ఇస్లాం చారిత్రక పాత్ర

bigstockphoto_Alltogheter_1451110

నేడు ఇస్లాం మీద, ముస్లింల మీద, ముస్లిం దేశాల మీద జరుగుతున్న విషపూరిత దాడి తెలిసిందే. ప్రపంచమంతా ఇప్పుడు ఇస్లాం గురించి చర్చించుకుంటుందన్న విషయమూ విదితమే. ఒక చేత్తో ఖుర్‌ఆన్‌, మరో చేత్తో ఖడ్గం ద్వారా ప్రపంచం మీద ఇస్లాం దండెత్తిందన్న వ్యూహాత్మక అపవాదుకి ఇప్పటికీ ఎంతో సమర్థన లభిస్తుంది.  అగ్ర రాజ్యాలు వారి స్వయప్రయోజనాల కోసం చేస్తున్న ఆయుధ, సాంస్కృతిక దాడుల నేపథ్యంలో కూడా ప్రణాళికబద్ధంగా దీనికి మరింత విశ్వసనీయతను ఆపాదిస్తున్నారు. మన దేశంలో సయితం అవే విష పవనాలను వ్యాపింపజేసే ప్రయత్నాలు ముమ్మరం గా సాగుతున్నాయి. మానవ జాతి వికాసంలో ఇస్లాం మరియు ప్రవక్త (స) వారి ప్రవ చనాలు పోషించిన కీలక పాత్రను, ముస్లింలు వివిధ రంగాల్లో చేసిన కృషి వల్ల తత్వశాస్త్రం, ప్రకృతి శాస్త్రం, మానవీయ శాస్త్రాల్లో చోటు చేసుకున్న జ్ఞానపరమయిన పురోగతిని విస్మరించి అపార్థాల, అపోహలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసి శాంతి శ్రేయాలతో వర్థిల్లాల్సిన సమాజాన్ని అశాంతి, అలజడులకు గురి చేస్తున్నారు. ‘పతి ముస్లిం ఉగ్రవాది కాదు కానీ; ప్రతి ఉగ్రవాది ముస్లిమే’ అనే నీచ ప్రవృతికి ఆజ్యం పోస్తున్నారు.

కాబట్టి ఇస్లాం నిర్వహించిన చారిత్రక పాత్రను అర్థం చేసుకోకపోతే ఇస్లాం వ్యతిరేక శక్తులు చేసే దుష్ప్రచారం సఫలమయ్యే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మందికి గర్వకారణమయిన మహోన్నత చరిత్ర దురవగాహనకు, అపోహలకు బలయ్యే ప్రమాదం ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో నిజధర్మ ధ్వజవాహకులు, మానవతావాదులు ఈ దుష్ప్రచారాల వల్ల భవిష్యత్తులో చోటు చేసుకోబోయే విష  మయ పరిణామాలపై దృష్టి సారించాల్సిన అవశ్యకత ఎంతయినా ఉంది. సామ్రాజ్య వాదుల, పాసిస్టుల వంత పాడే నయవంచకుల విష వీచికలకు విరుగుడు కని పెట్టాల్సిన ఆవసరం ఉంది. శాంతి, సుస్థిర స్థాపనకు నడుం బిగించాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో ఓ భాగమే ఈ వ్యాసం.

