ఖుర్‌ఆన్‌లో మానవ సృష్టి గురించి …

islam-guide_Page_01
 (ఖుర్‌ఆన్‌ మరియు సైన్స్‌ పుస్తకం నుండి)
”మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. తర్వాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మార్చాము. ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము. ఆ పైన ముద్దను కండగా చేశాము. తర్వాత మాంసపు కండను ఎముకలుగా చేశాము, ఆ తరువాత ఎముకలకు మాంసాన్ని తొడిగాము, ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము”. (ఖుర్‌ఆన్-23; 12-14)
 పై ఖుర్‌ఆన్‌ వాక్యాలు 1) బిందువు 2) ముద్ద ఆకారము 3) కండ 4) ఎముకలు 5) ఎముకలపై మాంసం 6) ఆ తరువాత ఓ రూపంగా మారుతుందని మానవ సృష్టి గురించి వివరించాయి. ఇలా ఒక్కో థ ఒక్కోలా ఉంటుందని ఖుర్‌ఆన్‌ తెలియజేసింది. మొదటి థలోని బిందువు- పురుషుని జననేంద్రియము నుండి వెలువడే బిందువు. అది స్త్రీ పురుషుల కలయిక వలన పురుషుని నుండి వెలువడి స్త్రీ గర్భాశయంలో చేరుతుంది. ఆ తరువాత అది ముద్దగా మారుతుంది. మొదటి థను సూచించటానికి, ఖుర్‌ఆన్‌లో అలఖ అనే అరబీ పదము వాడబడింది. అలఖ అనే  పదానికి  అరబీ  భాషలో  మూడు అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒక అర్థం జలగ, మరో అర్థం వ్రేలాడుతున్న మరియు మూడవ అర్థం గడ్డకట్టిన. ఇక్కడ మూడు పటాలు ఇవ్వ బడ్డాయి. కాబట్టి ఆ బిందువు పిండంగా మారి క్రమంగా వృద్ధి చెందే విధానాన్ని గనుక జాగ్రత్తగా గమనిస్తే, 1వ పటంలో అది ఓ జలగను పోలినట్లు, 2వ పటంలో అది వ్రేలాడుతున్నట్లు మరియు 3వ పటంలో గడ్డ కట్టిన రక్తపు ముద్దలా కనబడును.
 తరువాత గడ్డ కట్టిన రక్తపు కండలా కనిపిస్తుంది. ఈ చిత్ర పటాల ను ‘ది డెవలప్పింగ్‌ హ్యూమాన్‌ మోర్‌ అండ్‌ పర్స్‌డ్‌’ అను వైద్య విజ్ఞా నానికి సంబంధించిన పుస్తకమును నుండి సేకరించడం జరిగింది.
 స్త్రీ గర్భంలో పిండం ‘జలగ మాదిరిగానే రక్తాన్ని పీల్చుతూ వృద్ధి చెందుతుంది’ అని, ‘ఓ అంచుకు మాత్రమే అతుక్కుని మిగిలిన భాగం వ్రేలాడుతూ ఉంటుంది’ అని వైద్య శాస్త్రం కనిపెట్టిన విషయాలు ఖుర్‌ఆన్‌లో తెలుపబడిన వాటితో ఎంత ఖచ్చితంగా సరిపోతున్నాయో మీరే గమనించండి. రెండవ థ: ఖుర్‌ఆన్‌ రెండవ థకు ముద్గా అనే పేరు ఇచ్చినది. ముదగ అంటే అరబీ భాషలో మెత్తటి కండ అని అర్థం. బబుల్‌ గమ్‌ను కాసేపు నమిలి దానిని దవడ పళ్ళ మధ్యన అదిమి ఆ తరువాత బయటకు తీసి చూస్తే అది కనిపించే మెత్తటి కండ ఆకారాన్ని పోలి ఉంటుందని వైద్యశాస్త్రజ్ఞుల పరిశోధనలలో తేలింది. ద్రవంలా కాకుండా మాంసపు కండలా ఉంటుంది.
        ఈ  చిత్రపటాలు చూడండి.  కాబట్టి ఖుర్‌ఆన్‌లో తెలిపిన దానికీ, వైద్యశాస్త్రం పరిశోధించి తెలుసుకున్న దానికీ ఎంత దగ్గరి పోలికలున్నాయో చూడండి.  క్రీ, శ. 1677 సంవత్సరంలో హమ్‌ అండ్‌ లీవ్యన్‌హోక్‌ అనే శాస్త్రవేత్తలు మొట్టమొదటి సారిగా పురుషుని ఇంద్రియముపై పరిశోధన లు జరిపి ”పురుషుని నుండి వెలువడే వీర్య బిందువులో మనిషిని పోలిన సూక్ష్మరూపం దాగి ఉంటుందని, అది స్త్రీగర్భాశయంలో చేరిన తర్వాత క్రమంగా వృద్ధి చెంది శిశువు రూపం దాల్చుతుంది” అనే తప్పుడు సమాచా రాన్ని అందించారు. ఇది నిజం కాలేదు. వీరి కంటే 1000 సంవత్సరములకు పూర్వమే ఎలాంటి పరిశోధనలు చేయకుండా ముహ మ్మద్‌ (స) మానవ సృష్టి గురించి ఖచ్చితమైన విషయాలు తెలియజేసారంటే, అది కేవలం దైవానుగ్రహం మాత్రమే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందరో ప్రముఖులు దీనిని స్వయంగా ఒప్పుకున్నారు.
