సాహసం శ్వాసగా సాగిపోయిన సుభక్తాగ్రేసరులు ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (ర) – 3

సజ్దాలో పాదాలు భువిని తాకుతుండగా మెడపై కరవాలం అట్టి ఆరాధనలో జాహిద్‌ ఉన్న మజాయే వేరు.

సజ్దాలో పాదాలు భువిని తాకుతుండగా మెడపై కరవాలం
అట్టి ఆరాధనలో జాహిద్‌ ఉన్న మజాయే వేరు.

మొతసిమ్‌ రాజు గారి దర్బారులోకి చాలా మంది ధార్మిక పండితులు బంధించబడి హాజరు చేయబడ్డారు. వారిపై కొరడా దెబ్బల వర్షం కురిపించ బడింది, కొరడా దెబ్బల బాధ తాళలేక గొప్ప గొప్ప పండితులు ప్రారంభం లోనే మాట జారిపోయారు. మరి కొందరైతే ప్రారంభంలో నిలకడను ప్రద ర్శించి తరువాత ఒప్పుకుని తప్పించుకున్నారు. చివరి వరకు స్థిరంగా నిలబ డింది మాత్రం ముగ్గురే (1) ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ నూహ్‌ (రహ్మ) ఈయన తనపై జరిగిన హింసను భరించలేక చెరశాలలోనే ప్రాణం వదిలారు.
2) ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ నస్ర్‌ ఖజాయి (రహ) ఈయనను ఖలీఫా వాసిఖ్‌ బిల్లాహ్‌ పుణ్యం ప్రాప్తమవుతుందనే నమ్మకంతో తమ హస్తాలతోనే చంపి వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు.
3) ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (ర). ఈయన చివరి వరకు స్థిరంగా నిలబడ్డారు, ఈయన నిలకడను చూసి రాజు మోతసిమ్‌ బిల్లాహ్‌ కసురు కుంటూ నీతోటివారెవరూ ఇలాంటి మొండి వైఖరిని చూపించలేదు, నీవెందుకు ఇలా చేస్తున్నావు? అని ప్రశ్నించాడు. అతను అడిగే ప్రశ్నలన్నింటికీ ఇమామ్‌ అహ్మద్‌ (ర) ఒకటే సమాధానం ఇచ్చేవారు. ”ఆతూని షైఅమ్‌ మిన్‌ కితాబిల్లాహి ఔ సున్నతి రసూలిహి హత్తా అఖూల బిహి”-అల్లాహ్‌ గ్రంథం నుండి ఆధారం ఏదైనా ఉంటే చూపిం చండి లేదా ప్రవక్త (స) హదీస్‌ ఏదైనా ఉంటే చూపించండి అప్పుడు ఒప్పు కుాంను.

మోతసిమ్‌ రాజు తొమ్మిది మంది శిక్షించే వారిని పిలిపించాడు, అందరూ కొరడాలతో కొట్టండని ఆజ్ఞాపించారు. మొది కొరడా దెబ్బ తగలగా ‘బిస్మిల్లాహ్‌ా’ అని పలికారు.రెండవ కొరడా దెబ్బ తగలగా ‘అల్‌హమ్దులిల్లాహ్‌’ అని పలికారు.మూడవ దెబ్బ తగిలినప్పుడు ఖుర్‌ఆన్‌ వాక్యాలు పఠించారు, ఆ వాక్యాల అర్థం: ”మాకు రాసి ప్టిెనది తప్ప మరోకి మాకు జరగదు” (తౌబా 51) నాల్గవ దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ ఏ మాట కారణంగా ఈ శిక్షలు ఇవ్వబడుచున్నాయో అదే మాట పలికారు- అనగా ”అల్‌ ఖుర్‌ఆను కలాముల్లాహి గైరు మఖ్‌లూఖ్‌”-ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ వాక్యం, అది సృష్టి ఎన్నికీ కాజాలదు.
తర్వాత అందుబాటులో ఉన్న కొన్ని నీళ్ళు మాత్రమే త్రాగి ఉపవాస దీక్ష ప్రారంభించారు, తొమ్మిది మంది కొరడాలతో కొట్టగా వీపు మొత్తం గాయా లయ్యాయి, బట్టలు రక్తంతో తడిసి ముద్దయ్యాయి, సృహ కోల్పోయి క్రింద పడ్డారు. చాలా సేపు తరువాత సృహ వచ్చినప్పుడు కొందరు త్రాగానికి నీరు అందించగా నేను ఉపవాసం భంగం చేయను అన్నారు. తరువాత అక్కడి నుండి ఇమామ్‌ అహ్మద్‌ (ర)ను ముహమ్మద్‌ బిన్‌ ఇబ్రాహీం (ర) గారి
ఇంటికి చేర్చారు. దొహ్ర్‌ నమాజు సమయం అవగా ఇబ్నె సమాఅ నమాజ్‌ చదివించారు, నమాజ్‌ తరువాత ఇబ్నెసమాఅ ఇమామ్‌ అహ్మద్‌ (ర)తో అయ్యా! మీరు నమాజు మరలా చదవండి ఎందుకంటే మీ శరీరం నుండి రక్తం ప్రవహించుచున్నది అన్నారు. అప్పుడు ఇమామ్‌ అహ్మద్‌ (ర) నోరు మూయించే సమాధానంగా ఇలా ఇచ్చారు: ”ఉమర్‌ (ర) నమాజ్‌ ఆచరించి నప్పుడు ఆయన శరీరం నుండి కూడా రక్తం ప్రవహిస్తూనే ఉండింది”.

