హాస్యం మరియు ఇస్లాం

మృదుత్వం, ప్రేమ, అణకువ, ఆప్యాయత, అనురాగం-ఇలాంటి ఇతర నైతిక విలువలు ప్రజల మధ్య చాలా అవసరం. ఇవి లేకుంటే ప్రజలు మనల్ని అభిమానించరు. దగ్గరికి రావడానికి ఇష్టపడరు. సుపరిచితు లైనా, అపరిచితులైనా ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడటం మనందరి నైతిక ధర్మంగా ఎంచాలి. సాధారణంగా మనం దానికి అంతగా ప్రాధా న్యతనివ్వకపోవచ్చు. కానీ నైతికంగా అది చాలా గొప్ప గుణం. ఎదుటి వ్యక్తి పట్ల మనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తం చేసుకునే విధానం. అందుకే ప్రియ ప్రవక్త (స) దానికి అంతటి ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు దాన్నో పుణ్యకార్యంగా పేర్కొన్నారు: ''నీ సోదరునితో నీ నగు మోము సంభాషణ కూడా పుణ్యకార్యమే''.

మృదుత్వం, ప్రేమ, అణకువ, ఆప్యాయత, అనురాగం-ఇలాంటి ఇతర నైతిక విలువలు ప్రజల మధ్య చాలా అవసరం. ఇవి లేకుంటే ప్రజలు మనల్ని అభిమానించరు. దగ్గరికి రావడానికి ఇష్టపడరు. సుపరిచితు లైనా, అపరిచితులైనా ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడటం మనందరి నైతిక ధర్మంగా ఎంచాలి. సాధారణంగా మనం దానికి అంతగా ప్రాధా న్యతనివ్వకపోవచ్చు. కానీ నైతికంగా అది చాలా గొప్ప గుణం. ఎదుటి వ్యక్తి పట్ల మనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తం చేసుకునే విధానం. అందుకే ప్రియ ప్రవక్త (స) దానికి అంతటి ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు దాన్నో పుణ్యకార్యంగా పేర్కొన్నారు: ”నీ సోదరునితో నీ నగు మోము సంభాషణ కూడా పుణ్యకార్యమే”.

నబీ (స) వారు ఇలా ప్రబోధించారు: ”ఏ మంచి పనినీ అల్పంగా భావించకండి. మీ సోదరుణ్ణి నగుమోముతో నవ్వుతూ పలకరించటాన్నయినా సరే” (ముస్లిం)
మృదుత్వం, ప్రేమ, అణకువ, ఆప్యాయత, అనురాగం-ఇలాంటి ఇతర నైతిక విలువలు ప్రజల మధ్య చాలా అవసరం. ఇవి లేకుంటే ప్రజలు మనల్ని అభిమానించరు. దగ్గరికి రావడానికి ఇష్టపడరు. సుపరిచితు లైనా, అపరిచితులైనా ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడటం మనందరి నైతిక ధర్మంగా ఎంచాలి. సాధారణంగా మనం దానికి అంతగా ప్రాధా న్యతనివ్వకపోవచ్చు. కానీ నైతికంగా అది చాలా గొప్ప గుణం. ఎదుటి వ్యక్తి పట్ల మనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తం చేసుకునే విధానం. అందుకే ప్రియ ప్రవక్త (స) దానికి అంతటి ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు దాన్నో పుణ్యకార్యంగా పేర్కొన్నారు: ”నీ సోదరునితో నీ నగు మోము సంభాషణ కూడా పుణ్యకార్యమే”. స్వయంగా ప్రవక్త (స) వారి పట్ల ఆయన సహచరుల అభిప్రాయమేమిటంటే – మాలోని ఎవరైనా సరే ఆయన వైపు గనక చూస్తే ఆయన నగుమోముతో పలకరించే వారు. ఈ కారణంగా మాలోని ప్రతి వ్యక్తి, ‘ప్రవక్త (స) అందరికన్నా అధికంగా తననే ప్రేమిస్తున్నారు’ అన్న సద్భావంతో ఉండేవాడు. రండీ! మన ప్రియ ప్రవక్త (స) వారిని నవ్వించేలా చేసిన ఆ మందస్మిత స్మృతుల్ని నెమరువేసుకుందాం!!

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”ప్రవక్తా! మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో చూసిచూడనట్టుగా ప్రవర్తించు”. (అల్‌ ఆరాఫ్‌: 199)
హజ్రత్‌ అనస్‌ (ర) కథనం – నేనోసారి నబీ (స) వారి వెంట నడు స్తున్నాను. ఆ సమయంలో ఆయన దళసరి అంచులు గల నజ్రాన్‌ దుప్పటి కప్పుకొని ఉన్నారు. దారి మధ్యలో ఓ పల్లెటూరి మొరటు వ్యక్తి కలిసి ఆయన ఉప్పటి పట్టుకొని గట్టిగా లాగాడు. నేను నబీ (స) వారి భుజం వంక చూశాను. గట్టిగా లాగడం వల్ల దుప్పటి అంచులు గీసుకు పోయి ఆయన భుజం కందిపోయివుంది. ఆ పల్లెటూరి వ్యక్తి అంతటితో ఊరుకోక, ‘అల్లాహ్‌ నీకిచ్చిన సొమ్ములో నుంచి నాక్కొంచెం ఇప్పించు!’ అని కాస్త కటువుగానే అడిగాడు. దానికి నబీ (స) వారు అతని వైపు తిరిగి చూసి ‘నవ్వుతూ’ ఇతనికి కొంత ధనం ఇవ్వండి” అని సహచ రుల్ని ఆజ్ఞాపించారు. (బుఖారీ, ముస్లిం)
ఓ సందర్భాన ఆయన ఇలా అన్నారు: ‘కుస్తీ పట్టి మల్ల యుద్ధంలో ఇతరులను చిత్తు చేసేవాడు పహిల్వాను కాడు. కోపం వచ్చినప్పుడు తనను తాను నిగ్రహించుకొని తన కోపాన్ని అదుపులో ఉంచుకో (కమించ) గలిగేవాడే నిజమైన బలశాలి”. (బుఖారీ, ముస్లిం)

