మనిషి యదార్థ జీవిత లక్ష్యం ఏమిటి?

మనిషి యదార్థ జీవిత లక్ష్యం ఏమిటి? దైవ సంతుష్టి; అనగా దేవుని సంతుష్ట పర్చడం. దైవ ధ్యానం వల్లనే అతనికి మనఃశాంతి మరియు సంతృప్తి కలుగుతుంది. దివ్యఖుర్‌ఆన్‌లో ఈ యదార్థం పేర్కొనబడింది: ”జాగ్రత్తగా వినండి! అల్లాహ్‌ను స్మరించుట వల్లనే మనసులకు యదార్థమైన శాంతి లభిస్తుంది”. (రఅద్‌: 28)

పేరు ప్రతిష్ఠల వల్ల గర్వాహంకారాలు జనిస్తాయి. తత్ఫలితంగా మానవుడు తనను తాను ఉత్తమునిగా, ఇతరులను అధములుగా, హీనులుగా భావిస్తాడు. అతనికి దైవ భక్తి కలిగి ఉండమని హితవు చేస్తే గర్వంతో విర్రవీగుతూ దైవ నియమిత శాసనాలను ఉల్లంఘిస్తాడు.

ప్రాపంచిక రుచులు జీవిత లక్ష్యం కాలేనపుడు, కీర్తి ప్రతిష్టలు, ఉన్నత స్థానాలు, పదవులు, పేరు ప్రఖ్యాతులు మొదలగునవి ఉన్నత విలువలని భావించి, వాటిని పొందటమే అసలు జీవిత లక్ష్యమని నిర్ణయించడం ఎంత వరకు సబబు? కొందరికి నాలుక రుచుల కంటే వీనుల రుచులు (పరుల నోట తమ కీర్తి ప్రతిష్టలు మరియు పొగడ్తలు వినడం) అంటే మిక్కిలి ప్రియంగా ఉంటుంది. వారు ఈ చవక రుచి కోసం విలువైన రుచులను వదులుకోవడానికి సిద్దపడతారు. కష్టాలకు గురికావడానికి కూడా వెనుకాడరు. దుఃఖ విచారాలను సహించడానికి సిద్ధపడతారు. ఆపదలకు, అపాయాలను ఎదుర్కోవడానికి తయారుగా ఉంటారు. వట్టి పేరు ప్రతిష్టల కొరకు ఆపదలను మరియు కష్టాలకు గురి కావడం ఎందుకని ప్రశ్నించినా వారు పట్టించుకోరు. యదార్థానికి పేరు ప్రతిష్ఠల అభిలాషి ప్రాపంచిక రుచిని ఆరాధించినవాడు. ఒక విధమై నటువిం ప్రాపంచిక రుచి గ్రోలడమే అతని ఆరాధ్య దైవం. తన ఘనతను ప్రకించడం మరియు గొప్పలు చెప్పు కోవడం – ఇదే అతని ఉద్దేశ్యంగా ఉంటుంది. దాని సాధన కొరకు అతడు విలువైన వస్తువులను కూడా బలి చేయ డానికి సిద్ధ్ద పడతాడు.

పేరు ప్రతిష్ఠల పిపాసి తన ఆనంద హర్మ్యం గాలిపై నిర్మిస్తాడు. ప్రజల నోటి నుండి వెలువడే పొగడ్తలు వట్టి గాలి పలుకులు కాకపోతే మరేమిటి ? మానవుని వద్ద గాలిపై అధికారం చలాయించే శక్తి ఉందా? రోజు గాలి వాటం ఎటువైపు ఉంటుందో ఎవరికి తెలుసు? లోకులు కాకులు. ఈనాడు వారు తమ కథా నాయకున్ని అత్యంత ఉన్నత శిఖరాలకు చేరుస్తారు. రేపు అతన్నే అకారణంగా నీచత్వ లోయలో పడవేస్తారు. నేడు పొగడ్తలు, ప్రశంసలుంటే, రేపు చీవాట్లు, గద్దింపులుంటాయి. మరి కొంత కాలం తర్వాత మనో రంగం నుండి అతని తొలగింపు మరియు అతన్ని మరిచి పోవడం జరుగుతుంది. పేరు ప్రతిష్ఠల అభిలాషులకు ప్రజల మన్ననలు అందు కున్న తర్వాత చివరకు జరిగే పర్యవసానం ఇదే.

