మేఘాలు తెల్లగా ఎందుకుంటాయి?

Originally posted 2013-04-22 16:21:17.

meghaalu
 ఆకాశం మేఘావతం అయినప్పుడు మీరు ఎప్పుడయినా చూశారా? నీలాకాశం తెల్లటి పాల నురుగు వంటి దుప్పటి కప్పుకున్న అనుభూతి కలు గుతుంది కదూ! ఈ మధురానుభూతితోపాటు ఒక అనుమానమూ కలు గుతూ ఉంటుంది. అసలు మేఘాలు తెల్లగా ఎందుకుంటాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే ముందు మేఘం అంటే ఏమిటో తెలుసుకుందాం.. వాతావరణంలో చుట్ట్టుప్రక్కల ఉన్న గుండ్రటి నీటి బిందువులన్నీ ఒక చోట కేంద్రీకృతమవడం లేదా ఒక చోటుకి చేరడాని మేఘం అని అంటారు.  పోతే,
 నీలాకాశంలో తెల్లగా కనబడే మేఘాలు – అవి ఉండే ఎత్తుని బట్టి, అవి సూర్య కాంతిని పరావర్తనం చెందించే విధానాన్ని బట్టి వాటి రంగు ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకి సిర్రస్‌ మేఘాలు సముద్ర మట్టానికి సుమారు 8కిమీ ఎత్తులో ఉంటాయి. అంత ఎత్తులో ఉండే మేఘాలు కేవలం నీటి ఆవిరి నుంచి తయారయిన మంచు స్ఫటికాలతోనే ఏర్పడి ఉంటాయి. ఈ మంచు స్ఫటికాలు సూర్య కాంతిని పరావర్తనం చెందించడం వల్ల ఆ ఎత్తు లో ఉన్న మేఘాలు ప్రకాశవంతమయిన తెలుపు రంగులో కనిపిస్తాయి. మరో విధంగా చెప్పాలంటే,
 మేఘంలో ఉండే నీటి బిందువులు ఒకే పరిణామంలో ఉండవు. వివిధ పరిణామాల్లో ఉంటాయి. అలాగే వేరువేరు కాంతి తరంగ దైర్ఘ్యాలను గ్రహించిన ఈ నీటి బిందువులు వివిధ రంగులు కలిగి ఉంటాయి. ఈ నీటి బిందువులన్నీ  విడివిడగా ఉన్నప్పుడు వెరువేరు రంగులను వెదజల్లుతాయి. కాని ఎప్పుడయితే నీటి బిందువులన్నీ ఒకచోట కేంద్రీకృతం అవుతాయో అప్పుడు అవి ఒకే ఒక్క రంగును అది కూడా తెలుపు రంగును మాత్రమే వెదజల్లుతాయి. అందుకే మేఘాలు తెల్లగా ఉంటాయి.అయితే అన్నీ మేఘాలు తెల్లగా కన్పించకపోవచ్చు. తుఫాను మేఘాలు అత్యంత దట్టంగా ఉండే మేఘాలు. ఇవి సూర్య కాంతిని పైవైపుకి పరావర్తనం చెందిస్తాయి. అవి క్రింది నుంచి చూసినప్పుడు ముదురు రంగులో కనిపిస్తాయి. అదే మనం వాటిని మేఘాల పైనుంచి చూడగలిగితే మాత్రం అవి తెలుపు రంగు లోనే దర్శనమిస్తాయి. మనకు దట్టంగా, ముదురు రంగులో కనిపించే మేఘా లలో కొన్ని సూర్య కాంతిని ఎక్కువ భాగం శోషించుకోవడం వల్ల అలా కనిపిస్తాయి.
కృత్రిమ మేఘాల ద్వారా నిజంగా వర్షం కురుస్తుందా?