ప్రపంచంలోనే ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న రెండో అతి పెద్ద దేశం – మన భారత దేశం. అయినా ఇస్లాంకు ఉన్న విప్లవాత్మక ప్రాముఖ్యాన్ని గుర్తించడంలోనూ, ఆ విప్లవాని కి ఉన్న సాంస్కృతిక పర్యవసానాలను అర్థం చేసుకోవడంలోనూ ఎంతో అవగాహనా రాహి త్యం నెలకొని ఉండటం విషాదకరం. మానవ చరిత్రలోనే ఇది బాగా ఆకర్షించే అధ్యాయం. ఈ అధ్యాయాన్ని నిస్పాక్షికంగా చదవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ అధ్యాయా నికి ఉన్న శాస్త్రీయ విలువ అత్యంత ఉన్నతమై నది. ముస్లిం దేశాలతో పోల్చితే భారత దేశం లో నివసిస్తున్న ముస్లింల సంఖ్యే ఎక్కువ. అయితే ఈ వాస్తవాన్ని అనేకులు అంతగా పట్టించుకోరు. ఈ యదార్థాన్ని గుర్తించే వారు సయితం చాలా అరుదు. భారత దేశంలో దాదాపు వెయ్యి సంవత్సరాలు పరిపాలించినా నేటికీ ముస్లింలను బయటివారిగానే ప్రచారం చేయడం జరుగుతోంది. దేశ నిర్మాణం బల హీన థలో ఉన్నప్పుడు ఈ విధమయినటు వంటి చీలికలు చోటు చేసుకోవడం విచార కరం.

అక్బరు పాలనలో జరిగిన అభివృద్ధిని తలచు కుని గర్వపడేవారు, షాజహాను కట్టించిన ముగ్ద మనోహర కట్టడాలను గొప్పగా చెప్పు కునేవారు ఆయా చక్రవర్తులు అవలంబించే మతానికి చెందిన వారిని పరాయి వారిగా చూస్తున్నారు. ముస్లింలంతా వారికి పొరుగు వారే. నేటికీ అదే దుస్థితి. ఏళ్ళ తరబడి కొన సాగుతున్న ఈ పక్షపాత  ధోరణి జాతీయ ఐక్యతకు దెబ్బతీయడమే కాక, నిస్పాక్షిక చరిత్ర పరిశీలనకు అది పెద్ద అవరోధంగా మారింది. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ రెండు మతాల వారు ఒకే దేశంలో ఉంటూ, ఒకే గాలిని పీలుస్తూ, ఒకే నీరుని త్రాగుతూ కూడా పరస్పర సంస్కృతుల గురించి వారి కున్న అవగాహన చాలా స్వల్పం. నాగరికత గురించి తెలిసిన వారు ఇస్లాం గురించి బొత్తి గా తెలియకుండా ఉండరు. ముస్లింల పట్ల కొందరిలో ఉండే చులకన వీరిలో కనిపిం చదు. ఆ కొందరిలో కూడా ఇస్లాం ధర్మ ప్రవక్త బోధన గురించి అవగాహన అంతంత మాత్రమే.

విద్యావంతుడయిన ఒక సామాన్య హిందువుకి ఇస్లాం యొక్క విప్లవాత్మక ప్రాధాన్యత గురించి, అది తీసుకువచ్చిన సాంస్కృతిక మార్పుల గురించి ఉన్న జ్ఞానం పూజ్యమనే చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇస్లాంకు వ్యతి రేకంగా ఆజ్యం పోసి మరీ పెంచబడుతున్న భావాలు ఎంతో ప్రమాదకరమయినవి. ప్రమా దకర భావాలను ఎదుర్కోవడం ఎంతో అవ సరం. దేశ సమగ్రత, చారిత్రక వాస్తవాల దృష్ట్యా ఇస్లాం ప్రాముఖ్యత గురించి తెలుసు కోవడం నేటి తక్షణ అవసరం.

గిబ్బన్‌ గొప్ప చరిత్రకారుడు. మరుపురాని విప్లవాల్లో ఇస్లాం అగ్రశ్రేణికి చెందినదని అతను అభివర్ణించాడు.  ఇస్లాం ప్రపంచ దేశాల్లో చెరగని ముద్ర వేసింది.  కొత్త విశ్వా సం అందించిన స్ఫూర్తితో నూతన చైతన్యాన్ని పొంది, అరేబియన్‌ ఎడారుల నుంచి బయలు దేరిన స్వల్ప సంఖ్య జనులు అప్పట్లో శక్తి వంతమయిన రెండు ప్రాచీన సామ్రాజ్యాలను మట్టి కరిపించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముహమ్మద్‌ (స) దైవదౌత్య బాధ్యతల ను చేపట్టి, శాంతి సందేశాన్ని ప్రచారం చేసి యాభై ఏళ్ళు గడవక ముందే ఆయన అను యాయులు రెపరెపలాడుతున్న ఇస్లాం సత్య కేతనాన్ని భారత దేశం సరిహద్దుల్లో ఒకప్రక్క, అట్లాంటిక్‌ సముద్ర తీరాన మరో ప్రక్క విజ యవంతంగా ఎగురవేశారు.

