ఇస్లాం ధర్మ సౌందర్యం

Hijab-The-Islamic-Commandments-Of-Hijab-By-Dr-Mohammad-Ismail-Memon-Madani1

 

ఈ ప్రపంచం ఒక మాయా వస్తువు. ఇక్క వాస్తవంకన్నా ఊహ కే ఎక్కువ ఆకర్షణ ఉంది. సత్యవంతులు చెప్పే అక్షర సత్యాలను నమ్మేవారి సంఖ్యకూడా తక్కువే. నరుడు, పామరుడు, ప్రవఁరుడు ఆడి తప్పేవారి మాటలనే గుడ్డిగా నమ్ముతాడు. ఇక్కడ మనకు అడుగడుగునా పుట్టగొడుగుల్లా కానవచ్చే సిద్ధాంతాలు కాల్పనిక మయినవి, అసంపూర్ణమయినవి. నిజం-మనిషి మరియు అతని కి ప్రాప్తమయి ఉన్న జ్ఞానమే అసంపూర్ణమయినప్పుడు అతను ప్రతి పాదించే రాతారీతులు సంపూర్ణం ఎలా కాగలవు? వాస్తవం ఏమి టంటే పరిపూరర్ణుడు, పరిశుద్ధుడు నిజదైవమయిన అల్లాహ్‌ా మాత్రమే. సృష్టిమొత్తంలో శ్వాస పీల్చే వాటన్నింటిలో మాట్లాడే వారందరిలో పరమ సత్యవంతుడు అల్లాహ్‌ా. ఆయన ఇలా సెలవిస్తున్నాడు: ”అల్లాహ్ కంటే సత్యమయిన మాట పలికేదెవరు?”  (అన్నిసా: 122)

అనంత దయాసాగరుడు, అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్     కరుణించి మనందరికి అనుగ్రహించినదే అంతిమ దైవగ్రంథం ఖుర్‌ఆన్‌, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స). ఈ రెంటి మేలు కలయికే ఇస్లాం. అల్లాహ్   ఇలా ప్రకటించాడు:”ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా ఇస్లాంను మీ జీవన ధర్మంగా సమ్మతించి ఆమోదించాను”. (అల్‌ మాయిదా: 3) ”అల్లాహ్  ఈ వాగ్దానం సత్యమైనది”. (అన్నిసా: 122)

దైవ దాసులారా! ఇస్లాం ధర్మం కొందరు భావిస్తున్నట్లు మహమ్మదీయ మతమూ కాదు; ముస్లింలు ముహమ్మదీయులూ (ముహమ్మద్‌ను దైవంగా భావించి కొలిచేవారూ) కారు. ఇస్లాం – అది మానవాళి మార్గదర్శకం నిమిత్తం ఆవిర్భవించిన 1 లక్ష 24 వేల మంది ప్రవక్తల ధర్మం. అది ఒక కాలానికో, ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒక జాతికో పరిమితమ యిన ధర్మం కాదు. దైవ ప్రవక్తలు తమ తమ కాలాల్లో, తమ తమ జాతులకు బోధపరచిన ధర్మమే ఇస్లాం. కాకపోతే దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) ద్వారా ఇది మానవాళికి సంపూర్ణంగా అందజేయబ డింది. అనాదిగా మానవాళి మొత్తానికి ఆ నిజ దైవం నిర్దేశించిన ఈ ధర్మంలో మూడు మౌలికాంశాలున్నాయి. 1) తౌహీద్‌ (దేవుని ఏకత్వం). 2) రిసాలత్‌ (దైవదౌత్యం). 3) ఆఖిరత్‌ (పరలోకం).  ఈ మూడు మౌలికాంశాల్నే ప్రవక్తలందరూ మానవాళికి ప్రబోధించారు.

