దైవేతర దాస్యాన్ని సహించని పక్షి

అయితే ఆమె, ఆమె ప్రజలు కూడా అల్లాహ్‌ను వదలి సూర్యునికి పూజించటం నేను గమనించాను. షైతాను వారి కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేసి, వాళ్ళను సన్మార్గం పొందకుండా అడ్డుకున్నాడు. అందువల్ల వారు సన్మార్గ భాగ్యం పొందలేకపోతు న్నారు''. (అన్‌ నమ్ల్‌: 20-24)

అయితే ఆమె, ఆమె ప్రజలు కూడా అల్లాహ్‌ను వదలి సూర్యునికి పూజించటం నేను గమనించాను. షైతాను వారి కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేసి, వాళ్ళను సన్మార్గం పొందకుండా అడ్డుకున్నాడు. అందువల్ల వారు సన్మార్గ భాగ్యం పొందలేకపోతు న్నారు”. (అన్‌ నమ్ల్‌: 20-24)

షేక్ రియాజ్ అహ్మద్
సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్‌ ఈ భూమ్మీద మానవ సృష్టిని ప్రారంభించి నప్పటి నుండి  మానవుల రుజుమార్గం కొరకు ఎందరో ప్రవక్తలను పంపాడు. ఈ ప్రవక్తల పరంపరలో సులైమాన్‌ (స) ప్రవక్త కూడా ఒకరు. ఈయనగారి ప్రస్తావన బైబిల్‌ పాత నిబంధనల్లో సొలోమోను ప్రవక్తగా ఉంది. కాని బైబిల్‌లో ఈ ప్రవక్త మీద ఎన్నో అసభ్య, అసత్య ఆరోపణలున్నాయి. వీటన్నింటిని దివ్య ఖుర్‌ఆన్‌ ఖండిస్తుంది. ఇంకా ఈయన సచ్చీలతను, సౌశీల్యాన్ని, ఒక ప్రవక్తకు ఉండవలసిన హోదాను, గౌరవాన్ని, మర్యాదను చాటి చెబుతుంది.
   అల్లాహ్‌ హజ్రత్‌ సులైమాన్‌ (స) గారికి మానవ జాతి చరిత్రలోనే కనీవిని ఎరుగని, ఇంకా ఎవ్వరికీ ఇవ్వబడని రాజ్యాధికారాన్ని ప్రసాదించాడు. ఈయన గారి రాజ్యంలో మానవులు, జిన్నాతులు, పక్షుల సైన్యాలు ఉండేవి.
 ”సులైమాను కోసం మానవులు, భూతాలు (జిన్నాతులు), పక్షుల సైన్యాలు సమకూర్చ బడ్డాయి. అవన్నీ క్రమ శిక్షణతో ఉంచ బడుతుండేవి”. (అన్‌ నమ్ల్‌ : 17)
  ఇంకా అల్లాహ్‌ సులైమాన్‌ (అ) గారి అదుపులో గాలిని కూడా ఉంచాడు. అందువల్ల ఆయన కోరిన దిశలో గాలి వీచేది. ఆ గాలి వేగం ద్వారా నెల రోజుల పాటు చేయవలసిన ప్రయాణాన్ని ఉదయం నుంచి మధ్యాహ్న వేళకే చేసి గమ్యానికి చేరుకునేవారు. ఇంకా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రయాణించి మరో నెల రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసేవారు. ఈ విధంగా ఒక రోజులో రెండు నెలల ప్రయాణం చేసేవారు.
 ”ఇంకా మేము సులైమాను కోసం గాలిని అదుపులో ఉంచాము. దాని ప్రొద్దుటి (ప్రయాణ) గమ్యం ఒక మాసానికి, ఒక సాయంత్రపు గమ్యం కూడా ఒక మాసా నికి సమానంగా ఉండేది”. (సబా: 12)
  ఇంకా సులైమాన్‌ (స) గారికి కోరిన వస్తువులు తయారు చేసుకునేందుకు దేవుడు కరిగించిన రాగిని సెలయేరులా ప్రవహింపజేశాడు. ”మేము అతని కోసం కరిగించిన రాగిని సెలయేరులా ప్రవహింపజేశాము”.  (సబా: 12)
  ఇంకా సులైమాన్‌ (స) గారికి అల్లాహ్‌ చీమల, పక్షుల, వివిధ జంతువుల భాషను కూడా నేర్పాడు.