అద్భుతాలు చేసి చూపించడం ద్వారా ప్రతి ప్రవక్త మహిమాన్వితుడనిపించుకుంటాడు.  ఈ లెఖ్కన తనకు ముందు, వెనకా వచ్చిన ప్రవక్తలందరిలోకెల్లా ముహమ్మద్‌ (స)ని గొప్ప వాడిగా, అగ్రజుడిగా గుర్తించాల్సి ఉంటుంది. అద్భుతాలెన్నో ఉన్నాయి. కాని ఇస్లాం అత్యంత అద్భుతమయినది. (గిబ్బ్‌)

అగస్టస్‌ రోమ్‌ సామ్రాజ్యం ఏడు వందల యేండ్ల యుద్ధాల ఫలితం. అగస్టస్‌ తరువాత ట్రాజన్‌ ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. కాని ఒక శతాబ్ద కాలంలో ఏర్పాటయిన అరబ్‌ సామ్రాజ్య స్థాయిని రోమ్‌ సామ్రాజ్యం అందుకోలేకపోయింది. అలేగ్జాండర్‌ సామ్రా జ్యం ఖలీపాల విశాల రాజ్యంలో ఒక భాగం తో సమానం అంతే. వెయ్యేళ్ల రోమ్‌ సైనిక శక్తిని నిలువరించిన పర్షియన్‌ సామ్రాజ్యం పదేళ్ళ కాలంలో ఇస్లామీకరించబడటం చరి త్రలోనే కని విని ఎరుగని సంఘటన. ఈ అద్భుతం ఎలా సాధ్యమయింది? ఈ ప్రశ్న చరిత్రకారులను విస్మయానికి లోను చేస్తుంది.

అమాయక ప్రజలపై నెగ్గిన మత ఛాందసంగా ఇస్లాం విజయాన్ని నిందించే వికృత వాదాన్ని నేటి అధ్యనశీల ప్రపంచం తిప్పి కొట్టింది. ఇస్లాం అసాధారణ విజయానికి కారణాలు రెండు. 1) ఇస్లాం ధర్మంలో ఉన్న విప్లవ శక్తి. 2) జన బాహుళ్యాన్ని నడిపించే నిరుపమాన శక్తి. గ్రీకు, రోము, పర్షియా, చైనా, భారత దేశం మొదలయిన ప్రాచీన నాగరికతల పత నానంతర కాలంలో ఏర్పడిన నిరాశ జనక పరిస్థితుల్లో ఇస్లాం ఒక ఆశాకిరణంగా, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, జన వాహినిని నడిపిం చగలిగింది. ఇదే అసలు ఇస్లాం విజయానికి కారణం. పోతే,