 కృత్రిమ మేఘాల ద్వారా ఎప్పుడోకప్పుడు మానవుడు ఓ స్థాయి వర్షం కురిపించడంలో కృతాకృతుడయ్యాడన్న మాట నిజమే కావచ్చు. కానీ, ప్రకృతి పై అతని ఈ ప్రయోగాలు దైవ చిత్తమయితే తప్ప సత్ఫలితాలను ఇస్తాయని చెప్పలేము. కారణం-అతని చేపట్టే ప్రయోగాలు అత్యధిక శాతం ఫలించక పోవడమే. కృత్రిమ మేఘాలను సృష్టించి ఓ మోస్తరు వర్షం కురిపించేందుకు సీడింగ్‌ ఏజెంట్స్‌ వంటి కొన్ని రకాల మూల పదార్థాలను మేఘాలలోకి ప్రవేశ పెడతారు. ఇందుకుగాను ఎయిర్‌ క్రాఫ్ట్‌లను ఉపయోగిస్తారు. అసలు ఈ సీడింగ్‌ ఏజెంట్‌ అంటే ఏమిటి?
 పొడి మంచు లేదా సిల్వర్‌ ఆయోడైడ్‌ స్ఫటికాలు వంటి వాటిని సీడింగ్‌ ఏజెంట్స్‌గా ఉపయోగిస్తారు. ఈ సీడింగ్‌ ఏజెంట్స్‌ను ఎయిర్‌క్రాఫ్ట్‌ల ద్వారా మేఘాలలోకి ప్రవేశ పెడతారు. మేఘాలలోని నీటి ఆవిరి ఈ స్ఫటికాల మీద సంకోచిస్తుంది. దీని వలన నీటి బిందువులు అతి ఎక్కువ మొత్తంలో ఏర్పడ తాయి. మేఘాలలో ఉన్న నీటి బిందువులు ఒకదానిని మరొకటి తాకి, ఒక దానిలో ఒకటి విలీనమై లేదా ఈ విధంగా ఒకదానిని ఒకటి తాకిన నీటి బిందువులు ఏకమై బరువు పెరుగుతాయి. ఆ నీరు వాన రూపంలో కురు స్తుంది. ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. మేఘాలలో ఏర్పడిన బరువైన నీటి బిందువులు పరిణామం విస్తరించేందుకుగాను ఆ మేఘాలు పెద్దవై వాన కురిసే అవకాశం ఉంది. ఏది ఏమయినా మనిషి ప్రయత్నం, ప్రయోగం ప్రతి సారీ సఫలం అవుతుందని మాత్రం గ్యారంటీ లేదు.
 ఇదే విషయాన్ని అల్లాహ్‌ా సృష్టి శ్రేష్టుడయిన మానవుణ్ణి ఉద్దేశించి అడుగు తున్నాడు: ”పోనీ, మీరు త్రాగే మంచి నీరు గురించి ఎప్పుడయినా ఆలోచిం చారా? దానిని మేఘాల నుండి మీరు కురిపిస్తున్నారా? లేక దాన్ని కురి పించేది మేమా? మేము గనక తలచుకుంటే దానిని చేదు నీరుగా మార్చేయ గలం. వాస్తవం ఇదయినప్పుడు మీరు కృతజ్ఞులుగా ఎందుకు మసలుకోరు.”

(అల్‌ వాఖిఆ: 68-70)
 ”అల్లాహ్‌ాయే గాలులను పంపిస్తున్నాడు. తరువాత అవి మేఘాలను లేపు తాయి. మరి ఆ మేఘాలను మేము ఒక మృత ప్రదేశం (భూమి) వైపునకు తీసుకుపోతాము. తద్వారా ఆ భూమిని-మృతి చెందిన మీదట – బ్రతికిస్తున్నాము. (మనిషి మరణించాక) మళ్ళీ తిరిగి లేపటం అనేది (కూడా) ఇలాగే జరుగుతుంది”. (అల్‌ ఫాతిర్: 9)

 

Related Post