవాలి. పేరు ప్రఖ్యాతల కోసం ఇలా తమ శ్రమను, సంపదను, సమయాన్ని వృధా పర్చడం కన్నా ముస్లిం సముదాయంతోపాటు ఇతర పౌరులకు పనికొచ్చే పాఠశాల, కళాశాల నిర్మాణం, జీవనోపాధి అవకాశాలను అందు బాటులోకి తేవడం చాలా అవశ్యం. ”దుబారా ఖర్చు చేసేవారు షైతాను సోదరులు” (ఇసా: 27) అని తెలుసుకోండి! ”రేపు పళ్రయ దినాన మీకు అనుగ్రహించ బడిన పత్రి అనుగ్రహం గురించి మిమ్మల్ని నిలదీసి అడగడం జరుగుతుంది”(తకాసుర్‌:8) అని మరువకండి. తీర్పు దినాన అల్లాహ్‌ ముందర నిలబడినప్పుడు మీరు సంపాదించిన, కూడ బెట్టిన, ఖర్చు చేసిన ప్రతి పైసా గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ”అయ్యో! నా సంపద నాకు ఏ విధంగానూ పనికి రాలేదే! నా అధికార ప్రాబల్యం నాకు ఏ విధం గానూ పనికి రాలేదే” అని అరణ్య రోధన చేసే దుస్థితి దాపురించక ముందే మంచికి శీక్రారం చుట్టండి!

అనుగ్రహ పద్రాత అయిన అల్లాహ్‌ మాట ఇది: ”అల్లాహ్‌ నీకు పస్రాదించిన దానిలో పరలోక స్థానాన్ని కూడా ఆన్వేషించు. మరి నీ పాప్రంచిక భాగాన్ని కూడా మరువ బోకు. అల్లాహ్‌ నీకు ఏ విధంగా మేలు చేశాడో అదే విధంగా నువ్వు కూడా (పజ్రల పట్ల) సద్వ్యహారం చెయ్యి. భువిలో అరాచకం కోసం ఆరాట పడకు. అరాచకం సృష్టించగోరే వారిని అల్లాహ్‌ ఎంత మాతం ఇష్ట పడడు”. (అల్‌ ఖసస్‌:77)

ఇజాల నడుమ మనం:

సాహితీ వేత్తలు, విజ్ఞులు ఒక జాతి భవిష్యత్తుకు దిశా నిర్దేశకులుగా ఉంటారు. ఈ ప్రాముఖ్యత దృష్ట్యా ముస్లిం కలంకారులతో, విజ్ఞులతో మా విన్నపం ఏమిటంటే, ‘మేము సెక్యూలర్‌ భావాలు’ గల వాళ్ళము అన్పించుకోవడం కోసం ఆరాట పడకండి. ముందు ‘సెక్యూలరిజమ్‌’ అంటే ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. సెక్యూలరిజమా? లేదా ఇస్లాం ధర్మమా? ఏదోకటి తేల్చుకోండి. మేము ముస్లింగా ఉంటూనే సెక్యూలర్‌గా ఉండగలము అన్న ఆత్మ వంచనకు స్వస్థి పలకండి. ఏక సమయంలో ఇటు ఇస్లాం ధర్మానికి, అటు సెక్యూలరిజానికి విశ్వాస పాత్రులుగా ఉంటాము అన్న మాటకు మించిన మోస పూరిత మాట మరొకటి లేదు. సెక్యూలరిజమ్‌ అంటేనే మత రాహిత్యం. ఇది దాని ప్రాథమిక సూత్రం, అజ్ఞానపు ఆలోచన అని తెలుసుకోండి. దీన్ని బుద్ధి సమర్థించదు, జ్ఞానమూ సమర్థించదు, పరిశోధనా సపోర్ట్‌ చెయ్యదు. సెక్యూలరిజమ్‌ అంటే అల్లాహ్‌ మరియు ఆయన ఆదేశాలతో మానవ జీవితానికి ఎలాంటి సంబందం లేదు, అవసరం కూడా లేదు. ప్రవ క్తలు, దైవదూతలు, పరలోకం, స్వర్గం, నరకం, తీర్పు, పళ్రయ సమీకరణ, పునరుత్థానం అన్ని వట్టి బూటకం అని చెప్పేది.