ఇస్లాం చారిత్రక విపరీత వాఖ్యానాలు చేసే వారు ఆ ధర్మం సాధించిన సైనిక విజయాల పైనే తమ దృష్టి మొత్తాన్ని కేంద్రీకరిస్తారు. కాని ఇవే ఇస్లాం నిర్వహించిన చారిత్రక పాత్రకు కొలమానం అయితే అది అద్వితీయ చారిత్రక ఘటన అనిపించుకోదు. ఎందు కంటే తాతార్‌ సిచలయా ప్రాంతాల్లోని ఆట విక జాతుల అఘాయిత్యం యూరప్‌, ఆసియా మధ్య ప్రాంతాల నుండి పెల్లుబికి పశ్చిమ, దక్షిణ, తూర్పు ప్రాంతాలకు ఎగిసిన అలలకు ఇస్లాం యుద్ధ నీతికి ఎంతో తేడా ఉంది. తీవ్రమయిన విధ్వంసాన్ని సృష్టించిన తర్వాతే అవి సద్దు మణిగాయి. దీనికి పూర్తి విరుద్ధమయినది ఇస్లాం విప్లవం. అది చరిత్ర లో అసాధారణ ఘట్టం. మనిషి సాంస్కృ తిక చారిత్రక ఒక సువర్ణ అధ్యాయం. యుద్ధం దాని లక్ష్యాల్లోని మామూలు భాగం మాత్రమే. శిథిలావస్థలో ఉన్న పాత, పాశవిక వ్యవస్థను కూల్చి గట్టి పునాదుల మీద దాన్ని నిర్మించ డం కోసం. ఆరాచక శక్తులను అంతమొందిం చేందుకు, బర్బరత్వం మెడలు వంచేందుకు ఆ సమరం అవసరమయింది. అయితే ఇస్లాం పరిణామ క్రమంలో ఎన్నో గొప్ప విషయాలు సామాన్య చరిత్ర విద్యార్థికి, అతను ముస్లిం అయినా తెలిసే అవకాశం తక్కువయినప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో సులభంగా ఊహించవచ్చు. ఇస్లాం విప్లవం మానవ జాతిని అనేక ప్రమాదాల నుండి కాపాడింది అంటే నవ్విపోయే వారికీ కొదువ లేదు.

ఇస్లాం చరిత్రను మత పిచ్చిగా, తీవ్రవాద మూకల దోపిడిగా సాధారణంగా కొందరు భావిస్తుంటారు. బాధిత ప్రపంచానికి ఖుర్‌ ఆన్‌, ఖడ్గం ఈ రెంటికి మధ్య ఏదో ఒకదాన్ని ఎంచుకోమని బెదిరించిందని వాదించేవారికి, ఇస్లాం అంటే, ‘అల్లాహు అక్బర్‌’ అనే భయా నక అరుపుగా భావించేవారికి ఒక విషయం తెలియదు. తెలిసినా దాటవేస్తారేమో. ఇస్లాం ధర్మ అవలంబీకుల్లో కొందరు ఒక థలో తార్కిక విషయాల్లో, యుద్ధాల్లో కూరుకుపో యారు అన్న మాటను అంగీకరించినా -వారి ని అతారిక్‌, అత్తిల, జెన్‌సెరిక్‌, చెంగీజ్‌, తామర్‌లేన్‌ వంటి క్రూరుల నుండి వేరు చేసే ది వారి ఉన్నతమైన వ్యక్తిత్వం, ఆశయంలో స్వచ్ఛత, ధర్మ నిష్ఠతో కూడిన చైతన్యం.

వారి దైవభక్తి కొందరికి మూఢ భక్తిగా కని పించవచ్చు. కాని అందులో కపటత్వం లేదు. లోకజ్ఞానం, ఉదారత వారి భక్తికి మెరుగులు  దిద్దింది. వారి లక్ష్యంలో ఏ కోశానా స్వార్థం కనిపించదు. దైవత్వం అనేది లాలసకు, లోల త్వానికి వేసిన ముసుగుగా వారు భావించ లేదు. మొదటి ధర్మ దళపతి అయిన అబూ బకర్‌ (ర) కన్నా గొప్పగా పని చేసిన వారూ లేరు. దైవ సైన్యానికి అధిపతిగా అబూ బకర్‌ జారీ చేెసిన మరుపు రాని ఆదేశం ఇలా ఉంది:

