కర్రి మబ్బులు వెలుగు ముగ్గులు

గర్వం-అహంకారం చీకటి. వినయం-అణకువ వెలుతురు. ద్వేషం-ప్రతీకార జాల చీకటి. క్షమ, ప్రేమ-పరోపకారం వెలుతురు. శాపనార్థాలు-చివాట్లు చీకటి. శుభవార్తలు-శుభాకాంక్షలు వెలుతురు. అన్యాయం-అక్రమం చీకటి. న్యాయం-ధర్మం వెలుతురు. అసత్యం-మౌఢ్యం చీకటి. సత్యం-విశాల దృక్పథం వెలుతురు. అందుకే - ''దౌర్జన్యం, దుర్మార్గాలు రేపు ప్రళయ దినాన కర్రి మబ్బులుగా పరిణమిస్తాయి' అని ప్రవక్త (స) చెప్పారు.

గర్వం-అహంకారం చీకటి. వినయం-అణకువ వెలుతురు. ద్వేషం-ప్రతీకార జాల చీకటి. క్షమ, ప్రేమ-పరోపకారం వెలుతురు. శాపనార్థాలు-చివాట్లు చీకటి. శుభవార్తలు-శుభాకాంక్షలు వెలుతురు. అన్యాయం-అక్రమం చీకటి. న్యాయం-ధర్మం వెలుతురు. అసత్యం-మౌఢ్యం చీకటి. సత్యం-విశాల దృక్పథం వెలుతురు. అందుకే – ”దౌర్జన్యం, దుర్మార్గాలు రేపు ప్రళయ దినాన కర్రి మబ్బులుగా పరిణమిస్తాయి’ అని ప్రవక్త (స) చెప్పారు.

గర్వం-అహంకారం చీకటి. వినయం-అణకువ వెలుతురు. ద్వేషం-ప్రతీకార జాల చీకటి. క్షమ, ప్రేమ-పరోపకారం వెలుతురు. శాపనార్థాలు-చివాట్లు చీకటి. శుభవార్తలు-శుభాకాంక్షలు వెలుతురు. అన్యాయం-అక్రమం చీకటి. న్యాయం-ధర్మం వెలుతురు. అసత్యం-మౌఢ్యం చీకటి. సత్యం-విశాల దృక్పథం వెలుతురు. అందుకే – ”దౌర్జన్యం, దుర్మార్గాలు రేపు ప్రళయ దినాన కర్రి మబ్బులుగా పరిణమిస్తాయి’ అని ప్రవక్త (స) చెప్పారు. అక్కడ మోక్షం కానని మనిషి వెర్రిగా అరుస్తాడు. ఏమని? నాకు పుల్‌ సిరాత్‌ మీద నడిచి వెళ్ళేందుకు కాంతి కావాలని. శాంతి నిలయమైన స్వర్గంలో ప్రవేశం లభించాలని. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది: ”ఆ రోజు కపటులైన పురుషులు, కపటులైన స్త్రీలు విశ్వాసులనుద్దేశించి, కాస్త మా కోసం ఆగండి! మేము కూడా మీ కాంతి నుండి లబ్ది పొందు తాము” అని అంటారు. ‘మీరు వెనక్కి వెళ్ళిపోండి. వెలుతురును అక్కడే వెతుక్కొండి’ అని వారికి సమాధానం ఇవ్వబడుతుంది…..వారు (కపటులు) వారిని (విశ్వాసులను) కేక వేసి పిలుస్తూ ”మేము మీ వెంట లేమా?” (మీతో కలిసి నమాజు చేయలేదా? ఉపవాసలుండలేదా?) అనంటారు. దానికి వారు – ”అవును, మా వెంట ఉన్న సంగతి నిజమే. కాని మీరు మీ ఆత్మలను వంచించుకున్నారు. (మాపై గడ్డు కాలం రావాలని) ఎదురు చూశారు. సందేహాలలో ఊగిసలాడారు. పనికి మాలిన మీ అభిలాషలే మిమ్మల్ని దగా చేశాయి. ఎట్టకేలకు దైవాజ రానే వచ్చింది. అల్లాహ్‌ా విషయంలో మోసగించినవాడు (షైతాన్‌) మిమ్మల్ని (కడదాకా) మోసంలోనే ఉంచాడు.” (హదీద్‌: 12-14)
అన్నీ నీతులు పాటించమని చెప్పే ధైర్యం పెద్దలకూ, నీతులన్నింటని పాటించే ఓపిక చిన్నలకూ లేని రోజులివి. కాబట్టి మనిషిలో గర్వాహంకారాలు ఉప్పొంగిన వేళ అతను అణకువతో తల వంచాలి. ద్వేషం ప్రతీకార లావా పెల్లుబికినప్పుడు ప్రేమ పూర్వకమైన వైఖరిని అవలంబించాలి. మనసులో దురుద్దేశ్యం, మెదడులో దురాలోచన చోటుచేసుకున్న సమయాన తనను పరో పకారిగా నిరూపించుకోవాలి.