ఈ సత్యధర్మాన్ని అడ్డుకునే ప్రయత్నం ప్రతి యుగంలోనూ జరిగింది. ఈ యుగం – కలియుగంలోనూ జరుగుతూనేె ఉంది. ప్రవక్త నూహ్‌ా (అ) వారు 950 సంవత్సరాలు బాధించబడినా, ప్రవక్త ఇబ్రాహీమ్‌ (స) వారిని అగ్నిగుండంలోకి విసిరేసినా, ప్రవక్త జకరియ్యాను రంపంతో రెండుగా చీరేసినా, ప్రవక్త యహ్యా (అ) గారి శిరస్సుని ఖండించి ఒక అలగా అబల కోసం బహుమతిగా ఇచ్చినా, ప్రవక్త ఈసా (అ) వారిని నానా రకాలుగా పీడించినా, ఒక పూర్తి ఊరును నిప్పుతో నిండిన కంద కానికి ఆహుతి చేెసినా, ఒక పూర్తి వర్గపు జనాభా మాంసాన్ని ఇనుప దువ్వెనలతో ఎముకల నుండి వేరు చేసినా, దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిని శతవిధాల అణచివేెసేందుకు, అంతమొందిం చేందుకు ప్రయత్నించినా – కారణం ఒక్కటే – వారు నమ్మింది సత్యం, వారు చెప్పింది సత్యమవ్వడమే. అసత్యం, మిథ్యావాదులు ఎంత పెచ్చ రిల్లి ప్రవర్తించినా అంతిమ విజయం మాత్రం సత్యానికే, సత్యవాదులనే వరించింది. అసత్యప్రియులు అప్రతిష్ఠ పాలయి, అపకీర్తి మూట కట్టు కుని అష్ట కష్టాలు అనుభవించారు. ఘోరమైన శిక్షలకు గురి చేయ బడ్డారు అనడానికి సుదీర్ఘమయిన మానవ చరిత్రే సాక్షి! నిజం – అల్లాహ్  ఇస్లాం ధర్మాన్ని ప్రవక్తల ద్వారా మానవాళికి బోధించింది, దానికి ఇతర జీవన విధానాల మీద ఆధిక్యతను అనుగ్రహించడానికే. ”వారు అల్లాహ్  జ్యోతిని తమ నోటితో (ఊది) అర్పివేయాలని కోరుతు న్నారు. అయితే అల్లాహ్  – అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే-తన జ్యోతి సంపూర్ణం చేయకుండా వదలిపెట్టడానికి అంగీకరిం చడు. ఆయనే తన ప్రవక్తకు-మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పం పాడు. ముష్రికులకు ఎంత సహించరానిదయినా సరే, ఇతర జీవన విధానాలపై దాన్ని ఆధిక్యతను వొసగడానికి”. (తౌబా: 32,33) ”ఇక ఎవరయితే ఇస్లాంను కాదని మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ఆ ధర్మం ఆమోదించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 85)

పరిశుద్ధ మనసు గల సమాలోచనాపరులంతా ఇస్లాంను లోతుగా పరి శీలించి తృప్తి చెంది తమ గుండెలకు హత్తుకుంటారు అనడానికి 14 వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్రే సాక్షి. వారు, అల్లాహ్  నిర్దేశాల, నియమాల వెనుక గల పరమార్థాన్ని గ్రహించి ఆయన మహోన్నత యుక్తిని తెలుసుకొని ఆయన్ను ప్రేమించనారంభించారు. సర్వకాల సర్వా వస్థలయందు ఆచరణయోగ్యమైన ఏకైక ధర్మం ఇస్లాం ఒక్కటే అన్న యదార్థాన్ని తెలుసుకున్న వారు దాని గొప్పతనాన్ని కొనయాడారు. ఎంతగానయితే మనిషిలో సత్య దృష్టి పరిపక్వత చెందుతుందో అంత గానే అతను ఇస్లాం ధర్మాన్ని  అభిమానిస్తాడు, ఆచరిస్తాడు, గౌరవి స్తాడు. ఎందుకంటే, ఇస్లాం మానవ మనుగడకు తోడ్పడే సకల మేళ్ళ, శుభాల, శ్రేయోసాఫల్యాల సమ్మేళనం.