”నిస్పాక్షికంగా ఉండు. అన్యాయం చేసిన వారెవరయినా బాగు పడరు. సత్యపరాక్రమ వంతునిగా ఉండు. అసత్యానికి లొంగి బ్రతక డం కంటే సత్యాన్ని బల పరుస్తూ ప్రాణాలర్పిం చడం ఉత్తమం. దయాళువై ఉండు. వృద్ధుల కు, ఆడవారికి, పిల్లలకు హాని కలిగించకు. పళ్ళ చెట్లను, ధాన్యాలను, పశు సంపదను ధ్వంసం చేయకు. శత్రువు అయినా సరే మాట నిలబెట్టుకో. సామాన్య జీవితం నుండి దూరం గా ఉంటున్న వారిని హింసించకు. ఈ అసా ధారణ ఆదేశాన్ని సేనాధిపతి, అతని అనుచరులు చిత్తశుద్ధితో పాటించడం వారి తిరుగు లేని కవాతుకు నిలువుటద్దం.

ఇస్లాం ధర్మం ఏ లక్ష్యంతోనయితే ప్రజలకు దీక్ష  ఇచ్చిందో అది అప్పటికి విశ్వ వ్యాప్తంగా ఉన్న అపోహలకు, అపార్థాలకు, అపమార్గాలకు విరుద్ధమ యినది.  శబ్దోత్పత్తి ప్రకారం ఇస్లాం అనే పదానికి అర్థం – శాంతి, సుస్థిరత, సమర్పణ, విధేయత. దేవుని ఏకత్వానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆదేశాలకు తలొగ్గి జీవించడం. మానవ సేవా దృక్పథాన్ని దుర్మార్గంగా ప్రక్క త్రోవ పట్టించిన విగ్ర హారాధనను తిరస్కరిస్తూ, మానవ జాతి సమ్మేళనం తో సమ్మోహనాత్మకంగా పుడమి మొత్తం శాంతితో అలరారాలన్నది ఇస్లాం ప్రథమ లక్ష్యం. ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి అనుచరులు తౌహీద్‌ ఆధా రంగానే స్వదేశంలో శాంతి నెలకొ ల్పారు. తర్వాతి తరం వారు అదే తౌహీద్‌ పునాదిగా సమర్‌ఖన్ద్‌ నుండి స్పెయిన్‌ వరకు గల విశాలమయిన రాజ్యాలలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పారు.

ఖలీఫా ఉమర్‌ (ర) జెరూసలెమ్‌ను జయించి నప్పుడు అక్కడి ప్రజల సంపదను కొల్లగొట్ట లేదు. వారి దైవారాధనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వ బడింది. క్రైస్తవులకు ప్రత్యేక నివాసాలు ఏర్పా టు చేశారు.  క్రిస్టియన్‌, ముస్లిం, అదే విధం గా సమకాలీన ఆధునిక కాలాలకు చెందిన ప్రామాణిక చరిత్రకారులందరిని సంపూర్ణంగా అధ్యాయనం చేసిన పిమ్మట గిబ్బన్‌ స్పష్టంగా ఒక విషయం రుజువు చేశాడు. ‘ముహమ్మద్‌ (స) ప్రవక్త తన క్రిస్టియన్‌ సోదరులకు వెంట నే భద్రత కల్పించాడు. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సత్య శీల విధానాన్ని ఖచ్చితంగా పాటించారు. ప్రవక్త (స) వారి వారసులే కాక, అరబిక్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలన్నింటిలో ఈ విధా నాన్నే కొనసాగించారు. ఈ పరంపర తాతార్‌ చేతుల్లోకి ప్రభుత్వ పగ్గాలు వెళ్ళే వరకు కొన సాగింది. మొదటి తరం తుర్కిష్‌ సుల్తానుల కాలంలోకూడా సహనశీలమయినదిగా ఇస్లాం కున్న పేరు కొనసాగింది. మరి ముస్లింల సహనశీల పాలనకు పూర్తి భిన్నంగా విషాన్ని విరజిమ్మింది క్రూసేడుల (కైస్తవుల) ప్రవర్తన’.