పిల్లలెలా పుడతారు?
పుత్ర కామేష్టి యజ్ఞం చేస్తే రామ, లక్షమణ, భరత, శత్రుఘ్నులు పుట్టారని, త్రిపురాంతకు డనే రాక్షసుణ్ని చంపాలనుకొని పొడిస్తే రక్త బొట్టు నేల పడిన చోటల్లా పుట్టగొడుగుల్లా త్రిపురాంతకులు పుట్టేవారని, విష్ణువు మోహిని అవతారం దాల్చగా, ఈశ్వరుడు ప్రియుడిగా వ్యవహరిచడం వల్ల మణికంఠ (అయ్యప్ప) పుట్టాడని, కర్ణుడు కుంతీకి చెవిలోంచి పుట్టా డని, చిప్పల్లోంచి, బుట్టల్లోంచి, తట్టల్లోంచి ఎందరో పుట్టారని మనం తరచూ వింటూనేె ఉంటాము. అలాగే ఫలానా విగ్రహం చుట్టూ 180సార్లు చొప్పున 40 రోజులు (మండలం) తిరిగితే పిల్లలు పుడతారని, అజ్మీరులో కసుమూరులో మొక్కుబడులు చెల్లించుకుంటే పిల్లలు పుడతారని, ఏదో ఒక బాబా దీవించి తాయెత్తు ఇస్తే పిల్లలు పుడతారని, తీర్థాలకు తిరిగితే, స్వాముల పేరిట వ్రతాలు చేస్తే పిల్లలు పుడతారని నేటికీ ఎంతో మంది నమ్ముతున్నారు. ఒకవేళ ఇన్ని చేెసినా ప్రయో జనం లేకపోతే – ఎట్టికి దొరికింది కదా అని స్త్రీని ‘గొడ్రాలు’ అని బిరుదు ఇచ్చే కొందరైతే, అది ఆమె పూర్వ జన్మ దుష్కృతమని తేల్చి చెప్పి నెపానంతా నారీమణిపై నెట్టేసి భర్తకు ఇంకో పెళ్ళి చేెసుకోమని ప్రోత్సహించే ప్రబు ద్ధులు కొందరుంటారు. అంతేగాని భర్తలో
లోపం ఉంటే ఈ రెండో భార్యకు కూడా పిల్లలు పుట్టరనే సంగతి ఎవరూ పట్టించు కోరు. ఓ కవి ఇలా అన్నాడు:
”గుడులు చుట్టు తిరిగి, గుంజీలు తీసిన
కడుపు పండు మాట కల్లగాదె?
రావిచెట్టు కాదు, రక్షక రేకులు కాదు,
లోపమెరుగ కలుగు పాప, చైతు!” అని.
కాబట్టి భార్యాభర్తల్లో ఏ ఒక్కరిలో లోపం ఉన్నా వైద్యుణ్ణి సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవడం మంచిది.