ఇస్లాం తౌహీద్‌ (దేవుని ఎకత్వం) గురించి, మానవాళికి నొక్కి వక్కాణి స్తుంది. తౌహీద్‌ను అనుసరించిన మనిషి అపూర్వమయిన, అనిర్వవచ నీయమయిన ఆత్మశాంతిని పొందుతాడు. తరతరాలుగా మనిషి భారం గా మోస్తున్న మిథ్యా దైవాల దాస్య కాడిని అతని భుజాల మీద నుంచి దించి, అతనిపై గల అనవసర ఆక్షంల సంకెళ్ళను త్రెంచి అతన్ని స్వేఛ్చా లోకంలో విహరింపజేయగలిగే తౌహీద్‌ సూత్రాన్ని పునాదిగా పేర్కొంటుంది ఇస్లాం. విశ్వ మొత్తానికి కర్త ఒక్కడేనని, ఆయనే ఈ విశ్వ వ్యవస్థను నిరాఘాటంగా నడుపుతున్నాడని, ఆతన తప్ప మరో ఆరాధ్య దైవం లేడని, ఆయనేె ఆది, ఆయనకు ముందు ఏదీ లేదని, ఆయనే అంతం ఆయన తర్వాత ఏది ఉండబోదని, ఆయనే మహోన్నతుడు ఆయనపైన ఏది లేదని, ఆయనే సజీవుడు, నిరంతుడని, భూమ్యాకాశాల మధ్య గల సమస్తం ఆయనదేనని, ఆయన్ను పోలినదేది లేదని, ఆయన సర్వ శక్తిమంతుడుని, ఈ విశ్వ వ్యవస్థను నడపడం ఆయన్ను అలసటకు గురి చేయజాలదని, ఆయనకు    కునుకుగాని,   నిద్దురగాని   రాదని,  ఆయన జ్ఞానం సమస్త లోకాలకు పర్యవేష్టించి ఉందని, గొచర అగోచ రాలన్నీ ఆయనకు తెలుసునని, వెలుగు వెన్నెల – చిమ్మ చీకటి ఆయన కు సమానమేనని, సకల జీవరాసుల జీవనోపాధి ఆయన చేతిలోనే ఉందని, ప్రతి క్షణం ప్రకృతిని, ప్రజల్ని కాపాడేెది ఆయనేనని, అట్టి కరుణామయునికి మాత్రమే దాస్యం చేెస్తూ, ఆయనకు నచ్చినవాటిని పాటిస్తూ, ఆయనకు నచ్చని వాటికి దూరంగా మసలుకోవాలని ఇస్లాం నొక్కి వక్కాణిస్తోంది.

వాస్తవం ఏమిటంటే సర్వలోక సృష్టికర్త, పాలకుడు, పరిపోషకుడు అయిన అల్లాహ్  మానవాళి మార్గదర్శకత్వం నిమిత్తం ప్రవక్తలను, గ్రంథాలను అవతరింపజేయడమే కాక, సృష్టిలోనూ, మానవాకృతి నిర్మాణంలోను అనేక నిదర్శనాలను పెట్టాడు. యోచనాపరులు వాటిని గురించి ఆలోచించాలని, పరిశీలించాలని, పరిశోధించాలని, ఇహ పరాల ప్రగతి బాటలు వేసుకోవాలని పలుమార్లు పిలుపునిచ్చాడు కూడా. ఈ అన్వేషణ ద్వారా యుక్తిపరులు ఆయన్ను తెలుసుకొని, ఆయన ఆజ్ఞలను గైగొని, ఆయన హక్కులను నెరవేర్చడం సులభమవు తుంది.”భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ (నిరంతర)మార్పిడి లో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రా లలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లాహ్  వర్షపు నీటి కురిపించి మృత భూమిని బ్రతికించడంలో,  ఇంకా అందులో అన్ని రకాల ప్రాణు లను వ్యాపింపజేయడంలో, వీచే గాలుల దిశను మార్చడంలో, భూమ్యా కాశాల మధ్య (అల్లాహ్‌ా) నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుం టున్న మేఘాలలో బుద్ధిమంతులకు (అల్లాహ్‌ా శక్తిసామర్థ్యాలకు సంబం ధించిన) ఎన్నో సూచనలున్నాయి”. (బఖరా: 164)

