ధర్మానుసరణతోనే జీవితాల్లో శాంతి

ఆయన జీవన విధానం మానవాళికంతటికీ ఆదర్శమని, సమస్త మానవాళికీ ఆయన కారుణ్యమనీ పవిత్ర ఖురాన్ స్పష్టం చేసింది. (ముహమ్మద్) మేము నిన్ను యావత్తు ప్రపంచవాసుల పాలిట కారుణ్యంగా చేసి పంపాము. (అంబియా 107) ‘ప్రవక్త జీవన విధానంలో మీకు మంచి ఆదర్శం ఉంది’ (అహెజాబ్ 21).

ఆయన జీవన విధానం మానవాళికంతటికీ ఆదర్శమని, సమస్త మానవాళికీ ఆయన కారుణ్యమనీ పవిత్ర ఖురాన్ స్పష్టం చేసింది. (ముహమ్మద్) మేము నిన్ను యావత్తు ప్రపంచవాసుల పాలిట కారుణ్యంగా చేసి పంపాము. (అంబియా 107) ‘ప్రవక్త జీవన విధానంలో మీకు మంచి ఆదర్శం ఉంది’ (అహెజాబ్ 21).

సృష్టి ప్రారంభం నుండి, సృష్టికర్త మానవ మనుగడ కోసం ఒక జీవన వ్యవస్థను, ధర్మాన్ని అవతరింపజేశాడు. తన ఇష్టాన్ని, అయిష్టాన్నీ ఎరుక పరిచాడు. సాఫల్య వైఫల్యాల మార్గాలను విస్పష్టంగా తెలియజేశాడు. ఏవిధమైన జీవన విధానాన్ని అవలంబిస్తే ఇహపరలోకాల్లో సుఖశాంతులు, సంతృప్తి సాఫల్యాలు పొందవచ్చునో, ఏ విధానంలో ఇహ పర కష్టనష్టాలు, అశాంతి, అసంతృప్తులు, వైఫల్యాలు ఉన్నాయో వివరించాడు. తన మనోభీష్టాన్ని ప్రజలకు వివరించి, ముక్తి, మోక్షాల మార్గం చూపడానికి వారి నుండే ప్రవక్తలను ఎంచుకున్నాడు.

వారిపై తన ఆదేశాలను అవతరింపజేశాడు. దైవాదేశాలకనుగుణంగా, దైవ సందేశహరులు ఎప్పటికప్పుడు ప్రజలకు మార్గదర్శకం వహిస్తూ, వారిని రుజుమార్గంపై నడపడానికి ప్రయత్నించారు. దైవం, దైవప్రవక్తల ఉపదేశాలకనుగుణంగా, ధర్మానుసరణలో జీవితం గడిపినంతకాలం మానవ సమాజం సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉంది. ఎప్పుడైతే జీవన విధానంలో అధర్మం ప్రవేశించిందో, అప్పుడే మానవాళికి కష్టాలు ప్రారంభమయ్యాయి. జీవితంలో శాంతి కరువైపోయింది.

ఈవిధంగా మానవులు సన్మార్గం తప్పి వక్రమార్గం పట్టినప్పుడల్లా, దైవం వారిని మళ్లీ రుజుమార్గంపైకి తీసుకురావడానికి, వారి జీవన విధానాన్ని గుర్తు చేసి వైఫల్యాల నుండి రక్షించడానికి, వారిలో నుండే ఉత్తములైన వారిని ఎంపిక చేస్తూ వచ్చాడు. దాదాపు లక్షా ఇరవైనాలుగువేలమంది మహనీయులను దైవం తన సందేశహరులుగా నియమించినట్లు ధర్మశాస్త్రగ్రంథాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ పరంపరలోని చివరి దైవప్రవక్త ముహమ్మద్ ( స) ఈయన ద్వారా ధర్మం సంపూర్ణమైంది. ఇక ప్రళయం వరకు జన్మించే మానవులందరికీ ముహమ్మద్ ప్రవక్త (స)మార్గదర్శకత్వమే అనుసరణీయం.