 

నాలుగు వంద అరవై ఏండ్ల అనంతరం క్రూ సేడుల కారణంగా జెరూసలేమ్‌లో క్రైస్తవుల పాలన ఏర్పడింది. కాని గతించిన ముస్లింల సహనశీల పరిపాలనను తలచుకొని ప్రజలు విచారించారని గిబ్బన్‌ తన ‘రైన్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ ది రోమ్‌ ఎంపైర్‌’లో పేర్కొన్నాడు. క్రూసే డులు సాగించిన దమన కాండ కారణంగా పెద్దా, చిన్నా, ఆడా, మగా తేెడా లేకుండా మూడు రోజుల పాటు నిర్విఘ్నంగా,నిర్దయగా నిరంకుశంగా, నిర్లజ్జగా మారణ కాండ సాగింది. సుమారు 70 వేల మంది దారుణం గా వధించబడ్డారు.పాలస్తీనా వీధుల్లో నర రుధిరం ఏరులయి పారింది. యూదులను వారి గుడిసెలలో తగుల బెట్టారు. ఎంతో మందిని బంధీలుగా చేెసుకున్నారు.

పోతే, దేవుడు ఒక్కడే అన్న భావనను ప్రాచీన జోరాస్టర్‌ మతం ప్రత్యేకంగా వ్యతిరేకించింది. మంచీచెడు అన్న ద్వంద్వ సూత్రం శాశ్వతమ యినదిగా వారు భావించారు. ఈ పరిస్థితుల్లో కూడా ముస్లింలు మాజియన్‌ తెగలను గౌర వించారు. మూడవ థాబ్ది కాలం నాటి వరకు అగ్ని మందిరాలు నిరాడంబరమయిన మస్జిదులతోపాటు వెలు గొందాయి. ఈ ప్రాచీన కట్టడాలు శిథిలమవ్వ డానికి ముస్లింలు కారణం కాదు.ఇస్లాం అద్వి తీయ ప్రబోధనాల ప్రభావంతో ప్రజలు పరివ ర్తనం చెంది విడిచి పెట్టడం వల్లనే అవి శిథి లావస్థకు చేరుకున్నాయి. ఆ విషయానికొస్తే, ఒక దేశ ప్రజలపై స్వల్ప ప్రతిఘటనతో విశ్వా సాలను రుద్దడం నిజంగా ఏ శక్తి వల్లా కుద రని పని. వాస్తవానికి అక్కడి విశ్వాసాలు క్ష్షీణ దశకు చేరుకున్నాయి. నాగరిక ప్రజల అవస రాలను అవి ఏ మాత్రం తీర్చలేకపోయాయి. అగ్ని, సూర్యుల వెలుగులకి, ఖరీమన్‌  ప్రతిభకు గ్రహణం పట్టింది.  శాశ్వత మయిన పాప సూత్రం వారిని అంధకారంలో ఉంచింది. ఈ దయ నీయ స్థితిలో ఇస్లాం సందేశాన్ని ఫర్షియా ప్రజలు విముక్తి సాధనంగా స్వీకరించారు.

