ఇస్లాం వలన ఉపయోగమేమి?

islam_00401823
 నేడు ఇస్లాం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా అమెరికాలో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని వివిధ సర్వేలలో తేలింది. హిల్లరి రొడమ్‌ క్లింటన్‌, లోస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. అలానే పాపులేష న్‌ రెఫ్రెన్స్‌ బూరియ, యుఎస్‌ఎ టుడే ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాప్తి చెందుతున్నదని తెలియజేసింది. ఇస్లాం స్వీకరించే వారిలో అన్ని వర్గాలకు చెందినవా రు వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. ధనికులు, బీదవారు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పాత్రికే యులు మరెన్నో విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ విషయాలు ఇక్కడ చెప్పడానికి కారణం ఏమిటంటే ఇస్లాంలోని వాస్త వాలను నేడు ప్రజలు గ్రహిస్తున్నారు. ఇందులో గల సత్యాన్ని తెలుసుకుంటున్నారు. ప్రతి మనిషి తన మనోనేత్రాలతో ఇస్లాం వాస్త వికతను చూసినట్లైతే ఇస్లాం ను తప్పక అంగీకరిస్తాడు. ఇస్లాం ధర్మం ద్వారానే స్వర్గాన్ని చేరగలము. వేరే దారి లేదు. ఇది సత్యం సత్యం. సత్యం, ముమ్మాటికీ ఇదే సత్యం.
1)స్వర్గంలో శాశ్వతస్థానం లభించును:
 ”మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి ఒకరికంటే ఒకరు ముందుకు పోయే కృషి చేయండి; ఆకాశాలంత, భూమియంత విశాల మైన స్వర్గం వైపునకు పరుగెత్తండి. అది అల్లాహ్‌నూ ఆయన ప్రవక్తలనూ విశ్వసించిన వారి కొరకు సిద్ధం చేయబడింది.ఇది అల్లాహ్‌ అనుగ్రహం; తాను కోరిన వారి కొరకు దాని ని ప్రసాదిస్తాడు. అల్లాహ్‌ా ఎంతో అనుగ్రహం కలవాడు.” (ఖుర్‌ఆన్‌ 57:21)
 ముహమ్మద్‌ (స) ఇలా తెలియజేశారు: ‘స్వర్గ వాసులలో చివరి దర్జాకు చెందిన వానికి ఈ భూలోకం కంటే పది రెట్లు ఎక్కువ స్థలాన్ని అల్లాహ్‌ ప్రసాదిస్తాడు’. (ముస్లిం, అహ్మద్)
 స్వర్గం యొక్క విలువ భూలోకంతో పోల్చు కుంటే, స్వర్గంలో ఒక పాదం మోపినంత స్థలం ఈ భూలోకం మొత్తం కంటే ఎంతో మేలైనది. (బుఖారి,ముస్లిం హదీథ్‌ గ్రంథాలు)
 ‘స్వర్గంలో ఉన్నవాటిని ఈ ప్రపంచంలో ఏ ప్రాణీ చూడ లేదు. వాటి అందాలను ఏ కనులూ చూడలేదు. వాటి గొప్పతనాన్ని ఏ చెవులూ వినలేదు’. (ముస్లిం,అహ్మద్)
 ‘ఇహలోక జీవితమంతా కష్టాలు అనుభవిం చిన వ్యక్తి ఒక్కసారి స్వర్గం చూస్తే ఆ వ్యక్తి ఇలా అంటాడు. ‘నేను ఏనాడూ కష్టాలు అనుభవించనే లేదు అంటాడు’.  (ముస్లిం, అహ్మద్)
 ‘స్వర్గంలో ప్రవేశించినవానికి తనకు ఏది కావాలంటే అది ఇవ్వబడుతుంది. అతనికి ఎలాంటి లోటూ చెయ్యబడదు. అతని యొక్క వస్త్రాలు మాసిపోవు. అతని యౌవ్వనం తరిగి పోదు’. (ముస్లిం )
 ”మా ఆయత్‌లను (వచనాలను) విశ్వసించి మంచి పనులు చేసే వారిని మేము, క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశ పెడ్తాము. అక్కడ వారు కలకాలం ఉంటారు. ఇంకా వారికి పరిశుద్ధులైన భార్యలు లభిస్తారు. మేము వారిని దట్టమైన నీడలలో ఉంచుతాము.” (ఖుర్‌ఆన్‌ 4:57)
 ”మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో పరుగెత్తండి. ఆ స్వర్గం భూమ్యాకాశాల అంత విశాలమైనది. అది భయభక్తులు కలవారి కొరకు తయారు చెయ్యబడింది. వారు కలిమిలో, లేమిలో ఏ స్థితిలో ఉన్నా తమ సంపదను ఖర్చు చేసే వారు. కోపాన్ని దిగమ్రింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు. ఇలాంటి సజ్జను లంటే అల్లాహ్‌ాకు ఎంతో ఇష్టం-వారి స్థితి ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా ఏదైనా అశ్లీల కార్యం వారి వల్ల జరిగితే లేదా ఏదైనా పాపం చేసి, వారు తమ ఆత్మలకు అన్యాయం చేసు కున్నట్లయితే, వెంటనే వారికి అల్లాహ్‌ా జ్ఞాప కం వస్తాడు. అప్పుడు వారు ఆయనను తమ తప్పులు క్షమించు అని వేడుకుంటారు.
        ఎందుకంటే అల్లాహ్‌ా తప్ప పాపాలను క్షమించ గలిగే వాడెవడున్నాడని? వారు తాము చేసిన తప్పులను గురించి బుద్ధి పూర్వ కంగా మొండివాదం చెయ్యరు. అలాంటి వారికి తమ ప్రభువు వద్ద లభించే ప్రతిఫలం ఏమిటంటే, ఆయన వారిని క్షమిస్తాడు. క్రింద సెలయేళ్ళు ప్రవహించే ఉద్యానవనాలలోకి వారిని ప్రవేశింపజేస్తాడు. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు.” (ఖుర్‌ఆన్‌ 3:131-136)
 పైన చెప్పబడిన ఖుర్‌ఆన్‌ వచనములు చూసి నట్లయితే స్వర్గానికి అర్హత పొందడానికి కావ లసిన లక్షణాలు, గుణాలు, ఇందులో చెప్ప బడ్డాయి. అలానే స్వర్గంలో స్వర్గవాసులకు లభించే వాటి గురించి తెలియజేయ బడింది. ఇస్లాంధర్మాన్ని తూ.చ. తప్పక పాటించే వారికి స్వర్గం తప్పక లభిస్తుంది. ఇది సర్వలోక సృష్టి కర్త అయిన అల్లాహ్‌ా యొక్క వాగ్దానం.
2. ఇస్లాం ధర్మం పాటించుట వలన నరకాగ్ని నుండి విముక్తి కలుగును:
 ”ఎవరు అవిశ్వాసం అవలంబించి అవిశ్వాస స్థితిలోనే అసుపులు బాశారో, వారిలో ఎవ రైనా తమను తాము శిక్ష నుండి కాపాడుకోవ టానికి భూమినంతా బంగారం నింపి పరిహా రంగా ఇచ్చినా స్వీకరించబడదు అనే విష యం నిశ్చయం. ఇలాంటి వారి కొరకు బాధా కరమైన శిక్ష సిద్ధంగా ఉంది. ఇంకా వారికి సహాయం చేసేవారూ ఉండరు.” (ఖుర్‌ఆన్‌ 3:91) (సశేషం)

 

Related Post