నమ్మకాలు – నిజాలు

అదే విధంగా మన పంచేద్రియాల పరిధిలో వచ్చేది, మన జ్ఞానేద్రియాలకు అందినది మాత్రమే నిజం, తక్కినవన్నీ తృణీకరించదగినవనుకోవడం ఎంత మాత్రం వివేకం అన్పించుకోదు.

అదే విధంగా మన పంచేద్రియాల పరిధిలో వచ్చేది, మన జ్ఞానేద్రియాలకు అందినది మాత్రమే నిజం, తక్కినవన్నీ తృణీకరించదగినవనుకోవడం ఎంత మాత్రం వివేకం అన్పించుకోదు.

నమ్మకాలుగా ప్రచారం పొందినవన్నీ అబద్ధాలు కావు. అలా అని అన్ని నమ్మకాలు నిజమేననటమూ న్యాయం కాదు. నమ్మకమనేది విచిత్రమైనది. దేవుడున్నాడా? ఆత్మ ఉన్నదా? మరణానంతర జీవితం, స్వర్గ-నరకాలు నమ్మదగినవా? ఆత్మకు రూపం ఉందా? మృత్యువుకు అర్థమేమిటి? – ఇవి ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మానవుడు అనాదిగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అటో ఇటో తేల్చి చెప్పేవారు, ఎటూ తేల్చలేని వారు ఎప్పుడూ ఉంటూనే వస్తున్నారు. నాటికీ, నేటికీ ఇవి వివాదాస్పద విషయాలే! హేతువే సర్వస్వం అని నమ్మేవారు, తమకు ప్రాప్తమయి ఉన్న మేధకు తామే మత్తెక్కి, కళ్ళు పైకెక్కిన వీటిని తెలికగా కొట్టి పారేస్తారు. అలా వారు కొట్టిపారేయడానికి హేతువు (కారణం) లేకపోలేదు. చాలా మంది అబద్ధాలు చెప్పి, లేని గొప్పలను ఆపాదించుకుని మోసాలు చేశారు. ఇలాంటి మోసగాళ్ళ వలన ఇదంతా బూటకమే కావచ్చునన్న అభిప్రాయం చదువుకున్న వారిలో చాలా మందికే ఉంటుంది. అయితే ‘తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరమున్‌ పలుకగ రాదు’ అంటూ తెనాలి రామకృష్ణ ఒక అహంకారిని మందలించాడన్న మాట మరువకూడదు. కట్టు కథలు అనేెకం ప్రచారం కావడం వల్ల ఏది నిజమో, ఏది కాదో తెలుసుకోవడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడిందన్నది నిజమే కావచ్చు. తమకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో తమకు తెలిసిందే విజ్ఞానమని భ్రమించే వ్యక్తులుంటారు. ఎంత తెలిసినా, తమకు ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉందని, విజ్ఞానానికి అంచులు లేవని సవినయంగా అంగీకరించే పండితాగ్రేసరలూ ఉంటారు. ఏది ఏమైనా ఈ విచిత్ర ప్రపంచంలో మనిషికి తెలియని, అను భవంలో రాని విశేషాలు ఎన్నో ఉన్నాయన్నది నిర్వివాదాంశం. వాస్తవం (రియాలిటీ) కన్నా, దానిని గురించిన మన అవగాహన మనకు సులభంగా బుర్రకెక్కుతుంది. కనుక ఆ రెంటికి మధ్య ఉన్న తేడాను మరచిపోయి, మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు, ఊహలు, ఇవే వాస్తవాలు, నిజాలు అన్న గందరగోళంలో పడిపోతుంటాము.

గబ్బిళం రాత్రిలో చూస్తుంది. పగటి పూట దానికి కన్పించదు. అంత మాత్రాన పగలు కాంతిహీనమైనదనీ, రాత్రి కాంతివంతమైన దని చెప్పలేము కదా! గబ్బిళం చూపు బలహీనమైనది. అది బలమైన వెలుగును చూడలేదు. కనుక వెలుగు చీకటి కలిసున్నప్పుడు మాత్రమే అది కానగలుగుతుంది. అలాగే ఒక వస్తువు చాలా దగ్గరగా, తేజోవంతంగా చూసినప్పుడు కూడా ఆ వస్తువ వాస్తవికత ఏమిటో అర్థం కాకపోవచ్చు. అదే విధంగా మన పంచేెద్రియాల పరిధిలో వచ్చేది, మన జ్ఞానేద్రియాలకు అందినది మాత్రమే నిజం, తక్కినవన్నీ తృణీకరించదగినవనుకోవడం ఎంత మాత్రం వివేెకం అన్పించుకోదు. రూపం లేని దానిని తెలుసుకోవడానికి, అనుభవ మవడానికి రూపం అవసరమే. కానీ రూపమే సర్వం అనుకోవడం ఎంత వరకు సబబు? మార్గమే గమ్యమనుకోవడం ఎంత అవి వేకమో ఇది కూడా అంతే. నూనె జిడ్డు పోవడానికి పోసుకున్న కుంకుడు రసం (షాంపొ)ని అలానే ఉంచుకోలేము కదా! అలాగే మత మౌఢ్యం, మూఢ నమ్మకం అనే నూనె జిడ్డును కూడా వదిలించుకోవాలి. మనిషి అంటే ఏమిటి? అతడి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రి యాలే అన్నింటికీ ప్రమాణాలా? ఏ యుగంలోనయినా ఆ యుగపు ప్రధానమైన ఆలోచనా స్రవంతిని అధిగమించడం అన్నది మానసి కంగా చాలా కష్టసాధ్యమైన పని అన్న మాట నిజమే కావచ్చు. అయినా మన ప్రయత్నం మనం చేయాలి.

చివరి మాట – మన చేతిలో ఉన్న పనిముట్టు కేవలం సుత్తి మాత్రమే, అయితే మనకు ఎదురయ్యే ప్రతి వస్తువును మేకులాగానే చూస్తాము. సైన్సు లేదా హేతువు అనే సుత్తిని చేతపట్టుకుని కనపడ్డ ప్రతి దాని నెత్తిన మొత్తడం అన్నది నేటి ఫ్యాషన్‌. సైన్సుకి మతం అవసరం లేదు అంటారు కొందరు. మతానికి సైన్సు అవసరం లేదు అని అంటారు మరికొందరు. కాని మనిషికి సైన్సు, మతమూ రెండూ అవసరమే అన్నది విజ్ఞుల మాట.

మతం పేరిటి పెంచుకున్న మౌఢ్యం అనే జిడ్డును కడగటానికి, అంధ విశ్వాసాల ఊబిలో కూరుకుపోయిన జన వాసాలను నిజం వెలుగులో తిసుకురావడాని, హేతవు పేరిటి గంతలు కట్టుకున్న వారి గంతలు విప్పడానికి, సుత్తి, గరిటె, కుంచె, ఉలి, కమానులాంటి సాధనాలకు లొంగని సత్యాలూ ఉన్నాయని సవినయంగా మనవి చేయడానికి నెలవంక కృషి చేస్తోంది. నాన్సెన్స్‌! సెన్స్‌ లేకుండా మాట్లాడతారేమిటి? అనే వారిని వారి తర్కానికే అప్పగించి…కాంతి, శాంతి లోకంలోకి ప్రవేశిద్దాం! ఇక్కడ మీ గైడ్‌ పేరు ఖుర్‌ఆన్‌+ముహ్మద్‌ (స)= ఇస్లాం.

Related Post