 

బ్రిటన్‌కు చెందిన వెల్లింగ్టన్‌ వాటర్లూ యుద్ధంలో నెపోలియన్‌ను ఓడించి విజయం సాధించాడు. అంతేకాక తన కాలపు నాగరికతా సంస్కృతులు నాశనం కాకుండా రక్షించాడు. ప్రజలతన్ని ఆదర గౌరవాలతో సత్కరించారు. మరియు వీర యోధుడని బిరుదు ఇచ్చారు. కాని కొద్ది కాలం పిదపనే ఆ ప్రజలే కోపోద్రేకులై లండన్‌ వీధుల్లో గుమిగూడి వెల్లింగ్టన్‌ తన జీవితాంతం కాపాడుతూ వచ్చిన అతని ప్రతిమను రాళ్ళతో కొట్టి నేలకూల్చి పగలగొట్టి మట్టి లో కలిపేశారు. ఒకప్పుడు జూలియస్‌ సీజర్‌ రోమ్‌ సామ్రాజ్యానికి నియంతగా పరిపాలన గావించాడు. కాని కృతఘ్నులైన తన నేస్తాల చేతులతోనే చంపబడ్డాడు. మహా వీరునిగా పేరు పొందిన అలెగ్జాండరు మరణించిన తర్వాత అతని మృతదేహం నెల రోజుల వరకు ఖనన సంస్కారాలు చేసేవారు లేక కుళ్ళుతూ పారవేయబడి ఉంది. గౌరవ లాంఛనాలతో ఆ మృత దేహాన్ని భూమిలో ఖననం చేసేవారు లేకపోయారు. పేరు ప్రతిష్ఠలు పొందడానికి కృషి చేసినవారికి లభించిన ‘మర్యాద’ ఇదే.
పేరు ప్రతిష్ఠల వల్ల మానవ జీవితంపై పడే ప్రభావం ఏమిటి ? పేరు ప్రతిష్ఠల వల్ల గర్వాహంకారాలు జనిస్తాయి. తత్ఫలితంగా మానవుడు తనను తాను ఉత్తమునిగా, ఇతరులను అధములుగా, హీనులుగా భావిస్తాడు. అతనికి దైవ భక్తి కలిగి ఉండమని హితవు చేస్తే గర్వంతో విర్రవీగుతూ దైవ నియమిత శాసనాలను ఉల్లంఘిస్తాడు. అతనికి అడుగడుగునా అతని స్వభావానికి విరుద్ధమైన సంఘటనలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒకడు నిందిస్తాడు, మరొకడు ఆక్షేపిస్తాడు, ఇంకొకడు ద్వేషిస్తాడు.
ఒకడు నీవు ‘అపవిత్ర నీటి బొట్టు’ నుండి జన్మించావని పలికితే, వేరొకడు నీవు వింత పశువువని అంటాడు. ఇలా అతని ప్రతి లోపం లోకం యెదుట బహిర్గతమవు తుంది. అతని ఏ తప్పు కూడా ప్రజల దృష్టి నుండి దాగదు.

పేరు ప్రతిష్ఠలు పొందాలనే కోరిక, ఔన్నత్యాభిలాష మొదలగునవి అతన్ని వేలకొలది దుఃఖాలు మరియు కష్టాల్లో ముంచి వేెస్తాయి. ఎందుకంటే అతను దైవంతో గల తన సంబంధాన్ని తెంచు కుని దాసులతో తన సంబంధం పెంచు కున్నాడు. దేవుని విడిచిన తర్వాత దేవుని దాసుల వల్ల దుఃఖ విచారాలు తప్ప వేరే ఏమీ లభించే ఆశ ఉంటుంది? సత్య దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) గారు ఆ వ్యాధిని గురించియే ఇలా హెచ్చరించారు:

”మనోకాంక్షల అనుసరణ మరియు ఆత్మ స్తోత్రాభిలాష మొదలగునవియే ప్రజలను సర్వ నాశనం చేయును”. దైవ ప్రవక్త గారు ఇదే విషయాన్ని మరొక ఉపమానం ద్వారా ఇలా వివరిం చారు – రెండు ఆకలిగొన్న క్రూరమైన తోడేళ్ళు గొర్రెల మందపై దాడి చేెసి యెంత భయంకరంగా నష్టపరుస్తాయో అంతకంటే ఎక్కువగా ఒక ముస్లిం యొక్క ధన ధాన్యాల మరియు గౌరవాం తస్థుల ప్రేమ అతని ధర్మాన్ని నష్ట పరు స్తుంది”. (ముస్లిం)

”గౌరవాంతస్థుల వ్యామోహం వల్లనే ఔన్నత్యాభిలాష లేదా గర్వ సంకల్పం జనిస్తుంది. మానవుడు ఈ అపకారిని దూరం చేయనంతవరకు అతని మరణా నంతర జీవితం సఫలీకృతం కాజా లదు. దివ్య ఖుర్‌ఆన్‌ ఈ యదార్థాన్నే ఇలా పేర్కొంది: ”ఇది అతి గొప్ప పరలోక గృహం, ఎవరైతే ఇహలోకంలో గర్వాహంకారాలు లేకుండా, కల్లోలం రేకెత్తించకుండా ఉండునో వారికే ఆ పరలోక గృహాన్ని ప్రసాదించెదము, మరియు సత్ఫలితము దైవభక్తులకే లభించును”. (ఖసస్‌: 83)

ఒకప్పటి ముస్లింల పాలకుడైన ఉమర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ (క్రీ.శ. 682 – క్రీ.శ. 720) తన మరణ సమీపాన పైన పేర్కొనబడిన ఖుర్‌ఆన్‌ వాక్యాన్ని పఠిస్తూ, చివరకు ఆ పఠన స్థితిలోనే మరణించారు.

పైన తెలుపబడిన విషయాల వల్ల మనం అపార్థాలకు గురి కాకూడదు. అనగా విజ్ఞానంలో, విద్యలో, కళలో పరిపూర్ణత, ప్రావీణ్యత, నైపుణ్యం పొందటం తప్పు కాదు. మనం విద్యా విజ్ఞానాల్లో ప్రవీణులు కావాన్ని, కళావృత్తుల్లో నిపుణులు అవాన్ని ఇస్లాం ప్రోత్స హిస్తుంది. కాని మానవుడు తన వాస్త్త వాన్ని మరవకూడదు. మరియు తన ప్రభువు యొక్క గొప్పతనాన్ని మరచి పోరాదు.
కానీ ఒక వ్యక్తి తనలోని ప్రావీణ్యతా నైపుణ్యతలు చూసుకుని గర్వాహంకారాలతో విర్రవీగుతూ, తనను తాను అతి గొప్పవానిగా, పరులను హీనులుగా భావించటం తగదు. అలాగే ప్రావీణ్యతా నైపుణ్యతలు సంపాదించి వాి ద్వారా ప్రజల మనసులు మరియు శరీరాలపై తన అధికారం చెలాయించగోరటం, మరియు దాని వల్ల లభించే మానసిక రుచిని గ్రోలటమే జీవిత లక్ష్యంగా భావించటం సరికాదు.
దీని గురింయే సత్య దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) గారు ఒక ప్రార్థనా రూపంలో రుజు మార్గం చూపారు. ”ఓ అల్లాహ్‌ా! నన్ను ఓర్పు వహించువానిగా మరియు కృతజ్ఞునిగా చేయుము. నన్ను నా దృష్టిలో చిన్నవానిగా, మరియు ప్రజల దృష్టిలో పెద్దవానిగా జేయుము”.