మనం అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాము. ‘ఏ సృష్టికర్త లేకుండా మనందరి సృజన ఎలా సాధ్యం?’ అని. మనిషి మనో మస్తిష్కాలను తరాల తరబడి కలచి వేస్తున్న ఈ ఆలోచన గురించి ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ”ఏమిటి? వీరు (పుట్టించేవాడు) ఎవరూ లేకుండానే వారం తట వారే పుట్టుకొచ్చారా? లేక వారికి వారే సృష్టిలకర్తలా?” (అత్తూర్‌: 35) ”ఏమిటి? భూమ్యాకాశాలకు వారే సృష్టికర్తలా?”   ”వాస్తవంగా ఆయనే ఆకాశాలను ఎలాంటి స్తంభాలు లేకుండానే సృష్టించాడు. మీరు దాన్ని చూస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన భూమి లో పర్వతాలను నెలకొల్పాడు. అది (భూమి) మీతోపాటు ఒదిగిపో కుండా ఉండేందుకు. ఇంకా అన్నిరకాల జంతువులను భూమిలో వ్యాపింపజేశాడు…..ఇదే అల్లాహ్  సృష్టి. ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి”. (లుఖ్మాన్‌: 10, 11)

”ఏమిటీ, ఏ వస్తువునూ సృష్టించలేని వారినీ, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారిని వీళ్లు (అల్లాహ్ కు) బాగస్వాములుగా నిల బెడుతున్నారా? వారు (మిథ్యాదైవాలు) వీళ్ళకు ఏ సహాయమూ చేయ లేరు. కనీసం తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు. వాస్త వంగా మీరు అల్లాహ్ ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొర పెట్టుకుంటూనే ఉండండి. (ఈ బహుదైవోపాసనలో) మీరు గనక సత్యవంతులయితే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.ఏమిటి, వారు(విగ్రహ ప్రతిమలు) నడవగలగటానికి వారికేమయినా కాళ్లున్నాయా? వారు దేనినయినా పట్టుకోవడానికి వారికి చేతులున్నాయా? చూడగలగ టానికి వారికి కళ్లున్నాయా? వినగలగటానికి వారికి చెవులున్నాయా? (ఓప్రవక్తా!) వారికి చెప్పు:”మీరు మీ భాగస్వాములందర్నీ పిలుచు కోండి. మరి మీరంతా కలిసి నాకు కీడు కలిగించే వ్యూహాన్ని రచిం చండి. నాకు కొద్ది పాటి గడువు కూడా ఇవ్వకండి”. (ఆరాఫ్‌: 191-195)

ఇది యదార్థం అయినప్పుడు, మన ఆరాధనలు, ఉపసనారీతులు, భక్తి ప్రపత్తులు, మొక్కుబడులు, మొరపెట్టుకోవడాలు కూడా ఆయన ఒక్కడి  కే అంకితం చేయాలి. (ఓ ముహమ్మద్‌!) వారికిలా చెప్పు: ”ఆయన అల్లాహ్  ఒక్కడే. అల్లాహ్‌ా నిరపేక్షాపరుడు. (ఏ అక్కరా లేని వాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన కూడా (ఎవరికీ) పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడు”. (ఇఖ్లాస్‌: 1-4)  ఆకాశాన్ని, దానిలోని వైభవోపేతమయిన సామ్రాజ్యాన్ని చూసినప్పు డల్లా ఆలోచనపరుని నోట ఈ స్తుతి ఆలాపనలు వెలువడతాయి: ”ఆకాశంలో బురుజులు నిర్మించి, అందులో ప్రజ్వలమయిన దీపాన్ని, కాంతి మంతమయిన చంద్రుణ్ణి ఆవిష్కరించినవాడు  శుభకరుడు. ఆయనే రేయింబవళ్లను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేెశాడు. ఇదంతా గుణ పాఠం నేర్చుకునే వాని కోసం, లేదా కృతజ్ఞతా పూర్వకంగా మసలుకో దలచిన వాని కోసం చేయబడింది”. (ఫుర్ఖాన్‌: 61,62) ”సూర్యున్ని ప్రకాశమానంగాను, చంద్రున్ని కాంతిమంతంగానూ చేసినవాడు ఆయనే. మీరు సంవత్సరాల సంఖ్యను, లెక్కలను తెలుసు కోవడానికి చంద్రుని థలను కూడా ఆయనే నిర్థారించాడు. అల్లాహ్  వీటిని సత్యబద్ధంగా తప్ప (నిరర్థకంగా) పుట్టించలేదు. తెలుసుకోగల వారి కోసం ఆయన ఈ సూచనలను విడమరచి చెబుతున్నాడు”. (యూనుస్‌: 5)