ఎందుకంటే, ఈయనకంటే ముందు నియమితులైన దైవప్రవక్తలందరూ ఒక జాతికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక కాలానికో పరిమితమయ్యారు. అలాగే ఆద్ జాతి వారికి ‘హూద్’ (అ)ప్రవక్తగా నియమితులయ్యారు. అదేవిధంగా మూసా, ఈసా (అ.ముస్సలా)లు తమ తమ జాతి జనులకు మాత్రమే (ఇశ్రాయేలు సంతతి) ప్రవక్తలుగా నియమించబడ్డారు. కాని ముహమ్మద్ ప్రవక్త (స) సమస్త మానవాళికీ మార్గదర్శిగా వచ్చారు. ప్రళయకాలం వరకు వచ్చే మానవులందరికీ ఆయన కారుణ్యంగా ప్రభవించారు.

ఆయన జీవన విధానం మానవాళికంతటికీ ఆదర్శమని, సమస్త మానవాళికీ ఆయన కారుణ్యమనీ పవిత్ర ఖురాన్ స్పష్టం చేసింది. (ముహమ్మద్) మేము నిన్ను యావత్తు ప్రపంచవాసుల పాలిట కారుణ్యంగా చేసి పంపాము. (అంబియా 107) ‘ప్రవక్త జీవన విధానంలో మీకు మంచి ఆదర్శం ఉంది’ (అహెజాబ్ 21).

కనుక ముహమ్మద్ ప్రవక్త (స) ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక ప్రాంతానికో, ఒక భాష మాట్లాడే వారికో లేక ఒక కాలానికో పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన అందరి ప్రవక్త. విశ్వజనీన ఆదర్శమూర్తి. విశ్వకారుణ్యమూర్తి. ఆయన ద్వారానే ధర్మం పరిపూర్ణమైంది. ఆయన మాటను, ఆయన బాటను అనుసరించడంలోనే మానవుల సాఫల్యం ఉంది. ఏకేశ్వరారాధనలోనే మానవుల ఇహపర సాఫల్యాలు ఉన్నాయని ముహమ్మద్ ప్రవక్త (స) స్పష్టం చేశారు. స్వార్థాన్ని వీడితేనే శాంతి దొరుకుతుందని సెలవిచ్చారు. బుద్ధిని ఉపయోగిస్తేనే నిజాలు వెల్లడవుతాయని ప్రవచించారు. అంధానుకరణ అజ్ఞానంలోకి నెట్టివేస్తుందని హెచ్చరించారు.

కాబట్టి, జీవితాల్లో సుఖశాంతులు పరిఢవిల్లాలంటే, మానసిక ప్రశాంతత, ఆత్మసంతృప్తి సిద్ధించాలంటే, ఇహలోకంంతోపాటు, పరలోక సాఫల్యం పొందాలంటే తు.చ. తప్పకుండా దైవధర్మాన్ని అనుసరించాలి. దైవాదేశాలు, ప్రవక్త ప్రవచనాల వెలుగులో జీవితాలను సమీక్షించుకుంటూ జీవనయానం కొనసాగించాలి. అప్పుడే శాంతి సాఫల్యాలు సొంతమవుతాయి.
శరీరానికి అనారోగ్యం కలిగితే భౌతిక జీవితం ప్రభావితమవుతుంది. అదే ఆత్మవ్యాధిగ్రస్థమైతే ఇహపర జీవితాలు రెండూ నాశనమౌతాయి. శారీరక అవసరాల పరిపూర్తిపై మాత్రమే శ్రద్ధవహిస్తే, అది పశుప్రాయమైన జీవితం అవుతుంది. అలాగే ఆధ్యాత్మిక అవసరాల పరిరక్షణపై మాత్రమే శ్రద్ధ పెడితే అది దైవదూతలజీవితం అవుతుంది. ఈ రెండింటినీ సమన్వయ పరిచి, రెండిటి అవసరాలు తీరిస్తే, అది మానవ జీవితం.