ఒక వ్యక్తి తన మనసులో తనను తాను ఒక మామూలు వ్యక్తిగా భావిస్తూ, తన నిస్సహాయ స్థితిని మరచిపోకుండా, తన యందున్న అజ్ఞానం పొరపాట్లు మొదలగు లోపాలను గుర్తుంచుకుంటే అతని మనసులో ఆత్మ స్తోత్రాభిలాష ఉండదు, గర్వాహంకారాల నీచ భావనా ఉండదు.
ఇక మానవ జీవిత అసలు లక్ష్యాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే దివ్య ఖుర్‌ఆన్‌ మార్గ దర్శాధారంగా జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడం తప్పనిసరి. మనందరి దేవుడు మరియు సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్‌ాను ఆరాధిం చటమే సర్వ మానవుల, సర్వ జిన్నుల మరియు ఇతర సృష్టిరాసు లన్నింనీ సృష్టించడానికి అసలు లక్ష్యం. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ పలుకులను గమనించండి! ”సర్వ జిన్నులు మరియు సర్వ మానవులు నన్ను ఆరాధించుట కొరకే నేను వారిని సృష్టించాను”.
(జారియాత్‌: 56)

దైవప్రవక్తలందరి సందేశం యొక్క సారాంశం ఇదే. ”ఓ నా జాతివార లారా! అల్లాహ్‌నే ఆరాధించండి. మీ కొరకు ఆయన తప్ప వేరే ఆరాధ్యు లెవరూ లేరు”. మానవ జీవిత అత్యుత్తమ లక్ష్యం అల్లాహ్‌ాను ఆరాధించటం, మరియు అందరికంటే ఎక్కువగా ఆయననే ప్రేమించటం. దివ్య ఖుర్‌ఆన్‌లో సత్య విశ్వాసుల గురించి ఇలా తెలుప బడింది: ”సత్య విశ్వాసులు (సత్య ముస్లింలు) అత్యధికంగా అల్లాహ్‌ా పట్ల ప్రేమ కలిగి ఉంారు”. (బఖరా: 165)

మనందరి సర్వ ఆరాధనలు, మన జీవితం, మన మరణం మొదలగునవన్నీ స్వచ్ఛంగా అల్లాహ్‌ా కొరకే అంకితం కావాలి. దివ్య ఖుర్‌ఆన్‌లో ఇలా హితవు చేయబడింది: ”ఓ దైవప్రవక్తా! ఇలా ప్రకించుము-నిశ్చయంగా నా నమాజు, నా సర్వారాధనలు, నా జీవితం, నా మరణం- అన్నీ సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్‌ాకే అంకితం. ఆయనకెవరూ సాటి లేరు. నాకు ఇదే ఆదేశం ఇవ్వబడింది. మరియు నేను మొట్ట మొదటి విధేయుడను”. (అన్‌ఆమ్‌: 162,163)

వాస్తవమేమిటంటే అల్లాహ్‌ాను సంతుష్ట పర్చటమే మనందరి జీవిత లక్ష్యం. దివ్య ఖుర్‌ఆన్‌ తెలిపేదేమిటంటే ”సత్య విశ్వా సులు అల్లాహ్‌ పట్ల అత్యధికంగా ప్రేమ కలిగి ఉంటారు. అనగా మన ప్రాణం, ధనం, సంతానం మొదలగు వాి ప్రేమ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమ అల్లాహ్‌ా పట్ల కలిగి ఉండాలి.

అల్ల్లాహ్‌ మనందరి ఆరాధ్యుడు, ప్రభువు, యజమాని, కావున మన ప్రతి కార్యంలో దైవారాధన స్పష్టం కావాలి. అనగా ప్రతి కార్యం అల్లాహ్‌ను సంతుష్ట పర్చడానికే చేయాలి గానీ, మనో కాంక్షల అనుసరణ కోసం, ప్రాపంచిక రుచి గ్రోలటం కోసం, ఇహలోక భోగాలు పొందటం కోసం పేరు ప్రతిష్ఠలు సంపా దించుట కోసం చేయరాదు. మన హృదయాలపై అల్లాహ్‌ అధికారమే ఉండాలి గానీ ఇతరుల అధికారం ఉండరాదు. మన చర్యలన్నింటి నిర్ణయం అల్లాహ్‌ ఆదేశం ప్రకారం జరగాలి గానీ, మనసు మరియు షైతాను ఆజ్ఞల అనుసారం కాకూడదు. ఇటువిం శుభకర జీవితమే దైవభక్తి పూరిత జీవితం అనబడుతుంది. మరియు అటువిం జీవితమే కృతార్థ జీవితం అవుతుంది.

Related Post