విజ్ఞాన భాండాగారం ఖుర్‌ఆన్‌

islam-and-science-wallpaper

ఖుర్‌ఆన్‌ అనే ఈ జ్ఞాన సాగరాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు. ఈ గ్రంథ రాజం తెలియపర్చే యదార్థాల వరకు, అద్భుత విషయాల వరకు చేరుకోవడానికి మనకి ఎన్ని యుగాలు అవసరమో తెలియదు. ఈ గ్రంథ విశిష్ఠత గురించి కలం కదిలించి వ్రాయడం అంటే- కొన్ని కోణాలను మనిషకి తెలిసిన జ్ఞానం, అనుభవం కొద్దీ గ్రహించి చెప్పడమే అవుతుంది. ఈ గ్రంథ జ్ఞానాన్ని ఏ కలం, మరే పుస్తకం ద్వారానూ ఇనుమడింపజేయలేము. ‘ఇమామ్‌ ఫఖ్రుర్రాజీ (ర)’ ఇలా అభిప్రాయాపడ్డారు: ”ఖుర్‌ఆన్‌ అనే ఈ విజ్ఞాన భాండాగారమే గనక లేక పోయినట్లయితే ప్రపంచం మూడు వందల ప్రయో జనకర విద్యలను కోల్పోయి ఉండేది”.

ఆయన కాలం నాటికి విద్యల సంఖ్య బహుశా మూడు వందలే అయువుండొచ్చు. ప్రస్తుతం గనక మూడు వేలు, మూడు లక్షలు, లేదా అంతకు మించిన జన ప్రయోజనకర విద్యారకాలు ప్రాచుర్యంలో ఉన్నా వాటన్నింటికీ బీజ గ్రంథం పవిత్ర ఖుర్‌ఆనే అవుతుంది అనడంలో ఎలాంటి సందే హం లేదు.  ఆ మాటే పరమ పవిత్రుడైన అల్లాహ్  తెలియజేస్తున్నాడు: ”భూ మండలంలోని వృక్షాలన్నీ కలములుగా, సముద్రాలన్నీ సీరాగా మారినా, ఆపై వాటికి జతగా మరో ఏడు మహా సాగారాలను సీరాగా చేసినా అల్లాహ్‌ా వాక్యాలు పూర్తి కావు. నిస్సందేహంగా అల్లాహ్  సర్వాధికుడు, వివేక వంతుడు”. (లుఖ్మాన్‌: 27) మచ్చుకు కొన్నింటిని ఇక్కడ పేర్కొనడం జగుతుంది.

ఖగోళశాస్త్రం: సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్ష    త్రాలు-మొదలయిన సమస్త రోదసీ వస్తు వులు వేర్వేరుగా తమకు నిర్దేశించిన కక్ష్యల్లో తిరుగుతున్నాయన్న యదార్థాన్ని నేటికి 1432 సంవత్సరాల క్రితమే ఖుర్‌ఆన్‌ తెలియజేసింది.

”సూర్యుడు తన నిర్ణీత కక్ష్యలో సంచరిస్తు న్నాడు. ఇది మహా శక్తిమంతుడు, అసా ధారణ వివేకవంతుడయిన అల్లాహ్  రూపొందించిన (అద్భుత, అద్వితీయ) పథకం. చంద్రుని కోసం మేము మజిలీ లను (చంద కళలలు) నిర్ణయించాము.  అది వాటిని దాటుకుంటూ చివరికి  ఎండి     పోయిన ఖరపు మట్టలా మారిపోతుంది. చంద్రున్ని చేరుకునే శక్తి సూర్యుని లో లేదు. అలాగే రాత్రి పగటిని దాటిపోలేదు. సమస్తం ఒక్కొక్క కక్ష్యల్లో (వాటికి నిర్దే శించబడిన కక్ష్యల్లో) సంచరిస్తున్నాయి”.   (దివ్య ఖుర్‌ఆన్ – 36: 38-48)