అలాగే ఉత్తర ఆఫ్రికాలో ఆలెగ్జాండ్రియా నుండి కారితేజ్‌ వరకు గల ఏకైక ప్రాంతంలో ఇస్లాం ప్రకాశించడం వల్ల, క్రిస్టియన్‌ మూఢ విశ్వాసాల కర్రి మబ్బులు తుడిచి పెట్టుకుపో యాయి. అక్కడ కాలం చెల్లిన విశ్వాసాల క్ష్షీణత వల్ల ప్రజల్లో చోటు చేసుకున్న నిరాశ నిస్పృహ, అస్తవ్యస్థ పరిస్థితులు ఇస్లాం విప్లవా నికి ఊతంగా నిలిచాయి. అంతేగానీ, ప్రజల్లో కొత్త మతధర్మం పట్ల అసహనం ఎంత మాత్రం కానరాదు. డోవటస్టుల నాస్తిక భావ నలు, కాథలిక్‌ మతస్థుల ఆవేశం ప్రజల పాలిట శాపంగా పరిణమించాయి. దారిద్య్రం లో మ్రగ్గుతున్న ప్రజలు చేెసిన తిరుగుబాటు ను కాథలిక్‌ మతవ్యతిరేకమని భావించి అణచి వేశారు. అటువంటి గడ్టు స్థితిలో వన డాల్‌ మూరిష్‌ దండ యాత్రల కారణంగా అప్పటికే శిథిలమై ఉన్న వి పూర్తిగా సర్వ నాశనమయ్యాయి. అలజడి, నిరాశ జనక పరిస్థితిలోకి ప్రజలు నెట్టి వేయ బడ్డారు. ఫలితం-భ్రమలో లభించే స్వాంతన కోసం ప్రజలు సన్యాసులుగా మారారు. నిర ర్థక జీవన విధానాలను అవలంబించారు. సామాజిక అస్థిరత్వం, ఆధ్యాత్మిక నిరాశవాదం కలగలిపి సృష్టించిన గాఢాంధకారంలో, ముహమ్మద్‌ (స) అందించిన ఆశావాహ ఇస్లాం సందేశం నమ్మకం కలిగించే దీప కాంతిగా మెరిసింది.

ఇస్లాం ఉపదేశాలు కలిగించిన చైతన్యం ఎంతో మందిని ఆకర్షించింది. దేవుడు ముగ్గు రుగా ఉన్నారన్న  నమ్మకంలో మూఢంగా కూరుకుపోయిన వారిని ఇస్లాం నిద్ర లేపింది. ప్రకృతి అవసరాలను కూడా ఆరోగ్యకరమయిన రీతిలో తీర్చుకునే వెసులు బాటును, ప్రోత్సాహాన్ని ఇస్లాం వారిలో కలిగిం చింది. విషణ్ణ వదనంలో కూరుకుపోయిన ప్రజలకు ఇస్లాం ఒక కొత్త నమ్మకాన్ని కలి గించింది. ఈ సత్య తరంగాలు ఒక నూతన సమాజానికి నాంది పలికాయి. అందులో ప్రతి ఒక్కరికీ వారి దక్షత, ప్రతిభలను బట్టి పైకి ఎదిగే అవకాశం లభించింది. ఇస్లాం అందించిన సత్యస్ఫూర్తి, ముస్లిం పాలకుల ధర్మబద్ధ పాలన, సస్యశామలమయిన భూము లు, వీటితో వారి పనితనం కూడా తోడవ్వడం తో ఉత్తర ఆఫ్రికా ప్రజలు చాలా వేగంగా కోలుకొని సాఫల్యాన్ని, సౌభాగ్యాన్ని తమ సొంతం చేసుకున్నారు.

