మానవ జాతికి మేలి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ)

మానవ జాతికి మేలి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ)

యువకులైన ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) గారి మిథ్యా దైవాలపై తిరుగుబాటును ఆయన జాతి ప్రజలు పరస్పరం చర్చించుకోవడం గురించి ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది: ”ఒక యువకుడు వాటి (విగ్రహాల) బలహీనతను ఎండ గడుతూ ఉండటం మేము విన్నాము. అతను ఇబ్రాహీమ్‌గా పిలువబడుతున్నాడు” అని కొందరు చెప్పారు; (అంబియా: 60)
పూర్వం దిఖియానోస్‌ అనే ఒక రాజు ఉండేవాడు. అతడు బహుదైవారాధన వైపు నకు, జాతరల వైపునకు ప్రజల్ని పురిగొల్పే వాడు. అయితే అదే రాజ్యంలో నివసించే సంపన్న వర్గాలకి చెందిన యువకులు కొందరు సత్యాన్వేషణ జరిపి సృష్టికికర్త ఒక్కడేనన్న విషయాన్ని గ్రహించారు. దాన్నే అమలు పర్చారు. చివరికి అప్పటి రాజు పిలిచి అడిగినా ధైర్యంగా సత్యాన్ని నిర్దిష్టంగా వెల్లడించారు. వీరి గురించి అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌ లో ప్రస్తావిస్తూ ఇలా అన్నాడు: ”తమ ప్రభువును విశ్వసించిన కొంత మంది యువ కులు వారు. మేము వారి సన్మార్గంలో వృద్ధి నొసగాము”. (అల్‌ కహఫ్: 13)

మానవ జాతికి మేలి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ)
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు. దేవుని కృపాకటాక్షాలతోపాటు ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నట్టు – దాన్ని మనిషి అన్వేషించి, శోధించి సాధించుకోవాలి. అధిక శాతం మంది ప్రవక్తలు అవిశ్వాసుల ఇంట, బహుదైవారాధనా సమాజంలోనే జన్మించారు. అలా జన్మించిన వారిలో ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) ఒకరు. ఆయన తత్వం వేరు. ప్రతి విషయాన్ని నిశిత దృష్టితో తరచి చూడటం ఆయనకు అలవాటు. మనిషి స్వహస్తాలతో చేసిన ప్రతిమల ముందు వంగటం, సూర్య చంద్ర నక్షత్రాల ముందు మోకరిల్లడం, అల్పాతిఅల్ప ప్రాణులకి అలౌకికానందంతో హారతులు పట్టడం, భక్తీ పారవశ్యాలతో చేతులు జోడించి నిలబడటం ఆయనకు మింగుడు పడలేదు.

కర్రి మబ్బుల కరాళ నృత్యానికి విసుగు చెందిన మానవాళికి ఆయనో ఉదయ కిరణం. అసత్య అంధకారాలను రూపు మాపి వెలుగుల్ని నింపిన ధర్మతేజం ఆయన. మార్గభ్రష్టత్వంలో మ్రగ్గే మానవ హృదయా లను ప్రక్షాళనం గావించి, రుజుమార్గం ఇదని తెలియజేసిన ఆశాజ్యోతి ఆయన. చైతన్యాన్ని జలింపజేసే సత్తువ, మనస్సులను కదిలించే ప్రేరణ, హృదయాల్ని ఏలే శక్తి ఒక్క త్యాగానకి మాత్రమే ఉందనడానికి ఆయన నడక, నడవడిక ప్రబల తార్కాణం. యుగయుగాలుగా నిద్రా ణంలో ఉన్న ప్రజల్లోని ప్రతిభాపాటవాలను చైతన్యపరచి సత్య మార్గం లో నడిపించిన అపురూప రథసారధులందరికీ మూల పురుషుడు ఆయన. తన అస్తిత్వం రీత్యా ఆయన ఒక మనిషి మాత్రమే. కాని తన అసాధారణ త్యాగాల దృష్ట్యా, ఘనకార్యాల రీత్యా ఆయన ఒక సమా జం. ఓ గొప్ప అకాడమి! ఈ కారణంగానే ప్రవక్తల పితామహినిగా నేటికీ అటు యూదక్రైస్తవులు, ఇటు ముస్లిం సముదాయం హృదయాల లో సమానంగా చిరస్మరణీయులయ్యారు. ఈ ఘనతావిశిష్ఠతల మూలంగానే అల్లాహ్‌ా ఇలా సెల విచ్చాడు:
”ఇది ఇబ్రాహీం (అ) జీవన ధర్మం. శుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రా హీమ్‌ పాటించిన జీవన సరళి పట్ల వైముఖ్యం చూపగలడు. మేము అతన్ని ప్రపంచంలోనూ ఎన్నుకున్నాము. పరలోకంలో కూడా అతను సజ్జనుల సరసన ఉంటాడు”. (బఖర: 130)