 ”చివరకు ఆయన ఒక చీమల లోయకు చేెరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటిం చింది: ‘ఓ చీమల్లారా! సులైమాను, అతని సైన్యాలు తెలీకుండా మిమ్మల్ని నలిపి వేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు, మీరు మీ మీ పుట్టలలోనికి దూరిపోండి’. దాని మాటపై సులైమాను చిరునవ్వు చిందిం చారు”. (అన్‌ నమ్ల్ల్‌: 18, 19)
హజ్రత్‌ సులైమాన్‌   (అ)  గారి   పక్షుల సైన్యంలో హుద్‌ హుద్‌ అనే పక్షి ఉండేది. అది ఆయన గారికి దారి చూపించేదిగా, గూఢాచారిగా వ్యవహరించేది. ఇంకా జలాశయాలు, సైనిక స్థావరాలు ఎక్క డెక్కడున్నాయో తెలుపుతూ ఉండేది. ఒక రోజు సులైమాన్‌ (అ) పక్షుల సైన్యాన్ని తనిఖీ చేస్తూ ఉంటే హుద్‌ హుద్‌ పక్షి కనబడ లేదు. తన అనుమతి లేకుండానే అది ఎక్కడికో వెళ్ళినందుకు ఆగ్రహించారు. తగిన కారణం చూపకపోతే దాన్ని శిక్షిస్తా నన్నారు. కాని కొద్దిసేపటికే హుద్‌ హుద్‌ పక్షి సులైమాన్‌(తి) వద్దకు తిరిగి వస్తుంది. వచ్చి అది సులైమాన్‌ (అ)తో, ”మహారాజా! మీకు, మీ సైన్యానికి కూడా తెలియని సబా రాజ్యం మరియు అక్కడి రాణి గురించిన అతి ముఖ్య సమాచారం తీసుకొచ్చాను” అని అంటుంది.
  ఇంతకు ఏమిటా అతి  ముఖ్య సమా చారం? అదే మానవ స్వభావానికి వ్యతిరేక మైన సమాచారం. ఆశ్చర్యాన్ని కలిగించే సమాచారం. మూర్ఖత్వాన్ని సూచించే సమాచారం. అంధకారం అలుముకున్న సమాచారం. అతి వింత సమాచారం. పక్షి సయితం ఊహించని సమాచారం.
  సబా జాతి ప్రజలు, అక్కడి రాణి తమను తమ కోసం ఈ పూర్తి సృష్టిని సృష్టించిన ఆ ఏకైక సృష్టికర్త (అల్లాహ్‌)ను వదిలి, ఆయన సృష్టించిన సృష్టితాలలోని ఒకటైన సూర్యుడ్ని తమ దేవునిగా చేసుకుని పూజిస్తుంది. దీనిని హుద్‌ హుద్‌ పక్షి చూసి సహించ లేకపోయింది. ఈ సమాచారాన్ని తన యజమాని అయిన సులైమాన్‌ (అ) గారికి తెలుపాలని, సబా జాతి వారికి సత్య సందే శాన్ని చేరవేయాలని. వారిని నకాగ్ని నుండి కాపాడాలని ఆత్రుతతో, ఆవేదనతో, ఆ వింత సమాచారాన్ని తన యజామని వద్దకు మోసుకొని వస్తుంది.
