ప్రేమికుల రోజు

ప్రేమికుల రోజు

వాలంటీన్ దినం గురించిన ఇస్లామీయ ధర్మాజ్ఞలు ఏమిటి?అల్హందులిల్లాహ్ – సకల ప్రశంసలు, కృతజ్ఞతలు అల్లాహ్కే చెందును.

మొట్టమొదటిది:వాలంటీన్ డే అనేది రోమన్ దేశం యొక్క అజ్ఞాన కాలపు పండుగలలోని ఒక పండుగ. అయితే రోమన్లు క్రైస్తవ మతం స్వీకరించిన తర్వాత కూడా దీనిని కొనసాగించినారు. 14, ఫిబ్రవరీ క్రీ.శ. 270వ సంవత్సరంలో మరణశిక్ష విధింపబడిన వాలంటీన్ అనే క్రైస్తవ సన్యాసితో ఈ పండుగకు సంబంధం ఉన్నది. అసభ్యకర, అశ్లీల, దుష్ట కార్యక్రమాలతో నిండి ఉన్న ఈ పండుగను అనేక మంది అవిశ్వాసులు నేటికీ దీనిని జరుపుకుంటున్నారు.

రెండవది:ముస్లింలకు అవిశ్వాసుల ఏ పండుగా జరుపుకోవటానికి అనుమతి లేదు. ఎందుకంటే పండుగలనేవి ప్రామాణిక గ్రంథాలపైనే ఆధారపడియున్న ఇస్లామీయ జీవన విధానం అంటే షరిఅహ్ పరిధిలోనికి వస్తాయి.

షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియహ్ ఇలా పలికినారు: పండుగలనేవి షరిఅహ్ లోని స్పష్టమైన భాగములు మరియు ఆరాధనలు. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ భావం యొక్క అనువాదం):“మీలోని ప్రతి ఒక్కరికీ, మేము చట్టాన్ని మరియు స్పష్టమైన జీవన విధానాన్ని శాసించినాము.”[అల్ మాయిదాహ్ 5:48]“ప్రతి సమాజానికి మేము మతపరమైన పండుగలను ఆదేశించినాము. దానిని వారు తప్పక పాటించవలెను.”[అల్ హజ్జ్ 22:67]

ఖిబ్లా (నమాజు చేసే దిశ), నమాజు, ఉపవాసం మొదలైనవి. వారు తమ పండుగలలో పాలుపంచుకోవటంలో మరియు వారు ఇతర అన్ని రకాల ఆరాధనలు ఆచరించటంలో ఎటువంటి తేడా లేదు. అటువంటి పండుగలలో చేరటం అంటే, అవిశ్వాసంలో చేరటమే. ఇంకా వాటి యొక్క కొన్ని చిన్న చిన్న విషయాలలో పాలు పంచుకోవటం అంటే, అవిశ్వాసపు కొన్ని విభాగాలలో పాలుపంచుకోవటం వంటిదే. నిశ్చయంగా, పండుగలనేవి వేర్వేరు ధర్మములలోని విభిన్నత్వాన్ని మరియు వాటి యొక్క విశిష్ఠతలను సూచించే అతి ముఖ్యమైన చిహ్నాలు. కాబట్టి, వాటిలో పాలుపంచుకోవటమంటే, అవిశ్వాసపు అత్యుత్తమ లక్షణాలలో మరియు వాటి ప్రధాన చిహ్నాలలో పాలుపంచుకోవటం లాంటిదే. ఆ పండుగలలో పాల్గొనటమనేది క్రమక్రమంగా అవిశ్వాసంలో చివరిమెట్టుకు చేర్చును.