ప్యూరో బాఖ్‌ – ‘దేవుడనబడే వస్తువే లేదు. మతం కేవలం ఒక ఆట విడుపు మాతమ్రే’ అంటాడు.
ఫాల్‌ సార్తర్‌ – ‘దేవునితో, మతంతో, నైతికతతో మనిషి దూరం కానంత వరకూ మనిషి స్వేచ్ఛ పరిపూర్ణం అవ్వదు’ అంటాడు.
వాల్టర్‌ – ”మనిషి మతి నుండి మత పరమయిన ఆలోచనలను పక్ష్రాళిస్తే గానీ ప్రపంచం నుండి దౌర్జన్యం, మోఢ్యం, సంకుచిత స్వభావం అంతమవ్వదు” అంటాడు.
ఒక్క నిమిషం ఆలోచించండి! అల్లాహ్‌ను, అల్లాహ్‌ పవ్రక్తలను, అల్లాహ్‌ గంథాలను, మరణ నంతర జీవితాన్ని, మంచీ చెడు విధిరాతలను నమ్మడం, నమాజు, జకాతు, ఉపవాసాలు, హజ్జ్‌ మొదలయినవన్నీ మూర్ఖత్వం. బూటకం. ఇది విజ్ఞానం, ఇలా చెప్పేవారు విజ్ఞులు అంటే దానికి మించిన తిట్టు మరొకటి ఉండదు.
ఒకరిని సంతోష పెట్టడానికి వారి తలపాగాను చట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, విగ్రహ ప్రతిమలకు పుష్పాభిషేకం, పాలాభిషేకం చెయ్యడం, చర్చీకి వెళ్ళి ఫాదర్‌ బ్లెస్సింగ్‌, మందిరానికేల్ళి పూజారి ఆశీర్వాదం, దర్గాహ్‌కు వెళ్ళి ముజావర్‌ దీవెనలు తీసుకోవడం, సజ్దా చెయ్యడం ఒక కథానాయకుడు కూడా ఇన్ని రంగులు పూసుకోడేమో. కేవలం ఓటు, నోటు కోసం.. అమాయక పజ్రలను మోసగించడం కోసం ఇలా చెయ్యడం ఎంత నీచం! ఒక్క నిమిషం కోసం ఆలోచించండి! మీరు మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని అమ్మకానికి పెడుతున్నారు. అది కూడా ఎలాంటి పప్రంచం కోసం? ”అల్లాహ్‌ దగ్గర దోమ రెక్కకు కూడా సమానం కాని” తుచ్ఛ పాప్రంచిక ప్రయోజనాల కోసం!
సెక్యూలరిజమ్‌ అంటే మీరు అపార్థం చేస కున్నారు అనేవారు స్వయంగా వారు అటు ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకో లేదు. ఇటు సెక్యూలరిజాన్ని అర్థం చేసుకోలేదు. వారు అర్థం చేసుకున్నది వారికి అర్థంమయ్యింది వారి పయ్రోజనాలు మాతమ్రే. గుంట నక్కను ఎవరయినా సాధు జంతువు అంటే దాని పరిభాష మారి పోతుందా? దాని వృత్తి, పవ్రృత్తి మారి పోతుందా చెప్పండి!
ప్రస్తుత యుగాన్ని వైజ్ఞానిక యుగంగా చెబుతారు. ఇక్కడ ఎవ్వరూ ఎవరినీ మోసం చెయ్యాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మనిషి ఏ మతస్థుడయిన అతనికి గుర్తింపు అతని నీతి, నడవడక, వెన్నుముక వ్యక్తిత్వం,క్రమ శిక్షణ, సమయ పాలన, మాట నిల బెట్టుకోవడం, నిజాయితీని బట్టి ఉంటుందే తప్ప ఇలాంటి నాటకీయ చేష్టల ద్వారా కాదు.