”నిస్సందేహంగా విత్తనాన్ని, టెంకను చీల్చేవాడు ఆయనే. ఆయన జీవమున్న దానిని జీవం లేని దానలోంచి తీస్తాడు. జీవం లేని దానిని జీవమున్న దానిలోంచి తీసేవాడూ ఆయనే. ఆయనే అల్లాహ్ . మరలాం టప్పుడు మీరు (సత్యం నుండి) ఎటు మరలిపోతున్నారు”.  (అన్‌ఆమ్‌: 95)  ”చీకట్లలోనూ, భూమిలోనూ, సమద్రంలోనూ మీరు మార్గం తెలుసు కునేందుకుగాను ఆయనే మీ కోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము  జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమరచి చెప్పాము”.  (యూనుస్‌: 5)  ”ఏమిటి నింగినేలకు సంబంధించిన సామ్రాజ్య వైభవాన్ని, అల్లాహ్  సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా? వారి కాలం దగ్గర  పడి ఉండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచిం చలేదా? మరి ఖుర్‌ఆన తర్వాత వారు విశ్వసించే మరో వస్తువు ఏముంటుంది?” (ఆరాఫ్‌: 185)

”ఆయన ఒకదానిపై ఒకటి సప్తాకాశాలను నిర్మించాడు. (ఓ చూచేవాడా!) నీవు కరుణామయుని సృష్టి ప్రక్రియలో ఎలాంటి అస్తవ్యస్తతను కానలేవు. కావాలంటే, మరో సారి దృష్టి సారించి చూడు. నీకేమయినా లోపం (బీటలు వారినట్లుగా) కనిపిస్తోందా? మళ్ళి మళ్ళీ దృష్టిని సారించు. నీ దృష్టి అలసిసొలసి, విఫలమయి నీ వైపు తిరిగి వస్తుంది”. (ముల్క్‌: 3,4)  జ్ఞానవంతులయిన వారు అల్లాహ్  నిర్మాణానికి నిదర్శనమయిన భూమిని చూస్తారు. అప్పుడు వారికి కొన్ని విషయాలు బోధపడతాయి. అల్లాహ్  ఘనతాగౌరవంతో వారి హృదయాలు ఉప్పొంగుతాయి.

”ఆయనే భూమిని విశాలంగా పరచి అందులో పర్వతాలను, నదీ నదాలను సృష్టించాడు. ఇంకా అందులో అన్ని రకాల పండ్లను రెండేసి జతలుగా సృష్టించాడు…..భూమిలో అనేక (రకాల) నేలలు (ఒక దాని కొకటి) ఆనుకొని ఉన్నాయి. అందులో ద్రాక్ష తొటలూ ఉన్నాయి. పంట పొలాలూ ఉన్నాయి. కర్జూరపు చెట్లూ ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా, మరికొన్ని వేరే రకంగా ఉన్నాయి. వాట న్నింటికీ ఒకే నీరు సరఫరా అవుతోంది. అయినప్పటికీ ఆ పండ్లలో ఒకదానికి మరోదానిపై శ్రేష్ఠతను ప్రసాదిస్తున్నాము. నిశ్చయంగా ఇందులో   విజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి”. (అర్రాద్‌: 3,4)

Related Post