ఆ దొహ్ర్‌ నమాజ్‌ గురించి మౌలానా ఆజాద్‌ (ర) ఇలా వ్రాసారు:”ఇమామ్‌ అహ్మద్‌ (ర) ఉమర్‌ (ర) గారి నమాజ్‌ గురించి ఇచ్చిన ఉదాహరణ ఆయన కు మనశ్శాంతి కలిగించి ఉండవచ్చు, అయితే నేను చెప్పేదేమిటంటే ఒక వేళ ఇమామ్‌ అహ్మద్‌ (ర) గారి శరీరం నుండి కారిన ఆ రక్తం అపరిశుభ్రం అయినట్లయితే తత్కారణంగా నమాజ్‌ ధర్మసమ్మతం కాదు, చెల్లదు అంటే మరి ప్రపంచంలో మనిషికి శుభ్రపరిచే వస్తువు ఏదో నాకు తెలుపండి. ఒకవేళ ఇది అపరిశుభ్రమైతే ప్రపంచపు పవిత్రలన్నీ ఈ అపరిశుభ్రత ముందు వెలవెలబోతాయి.
ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల భౌతికాయాలకు స్నానం చేయించడం తప్పనిసరి గావించబడింది కానీ ”షహీద్‌” అల్లాహ్‌ా మార్గంలో వీరమరణం పొందిన వారికి స్నానం చేయించడం అవసరం లేదని వారి కొరకు జనాజా నమాజ్‌ కూడా ఆచరించ వలసిన అవసరం లేదని ఎందుకు తెలుప బడింది? ”రక్తంతో తడిసిన వారి బట్టలను సైతం వారి దేహాల నుండి వేరు చేయ వద్దు, ఆ రక్తసిక్తమైన బట్టలతోనే వారిని వారికోసం ఎదురు చూడ బడుచున్న చోటుకి సాగనంపండి, అక్కడ రక్తంలో తడిసిన వారి బట్టల కంటే ఎక్కువ విలువయినవి ఏవి ఉండవు” అని చెప్పడం జరిగింది.

