మిస్వాక్‌ మేలు

మిస్వాక్‌ పళ్లను శుభ్రం చేసే మంచి ప్రక్రియ. ఇలా చేయకపోతే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. పళ్లు గారపట్టి రంగు మారాతాయి. దీని ప్రభావం జీర్ణ వ్యవస్థపై పడి, వివిధ రకాల నొప్పులు, త్రేన్పులు, రోగా లకు దారి తీస్తుంది. ఒకసారి ప్రవక్త (స) వారిని కలవడానికి కొందరు ముస్లింలు వచ్చారు. వారి దంతాలు పాచి పట్టడం వల్ల మలినంగా ఉన్నాయి. అది గమనించిన ప్రవక్త (స) ''మీ పల్లు అలా పచ్చగా అగు పడుతున్నాయేం? మిస్వాక్‌ చేస్తూ ఉండండి''. అని హితువు పలికారు. (ముస్నద్‌ అహ్మాద్‌)

మిస్వాక్‌ పళ్లను శుభ్రం చేసే మంచి ప్రక్రియ. ఇలా చేయకపోతే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. పళ్లు గారపట్టి రంగు మారాతాయి. దీని ప్రభావం జీర్ణ వ్యవస్థపై పడి, వివిధ రకాల నొప్పులు, త్రేన్పులు, రోగా లకు దారి తీస్తుంది. ఒకసారి ప్రవక్త (స) వారిని కలవడానికి కొందరు ముస్లింలు వచ్చారు. వారి దంతాలు పాచి పట్టడం వల్ల మలినంగా ఉన్నాయి. అది గమనించిన ప్రవక్త (స) ”మీ పల్లు అలా పచ్చగా అగు పడుతున్నాయేం? మిస్వాక్‌ చేస్తూ ఉండండి”. అని హితువు పలికారు. (ముస్నద్‌ అహ్మాద్‌)

సంపూర్ణ ఆరోగ్యం మిస్వాక్‌: ‘మిస్వాక్‌, సివాక్‌’ అనగానే ప్రవక్త (స) వారి సంప్రదాయాల పట్ల ప్రేమ గల వారి ప్రాణం లేచి వస్తోంది. వారు ఉమ్రా-హజ్‌జలు నిర్వర్తించి తిరుగు ప్రయాణమయిన ప్రతి సారీ మక్కా మదీనాల బహుమానంగా జమ్‌జమ్‌ జలాన్ని, మిస్వాక్‌ను తప్పకుండా తీసుకు రావడం మనం గమనిస్తాము. చెట్టు వేరుగా మనకు అన్ని చోట్ల లభించే పల్లుతోము పుల్ల మిస్వాక్‌. మిస్వాక్‌ చేయ డం వల్ల ఇతరత్రా పేస్టుల వల్ల కలిగే సైడ్‌ ఎపేక్ట్‌ ఉండవు. మిస్వాక్‌ చేయడం వల్ల దంత ఆరోగ్యమే కాక జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది. ఈ కారణంగానే ”ఎక్కువగా మిస్వాక్‌ చేస్తుండడని నేను మీకు తాకీదు చేస్తున్నాను”. అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)

మిస్వాక్‌ పళ్లను శుభ్రం చేసే మంచి ప్రక్రియ. ఇలా చేయకపోతే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. పళ్లు గారపట్టి రంగు మారాతాయి. దీని ప్రభావం జీర్ణ వ్యవస్థపై పడి, వివిధ రకాల నొప్పులు, త్రేన్పులు, రోగా లకు దారి తీస్తుంది. ఒకసారి ప్రవక్త (స) వారిని కలవడానికి కొందరు ముస్లింలు వచ్చారు. వారి దంతాలు పాచి పట్టడం వల్ల మలినంగా ఉన్నాయి. అది గమనించిన ప్రవక్త (స) ”మీ పల్లు అలా పచ్చగా అగు పడుతున్నాయేం? మిస్వాక్‌ చేస్తూ ఉండండి”. అని హితువు పలికారు. (ముస్నద్‌ అహ్మాద్‌)

దైవప్రసన్నతా సాధనం మిస్వాక్‌: మిస్వాక్‌ చేయడం అనేది ఓ సాధారణ చర్య కాదు. అదోక ఆరాధన. అది మనిషి భౌతిక అవస రాన్ని తీర్చడంతోపాటు దైవప్రసన్నతను కూడా సంపాదించి పెడు తుంది. ప్రవక్త (స) వారి సంప్రదాయాలు ఎంత శుభవంతమయినవి! ఉన్నత ఆరోగ్యప్రదమయిన జీవనానికి సకల సౌకర్యాలు కల్పించడం తోపాటు వాటిని ఆచరించడం వల్ల భౌతిక లాభమే కాకా, ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా ప్రాప్తమవుతుంది. దైవప్రవక్త (స) ఇలా ఉపదేశిం చారు: ”మిస్వాక్‌ నోటిని శుభ్రపరుస్తుంది. కరుణామయుణ్ణి రాజీ పరుస్తుంది”. (నసాయీ)
ప్రవక్తల సంప్రదాయం మిస్వాక్‌: మూడు విషయాలు ప్రవక్తల సం ప్రదాయాల్లోనివి: 1) ఇఫ్తార్‌ చేయడం (ఉపవాసం విరమించడం)లో త్వరపడటం. 2) సహరీ చేయడంలో ఆలస్యం చేయడం. 3) మిస్వాక్‌ చేయడం.