ఏకేశ్వర వాద మతంగా ఇస్లాం అరబ్‌ నాగరి కతతోపాటు స్వేచ్ఛాయుత తాత్విక సిద్ధాంతగా మధ్య యుగాల నాటి యూదులను, పరోక్షం గా పాశ్చాత్త క్రైస్తవులను చాలా శక్తివంతంగా ప్రభావితం చేసింది. పరిపూర్ణ ఏకేశ్వర వాద మతంగా ఇస్లాం పోషించిన పాత్ర అమోఘం. అంతకు పూర్వం ప్రవక్తలు తీసుకొచ్చిన జీవన విధానంలో సయితం తౌహీద్‌ కీలకమయిన అంశంగా ఉన్నప్పటికీ తర్వాత వారి అనుయా యుల నిర్లక్ష్యం వల్ల ప్రవక్తలు బోధించిన స్వచ్ఛమయిన ఏకేశ్వర వాదం ఇతర మిథ్యా వాదాలతో  ప్రభావితం అయి, తన ఉనికిని కోల్పోయింది.  అయితే ఇస్లాం విషయంలో అలా జరుగలేదు. అందులో మిథ్యాభావాలను జొప్పించే ప్రయత్నం జరిగినప్పటికీ, అక్కడ క్కడ  కొన్ని ప్రాంతాల్లో ఇస్లాం ధర్మ అవగా హనా రాహిత్యం వల్ల కొందరిలో బహుదైవ భావాలు పొడ సూపినప్పటికీ నేటికీ స్వచ్ఛమ యిన ఏకేశ్వరోపాసనకు కట్టుబడి జీవిస్తున్న ప్రజల సంఖ్య కోట్లకు పైమాటే. కారణం – ఇస్లాం ఖుర్‌ఆన్‌ మరియు హదీసులు సురక్షి తంగా ఉండటమే. వ్యక్తి పూజను ఇస్లాం సదా వ్యతిరేకించిన మాట ధర్మవేత్తల, ఔలియాల వియంలోనే కాదు, సత్య ప్రవక్త అయిన ముహమ్మద్‌ (స) వారి విషయంలోనూ అది అదే నియతికి, నియమానికి కట్టుబడింది.   అందుకు క్రింది ఉదాహరణ ప్రబల తార్కాణం. హజ్రత్‌ ఉమర్‌ (ర) గారికి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి మరణవార్త అందగానే – తీవ్ర భావోద్రేకానికి లోనై ఆయన ఆ వార్త ను నిరాకరించారు. అలా చెప్పిన వారిని హత మారుస్తానని అన్నారు. అప్పుడు హజ్రత్‌ అబూ బకర్‌ (ర) ఉమర్‌ (ర) ఉద్రేకాన్ని చల్లార్చుతూ అన్న మాటలివి:

”సోదరులారా! వినండి. ఒకవేళ ఎవరయినా ముహమ్మద్‌ (స)ను ఆరాధిస్తుంటే ఆయన (స) ఇహలోకం వీడిపోయారని తెలుసుకో వాలి.  ఆల్లాహ్‌ాను మాత్రమే ఆరాధించే వారికి అల్లాహ్‌ా సజీవంగా ఉన్న సంగతి తెలిసిందే. నిత్య జీవుడు అల్లాహ్‌ా మాత్రమే” అంటూ ఖుర్‌ఆన్‌ వాక్యాన్ని చదివి విన్పించారు. ”ముహమ్మద్‌ (స) దైవప్రవక్త మాత్రమే. అతని కి పూర్వం కూడా అనేక మంది దైవప్రవక్తలు వచ్చి పోయారు. మరి ఆయన చనిపోతే లేక చంపబడితే మీరు (ధర్మం నుండి) వెనుదిరిగి పోతారా ఏంటీ? గుర్తుంచుకోండి! అలా వెను దిరిగి పోయేవాడు అల్లాహ్‌ాకు ఎలాంటి నష్టం కలిగించలేడు. అల్లాహ్‌ా తనకు కృతజ్ఞతలు చూపేవారికి తగిన బహుమానం ప్రసాది స్తాడు”. (ఖుర్‌ఆన్‌-3: 144)

ఇక్కడో విషయం గుర్తించాలి. ఇస్లాం తొలి దళపతి ముహమ్మద్‌ (స)ను ఒక దైవ ప్రవక్తగా మాత్రమే పిలిచారు కానీ, ఒక దైవంగా తలచ లేదు. ప్రవక్త (స) వారి అనుసరులు సయితం ఆయన్ను ఒక దైవప్రవక్తగా మాత్రమే చూశారు. అలా దైవ అంతిమ ప్రవక్తకు లేని దైవత్వాన్ని ఆపాదించకుండా ఆయన్ను కేవలం దైవ సందేశహరునిగా మాత్రమే చూడటం ఇస్లాంను పరిశుద్ధ ఏకేశ్వర వాద సిద్ధాంతంగా నిలబెట్టింది. ఎందుకంటే,……

Related Post