అల్లాహ్‌! అల్లాహ్‌! ఇక్కడ దేహ శుద్ధి, వస్త్ర శుద్ధి గురించి ప్రశ్న ఎందుకు? ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (ర) పూర్తి జీవితంలో శుద్ధమైన, నిజమైన నమాజ్‌ ఏదైనా ఆచరించారా అంటే ఆ దొహ్ర్‌ా నమాజే అని చెప్పాల్సి ఉం టుంది. వారి మొత్తం జీవితంలో ఆచరించిన నమాజులు ఒక వైపు అవి దజ్‌లా నది నీటితో శుద్ధి చేయబడి ఆచరించబడ్డాయి. ఈ కొద్ది క్షణాలలో ఆచరించిన ఆరాధన మరో వైపు. దీనిని అల్లాహ్‌ మార్గంలో ధార పోసిన రక్తం పరిశుద్ధంగా పవిత్రమైనదిగా చేసింది. సుబ్‌హానల్లాహ్‌! ఎవరి ప్రేమ కోసం కాళ్ళలో నాలుగేసి బేడీలు తొడుగుకున్నారో, ఎవరి కోసమయితే శరీరం మొత్తం గాయాలతో,రక్తంతో తడిసి ముద్దయిందో ఆ పరమ ప్రభువు ముందు నుదుట వంచు చున్నారు. ఆ ప్రభువు పవిత్రతను నాలుకతో కొనియాడుతున్నారు. ఆ ప్రభువును దర్శించుకోవాలనే తపన ఆత్మలో నింపుకొని పదే పదే ఆయన నామాన్ని జపిస్తున్నారు.
కవి ఇలా అన్నారు:
సజ్దాలో పాదాలు భువిని తాకుతుండగా మెడపై కరవాలం
అట్టి ఆరాధనలో జాహిద్‌ ఉన్న మజాయే వేరు.
ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (ర) గారి తనయులు ఇమామ్‌ అబ్దుల్లాహ్‌ (ర) ఇలా తెలిపారు-నా తండ్రి ఎక్కువగా ఇలా అంటూ ఉండేవారు: ‘అబుల్‌ హైథమ్‌పై అల్లాహ్‌ా కారుణ్యం వర్షించుగాక! అబుల్‌ హైథమ్‌ను అల్లాహ్‌ మన్నించుగాక!’ నేను ఈ పలుకులు విని – నాన్నా! ఈ అబుల్‌ హైథమ్‌ ఎవరు? అని అడిగాను. అబుల్‌ హైథమ్‌ బగ్దాద్‌ నగరంలో ఓ గజ దొంగ, లూటీలు చేసేవాడు అని బదులిచ్చారు. ఆ తరువాత ఇలా అన్నారు. ‘బాబూ! అబుల్‌ హైథమే గనక లేకుంటే నీ తండ్రి ఎప్పుడో నాశనమై పోయి ఉండేవాడు, అదెలాగంటే భటులు నన్ను రాజ్య భవనంలోకి బంధించి తీసు కెళ్ళి నాపై కొరడాతో చికత బాదడం జరిగింది. ఆ తరువాత నేను అక్కడి నుండి తిరిగి వస్తున్నప్పుడు ఒక భయంకరమైన శరీరాకృతి గల వ్యక్తి నన్ను పట్టుకొని-
‘నన్ను గుర్తు పట్టారా? నేనే బగ్దాద్‌ గజదొంగ అబుల్‌ హైథమ్‌ హద్దాన్‌ని. దొంగతనాలు చేసి అనేక సార్లు పట్టు బడ్డాను, శిక్షలు అనుభవిం చాను, నా వీపుపైన కొట్టబడిన కొరడా దెబ్బల సంఖ్య ఇంచు మించు ఎనిమిది వేలకు పైమాటే. ఇన్ని దెబ్బలు తిని కూడా నేను దొంగతనాన్ని వదల లేదు, జైలు నుండి విడుదల అయిన వెంటనే మళ్ళి దొంగతనం చేసే వాడిని, అలా నేను షైతాను దారిలో నడుచుకుంటూ కూడా ఇంతి స్థిర త్వాన్ని ప్రదర్శిస్తుంటే మరి అల్లాహ్‌ కోసం మీరు కొంచెం ధైర్యం చేయ లేరా?’ అన్నాడు. అతని మాటలు విన్న తరువాత నేను మనసులో ఆలోచించ సాగాను, ‘చెడు కోసం ఒక దొంగ చూపిస్తున్నంతి నిలకడను కూడా నేను అల్లాహ్‌ మార్గంలో చూపలేకపోతే నా ఈ భక్తి, ధర్మ జ్ఞానము, హదీసు విద్య అంతా వ్యర్థం. ఇక ఏమైనా సరే సత్యాన్ని చేజారనీయకూడదు’ అని నిర్ణయించు కున్నాను.

ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ బుఖారీ (ర) ఇలా తెలిపారు: ఇమామ్‌ అహమ్మద్‌ బిన్‌ హంబల్‌ (ర)కు కొట్ట బడిన 80 కొరడా దెబ్బల తీవ్రత ఎలాంటిదంటే ఆ దెబ్బలు ఏనుగుకు కొడితే అది తట్టుకోవడం కష్ట మయ్యేది. కానీ కొండలా నిలిచిన ఆ సహనశైలి ‘ఉఫ్‌’ అని కూడా అన లేదు. ఒకే మాట ”ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ వాక్యము అది ఎన్నిటికీ సృష్టి కాజాలదు”.
చివరికి రాజ్యాధికారంతో విర్రవీగిన వారందరూ సత్యప్రియుని ముందు తలలు దించుకునే రోజు రానే వచ్చింది. మేము మార్గభ్రష్టతకు గుర య్యాము, రుజుమార్గంపై ఉన్నది నీవే అని అంగీకరించవలసిన రోజు రానే వచ్చింది.అదెలాగంటే, ఖలీఫా వాసిఖ్‌ బిల్లాహ్‌ా పరిపాలన చివరి రోజుల్లో రెండు సంఘటనలు సంభవించాయి, ఆ సంఘటనల అనంతరం వాసిఖ్‌ బిల్లాహ్‌ ఆలోచనలలో మార్పు వచ్చింది.

1) వాసిఖ్‌ బిల్లాహ్‌ కుమారుడు మహ్‌ాదీ తెలిపిన ప్రకారము… ఒకసారి ‘ఉద్‌నా’ ప్రాంతం నుండి ప్రముఖ హదీసువేత్త అబ్దుల్లాహ్‌ బిన్‌ ముహమ్మద్‌ అజ్‌రమీ (ఇమామ్‌ అబూ దావూద్‌ మరియు ఇమామ్‌ నసాయీ (రహ)లకు విద్య నేర్పిన గురువు) ఇనుప బేడీలలో బంధించబడి రాజు వాసిఖ్‌ దర్బారు లో హాజరు చేయబడ్డారు, గురువు గారి ముఖారవిందాన్ని చూసి రాజు సిగ్గు పడి పోయి గౌరవ మర్యాదలు చేయసాగాడు. తరువాత (బిద్‌అతీల గురువు) ఇబ్నె అబూ దావూద్‌ మొఅతజిలీతో చర్చ జరపాల్సిందిగా గురువు గారని కోరాడు, గురువు గారు వెంటనే నేను చర్చకు సిద్ధమే అతను ఓడిపోతాడు అన్నారు. ఈ మాట విన్న రాజుకి కోపం వచ్చి – అతను ఓడి పోతాడని మీకు ముందే ఎలా తెలిసింది?’ అని కేక వేసాడు. సరే మరి అతన్ని నాతో డిబెట్ చేయమని ఆదేశించండి అని గురువుగారు రాజుని కోరారు. అప్పుడు రాజు తన ఉద్దేశ్యాన్ని వ్యక్త పరుస్తూ ‘నేను ఇందు నిమిత్తమే మ్మిమల్ని రప్పించింది’ అన్నాడు. చర్చ మొదలయింది,

