హజ్‌ ఔన్నత్యం

watacbe767083f
 అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ‘హజ్‌ మరియు ఉమ్రా అల్లాహ్‌ (ప్రసన్నత) కోసం పూర్తి చేయండి’. (అల్‌ బఖర: 196)
 ‘సర్వ మానవాళి కోసం నిర్మించబడిన మొట్టమొదటి ఆరాధనా గృహం ఖచ్చితంగా బక్కా (మక్కా)లో ఉన్నది. అది శుభ ప్రదమైనది మరియు విశ్వజనులందరికీ మార్గ దర్శక కేంద్రం’. (ఆలి ఇమ్రాన్: 96)
 ‘ఎవరైతే ఈ గృహాన్ని సందర్శించి హజ్‌ చేస్తాడో (హజ్‌ మధ్య) అసభ్యంగా ప్రవర్తించ టం, దైవాజ్ఞల్ని ఉల్లంఘించటం చెయ్యడో అతను అప్పుడే తల్లి కడుపున పుట్టిన స్థితి లో (పాపరహితుడై) తిరిగి వస్తాడు’. (బుఖారీ, ముస్లిం)
 ప్రవక్త (స) తమ ప్రసంగంలో ‘ఓ ప్రజలారా! అల్లాహ్‌ మీపై హజ్‌ విధిగావించాడు. కనుక మీరు హజ్‌ చేయండి’అని బోధించారు. (ముస్లిం)
 ప్రవక్త (స) ఇంకా ఇలా బోధించారు: ‘హజ్జె మబ్రూర్‌ (స్వీకరించబడిన హజ్‌) ప్రతి ఫలం స్వర్గమే’. (బుఖారీ, ముస్లిం)
 ‘గాజీ (ధర్మయుద్ధపు విజేత), హాజీ మరియు ఉమ్రా చేసే వ్యక్తులు అల్లాహ్‌ అతి థులు. అల్లాహ్‌ వారిని పిలిపించాడు. వారు హాజరయ్యారు. ఇక వారు అడిగిందల్లా ప్రసాదించబడుతుంది’. (ఇబ్ను మాజా)

హజ్‌ పరమార్ధం

 విశ్వ ప్రభువైన అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ‘హజ్‌ కొరకై మానవులందరికీ పిలుపు ఇవ్వు. వారు నీ వద్దకు ప్రతి సుదూర ప్రాంతం నుండి కాలి నడకన-ఒంటెలపైనా ఎక్కి రావాలని, తమ కొరకు ఇక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని’. (అల్‌ హజ్: 27)
 ‘అల్లాహ్‌ా వారికి ప్రసాదించిన పశువుల (జిబహ్‌ా) మీద కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలి. స్వయంగా వారూ తినాలి. లేమికి గురి అయిన అగత్య పరులకూ తినిపించాలి. తరువాత వారు మాలిన్యాన్ని (మనో మాలిన్యంతో సహా) దూరం చేసుకో వాలి. తమ మొక్కుబడులను చెల్లించుకోవాలి. మరియు ఆ ప్రాచీన గృహానికి (దైవా రాధన ఉద్దేశ్యంతో) ప్రదక్షిణ చేయాలి’. (అల్‌ హజ్‌ 27-29)
‘అంటే, వారు ఈ గృహ ప్రభువును ఆరాధించాలి’. (ఖురైష్: 4)

Related Post