దీన్ని బట్టి తెలిసేదేమిటంటే- ఈ విశ్వంలో ఏ రోదసీ వస్తువు స్థిరంగా లేదు. ప్రతి గ్రహం, ప్రతి నక్షత్రం, ప్రతి గెలాక్సి, ప్రతి క్వాజర్‌ తమ తమ నిర్ణీత కక్ష్యల్లో నిరంతరాయంగా సంచరిస్తున్నా యన్నది. పైగా ఇవన్నీ ఒకదానికొకటి ఢీ కొనడానికి వీలు లేని విధంగా దేవుడు నిర్దేశించిన కక్ష్యల్లో, ఆయన నిర్ణయించిన వేగాలతో ఎంతో క్రమబద్ధంగా తిరుగు తున్నాయి. కనుక సర్వలోక సృష్టికర్త, మహా శక్తిపరుడు, ఘనాఘనుడైన అల్లాహ్  ను మాత్రమే ఆరాధించాలని ఈ సూక్తి మానవాళికి పరోక్షంగా బోధిస్తున్నది.     మరో చోట ఇలా ఉంది: ”మేము రేయింబవళ్ళను (మా శక్తి) సూచనలుగా చేశాము. రాత్రి సూచనను (మీ విశ్రాంతి కోసం) చీకటిమయంగా చేశాము. అలాగే మీ ప్రభువు అనుగ్రహం (జీవనోపాధి) అన్వేషించడానికి, నేలలు, సంవత్సరాల లెక్క చూసుకోవడానికి వీలుగా మేము పగటి సూచనను కాంతిమంతంగా చేశాము. ఈ విధంగా మేము ప్రతి విష యాన్నీ స్పష్టంగా విడమరచి చెప్పాము”.  (బనీ ఇస్రాయీల్ ; 12)

ఈ విద్య వల్ల భూమి యొక్క వాస్తవ రూపాన్ని, దాని పూర్వ పరాల్ని  గ్రహించవచ్చు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”భూమ్యాకాశాలు కలిసి ఉండగా, మేము వాటిని విడదీసిన వైనాన్ని (దైవం అనే అస్తిత్వం లేదని వాదించే నాస్తికులు) తిరస్కారులు చూడటం లేదా? అలాగే ప్రతి ప్రాణినీ మేము నీటితో సృజించిన విషయాన్ని వీరు గమనించడం లేదా? అయినప్పటికీ వారు విశ్వసించరేమి?”.  (అల్‌ అంబియా: 30)

పై ఆయతులో ‘చూడటం’ అంటే – మనో నేత్రంతో చూడటం అని అర్థం. అలాగే ‘నీటితో’ అనే పదాన్ని వర్షపు నీరు గా, కాలువ నీరుగా భావిస్తే దాని ప్రతి వస్తువుకు నవ జీవనం లభిస్తుందన్న విష యం విదితమే. ఒకవేళ ‘వీర్య బిందువు’గా భావిస్తే ప్రతి ప్రాణీ దాంతోనే ఉనిలోకి  వస్తుందన్న జగమెరిగిన సత్యం.

మరో చోట ఇలా ఉంది: ”భూమి వారిని కుదిపివేయకుండా ఉండటానికని మేము అందులో పర్వ తాలను పాతాము. వారు తమ మార్గాలను పొందటానికి అందులో సువిశాలమైన రహదార్లును ఏర్పరచాము”. (15: 31)

”అందులో (భూమిలో) ప్రతి వస్తువును నిర్ణీత మోతాదులో మొలిపించాము. అందులోనే మేము మీ జీవనోపాధికి వన రులను సమకూర్చాము. ఇంకా మీరు జీవ నోపాధి కల్పించని వాటికి కూడా. అన్ని వస్తువుల ఖజానాలు మా వద్దనే ఉన్నాయి. ప్రతి వస్తువును మేము తగు మోతాదులో మేము అవతరింపజేశాము”  (అల్‌ హిజ్ర్‌: 20, 21)

అలాగే వాన గురించి, గాలుల సంచారం గురించి ఆ పరమదాత అయిన అల్లాహ్  ఇలా తెలియజేస్తున్నాడు: ”మేము బరువైన గాలులను పంపిస్తున్నాము.మరి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, దాన్ని మీకు త్రాపిస్తున్నాము. ఈ (జల) నిధిని సమ కూర్చుకోవడం అన్నది మీ వల్ల కాని పని. ప్రాణం పోసేది, ప్రాణం తీసేది కూడా మేమే. (ఎట్టకేలకు) వారసులం కూడా మేమే. ”. (అల్‌ హిజ్ర్‌:22, 23)