గురువుగారు: ఖుర్‌ఆన్‌ సృష్టి అని మీరు చెబుతున్న ఈ మాట, అంగీకరించబడిన ధార్మిక విశ్వాసాలకు లోబడిన మాటనా? ఆ మాటను విశ్వసించనిదే మనిషి విశ్వాసం అసంపూర్ణం అవుతుందా?
ఇబ్నె అబూ దావూద్‌: అవును
గురువుగారు: అల్లాహ్‌, ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి ప్రవక్త పదవి ఇచ్చిన తరువాత నుండి ఆయన తన అనుచర సమాజానికి తెలుపకుండా ఏదైన విషయాన్ని దాచారా?ఇబ్నె అబూ దావూద్‌: లేదు, దాచలేదు.
గురువుగారు: ప్రవక్త ముహమ్మద్‌ (స) తమ అనుచర సమాజానికి ఖుర్‌ఆన్‌ సృష్టి అని విశ్వసించమని పిలుపునిచ్చారా?
ఇబ్నె అబూ దావూద్‌: లేదు,
గురువుగారు: ఖుర్‌ఆన్‌లో ఇస్లామ్‌ ధర్మం సంపూర్ణం చేశానని తెలియజేసిన అల్లాహ్‌ మాట నిజమా? లేక అల్లాహ్‌ ధర్మం అసంపూర్ణం అని నమ్ముతూ అందులో కొత్త విశ్వాసాలను ప్రవేశపెడుతూ బలవంతంగా ప్రజలపై వాటిని రుద్దానికి ప్రయత్నిస్తున్న మీ వాదన నిజమైనదా?
ఇబ్నె అబూ దావూద్‌: ఎలాంటి సమాధానం ఇవ్వలేక పోయాడు.
గురువుగారు: మీరు బోధిస్తున్న ఈ విషయ జ్ఞానము ప్రవక్త ముహమ్మద్‌(స) వారికి ఉండేదా? లేదా? అంటూ గంభీరంగా ప్రశ్నించారు.
ఇబ్నె అబూ దావూద్‌: ఉండేది.
గురువుగారు: అంటే ఈ జ్ఞానం ప్రవక్త (స) ఉండి కూడా ఆయన మౌనం పాటించారేగానీ అనుచర సమాజానికి దీని గురించి బోధించ లేదు. అని మీ మాటల ద్వారా అర్థమవుతుంది; అవునా?
ఇబ్నె అబూ దావూద్‌: అవును.
గురువుగారు: ఖులఫాయె రాషిదీన్‌ అబూబకర్‌, ఉమర్‌,ఉస్మాన్‌, అలీ (ర) లకు దీని గురించి తెలిసుండేది. అయినా వారు కూడా మౌనం పాటించారు, తమ కాలపు ప్రజలపై ఒత్తిడి తీసుకు రాలేదు, అలాంటప్పుడు ప్రవక్త ముహమ్మద్‌ (స) లాగా, ఆయన తరువాత ఉత్తమ వ్యక్తుల వలే మౌనంగా ఉండటం మీ వల్ల కాదా? అని ప్రశ్నించారు.
ఈ మాటలు వింటున్న రాజు-గురువు గారి కాళ్ళు, చేతులకు వేయబడిన బేడీలను వెంటనే విప్పండని ఆదేశించాడు. బేడీలు విప్పగా ఆ బేడీలను గురువుగారు తమ సామగ్రిలో ఉంచుకున్నారు. ‘మీరు ఈ బేడీలను ఏం చేస్తారు?’ అని రాజు ప్రశ్నించగా- ”నేను నా వారసులకి నా మారణానం తరం ఈ బేడీలను నాతోపాటు ఖననం చేయండని హితవు చేయదలిచాను. ఎందుకనగా రేపు పరలోక దినాన ఈ దౌర్జన్యపరుడైన ఇబ్నె అబూ దావూద్‌ కు వ్యతిరేకంగా అల్లాహ్‌ా సన్నిధిలో అభియోగము దాఖలు చేయదలిచాను. ఓ అల్లాహ్‌! ఈ వ్యక్తి నాకు ఎందుకు ఖైదు చేయించాడు? ఎందుకు నా కుటుంబీకులకు ఇబ్బంది కలిగించాడు? అని ప్రశ్నించదలిచాను” అంటూ గురువుగారు కంట తడి పెట్టారు. గురువుగారి మాటలు విని రాజు వాసిఖ్‌ కళ్ళు కూడా చెమర్చాయి. రాజు దర్బారులో ఉన్నవారందరూ కన్నీరు మున్నీ రయ్యారు..
చర్చ అనంతరం రాజు వాసిఖ్‌ బిల్లాహ్‌ గురువు గారిని చాలా గౌరవిం చాడు, బహుమానం ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. కాని గురువుగారు బహు మానం స్వీకరించానికి అంగీకరించలేదు.
మహ్‌దీ బిన్‌ వాసిఖ్‌ బిల్లాహ్‌ ఇలా తెలిపాడు: ఈ చర్చ జరిగిన తరువాత నా ఆలోచనలో స్పష్టమయిన మార్పు వచ్చింది, బహుశా అదే తర్వాత మార్పుకు అంకురం అయ్యింది. (సశేషం)

Related Post