కొద్దిగా పాలుపంచుకోవటమనేది కూడా అవిధేయతగా మరియు పాపకార్యంగా పరిగణింపబడును. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలలో ఇలా తెలుపబడినది: “ప్రజలందరికీ పండుగలున్నాయి మరియు ఇది మన పండుగ.” జినార్ (అహ్లు అద్దిమ్మా అనే ముస్లిమేతర ప్రజలు ధరించే ప్రత్యేకమైన దుస్తులు) దుస్తులు ధరించటం మరియు ఇతర పద్ధతుల కంటే నీచమైనది. ఎందుకంటే ఆ పద్ధతులు మానవుడు రూపొందించుకున్నవి మాత్రమే. అవి వారి ధర్మంలోని భాగములు కావు. ముస్లింలకు మరియు అవిశ్వాసులకు మధ్యనున్న తేడాను స్పష్టపరచటమే వాటి వెనుకనున్న ముఖ్యోద్దేశ్యం. ఇక అలాంటి పండుగలు మరియు వాటి ఆరాధనలకు సంబంధించి అసలు విషయం ఏమిటంటే, అవి వారి ధర్మంలోని శపించబడిన భాగాలు. అంతేకాక వాటిని అనుసరించేవారు కూడా శపించబడినారు. కాబట్టి అటువంటి వాటిలో పాలుపంచుకోవటమంటే అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠిన శిక్షకు గురయ్యే మార్గంలో పయనించటమే. Iqtida’ al-Siraat al-Mustaqeem (1/207).

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా ఉపదేశించియున్నారు: వారి పండుగలలోని ప్రత్యేక పద్ధతులు ఏవైనా ఉంటే అటువంటి వాటిని అనుసరించే అనుమతి ముస్లింలకు లేదు. అవి ఆహారం, దుస్తులు, స్నానాచారాలు, అగ్ని వెలిగించటం, ఏదైనా అలవాటు నుండి ఆగిపోవటం, ఆరాధనలు చేయటం, మొదలైన వేరే ఇతర పద్ధతులు. విందుభోజనాలు ఏర్పాటు చేయటం, బహమతులు ఇవ్వటం, ఆ పండుగలలో వారికి అవసరమయ్యే వాటిని అమ్మటం, పిల్లలను మరియు ఇతరులను వారి పండుగలలోని భాగమైన ఆటపాటలలో పాల్గొనటానికి అనుమతించటం లేదా వారి ప్రత్యేక దుస్తులు ధరించటం మొదలైన వాటికి అనుమతి లేదు.

ఇక చివరగా: ముస్లింలు వారి పండుగ సమయాలలో వారు చేసే ఏ ఆరాధలూ ఆచరించకూడదు; కాని ఆ దినం ముస్లిం ల దృష్టిలో వేరే ఇతర దినాల మాదిరిగానే ఉండవలెను. వారిని అనుకరించే ఏ పనినీ ముస్లింలు ప్రత్యేకంగా చేయకూడదు. Majmoo al-Fataawa (25/329).

అల్ హాఫిల్ అల్ దహాబీ రహిమహుల్లా ఇలా తెలిపినారు: క్రైస్తవులకు పండుగలు ఉన్నాయి మరియు యూదులకు పండులు ఉన్నాయి. అవి కేవలం వారి కోసమే. కాబట్టి ఏ ముస్లిమూ ఎలాగైతే వారి ధర్మంలో లేదా వారి ఆరాధనలలో పాలుపంచుకోరో, ఆ విధంగానే వారి పండుగలలో కూడా పాలుపంచుకోకూడదు. Tashabbuh al-Khasees bi Ahl al-Khamees, published in Majallat al-Hikmah (4/193)

ఆయెషా రదియల్లాహు అన్హా సహీబుఖారీ మరియు సహీ ముస్లిం గ్రంథాలలో ఉల్లేఖించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాన్ని షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియాహ్ ఇలా ఉల్లేఖించినారు: ఆనాడు బుఆథ్ దినం రోజున అన్సారులకు జరిగిన సంఘటన గురించి ఇద్దరు యువతులు నా దగ్గర పాడుతుండగా, అబూ బకర్ లోపలికి వచ్చి, ఇలా పలికారు: “అల్లాహ్ యొక్క ప్రవక్త ఇంటిలో షైతాను యొక్క సంగీతవాద్యాలా?!”ఆవిడ ఇలా తెలిపారు: వారి పాటలు పాడే వృత్తికి చెందిన వారు కాదు (గాయకులు కాదు) మరియు ఆ రోజు ఒక పండుగ రోజు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఓ అబూ బకర్, ప్రతి వారికి ఒక పండుగ రోజు ఉన్నది మరియు ఇది మన పండుగ రోజు.”

