Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ఖుర్‌ఆన్‌ ఔన్నత్యం

ఖుర్‌ఆన్‌ గ్రంథం ఎంత శుభప్రదమయినదంటే, అందులోని ఒక్కో అక్షర పఠనానికిగాను పదేసి పుణ్యాలు అల్లాహ్‌ా ప్రసాదిస్తాడు. దాని వచన కంఠస్థ ఆధారంగా స్వర్గ హోదాలు ఖరారు చెయ్య బడతాయి. అది పారాయణం చెయ్యబడే ప్రదేశం నుండి షైతాన్‌ పారి పోతాడు.

ఖుర్‌ఆన్‌ గ్రంథం ఎంత శుభప్రదమయినదంటే, అందులోని ఒక్కో అక్షర పఠనానికిగాను పదేసి పుణ్యాలు అల్లాహ్‌ా ప్రసాదిస్తాడు. దాని వచన కంఠస్థ ఆధారంగా స్వర్గ హోదాలు ఖరారు చెయ్య బడతాయి. అది పారాయణం చెయ్యబడే ప్రదేశం నుండి షైతాన్‌ పారి పోతాడు.

సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్‌ భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టి అర్ష్‌పై ఆసీనుడయ్యాడు.భూమిని పాన్పుగా, ఆకాశాన్ని కప్పుగా చేసి, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా భూమి నుండి పండ్లు ఫలాలను మనకు  ప్రసాదించి, మన మనుగడకు కావాల్సిన ఒనరులను సమకూర్చి పెట్టి మనల్ని తన ప్రతినిధిగా నియమించాడు. ఆ తర్వాత మానవాళికి తన అభి ప్రాయాన్ని తెలియజేయడానికి మనుషుల్లో నుండే మానవోత్తములను ప్రవ క్తలుగా ఎన్నుకున్నాడు. వారికి తన గ్రంథాలను వొసగి తద్వారా మానవాళికి సన్మార్గమేదో, అపమార్గమేదో బోధ పర్చాడు. ఆ విధంగా ప్రవక్తల పరంపరలో తొట్ట తొలి ప్రవక్త ఆదమ్‌ (అ) అయితే కట్ట కడపటి  ప్రవక్త ముహమ్మద్‌ (స).  అల్లాహ్‌ా, మహా ప్రవక్త ముహమ్మద్‌ (స)వారి ద్వారా ప్రళయం వరకూ అనుసరించదగ్గ చిట్ట చివరి గ్రంథాన్ని అందించాడు. ఆ గ్రంథరాజమే ఖుర్‌ఆన్‌.

ఖుర్‌ఆన్‌ అంటే ఎల్లప్పుడూ పఠించ బడేది అని అర్థం. మహనీయ ముహమ్మద్‌ (స) వారిపై ఆవతరించిన తొట్ట తొలి ఖుర్‌ఆన్‌ వాక్యం ‘వహీ -దైవవాణి’ కూడా ‘పఠించు’ అన్న పదంతో మొదలయింది.”పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు నామంతో”. (అల్‌ అలఖ్‌: 1) దైవగ్రంథాల న్నిం మధ్య అంతిమ దైవగ్రంథమయిన ఖుర్‌ఆన్‌కు గల ప్రత్యేకత ఏమిటం టే, దాన్ని ప్రళయ దినం వరకూ స్వయంగా అల్లాహ్‌ా కాపాడుతానని పూచి పుచ్చుకున్నాడు. ”ఈ జ్ఞాపికను మేమే అవతరింప జేశాము. స్వయంగా మేమే దానిని రక్షిస్తాము”. (అల్‌హిజ్ర్‌: 9)

ఖుర్‌ఆన్‌ గ్రంథం ఎంత శుభప్రదమయినదంటే, అందులోని ఒక్కో అక్షర పఠనానికిగాను పదేసి పుణ్యాలు అల్లాహ్‌ా ప్రసాదిస్తాడు. దాని వచన కంఠస్థ ఆధారంగా స్వర్గ హోదాలు ఖరారు చెయ్య బడతాయి. అది పారాయణం చెయ్యబడే ప్రదేశం నుండి షైతాన్‌ పారి పోతాడు.  నిత్యం ఖుర్‌ఆన్‌ పారాయ ణం చేస్తూ ఉండే వారు కాపట్యం, దుష్ప్రేరణల నుండి దూరంగా ఉంారు. ఖుర్‌ఆన్‌ అవతరిస్తున్న కాలంలో దాని పారాయణానికి అబూ జహల్‌, అబూ లహబ్‌ విం బద్ధ శత్రువులు కూడా ముగ్దులయ్యేవారు. అలాంటి వారిలో తర్వాత విశ్వాస భాగ్యానికి నోచుకొని ప్రవక్త ప్రముఖ సహాబీగా పేరుగాంచిన హజ్రత్‌ ఉమర్‌ (ర) గారు కూడా ఉన్నారు. ఆయన ఒక రోజు కాబా ప్రాంగణంలోకి ప్రవేశించగా అక్కడగా ప్రవక్త (స) సూరతుల్‌ హాఖ్ఖహ్‌ పారాయణం చేస్తున్నారు. ఉమర్‌ (ర) ఖుర్‌ఆన్‌ శైలికి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ శుభ సందర్భంలోనే ఇస్లాం ధర్మ ఔన్నత్యం నా మదిలో చోటు చేసుకుంది అని తరచూ ఆయన అంటూ ఉండేవారు.

దివ్యఖుర్‌ఆన్‌ ప్రభావం ఒక్క మానవుల్నే కాదు జిన్నాతుల్ని సయితం మంత్ర ముగ్దుల్ని చేసింది. ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని ప్రవక్త (స) వారి నోట విని విశ్వసించిన వైనాన్ని స్వయంగా అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లోని జిన్న్‌ సూరాలో పేర్కొన్నాడు. ఖుర్‌ఆన్‌ పఠన పరంగానే కాకూండా పాటింపు పరంగా కూడా ఎంతో శుభప్రదమయినది. అది ఎంత శుభప్రధమయినదో అర్థం అవ్వా లంటే, ఒక రాత్రిలో దాని అవతరణ కారణంగా అల్లాహ్‌ా మొత్తం రమజాను మాసాన్నే వరాల వసంతంగా పేర్కొన్నాడు.  అది అవతరించిన రాత్రి ఘన తరమయినది. అది అవతరించి పట్టణం మక్కా మహిమాన్వితమయినది. అది ఎవరిపై అవతరించిందో ఆయన ప్రవక్తాగ్రేసరులు, ప్రవక్తల నాయ కులు. అది ఎవరి కోసం అయితే అవతరించిందో వారు సృష్టి శ్రేష్టులు. దాన్ని ఎవరయితే పాటీస్తున్నారో వారు ఉత్తమ సముదాయానికి చెందిన వారు. ఒక్క మాట చెప్పాలంటే ”ఖుర్‌ఆన్‌ అధారంగా అల్లాహ్‌ా కొందరిని ఉన్నత శిఖరాలకు చేర్చితే, మరికొందరిని పాతాళానికి నెట్టేస్తాడు”. (ముస్లిం) అల్లాహ్‌ా మనందరికి ఖుర్‌ఆన్‌ పారాయణం చేసి, అవగాహన చేసుకుని, అమలు పర్చే సద్బుద్ధిని ప్రసాదించు గాక! ఆమీమ్‌.

Related Post