వృక్ష సంపద గురంచి ఖుర్‌ ఆన్‌లో పలు చోట్ల ఎంతో విపులంగా, వివరణాత్మకంగా పేర్కొనడం జరిగింది. ఉదాహరణకు – ”ఆయనే పందిళ్ళపై ప్రాకే, పందిళ్ళపై ఎక్కించబడని తోటలతో సహా రకరకాల తోటలు, తోపులను సృష్టించాడు.  ఖర్జూర చెట్లను, రకరకాల ఆహార పదా ర్థాలు ఉత్పత్తి చేసే పొలాలను సృజిం చినవాడు కూడా ఆయనే. ఆలివ్‌, దానిమ్మ వృక్షాలను సృజిస్తున్నవాడూ ఆయనే. వాటి పళ్ళు కొన్ని పరస్పరం పోలి ఉంటాయి, మరికొన్ని పోలి ఉండవు. (పోలిక ఒకటే అయినా రుచి మాత్రం వేర్వేరుగా ఉంటుంది). అవి పంటకు వచ్చినప్పుడు వాటి పండ్లను హాయిగా తినండి. దాంతోపాటు పంట కోతకు వచ్చినప్పుడు తప్పనిసరిగా చెల్లించవలసిన దాని హక్కును చెల్లిం చండి. దుబారా ఖర్చు చేయకండి. దుబారా చేసేవారిని అల్లాహ్  ప్రేమిం చడు”. ( అల్‌ అన్‌ఆమ్ : 143)

: ”వీరు తమ మీద రెక్కలు జాపుతూ, ముడుస్తూ, ఎగిరే పక్షుల్ని పరికించి చూడటం లేదా? (అలా (వాటిని ఏ ఆధారం లేకుండా) పట్టి ఉంచిన వాడు కరుణామయుడు తప్ప మరెవరు లేరు”. (అల్‌ ముల్క్: 19)

”భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా, తమ రెండు రెక్కల సహాయంతో ఎగిరే పక్షులైనా – అన్నీ మీ వంటి సముదాయాలే”. (అల్‌ అన్‌ఆమ్ : 37)

రసాయన శాస్త్రం – ”ఈ రంగంలో మార్గదర్శకం కాగలిగే సూత్రాలు అనేకం ఖుర్‌ఆలో ఉన్నాయి. ఉదాహరణకు -”మీ కోసం పశువులలో కూడా గొప్ప గుణ పాఠం ఉంది. వాటి కడుపులో ఉన్న పేడకు – రక్తానికి మధ్యలో నుంచి స్వచ్ఛమైన పాలు మీకు తాపిస్తున్నాము. త్రాగేవారికి అది కమ్మగా ఉంటుంది.”  (అన్‌ నహ్ల్ : 66)

‘నీ ప్రభువు తేనెటీగకు ఈ సంకేతమిచ్చాడు: ”కొండల్లో, చెట్లల్లో, ప్రజలు కట్టుకున్న ఎత్తైన పందిళ్ళలో నీ ఇండ్లను (తేనె తెట్టలను) నిర్మించుకో. అన్నీ రకాల పండ్లు తిను. నీ ప్రభువు సులభతరం చేసిన మార్గాలలో విహరిస్తూ ఉండు.” వాటి కడుపులలో నుంచి పానకం ఒకటి వెలువడుతుంది. దాని రంగులు వేర్వేరుగా ఉంటాయి. అందులో ప్రజలకు స్వస్థత ఉంది. ఆలోచించేవారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది’. (అన్‌ నహ్ల్ : 68, 69)

: వ్యవసాయం, సేద్యం గురించి ఎంతో గొప్ప సూచన – ”మెరక ప్రాంతంలో ఉన్న తోట. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. దానిపై పెద్దగా వాన కురియకపోయినా, సన్నటి జల్లు పడినా సరిపోతుంది”. (బఖరా: 265)

గర్భస్థ శిశువు: ”ఆయన మిమ్మలందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. మరి దాంతోనే దాని జతను కూడా చేశాడు. ఇంకా మీ కోసం పశువులలో ఎనిమిది (రకాల జతలను) పెంటి – పోతులను అవతరింపజేశాడు. ఆయన మిమ్మల్ని మీ మాతృ గర్భాలలో -మూడేసి చీకట్లలో – ఒకదాని తర్వాత ఒకటిగా రూపకల్పన చేస్తున్నాడు”. (అజ్‌ జుమర్ :12-14)

 

Related Post