”ఒక వ్యక్తి అల్లాహ్‌ ముందు తల వంచి, సదాచారసంపన్నుడై ఉండి, ఏకాగ్రతచిత్తుడై ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరిస్తే – ధర్మం రీత్యా అతనికంటే ఉత్తముడు మరెవడు కాగలడు? ఇబ్రాహీమ్‌(అ)ను అల్లాహ్‌ తన మిత్రునిగా చేసుకున్నాడు”. (అన్నిసా: 125)

ఈ ఎంపిక ఏ ఆధారంగా జరిగింది?

”నిన్ను నీవు (నాకు) సమర్పించుకో” అని అతని ప్రభువు అతన్ని ఆదే శించినప్పుడల్లా ‘సకల లోకాల ప్రభువుకు నన్ను నేను సమర్పించు కుంటున్నాను’ అని అతను సమాధానమిచ్చాడు. (బఖర: 131) ”జ్ఞాపకం చేసుకోండి! ఇబ్రాహీమ్‌ (అ)ను అతని ప్రభువు అనేక విషయాలలో పరీక్షిం చగా, అతను అన్నింటిలోనూ (నికార్సుగా) నెగ్గుకు వచ్చాడు. అప్పుడు అల్లాహ్‌ా అతన్ని ఉద్దేశ్యించి- ”నేను నిన్ను ప్రజలకి నాయ కునిగా చేస్తున్నాను” అన్నాడు. (బఖర: 124)

ఆయన తీసుకొచ్చిన జీవన ధర్మం ఏది?

”ఇబ్రాహీమ్‌ (అ) యూదుడూ కాదు. క్రైస్త వుడూ కాదు. ఆయన ఒకే దేవుని వైపు అభి ముఖుడైన ముస్లిం-విధేయుడు. ఆయన బహుదైవారాధకులలోని వాడు ఎంత మాత్రం కాదు”. (ఆలి ఇమ్రాన్:67)
ఆయన ప్రజలను యూదత్వం వైపునకో, క్రైస్తవం వైపునకో, ఆహ్వానించలేదు. ఆ మాట కొస్తే ఈ మతాల ఉనికే అప్పటికి లేెదు. ఆయన ప్రబోధించింది తౌహీద్‌-ఏకేశ్వరో పాసనను మాత్రమే. దాసుడు దేవుని ఆదేశా లకు శిరసావహించడం అనే నిజం గురించే ఆయన నొక్కి వక్కాణించారు తప్ప త్రిత్వమో మరే ఇజం గురించో కాదు. ఆ విధేయతా మార్గమే, ఆ శాంతి బాటయే ఇస్లాం. ఆ విష యానికొస్తే ప్రవక్తలందరి ధర్మం కూడా ఇస్లామే. వారందరూ ముస్లిములే. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లాహ్‌ నూహ్‌కు ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్నే మీ కొరకు నిర్ధా రించాడు. దానినే (ఓ ముహమ్మద్‌-స!) నీ వైపునకు (వహీ ద్వారా) పంపాము. దాని గురించే ఇబ్రాహీమ్‌కు, మూసాకు ఈసా (అ)కు కూడా తాకీదు చేశాము. ఈ ధర్మాన్నే నెలకొల్పాలని, అందులో చీలిక తీసుకురావ ద్దనీ (వారికి) ఉపదేశించాము”.(షూరా:13)
ఇదే విషయాన్ని ప్రవక్త మహనీయులు (స) వారు ఇలా ఉద్బోధించారు: ”ప్రవక్త సమూ హం సవితి సంతానం వంటిది. వారి తల్లులు (ధర్మ శాస్త్రాలు) వేరు, కాని వారి ధర్మం మాత్రం ఒక్కటే”. (బుఖారి)

Related Post