ఇక అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే – స్త్రీపురుష సంయోగంతో పాటు దేవుని కృపాకటాక్షాలు ఉంటేనే పిల్లలు పుడ తారన్నది. అదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా సెలవిస్తుంది:

”భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్‌ాదే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. తాను కోరిన వారికి ఆడ పిల్లలను ఇస్తాడు, తాను కోరిన వారికి మగ పిల్లలను ఇస్తాడు. లేదా వారికి మగ పిల్లలను, ఆడ పిల్లలను కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతాన హీనులుగా చేస్తాడు. ఆయన మహాజ్ఞాని. సంపూర్ణ అధికారం గలవాడు”. (షూరా: 49,50)

హజ్రత్‌ ఆదంను అల్లాహ్‌ తల్లిదండ్రి లేకుండా సృష్టించాడు మట్టితో. హజ్రత్‌ హవ్వాను అల్లాహ్‌ తల్లి లేకుండా పుట్టించాడు ఆదం పక్క టెముకతో. హజ్రత్‌ ఈసా(అ)ను అల్లాహ్‌ తండ్రి లేకుండా పుట్టించాడు. మిగిలిన మాన వులంతా తల్లిదండ్రుల సంయోగంతోనే పుట్టారు. కాబట్టి సంతానం కావాలంటే సంతాన ప్రదాతను వేడుకోవాలేగానీ, రాయి- రప్ప, పాము-పుట్ట, దర్గా-దుర్గాలను కాదు సుమీ! పిల్లల గురించి ఉన్న ఆపోహాల్ని, మూఢాచారాల్ని ఎంత త్వరగా విడనాడితే అంత మంచిది. ముఖ్యంగా ముస్లింలు.

వాతలు పెడతామండి వాతలు!!
ఇంట్లో శిశువు పుట్టి ‘కేర్‌’ మనడమే ఆలస్యం పాపం-వెంటనే సూదిని దీపం మీద ఎర్రగా కాల్చి బొడ్డుకు చుట్టు నాలుగు
వాతలు వడ్డిసారు. ఇలా చేెయడం వల్ల బొబ్బలు తేలి, చీము పట్టి, క్రిములు చేరి ధను ర్వాతం వచ్చే ప్రమాదముంది. అలా గనక జరిగితే ఏ వాతలతో దీర్ఘాయుషు ఇద్దామను కున్నామో, వాటితోనే దీర్ఘ నిద్రలో ముంచే ప్రమాదముంది.

వంపులు-ఫిట్సు వస్తే దాని రకాన్ని బట్టి వైవిధ్యమైన వైద్యాలు అమల్లో ఉన్నాయి. అయితే మన పెద్దలు ‘వాతల్ని సర్వ రోగ నివారిణి’ అంటూ కణతల మీద రెండు వైపులా కాలుస్తారు. అలాగే చెవి ముందు భాగంలో వాపుదేలినా – ‘కమ్మకాక, గవద బిళ్ళలు, మంప్స్‌పేరొటైటీస్‌’ వస్తే దానంతట తగ్గే జబ్బుకు చెవి ముందు భాగంలో ‘ప్రత్తి’ పుల్లతో చక్కగా వాతలు పెడతారు.

ఇంకా గొంతంతా పొక్కిపోయి, నోటి మంట, కారం పట్టనీయకపోవడం, దగ్గు, కొంచెం కళ్ళెం పడటాన్ని ‘ఫేరింజైటెస్‌’, ‘టాన్సిలైటీస్‌’ అనంటారు. ఇవి తగ్గటానికి డాక్టర్‌ సలహా మెరకు ఉప్పు నీళ్ళు పుక్కిలించటం, పెన్సి లిన్‌, టెట్రాసైక్లిన్‌ వంటివి వేసుకుంటే నయం అవుతుంది. అయితే ఇవేమీ కాకుండా రోగిని బాగా నోరు తెవమని పుల్లను ఎర్రగా కాల్చి కొండ నాలుక మీద వాత పెడతారు. మరి కొన్ని చోట్ల ముంజేతి మీద బోటన వేలికి ఎదురుగా కాల్చిన నులకతాడుతో బొబ్బ తేలే దాకా కాల్చి మరీ వదులుతారు. అంతటితో సరిపెట్టుకుంటారా అంటే అదీ లేదు. తర్వాత రోగికి రొట్టె, తెల్లగడ్డలు (వెల్లుల్లి), మిరప కాయలతో చేెసిన (గొడ్డు) కారం పొడి పథ్యం గా పెడతారు. వాతలతో చేయి నొప్పి, కారం తో నోరు నొప్పి, కడుపులో ఆరాటం…. అసలే పాపం గొంతు నొప్పి. ఒక నొప్పి వదల గొట్టేందుకు ఇన్ని నొప్పులు భరించాలి పాపం!