అబూ దావూద్ హదీథ్ గ్రంథంలో అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ ఇలా ఉన్నది: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వలస వచ్చినప్పుడు, మదీనా వాసులు రెండు దినాలు ఆటపాటలలో గడిపే వారు. అది చూసి, ఆయన వారినిలా ప్రశ్నించినారు: “ఈ రెండు దినాలు ఏమిటి?” వారిలా బదులు పలికినారు: “అజ్ఞాన కాలంలో మేము ఈ రెండు దినాలు ఆటపాటలలో గడిపేవారము.” అది విని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు “వాటికి బదులుగా అల్లాహ్ మీకు వాటి కంటే ఉత్తమమైన రెడు దినాలను ప్రసాదించెను: అల్ అధా దినం (బక్రీద్ పండుగ) మరియు అల్ ఫిత్ర్ దినం (రమదాన్ పండుగ దినం)” సహీహ్ అబూ దావూద్ గ్రంథంలో ఈ హదీథ్ ను ప్రామాణికమైనదిగా అల్ బానీ వర్గీకరించినారు.

పండుగనేవి వేర్వేరు ధర్మాల విభిన్నత్వాన్ని సూచించే ప్రత్యేక సందర్భాలని దీని ద్వారా తెలుస్తున్నది. బహుదైవారాధకుల (ముష్రికుల) మరియు అజ్ఞానుల పండుగలు జరుపు కోవటానికి ఇస్లామీయ ధర్మం మనకు అనుమతివ్వలేదు. అలాగే ఈ వాలెంటీన్ దినాన్ని జరుపుకోవటం కూడా ఇస్లామీయ ధర్మంలో నిషేధింపబడినదని మన పండితులు ఫత్వా జారీచేసి యున్నారు.

1 – ఒక సోదరుడు షేఖ్ ఇబ్నె తైమియాహ్ ను ఒకసారి ఇలా ప్రశ్నించినారు:

నేటి కాలంలో వాలెంటీన్ దినం జరుపు కోవటమనేది ఎక్కువగా వ్యాపించినది, ముఖ్యంగా మహిళా విద్యార్థులలో. ఇది క్రైస్తవ పండుగ. ప్రజలు ఈ దినమున తమ బూట్లు, చెప్పులతో సహా పూర్తిగా ఎరుపు రంగు దుస్తులు ధరించి, ఎరుపు రంగు పూలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. మీరు ఈ పండుగ గురించిన ఇస్లామీయ ధర్మాదేశాలను వివరించగలరు. అటువంటి పండుగల గురించి మీరు ముస్లిలకు ఏమని సలహా ఇస్తారు? అల్లాహ్ మిమ్మల్ని దీవించుగాక మరియు రక్షించుగాక.

జవాబుగా ఆయన ఇలా పలికినారు:అనేక కారణాల వలన వాలెంటీన్ దినం జరుపుకోవటమనేది అనుమతింపబడలేదు.

1- ఎటువంటి ఆధారాలు లేని ఒక నూతన కల్పిత ఆచరణ ఇది. దీనికి ఇస్లాంలో స్థానం లేదు.

2- ఇది పరిధులు దాటే వ్యామోహాన్ని, ఆకర్షణలను పుట్టిస్తుంది.

3- సహాబా రదియల్లాహు అన్హుమ్ ల ఉత్తమ జీవన విధానానికి భిన్నంగా ఇది మనస్సులను మూర్ఖపు, అవివేకపు విషయాలలో లీనమవటం వైపునకు పిలుస్తుంది.

ఆ రోజున ఆ పండుగ కోసం ప్రత్యేకించబడిన ఏ పనులూ చేయటానికి అనుమతి లేదు. అవి ఆహారపానీయాలకు సంబంధించినవైనా, దుస్తులకు సంబంధించినవైనా, బహుమతులు, కానుకలు ఇచ్చిపుచ్చుకోవటం మొదలైనవి అయినా సరే.

ముస్లింలు తమ ధర్మం పై గౌరవాభిమానాలు కలిగి ఉండవలెను. ప్రతి టామ్, డిక్, హారీల నిరాధార చేష్టలను అనుసరించే బలహీనమైన ప్రవర్తన కలిగి ఉండకూడదు.

 

 

Related Post