హజ్రత్‌ ఆమిర్‌ బిన్‌ యాసిర్‌ (ర) గారి కథనం: ”నేను ప్రవక్త (స) వారిని ఉపవాస స్థితిలో మిస్వాక్‌ చేస్తూ ఎన్ని సార్లు చూశానంటే వాటి లెక్కను పొందు పర్చడం కష్టం”. (అబూ దావూద్‌)

హజ్రత్‌ షరీహ్‌ాబిన్‌ హానీ (ర) గారి కథనం – నేను విశ్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా (ర) గారిని అడిగాను – ‘దైవప్రవక్త (స) ఇంట్లో ప్రవే శించాక మొట్టమొదట ఏం చేసేవార?ని’. అందుకామె ”మిస్వాక్‌ చేసేవార”ని బదులిచ్చారు. (రియాజుస్లాలిహీన్‌)
హజ్రత్‌ హుజైఫా (ర) గారి కథనం – ”ప్రవక్త (స) నిద్ర నుండి మేల్కోగానే మొదట మిస్వాక్‌ చేసేవారు”. (బుఖారీ, ముస్లిం)
హజ్రత్‌ ఆయిషా (రఈఅ) గారి కథనం -”మేము దైవప్రవక్త (స) వారి కోసం మిస్వాక్‌ను, వుజూ నీటిని సిద్ధంగా ఉంచేవారము. రాత్రి వేళ ఆయనకు మెలకువ రాగానే మొట్టమొదట మిస్వాక్‌ చేసేవారు. తర్వాత వుజూ చేసి నమాజు చేసేవారు”. (ముస్లిం)

విధిగా ఖరారు చేయాలనుకున్న నియమం మిస్వాక్‌:

”హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం – దైవప్రవక్త మహితోక్తి: ”నా అనుచర సముదాయానికి మిస్వాక్‌ చేయడం కష్టంగా పరిణమి
స్తుందేమో అన్న సందేహం లేకుంటే నమాజ్‌ చేయడానికి వుజూతో పాటు మిస్వాక్‌ను కూడాతప్పనిసరిగా చేయాలని నేను ఆశించేవాణ్ణి”. (ముత్తఫఖున్‌ అలైహి)
చరమ ఘడియల్లో చివరి చర్య మిస్వాక్‌: దైవప్రవక్త (స) వారు చివరి శ్వాస వరకు ఎంతో ఇష్ట పడి మిస్వాక్‌ చేశారు. ఆయన చరమ ఘడియల్లో హజ్రత్‌ ఆయిషా (ర.అ) మిస్వాక్‌ను నమిలి ఇవ్వ గా మిస్వాక్‌ చేసి ‘నాకు ఆ మహా మిత్రుడే కావాలి’ అంటూ తది శ్వాస వీడారు ప్రవక్త (స).

దీన్ని బట్టి మిస్వాక్‌ చేయడం దైవప్రవక్త (స) వారికి ఎంత ఇష్టమో అర్థమవుతుంది. మరి ఆయన అనుచర సమాజంగా మనం చేస్తున్న దేమిటి? ఎప్పుడూ నోటిని శుభ్ర పరిచే, ప్రభువును ప్రసన్న పరిచే మిస్వాక్‌తో నానాల్సి నోరు, నిరతం నిప్పులు చెరిగే, దుర్వాసన దుర్గం ధాన్ని, కంపును వెదజల్లే, దైవ దూదతలను దగ్గరికి రాకుండా చేసే సిగరెట్‌తో నానడం దేన్ని చూచిస్తోంది? నిద్ర నుంచి మేల్కొంటే సిగరెట్‌, బోజనానంతరం సిగరెట్‌, నమాజుకు వెళ్లక ముందు సిగరెట్‌, ఇంట్లో ప్రవేశించడానికి ముందు సిగరెట్‌, పడక మీద పక్క వాల్చడానికి ముందు సిగరెట్‌. చివరి రమాజాను మాసంలో రోజంతా ధర్మసమ్మతమయిన ఆహార పానీయాలతోపాటు అన్ని విధాల హరామ్‌ అయిన సిగరెట్‌ నుండి దాదాపు 14 గంటలు దూరంగా ఉండే వ్యక్తి సయితం ఉపవాస విమరణ పూర్తవడమే ఆలస్యం దమ్ములాగడానికి పరుగెత్తడం దేన్ని సూచిస్తుంది? ఒక్క నిమిషం ఆలోచించండి! రమజాను వంటి కఠోర శిక్షణా కాలం తర్వాత సయితం మనం ఇటు వంటి వ్యసనాలను వదులుకోకపోతే ఇంకెప్పుడు మారతాం చెప్పండి! ఒక్క మాటలో చెప్పాలంటే మిస్వాక్‌ చేసే వారి భార్యలు, పిల్లలు అదృష్టం చేసుకున్న వారయితే, ధూమపాన ప్రియుల్ని చేసుకున్న స్త్రీలు, వారి పిల్లలు ఒక విధంగా దురదృష్టవంతులే. కాబట్టి మనం మన ప్రవక్త (స) వారి అడుగుజాడల్లో నడుచుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. తద్వారా అల్లాహ్‌ా ప్రసన్నతోపాటు కంటి చూపు మెరుగవు తుంది. మిస్వాక్‌ చేయకుండా చేసే నమాజుకన్నా మిస్వాక్‌ చేసి చదివే నమాజు మేలయినది అన్న ప్రవక్త (స) వారి ప్రవచనం ఈ సందర్భంగా గమనార్హం!

Related Post