వాత వాచీ
రోలెక్సు వాచీ, రెమండు వాచీ, టైటాన్‌ వాచీలాగే ఇదీ ఒక రకమైన వాత వాచీ. పచ్చ కామెర్లకు వేసే వాచీ ఇది. అసలు పచ్చ కామెర్లు ‘వైరస్‌’ క్రిమితో వస్తుంది. అలాగే మూత్ర పిండాల్లో వచ్చే ‘ఎక్యూట్‌నెఫ్రెటిస్‌’ – ఉబ్బు కామెర్లు -ఇవి కొన్ని పథ్యాలు పాటించి విశ్రాంతి తీసుకుంటే తగ్గి పోతాయి. అయితే వాతలు పెట్టే నిపుణులు వాత పెట్టి, వాతకు చీము పడితేనే జబ్బు తగ్గుతుందని బల్ల గుద్ది మరీ చెబుతుంటారు. ఇది కొన్ని వాతలు మాత్రమే. ఇదే రకమైన ఆచారం అరబ్బుల్లో సయితం ఉండేది. ‘ఏ మందూ పని చేయన ప్పుడు వాతే శరణ్యం-ఆఖిరుల్‌ ఇలాజి అల్‌ కై’ అన్న నానుడి వారి నాలుకలపై నానుతూ ఉండేది. అరబ్బులు మూడు విషయాల వల్ల స్వస్థత లభిస్తుందని నమ్మేవారు. 1) తేనె సేవించడం వల్ల. 2) చెడు రక్తం తీసే ప్రక్రియ (హిజామా) వల్ల. 3) వాత పెట్టడం వల్ల. మహనీయ ముహమ్మద్‌ (స), పై రెంటి ని ఆమోదించి చివరిదాన్ని అంటే వాత పెట్ట డాన్ని అసహ్యించుకోవడమే కాక ‘నేను నా సముదాన్ని దీన్నుండి వారిస్తున్నాను’ అని సెల విచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది; వాత ఎవరు పెట్టినా, పెట్టక పోయినా తగిన వైద్యం జరగనంత వరకు ఎలాంటి ప్రయోజనం లేదు. వాటంతట అవే తగ్గే జబ్బు రోగ నిరోధక శక్తి పెరిగిననప్పుడు పోతాయి. అయితే గౌరవం మాత్రం వాతకే దక్కుతుంది.

మేము చేసిన నేరము ఏమి?

ఉల్లిపాయలు తింటే కోపం వస్తుందని, ప్రజల్లో పిల్లి నమ్మకం.మధుమోహం (షుగర్‌) జబ్బు వస్తే అన్నంతో, ఆకు కూరలు తినకూడ దని కొందరి నమ్మకం. మధుమోహం శరీరం లో ‘ఇన్సులిన్‌’ అనే హార్మొను తయారు కావడం తగ్గిపోతే వస్తుంది. తగ్గిన హార్మోను ను పెంచే మందులు వాడటమో, ఇన్సులెన్‌ బొత్తిగా లేకపోతే బయట నుంచి ఇంజక్షన్‌ రూపంలో ఇవ్వటమో చేయాలి. ఈ క్రమంలో ఆహార నియమాలు కొన్ని వైద్యులు చెబు తారు. స్థూలకాయులైతే బరువు తగ్గించడాని కి ఆహారం తగ్గించమంటారు అంతే. మరి ఆకు కూరలు తినడం వల్ల ప్రయోజనమేగానీ నష్టం ఏమీ లేదు. అదే విధంగా కోడి కూర వేడి చేస్తుందనడం, మామిడి పండు తింటే చీము గుల్లలు వస్తాయనడం, పాలల్లో నీళ్ళు కలపకపోతే మందం చేస్తుందనడం, బొప్పాయి పండు తింటే గర్భస్రావం జరుగు తుందనడం హాస్యాస్పదం తప్ప ఇంకేమి కాదు.
అలాగే ఫలానా రోజు ఫలానా కూర గాయలు తినకూడదు, ఫలానా రోజు మాం సం ముట్టుకోకూడదు అన్న పట్టింపు సయి తం పస లేనిదే. చివరగా – థమ్స్‌అప్‌, గోల్డ్‌ స్పాట్‌, కొకా కోలా, పెప్సి వీటి వల్ల వేడి తగ్గుతుందనుకోవడం కూడా శుద్ధ అవివేకమే. అసలు వీటిలో శరీర నిర్మాణాని కిగానీ, శరీ రంలో శక్తి పెంచడానికిగాని పనికొచ్చే సరకు పూజ్యం. పైగా నష్టమే అధికం. నాటు సారా, బ్రాంది బుడ్లకన్నా ఎక్కువ కాకపోయినా, దానికన్నా మంచి నీళ్ళు త్రాగడం మంచిది.