  ”అతను పక్షులను తనిఖీ చేసి – ‘హుద్‌ హుద్‌ పక్షి(వడ్రంగి పిట్ట) నాకు కన్పించటం లేదేమిటి? అది నిజంగా హాజరు కాలేదా?’ అని అన్నాడు. ‘నేను దానిని కఠినంగా శిక్షిస్తాను లేదా కోసి వేస్తాను లేదా అది నాకు సరైన సంజాయిషి అన్నా ఇవ్వాలి’ (అని చెప్పాడు.) కొద్ది సేపట్లోనే అది వచ్చి ఇలా విన్నవించుకో సాగింది: ‘మీకు తెలియని ఒక సమాచారాన్ని నేను సేకరించాను. నేను సబా జాతికి చెందిన ఒక నిజ వార్తను మోసుకు వచ్చాను. ఆ జాతి వారిని ఒక స్త్రీ పరిపాలిస్తుండటం నేను కనుగొన్నాను. ఆమెకు అన్ని వస్తువులలో నుంచి (అంతో ఇంతో) ప్రసా ప్రసాదించబడింది. ఆమె సింహాసనం కూడా వైభవోపేతమైనదే. అయితే ఆమె, ఆమె ప్రజలు కూడా అల్లాహ్‌ను వదలి సూర్యునికి పూజించటం నేను గమనించాను. షైతాను వారి కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేసి, వాళ్ళను సన్మార్గం పొందకుండా అడ్డుకున్నాడు. అందువల్ల వారు సన్మార్గ భాగ్యం పొందలేకపోతు న్నారు”. (అన్‌ నమ్ల్‌: 20-24)
  సోదర సోదరీమణులారా! దేవుడు ఈ పూర్తి విశ్వంలోని సృష్టి రాసులకంటే మనిషిని అత్యుత్తతమైన, శ్రేష్టమైన జీవిగా సృష్టిం చాడు. మనిషి అందంలోనూ, ఆకారంలోనూ, జ్ఞానంలోనూ పక్షుల కంటే ఎన్నో రెట్లు ఉన్నతంగా సృజించబడ్డాడు. మనిషికి దేవుడిచ్చిన బుద్ధీజ్ఞానాన్ని వినియోగించి శాస్త్ర సాంకేతిక పరంగా ముందుకు దూసుకుపోతున్నాడు. చంద్ర మండలంపై కాలు మోపాడు. పక్షిలా గాలిలో ఎగురుతున్నాడు. చేపలా నీటిలో ఈదు తున్నాడు. మనిషికి కావలసిన మరెన్నో వస్తువులను తయారు చేెస్తున్నాడు. కొత్త కొత్త వ్యాధులకై సయితం మందులను కనుగొంటున్నాడు. ఇలా వైద్య రంగంలో కూడా ముందుకు పోతున్నాడు. అన్ని రంగాలలోనూ కొన్ని సార్లు వైఫల్యం చెందినా కూడా తరువాత విజయం సాధిస్తున్నాడు. కాని ఇవన్నీ చేసేదానికి మనిషికి ఈ సృష్టిలోని, తమ పరిసరాలలోని దేవుడు ఉనికిలోకి తెచ్చిన వస్తువుల మీదనే ఆధార పడివున్నాడు. వాటి ద్వారానే తను చేయదలుచుకున్నది చేస్తున్నాడు. దేవుడు సృష్టించిన ఈ విశ్వంలో మనిషి ఇన్ని విధాలుగా లబ్ది పొందుతూ విలాసవంతమైన జీవితం గడుపుతూ, జ్ఞానవంతుడిగా, మేధావిగా, తెలివిగలవాడుగా సమాజంలో పేరు ప్రఖ్యాతులను పొందుతూ, బుద్ధీజ్ఞానాలలో తనకు సాటి ఎవరూ లేరు అని విర్రవీగుతున్నాడు. కాని శోచనీయ మైన విషయమేమిటంటేె, ఇన్ని తెలివి తేటలు, బుద్ధీ జ్ఞానాలు ఉండి కూడా దేవుని విషయంలో మటుకు మోసపోతున్నాడు.   ఈ విశ్వంలోని ప్రతి వస్తువు వెనుక ఒక అద్భుతమైన శక్తి ఉంది. అది ఈ సృష్టినంతటిని ఒక పద్ధతి ప్రకారం నడుపుతోంది అని ఈ విశ్వంలోని ప్రతి వస్తువూ ఘోషిస్తూ ఉంటే మానవుడు మాత్రం సృష్టికర్తను తెలుసుకునే విషయంలో పొరబడుతున్నాడు. తన ఆత్మకు అన్యాయం చేస్తూ దేవుని విషయంలో మూఢ నమ్మ కాలను పెద్దల వారసత్వమంటూ సమాజంలో ఉండే ఆచారాలను, గుడ్డిగా నమ్మి, దేవుడిచ్చిన బుద్ధీజ్ఞానాలను, తెలివితేటలను ప్రక్కన పెట్టి విశ్వకర్తను వదలి సృష్టితాలను  దైవాలుగా చేసుకొని పూజిస్తున్నాడు. ఎంత అన్యాయం! ఎంత ఘోరం! ఏమిటి మనిషి ఒక పక్షిలా కూడా ఆలోచించలేకపోతున్నాడా? ఎంత విడ్డూరం!

Related Post