మానవుడు రెండు వస్తువులు లేదా రెండు పదార్థాల ప్రతిరూపం. ఒకటి శరీరం, రెండు ఆత్మ. ఈ రెండింటి అవసరాలు వేర్వేరు. అందుకని వీటి పోషణ, పరిరక్షణకు దైవం రెండు రకాల వేర్వేరు ఏర్పాట్లు చేశాడు. మాతృగర్భంలోంచి బయటికి రాగానే అమ్మ ఎదలోంచి అమృతధారలాంటి పాల ఏర్పాటు మొదలు, సమాధి గర్భంలోకి వెళ్లేవరకు దైవం ఎన్ని ఏర్పాట్లు చేశాడో ఒక్కసారి ఊహించగలిగితే హృదయం కృతజ్ఞతాభావంతో వినమ్రంగా వంగిపోతుంది. మానవ సృజన మట్టితో జరిగింది కాబట్టి అతని సమస్త భౌతిక అవసరాల పరిపూర్తికి భూ ఉత్పత్తుల నుండే ఏర్పాట్లు చేశాడు దైవం.

మానవుడి భౌతిక అవసరాలన్నీ వీటిద్వారానే పరిపూర్తి అవుతాయి. ముందు చెప్పుకున్నట్లు, మానవుడికి ఆత్మ కూడా ఉంది. దానికీ ఆహారం కావాలి. మనిషి సజీవంగా ఉండాలంటే ఆహారం ఎలా అవసరమవుతుందో, అలాగే ఆత్మ సజీవంగా ఉండాలన్నా దానికీ ప్రత్యేకమైన ఆహారం కావాలి. అయితే శారీరక అవసరాలు తీర్చే ఆహారం దీనికి పనికి రాదు. ఆత్మకు ఆధ్యాత్మిక ఆహారం కావాలి. అంటే దైవిక బోధనలు, దైవప్రవక్తల మార్గదర్శనం, దైవగ్రంథ పారాయణం, సజ్జన సాంగత్యం. వీటి ద్వారానే ఆత్మకు కావలసిన ఆహారం లభిస్తుంది. దేహం, ఆత్మ… ఈ రెండు పరస్పరం భిన్నమైనవి. ఒకటి నాశనమైపోయేది, మరొకటి నాశనం కానిది.

ఒకటి కింది స్థాయికి చెందినది, మరొకటి ఉత్తమశ్రేణికి చెందినది. ఈ రెండిటి మధ్య అసలు పొంతన, సారూప్యత లేనే లేదు. ఎప్పుడూ వీటిమధ్య సంఘర్షణే. ఒకదాని ప్రాబల్యం అధికమైతే, మరొకటి అణిగిపోతుంది. దేని ప్రాబల్యం అధికమైతే, అది మరొక దాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకని ఈ రెండింటి సంస్కరణ, శిక్షణ అత్యంత అవసరం. కేవలం భౌతికతపై మాత్రమే దృష్టి పెట్టి, ఆత్మను పట్టించుకోకపోతే, పైశాచికత్వం ప్రాబల్యం వహిస్తుంది. ఆధ్యాత్మిక ఆహారం లేని ఆత్మ బలహీనమై, వ్యాధిగ్రస్థం కావడం వల్ల మనిషి మానవరూపంలోని దానవుడుగా మారే ప్రమాదమూ ఉంది.

ఒకవేళ ఆధ్యాత్మిక వికాసానికే అధిక ప్రాధాన్యతనిచ్చి, భౌతిక అవసరాలను అణచివేసి, ఆత్మవికాసం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే, మానవుడు ఐహికజీవితాన్ని త్యజించి, ఇల్లూవాకిలీ, భార్యాపిల్లలను వదిలేసి, అడవుల్లోకి పారిపోతాడు. ఈవిధమైన సన్యాసత్వం వల్ల మానవ జీవిత ఉద్దేశ్యమే మరుగున పడుతుంది. ఈవిధమైన రెండు అతిశయాలకు అతీతంగా, మధ్యేమార్గాన్ని అవలంబిస్తూ విలువలతో కూడిన ధర్మబద్ధమైన జీవితం గడపడమే మానవ జీవిత లక్ష్యం. అటుపూర్తిగా ఐహిక వ్యామోహంలో పడటం… ఇటు పూర్తిగా ఆధ్యాత్మికంలో పడి సామాజిక బాధ్యతలనుండి పారిపోవడం రెండూ అతిశయాలే, ధర్మవ్యతిరేక మార్గాలే. ఈ రెంటికి భిన్నంగా ఐహిక జీవితాన్ని నైతిక, ఆధ్యాత్మిక విలువల పరిధిలో గడపడమే అసలైన దైవధర్మం.

Related Post