హజ్రత్‌ అబూ అమ్ర్‌ జరీర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ా (ర) గారి కథనం – ఒక రోజు మిట్ట మధ్యాహ్నం మేము నబీ (స) వారి పవిత్ర సన్నిధిలో ఉండ గా కొంత మంది వచ్చారు. వారి ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేవు. గళ్ల దుప్పటి లేక కంబళ్లు చుట్టుకొని ఉన్నారు. వాళ్లలో చాలా మంది, చాలా మందేమిటి దాదాపు అందరూ ‘ముజర్‌’ తెగకు చెందిన వాళ్లే. వారి పస్తుల స్థితి చూసి నబీ (స) వారు చలించిపోయారు. ఆయన (స) ముఖారవిందం కమిలిపోయింది. ఆయన తన కుటీరం లోనికి వెళ్ళి తిరిగి బయటికొచ్చారు. అజాన్‌ ఇవ్వమని హజ్రత్‌ బిలాల్‌ (ర)ను ఆదేశించారు. బిలాల్‌ (ర) అజాన్‌ ఇచ్చి (ప్రజలు నమాజు కోసం హాజరైన తర్వాత) ఇఖామత్‌ పలికారు. నబీ (స) వారు నమాజు చేయించిన తర్వాత ప్రజల ముందు ఉపన్యసిస్తూ ఇలా అన్నారు: ”ప్రజలారా! మిమ్మలందర్నీ ఒకే ప్రాణి నుంచి పుట్టించిన మీ ఆ ప్రభువుకు భయ పడండి…..అల్లాహ్‌ా మిమ్మల్ని గమనిస్తున్నాడనే విషయాన్ని విస్మరించకండి”. (నిసా:1) తరువాత సూరయె హష్ర్‌లోని ఆయతులు పఠించారు: ”విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌ాకు భయపడండి. ప్రతి వ్యక్తీ తాను రేపటి కోసం ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి”.
ఆ తర్వాత ప్రజల్ని దానధర్మాలు చేయమని ప్రోత్సహించారు. ప్రతి వ్యక్తీ తన దీనారు నుండి, తన దిర్హము నుండి, తన బట్టల నుండి, ఇంకా గోధుమలు ‘సా’ (కొలిచే ఒక ప్రమాణం) నుంచి, ఖర్జూరాల ‘సా’ నుంచి దానం చేయాలన్నారు. అంతే కాదు. ఒక్క ఖర్జూరపు ముక్కయి నా సరే దానం చేయాలని పురిగొల్పారు.
అప్పుడు అన్సార్లలోని ఒకతను ఒక నిండు బస్తా తీసుకొచ్చాడు. అతని చేయి ఆ బస్తాను మోయలేనట్టుగా ఉంది. (కొంత దూరం వచ్చాక) సాధ్యం కాలేకపోయింది. ఆ తర్వాత ప్రజలు ఒకర్ని చూసి మరొకరు దానాలు చేస్తూ పోయారు. నేను చూస్తుండగానే అక్కడ రెండు రాసులు తయారయ్యాయి. వాటిలో ఒకటి తినే వస్తువులది. రెండోది బట్టలది. అది చూసి నబీ (స) వారి ముఖారవిందం మేలిమి బంగారపు ముక్కలా మెరుస్తుండటం నేను గమనించాను.

తరువాత నబీ (స) వారు ఇలా ఉద్బోధించారు: ”ఎవడైనా ఇస్లాంలో ఒక మంచి పనిని మొదలు పెడితే అతనికి తన పుణ్యం లభిస్తుంది. ఇంకా అతని తర్వాత దానిని ఆచరించేవారి పుణ్యం కూడా లభిస్తుంది. దాని వల్ల వారికి లభించే పుణ్యంలో ఎలాంటి కొరతా ఏర్పడు. దీనికి విరుద్ధంగా ఇస్లాంలో ఎవడైనా ఏదైనా చెడ్డ పని ప్రారం భిస్తే అతనిపై దాని పాపభారం పడుతుంది. ఇంకా అతని తర్వాత దానిని అమలు చేసేవారందరి పాపం కూడా అతని నెత్తి మీద పడుతుంది. అయితే దీని వల్ల వారిపై పడే పాపభారం ఏ మాత్రం తగ్గింపు ఉండదు”. (ముస్లిం)

Related Post