మేలిమి భూషణం సిగ్గు

అంతిమ దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ''ప్రతి మతానికి ఒక అశేష గుణం ఉంటుంది. ఇస్లాం మేలిమి గుణం లజ్జ''. (ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌)

అంతిమ దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”ప్రతి మతానికి ఒక అశేష గుణం ఉంటుంది. ఇస్లాం మేలిమి గుణం లజ్జ”. (ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌)

మానవ జీవితంలో సిగ్గు బిడియాలు ప్రకృతి సిద్ధమయినవి. ఈ మేలిమి గుణం మనిషిని అసంఖ్యాకమయిన చెడులకు దూరంగా ఉంచుతుంది. అసభ్యత, అశ్లీలతల నుండి కాపాడుతుంది. అందుకే సిగ్గు, బిడియాలు మనిషి అమూల్య భూషణాలు అన్నారు పెద్దలు.
అంతిమ దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”ప్రతి మతానికి ఒక అశేష గుణం ఉంటుంది. ఇస్లాం మేలిమి గుణం లజ్జ”. (ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌)

సిగ్గు లేక లజ్జ అన్నది చాలా విస్తృత భావం గలది. దీన్ని అల్లామా ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర) పది రకాలుగా వర్గీకరించారు. వాటిలో కొన్ని.

1) అపరాధ బావంతో కలిగే సిగ్గు: అల్లాహ్‌ తనకు ప్రసాదిమచిన అనుగ్రహాలను, చేసిన మేళ్ళను మనిషి గమనిస్తాడు. ఆయనకు కృతజతలు చెల్లించుకొవడంలో తన వల్ల జరిగి జాప్యం, నిర్లక్యం, అశ్రద్ధ అతనికి గుర్తుకొస్తుంది. అప్పుడు అతనిలో చోటు చేసుకునే అల్లాహ్‌ా పట్ల కృతజతా భావం, మరియు తన నిర్వాకం పట్ల అపరాధ భావానికి మధ్యస్థ స్థితినే సిగ్గంటారు. హజ్రత్‌ ఆదమ్‌ (అ) వారి వల్ల ఓ పొరపాటు దొర్లింది….అప్పుడు అల్లాహ్‌ – ఆదమ్‌ (అ)! నువ్వు నా నుమడి పారిపోతున్నావా? అని అడిగాడు. దానికాయన ‘లేదు, నా ప్రభూ! కానీ నీ ముమదర రావడానికి సిగ్గు పడుతున్నాను’ అని సవినయంగా విన్నవించుకున్నారు. (మదారిజుస్సాలికీన్‌)

2) హక్కు పూర్తిగా నెరవేర్చలేక పోయామన్న భావనతో కలిగే సిగ్గు: రేపు ప్రళయ దినాన అల్లాహ్‌ దాసులు – ”ఓ అళ్లాహ్‌ నీవు మహోన్న తుడివి. నిన్ను ఆరాధించాల్సిన విధంగా ఆరాధించ లేదు’ అని విన్న వించుకుంటారు.

3) జ్ఞా నంతో కూడిన సిగ్గు: మనిషి, అల్లాహ్‌ శక్తిసామర్థ్యాల గురించి, గుణవిశేషాల గురించి ఎంత ఎక్కువగా తెలిసి ఉంటాడో అంతే ఎక్కువగా ఆయన పట్ల సిగ్గు కలిగి ఉంటాడు. ఓ సారి దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీరు అల్లాహ్‌ పట్ల ఎలా సిగ్గు కలిగి ఉండాలో అలా సిగ్గు కలిగి మసలుకోండి’ అన్నారు. అది విన్న సహచరులు – ‘అల్‌హమ్దు లిల్లాహ్‌ా మేము అల్లాహ్‌ా యెడల సిగ్గు కలిగే వ్యవరిస్తాము’ అన్నారు. అలా కాదు, అల్లాహ్‌ యెడల సిగ్గు కలిగి ఉండటం అంటే, మీ తలను (మేధను), దాంతో ముడిపడి ఉన్న వాటన్నింటిని(చెవులు, నోరు, కళ్ళు) చెడు నుండి కాపాడుకోవాలి. కడుపు దానితో ముడిపడి ఉన్న వాటన్నింటని (మర్మాంగం, కాళ్ళు, కడుపు) అధర్మ విషయాల నుండి కాపాడుకోవాలి”. (తిర్మిజీ)

4) మృదువు వైఖరి వల్ల కలిగే సిగ్గు: మహా ప్రవక్త (స) వారు వలీమా విందు ఉచ్చారు. విందుకొచ్చిన కొందరు భోజనాల తర్వాత కూడా అక్కడే చాలా సేపు వరకూ కూర్చుండిపోయారు. అయితే బిడయం వల్ల ప్రవక్త (స) ఇటు అటూ తిరుగు తున్నారు కానీ వారికి ఏమీ అనకలేక పొతున్నారు. అప్పుడు అల్లాహ్‌ విందుకొచ్చిన వారిని మందలిస్తూ -మీకు విందు ఇవ్వబడితే విందారగీమచిన తర్వాత అక్కడే కూర్చుని ఉమడిపోకండి. మీ ఈ చర్య వల్ల ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి ఇబ్బమది పడతాడు’ అనే వచనాలు అవతరింపజేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి మేలిమి భూషణం, మేలిమి భాషణం సిగ్గు.