ఆత్మావలోకనం:

నేడు మనందరిలో అనేక చెడులు జడలు విప్పుతున్నాయి. కారణం మనం అల్లాహ్‌ మరియు ఆయన పవ్రక్త (స) వారి మార్గదర్శకత్వం నుండి వెలుగును తీసుకోవడం తగ్గించాము లేదా పూర్తిగా మానుకున్నాము. అల్లాహ్‌ మరియు ఆయన పవ్రక్త (స) వారి విధేయత లో ఇహపరాల సాఫల్యం దాగుంది. కానీ, నేడు మనం మన అసలు దిశను వదిలేసి ఎన్నో దిశలను కేయించుకున్నాము. రాజకీయ రంగంలో ఒకడు ‘అక్బర్‌’ నాకు ఆదర్శ ప్రాయుడంటే, ఆర్థిక రంగంలో నాకు ‘కార్ల్‌మార్క్స్‌’ ఆదర్శ ప్రాయుడంటాడు మరొకడు. వ్యవహారంలో ఒకడు ‘ఛార్లీ చంప్లీన్‌’ నాకు ఐడియల్‌ అంటే, అధికారంలో ‘హిట్లర్‌’ నాకు ఐడియల్‌ అంటాడు. తత్వ శాస్తంలో ‘ప్రాయిడ్‌’ నాకు దిక్సూచి అంటే, తర్క శాస్తంలో నాకు ఫలానా వ్యక్తి దిక్సూచి అంటాడు మరొకడు. ఇన్ని ఐడియల్స్‌, ఆదర్శాల మధ్య మహా ఆదర్శంగా అల్లాహ్‌ పేర్కొన్న ప్రవక్త ముహమ్నద్‌ (స)ను మనం వదిలేశాము. ఇలా మనం ఎంత కాలం చేసినా సఫలీకృతులం కాలేము. ధర్మ ద్రోహానికి పాల్పడిన మనకు స్వామి అనుగ్రహం వరిస్తుందనుకోవడం పగటి కల తప్ప మరేమీ కాదు.

ఇస్లాం వంటి సంపూర్ణ జీవన విధానం మనకు అల్లాహ్‌ అనుగహ్రిస్తే మనం ఇలా వేషాలు మారడం, ఎప్పుడు చినుకవుతారో, ఎప్పుడు మడుగవుతారో, ఎప్పుడు పిడుగవుతారో తెలియని వారి పంచన చేరడం ఒక ముస్లింగా మనకు ఏ విధంగానూ శోభించని విషయం. కాబట్టి అనేక విధానాలు, నినాదాలను అనుసరించి మనం సాఫల్యం సాధించ లేము. రేపటి మన సంతానం ఈ నిజం లేని ఇజాలకు ప్రభావితులు కాకూడదన్నది మన అభిలాష అయితే, మనల్ని మనం ముందు ఇస్లామీయ రంగులో రంగరించుకోవాలి. జీవితానికి ప్రవక్త (స) వారు గీసిన సరిహద్దు రేఖలను మనం దాట కూడదు. ”ఇదే నా రుజుమార్గం. కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరతా మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లాహ్‌ మార్గం నుండి వేరు పరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకుగాను అల్లాహ్‌ మీకు ఈ విధంగా తాకీదు చేశాడు”. (అన్‌ఆమ్‌: 153))

అల్లాహ్‌ ఆదేశానికి మనం శిరసా వహించినట్లయితే ప్రజల మన్నలను మన దక్కక ముందే ప్రభువు ప్రశంసకి అర్హులం అవుతాము. ఆయన గనక మనల్నిప్రేమిస్తే దైవ దూతల నాయకునికి, ఆయన ద్వారా ఆకాశ వాసులకు, వారి ద్వారా భూమిలోని చరాచరాలకు అల్లాహ్‌ పేమ్ర సందేశం అంది, అందరూ ఆ దాసుణ్నిప్రేమించడం ప్రారంభిస్తారు. (బుఖారీ)
”ఇలా ప్రకటించు: ఓ అల్లాహ్‌! విశ్వ రాజ్యాధి పతీ! నీవు కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తావు. నీవు కోరిన వారి నుండి రాజ్యాన్బి లాకుంటావు. నీవు కోరిన వారికి గౌరవమొసగుతావు. నీవు కోరిన వారిని పరాభవానికి గురి చేస్తావు. సమస్త మేళ్లూ నీ చేతిలోనే ఉన్నాయి. నిశ్చయంగా నీవు ప్రతి వస్తువు పైన అధికారం కలవాడవు”. (అల్‌ ఇమాన్ర్‌: 26)

