New Muslims APP

పర్వదిన పరమార్థం

పండుగ నాడు శృంతి మించి వ్యవరించని సముదాయం అంటూ లేదు; ఒక్క ముహమ్మద్‌ (స) వారి సముదాయం తప్ప. వారి పర్వదినాలు సయితం ప్రార్థనలతో, తక్బీర్‌, తహ్‌లీల్‌లతో, పుణ్య కార్యాలతో నిండు శోభను కలిగి ఉంటాయి. - ఇబ్నుల్‌ జౌజీ (ర)

పండుగ నాడు శృంతి మించి వ్యవరించని సముదాయం అంటూ లేదు; ఒక్క ముహమ్మద్‌ (స) వారి సముదాయం తప్ప. వారి పర్వదినాలు సయితం ప్రార్థనలతో, తక్బీర్‌, తహ్‌లీల్‌లతో, పుణ్య కార్యాలతో నిండు శోభను కలిగి ఉంటాయి. – ఇబ్నుల్‌ జౌజీ (ర)

షవ్వాల్‌ మాసపు మొది రోజు ఈదుల్‌ ఫిత్ర్‌. అది ఇస్లాం సూచించిన మూడు పండుగల్లోని ఓ పర్వదినం. ఈదుల్‌ అజ్హా, ఈదుల్‌ ఫిత్ర్‌, జుమా దినం. ఈ మూడు పండుగలు తప్ప ముస్లింల మరే పండుగా లేదు. ఈ రోజుల్లో స్నానం చెయ్యడం సున్నత్‌.

రమజాన్‌ పండుగ నెలసాంతం ఉపవాసాలు, ఖర్‌ఆన్‌ పారాయణాలు, తరావీహ్‌ా ప్రార్థనల తర్వాత వస్తే, ఈదుల్‌ అజ్హా మహారాధన హజ్జ్‌ తర్వాత వస్తే, జుమా రోజు వారాంతర ఆరాధనలు, స్తుతిస్తోత్రాల తర్వాత వస్తుంది.

పండుగ నాడు శృంతి మించి వ్యవరించని సముదాయం అంటూ లేదు; ఒక్క ముహమ్మద్‌ (స) వారి సముదాయం తప్ప. వారి పర్వదినాలు సయితం ప్రార్థనలతో, తక్బీర్‌, తహ్‌లీల్‌లతో, పుణ్య కార్యాలతో నిండు శోభను కలిగి ఉంటాయి. – ఇబ్నుల్‌ జౌజీ (ర)

అజ్ఞాన కాలం నాి పండుగల్ని నిర్మూలించి వాి స్థానం లో ఈదుల్‌ అజ్హా మరియు ఈదుల్‌ ఫిత్ర్‌ను చేర్చడం ఏదో ప్రవక్త (స) వారు చేసిన స్వయం సిద్ధాంతం కాదు. ఇది అక్షరాల ప్రళయం వరకూ అల్లాహ్‌ా నిర్దేశిం చిన, మార్పు సాధ్యం కాని శాసనం. ఆయన శాసనాన్ని గౌరవించడం హృదయ తఖ్వాకు నిదర్శనం.
అజ్ఞాన కాలం నాి పండుగల్ని నిర్మూలించి వాి స్థానం లో ఈదుల్‌ అజ్హా మరియు ఈదుల్‌ ఫిత్ర్‌ను చేర్చడం ఏదో ప్రవక్త (స) వారు చేసిన స్వయం సిద్ధాంతం కాదు. ఇది అక్షరాల ప్రళయం వరకూ అల్లాహ్‌ా నిర్దేశిం చిన, మార్పు సాధ్యం కాని శాసనం. ఆయన శాసనాన్ని గౌరవించడం హృదయ తఖ్వాకు నిదర్శనం.
మనిషి స్వభావ సిద్ధంగా విశ్రాంతిని, ఆహ్లాదకర వాతా వరణాన్ని ఇష్ట పడతాడు. అతనిలోని ఈ సహజ కాంక్షను ఇస్లాం ఉత్తమ రీతిలో తీర్చే ఏర్తాటు చేస్తుంది. నెల సాంతం విధిగా ఉపవాసం పాించాలి అదీరిె చెప్పి పండుగ నాడు మాత్రం అందరిపై ఉపవాసాన్ని నిషేధి స్తుంది. కారణం మనిషి సంబర ఘడియల సంతోషాన్ని సంపూర్ణంగా ధర్మబద్ధమయిన రీతిలో అనుభవించా లన్నదే.

పండుగ, కాలం ప్రవాహంలోని ఓ చిన్ని భాగం. మనిషి దుఃఖ, ఖేదాలను మరచి, రాగద్వేషాలను వీడి స్నేహ పూరిత వాతావరణంలో సమయం గడపాలన్నదే దాని ఉద్దేశ్యం. పండుగ సందర్భంగా దఫ్‌్‌ వాయిస్తూ గేయాల పన చేసే పిల్లల్ని అబూ బకర్‌ (ర) దండించగా, ”వారిద్ద రిని వదిలెయ్యి. ఇవి పండుగ దినాలు కదా అబూ బకర్‌ (ర)!” అని ధర్మసమ్మతమయిన ఆట, పాటకు అనుమతిం చారు. అంతే కాదు, పండుగ సందర్భంగా ఆడబడే ఆటల్ని, విల్లు విన్యాసాల్ని సతీమణి ఆయిషా (ర) గారితో కలిసి వీక్షించారు కూడా ప్రవక్త (స).

ప్రవక్త (స) పండుగ నమాజును ఊరి బైట మైదానంలో చేసేవారు. ఈ కారణంగానే – ‘అనివార్య ఏ కారణం లేకుండా ఈద్‌ నమాజు మస్జిద్‌ లో చేయడాన్ని పండి తులు తప్పు ప్టారు’. కారణం; పండుగ సందర్భంగా ముస్లింలు-వారిలోని సమైక్యతను, బలాన్ని, పరస్పర ప్రేమ, వాత్సల్యాన్ని ప్రదర్శించాలన్న ఉద్దేశ్యంతోనే నమాజు విధి కాని, పిల్ల జల్లను, అశుద్ధావస్థలో ఉన్న స్త్రీలను సయితం ఈద్‌గాహ్‌ాకు తరలి రావలసిందిగా ప్రవక్త (స) పురమా యించారు.

సంబర ఘడియల సందర్భంగా శృంతి మించి వ్యవహ రిస్తున్న కొందరిని చూసి – ”గతించిన దినాల్లో మీరు సత్కార్యాలు చేసి ఉంటే దానికి కృతజ్ఞతలు చెల్లించు కునే విధానం ఇది కాదు. ఒకవేళ మీరు గతాన్ని పాడు చేసుకున్నట్లయితే కరుణామయుని యెడల అనుచితం గా వ్యవహరించిన వారు పశ్చాత్తాపం చెందాల్సిన విధానం కూడా ఇది కాదు” అన్నారు ఓ సజ్జన దాసుడు.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.