‘అల్‌ హయా మినల్‌ ఈమాన్‌. వల్‌ ఈమాను ఫిల్‌ జన్నతి’ – సిగ్గు విశ్వాసపు అంతర్భాగం . విశ్వాసం మనిషిని స్వర్గానికి గొనిపోతుంది. నిర్లజ్జత చెడులకు కారకం. మరి చెడులేమో మనిషిని (నట్టేటా ముంచి) నరక కూపంలో నెట్టేస్తాయి”. (ముస్నిద్‌ అహ్మద్‌, తిర్మిజీ)
మరో సందర్భంలో ఆయన ఇలా అన్నారు: లజ్జ మరియు విశ్వాసం అవిభాజ్యాలు. వాటిలో ఏ ఒక్కటి వైదొలిగినా రెండవది దానంతట అదే తొలిగి పోతుంది. ఈ నేపథ్యంలో ప్రవక్త (స) వారు చెప్పిన మాట ఏమిటంటే, మనిషి సిగ్గుమాలిన పనికి, అశ్లీల చేష్టకు, వ్యభిచారానికి పాల్పడేటప్పుడు విశ్వాసం అతన్నుండి వైదొలుగుతుంది, అతను విశ్వాసిగా ఉండడు’ అని.

మనిషి ఓ ఇంటి పెద్దకు, ఓ ఊరి పెద్దకు, ఓ జాతి పెద్దకు ఎంతగానయితే సిగ్గు పడతాడో దానికన్నా ఎక్కువగా తను అల్లాహ్‌కు సిగ్గు పడాలి. చీకటి బాగా దట్టమయ్యిందన్న తలంపు కొందరిని చెడు తలుపులు తెరిచేలా ప్రేరేపిస్తే, ఎవడూ గమనీమచడం లేదు అన్న ధీమా మరికోమదరిని పాప కార్యానికి పురిగొల్పుతుంది. నైతిక విలువల వలువలు వలిచేయాలని, కుటుంబ మర్యాదను మట్టిలో కలిపేయాలని, ఆధ్యాత్మిక ఆంకలి అతిక్రమించాలని, బరువు బాధ్యతలను మరచి బరితెగించి కోరికల మజాలు జుర్రుకోవాలని ఉసిగొల్పుతుంది. ఆ బలహీన కణంలో – ‘కామా తురాణాం నభయం నలజ్జ’ వంటి స్థితికి లొనవుతాడు మనిషి. ఆ సమయంలో మనిషి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరు చూసినా, చూడకపోయినా, పట్ట పగలయినా, చిమ్మ చీకటయినా అల్లాహ్‌ా మాత్రం చూస్తున్నాడు అని గ్రహించాలి. అధికారి గమనిస్తు న్నాడనో, కఫీల్‌ చూస్తున్నాడనో కాదు, అల్లాహ్‌ చూస్తున్నాడన్న బావన మనలో ఉండాలి, మదిలో నిండాలి. అమ్మానాన్నలకు దూరంగా, ఆలుబిడ్డలకు దూరంగా నివసిస్తున్న మనలోనీ చాలా మంది అక్ర సంబఖధాల కోసం అర్రులు చాచుతున్నాడు. మనం నీతికి నీళ్లు వదలి నీచంగా బ్రతుకుతూ మనవారు మాత్రం నికార్సయిన వారుగా ఉండాలనుకోవడానికి మించిన ఆత్మ వంచన, మూర్ఖత్వం మరొకటి లేదు.
‘సిగ్గు మొత్తం మేలుతో కూడినదే’ అన్నారు ప్రవక్త (స). ‘సిగ్గు స్త్రీ ఆభరణం’ అన్న మాట ఎంత వాస్తవమో సిగ్గు ప్రతి ఒక్కరి అమూల్య భూషణం అన్న మాట కూడా అంతే నిజం. ప్రవక్త ముహమ్మద్‌ (స) ‘పరదాలో ఉండే కన్యకన్నా ఎక్కువ సిగ్గు కలవారు’. అలాగే అల్లాహ్‌ాకు గల పేర్లలో హయ్యివున్‌ – సిగ్గరి అన్నది కూడా ఒకటి. కాబట్టి అందరూ ముఖ్యంగా స్త్రీలు మరింత సిగ్గు కలిగి వ్యవహరించాలి. విచ్చలవిడితనానికి, నగ్న, అర్థ నగ్న, ముప్పాతిక నగ్న దుస్తులు ధరించడానికి దూరంగా ఉండాలి. అంతిమంగా అల్లాహ్‌ా మాటతో నా మటను పూర్తి చేెస్తున్నాను. ”నిశ్చయంగా అల్లాహ్‌, దాసుడు చేతు లెత్తి మొరపెట్టుకుంటే అతన్ని ఖాలీ చేతులతో పంపడానికి సిగ్గు పడతాడు”. కాబట్టి ఏది సిగ్గుతో కూడిన విషయమో, ఏది సుగ్గుమాలిన విషయమో మన అంతరాత్మే మనకు చెబుతుంది. ప్రవక్త (స) ఓ పని చేస్తు నీకు మనస్సంతృప్తి కలిగితే అది మంచి, ఒక పని చేస్తూ నీలో శంక కలిగిథే, రపజల ఎక్కడ చూస్తారేమో అన్న భయం కలిగితే అది చెడు అని తెలుసుకో! కాబట్టి ఈ రోజు మనం సిగ్గు కలిగి జీవిస్తే రేపు ప్రళయ దినాన అల్లాహ్‌ ముందర సిగ్గుతో తల దించుకోవాల్సి దుర్గతి తప్పుతుంది. అల్లాహ్‌ మనందరికి మేలిమి భూషణమయి సగ్గును ప్రసాదించాలని, చెడు కార్యాలన్నింటికి దూరంగా మసలుకునేలా దీవించాలని కోరుతూ…

Related Post