 ప్రోఫిసర్‌ ఎమిరేట్స్‌ కేత్‌ ఎల్‌.మోర్‌ ఎంబ్‌టి లోజీ-ఒక ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త. ఆయన అనటొమీ ఎంబోలోజీ (పిండోత్పత్తి మరియు శరీర నిర్మాణ శాస్త్రము)లలో పరిశోధనలు చేశారు. ఆయన ది డెవలప్పింగ్‌ హ్యూమాన్‌ అను గ్రంథమును రచించారు. ఈ గ్రంథం 8 భాషలలో అనువదించబడింది. దీనిపై ఆధార పడి మరెన్నో పరిశోధనలు జరిగాయి. అమె రికాలోని ఓ ప్రత్యేక కమిటీ వారు ఈ పుస్తకా నికి వైద్య విద్యారంగములో మొట్టమొదటి స్థానాన్ని కల్పించారు. అంతే కాదు ప్రోఫిసర్‌ కేత్‌ ఎల్‌. మోర్‌ కెనడాలోని టోరంటో అను పట్నంలో యూనివర్సిటీ ఆఫ్‌ టోరంటోలో అనటొమి ప్రొఫిసర్‌గా కూడా పనిచేశారు. అంతే కాక అనటొమి విభాగమునకు చేర్మన్‌ గా 8 సంవత్సరముల పాటు తన సేవలను అందించారు. అమెరికా, కెనడాకు చెందిన అసోసియేషన్‌ ఆఫ్‌ అనటొమిస్ట్‌ అండ్‌ ది కౌన్సిల్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ఆఫ్‌ బైఆలోజికల్‌ సైన్స్‌ కు ముఖ్య సలహాదారునిగా కూడా ఆయన తన సేవలను అందించారు.
    1981 సంవత్సరంలో సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో జరిగిన 7వ మెడికల్‌ కాన్ఫ్రెన్స్‌లో డా. కేత్‌ ఎల. మోర్‌ గారు ఇలా వ్యాఖ్యానించారు:
”మానవ శరీర నిర్మాణం, అది ఏర్పడే విధానం, అది స్త్రీ గర్భంలో వృద్ధి చెందే విధానం గురించి ఖుర్‌ఆన్‌లో చెప్పిన విషయాలు నేడు అభివృద్ధి చెందిన వైద్య విజ్ఞానం పరిశోధనలు చేసి చెప్పిన విషయాలలో ఎలాంటి వ్యత్యాసం లేదని చెప్పడానికి నేను చాల సంతోషిస్తున్నాను. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఎలాంటి పరిశోదనలు చేయకుండా ఇలాంటి విషయాలను ముహమ్మద్‌ చెప్పగలిగారంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన ఖచ్చితంగా సృష్టికర్త యగు అల్లాహ్‌ా యొక్క నిజమైన ప్రవక్తయే మరియు ఖుర్‌ఆన్‌ దైవగ్రంథమే అనడంలో ఎలాంటి సందే హమూ లేదు.”  దీనితో అక్కడి సభికులు డా. మోర్‌ గారిని ఇలా ప్రశ్నించారు. ”మీరు ఖుర్‌ఆన్‌ను దైవగ్రంథంగా నమ్ముచున్నారా?” అప్పుడు డా. మోర్‌ ఇలా బదులిచ్చారు – ”ఎలాంటి అనుమానం లేదు, ఖుర్‌ఆన్‌ దైవగ్రంథమే.” డా. మోర్‌ ఇంకా ఇదే సభలో – ”పిండోత్పత్తి, దాని థలు తెలియజేసే విధానము గురించి ఖుర్‌ఆన్‌లో మరియు ముహమ్మద్‌ ఉపదేశాలలో తెలియజేసిన పద్ధతే సరైనది. నేను ఖుర్‌ఆన్‌ను మరియు ముహమ్మద్‌ ఉపదేశాలను (హదీథ్‌లను), ఆయన సహచరులు (సహాబీలు) తెలియజేసిన విషయాలను నేను నాలుగు సంవత్సరాల పాటు చదివాను. వాటిలో నాకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలి శాయి. క్రీ.శ. 6వ శతాబ్దంలోనే పిండోత్పత్తి గురించి ఎంతో ఖచ్చితమైన వివరాలు తెలియజే యబడ్డాయి.
 క్రీ.పూ. 4వ శతాబ్దంలో అరిస్టాటిల్‌ అను శాస్త్రవేత్త కోడి గ్రుడ్డుపై పరి శోధనలు చేసి తెలియజేసిన విషయాలు కూడా అంతంత మాత్రమే. 20వ శతాబ్దం వరకు మానవుని పిండోత్పత్తి గురించి కని పెట్టినది చాలా తక్కువే అని చెప్పాలి. కాని 6వ శతాబ్దములోనే ఎలాంటి పరిశోధ నలు జరపకుండా సైన్స్‌పై ఆధార పడకుండా చెప్పిన విషయాలు గమనించినట్లయితే ఖచ్చితంగా ఖుర్‌ఆన్‌ దైవగ్రంథమే. ఎందుకంటే ఈ విషయాలు తెలియజేసిన ముహమ్మద్‌ నిరక్షరాసి, శాస్త్రీయ పరిజ్ఞా నము అంతకంటే లేనివారు. కాబట్టి ఖురఆన్‌ ఖచ్చితంగా దైవగ్రంథమే” అని ప్రకటించారు. 

 

Related Post