చివరి విన్నపం:

”మీరు ఇస్లాంలో పూర్తిగా పవ్రేశించండి”. (అల్‌ బఖరహ్‌: 208) అంటే, మనం ఏదొక రంగంలో మాత్రమే ఇస్లాం ధర్మాన్ని అనుసరించి మిగతా రంగాలలో ఇస్లామీయ హద్దుల్ని, పద్దుల్ని ఖాతరు చెయ్యడం లేదంటే అవమానం మన నుదుటి రాతగా మారడం ఖాయం. నేడు అంతర్జాతీయ స్థాయిలో ముస్లింల స్థితి రోజు రోజుకి దిగజారుతున్నది. ఇలాంటి విపత్కర స్థితిలో మనం సయితం యూదులు, క్రైస్తవులు, నాస్తికుల విధానాల అవలంబిస్తూ, వారు చేసిన పనులే మనం చేస్తూ అల్లాహ్‌ సహాయం వస్తుందనుకోవడం అత్యాశే కాదు, ఎన్నికీ తీరని ఆశ. చరిత్ర నుండి పాఠాన్ని గ్రహించాలి మనం. మనం మన మనోమయ స్థితని మార్చుకునే పయ్రత్నం చెయ్యాలి. ఎంతో మంది ధర్మ బోధకులు వారు చేస్తున్న బోధనలను వారే పాటించడం లేదు. ఎంతో మంది ఆస్తిపరులు దాన ధర్మాలు చెయ్యడంలో చూపించే ఆసక్తి మిగతా విషయాలలో కనబర్చడం లేదు. ఎంతో మంది నమాజీలకు నమాజులోని ముఖ్యమయిన విషయ జ్ఞానం కూడా పూజ్యం. రోజుకి నిష్ఠగా అయిదు పూటలు పాటించే నమాజును మనం చక్కబెట్టుకోలేక పోతున్నామంటే, సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని చక్కదిద్దే సామర్థ్యం మనలో ఎక్కడిది చెప్పండి! మరి అల్లాహ్‌ అసమర్థులకు ప్రపంచ పగ్గాలు అప్పగిస్తాడా చెప్పండి!

కాబట్టి అల్లాహ్‌కు మనల్ని దగ్గర చేసే ఆయన మన మీద విధిగావించిన విధుల నిర్వహణతో పాటు, అన్య జనుల వరకూ ఇస్లాం ధర్మ సందేశాన్ని అంద జేయాలి. మనలో నాయకత్వ లక్షణాలను పెంపొందించు కోవాలి. కేవలం మస్జిద్‌లకు, మదర్సాలకు పరిమితం అవ్వమని ఇస్లాం చెప్పదు. ఇస్లాం ధర్మాన్ని నేల నాలుగు చెరగులా స్థాపించాలన్నది దాని ఆదేశం.ఈ పార్టీ భయం, ఆ పార్టీ భయం, ఈ దళ ఆందోళన, ఆ జన పత్రిఘటన – వీటికి కాదు మనం తలొగ్గాల్సింది. మైనారిటీలం అన్న ఏడుపూ ఇక తగదు. మనం అల్లాహ్‌కు భయ పడాలి. ఆయనకు పూర్తి విధేయత చూపాలి. ఒకరి దయతో లభించేది హక్కు కాదు, అది భిక్షం. మనం కేవలం అల్లాహ్‌ సన్నిధిలో మాతమ్రే భిక్ష గాళ్ళము. ఇంకెవ్వరి ముందర చేయి చాచి స్వేచ్ఛను, బతికే హక్కు అడుక్కో కూడదు. అలా చేస్తేచరిత్ర హీనులం అవుతాం! మనం చరితార్థులం అవ్వాలి. మన తార్వతి తరాలకు స్ఫూర్తి దాతలం కావాలి. అవుతారని ఆశిస్తూ….!!

Related Post