ఇస్లాం- అది ఈ విశ్వ వ్యవస్థను సృష్టిం చిన వాడున్నాడంటుంది. ఈ నిఖిల జగత్తు వ్యర్థంగా, లక్ష్యరహితంగా సృష్టించబడ లేదు అంటుంది. తనను అందమైన ఆకారంలో పుట్టించిన ఆ సృజకారుడిని తెలుసు కోవ డమే సిసలైన జ్ఞానం, విజ్ఞానం, తక్కిన విద్య లన్నీ సమాచారం క్రిందికే వస్తాయంటుంది. యాదార్థానికి దైవాన్ని విశ్వసించడానికి ఏ తార్కాణాలైతే మనిషికి అవసరమో అవి అనుక్షణం అతని ముందున్నాయి. అయి నప్పటికి మనిషి దేవుణ్ణి ఆయన అద్భుతాల ను విశ్వసించకపోతే అది అతని దోషంగానీ విశ్వ వ్యవస్థది కాదు. కాబట్టి నేడు మనిషి ఎదుర్కొంటున్న అనేకానేక సవాళ్ళకు, సమస్యలకు ఏకైక పరిష్కారం మనిషి బేషర తుగా తన్ను తాను ఆ సర్వేశ్వరుని సమ ర్పించుకోవడమే. అలా సమర్పించుకుంటే ఏమిట లాభం? అంటారా!

నిజదైవమైన అల్లాహ్‌ సకల విజ్ఞానానికి, సమస్త వివేచనలకు, యుక్తులకు మూల నిధి. అందుచేత అల్లాహ్‌ాను పొందిన మనిషి చైతన్య వంతుడవుతాడు. అల్లాహ్‌ా యావత్తు భూమ్యాకాశాలకు కాంతి. కనుక మనిషి అల్లాహ్‌ాను పొందితే అతని వ్యక్తిత్వం అంతా దివ్యకాంతితో ప్రకాశించ సాగుతుంది. అల్లాహ్‌ా సకల శక్తులకు మూల సరోవరం. కాబట్టి దైవాన్ని పొందిన మనిషి ఎంతో శక్తి శాలిగా రూపొందుతాడు. ఏ వరదా అతన్ని ముంచజాలదు. ఏ పెను తుఫాను అతన్ని కూల్చివేయలేదు. సృష్టికి కర్త ఒక్కడే అని అతను నమ్ముతాడు గనక సృష్టిలో ప్రతి జీవిని దైవ కుటుంబంగా భావిస్తాడు. తద్వారా అతని విజ్ఞానం, ప్రతిభా పాటవాలను ధన విక్రయం కోసం కాకుండా జన శ్రేయం కోసం వినియోగిస్తాడు. లాభ నష్టాలు ఒక్క అల్లాహ్‌ా చేతిలో మాత్రమే ఉన్నాయని అతను తెలుసుకుంటాడు గనక, తన జయాపజయాలను సృష్టిలోని ఏ వస్తువుతోనూ ముడి పెట్టడు. దేనికి భయ పడడు, ఒక్క అల్లాహ్‌కు తప్ప.

Related Post