New Muslims APP

ఆలోచన ఖరీదు-ఖరీదైన ఆలోచన

''వాస్తవానికి తమలోని స్వార్థప్రియత్వం (పేరాశ) నుండి కాపాడ బడిన వారే కృతార్థులు''. (అల్‌ హష్ర్‌: 9)

”వాస్తవానికి తమలోని స్వార్థప్రియత్వం (పేరాశ) నుండి కాపాడ బడిన వారే కృతార్థులు”. (అల్‌ హష్ర్‌: 9)

”అల్లాహ్‌ అత్యున్నత ఆలోచనల్ని, అత్యుత్తమ కార్యాల్ని ఇష్ట పడతాడు. తుచ్చ ఆలోచనల్ని, నీచ కార్యాల్ని ఇష్ట పడడు” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (తబ్రానీ)
ఆలోచన మనిషి బుద్ధికి చెందిన విశేష లక్షణం. ఆలోచన ఎంత విలక్షణమ యినదంటే ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు ఒకేలా ఉండవు. సాత్విక ఆలోచన, భౌతిక ఆలోచన, అంతర్జాతీయ ఆలోచన, జాతీయ ఆలోచన, రాష్ట్రీయ ఆలోచన, ప్రాంతీయ ఆలోచన, సామాజిక ఆలోచన, వ్యక్తిగత ఆలోచన, సమైక్య ఆలోచన, నిర్మాణాత్మక ఆలోచన, స్వార్థ ఆలో చన. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషంటే ఆలోచన, ఆలోచనంటేనే మనిషి. మనం మన ఆలోచనల్ని అత్యున్నత అశయాల కోసం వెచ్చించాలి. లేదంటే అది ఖచ్చితంగా వక్ర మార్గాలు పోతుంది.

మనం ముందు ఏదయినా ఆలోచిస్తాం. ఆ తర్వాతే అది కార్యరూపం దాలుంది. ఆలోచన మన జివితపు అన్ని రంగాల్లోనూ, అన్ని అంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మెదడులో అలోచన బీజం పడగానే – ఆ విత్తనం నాసిక రకమా, మంచి విత్తనమా అన్నా తేడా లేకుండా శరీరంలోని పంచేద్రి యాలు, జ్ఞానేంద్రియాలు దానికి రూపం ఇవ్వడానికి పూనుకుాంయి. అందుకే మేరాజ్‌ సందర్భంగా ఏడు ఆకాశాలపైన’మలయె ఆలా’లో అల్లాహ్‌ ప్రవక్త వారికి చేసిన హితవు – ”మంచి ఆలోచన వస్తే (అది కార్య రూపం దాల్చక పోయినా) పుణ్యం లభిస్తుంది. కార్య రూపం ఇస్తే దానికి పదింతలు మొదలు ఏడు వందలు దానికి మించి పెంచి పుణ్యం ఇవ్వ బడుతుంది”. (బుఖారీ) అన్నది.
మహితాత్ముడయిన అల్లాహ్‌ా ఈ హితోక్తి ఆధారంగా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌(స) తన సహచరుల్ని ఎలా తర్పీదిచ్చారంటే, ఒకప్పుడు ఆలోచ నలకు ఖరీదు చెల్లించే వారే ఖరీదయిన ఆలోచనలు, అత్యు త్తమ ఆదర్శాలు గల వ్యక్తులుగా రూపామతరం చెందారు. రాయి-రప్ప, పాము-పుట్ట, విగ్ర హాలు-క్రీమికీటకాలను అలౌకికానందంతో హారతులు పడుతూ దైవంగా భావించి కొలవడం వారి పెడ బుద్దికి వారు చెల్లించుకున్న మూల్యం అయితే, నిజ సృష్టికర్త అల్లాహ్‌ మాత్రమేనని గుర్తించి, ఆయనకు మాత్రమే తన దాస్యాన్ని అంకితం చేయడం వారిలోని ఖరిదయిన ఆలోచనకు నిదర్శనం. ఆడ కూతురిని ఆవమానంగా భావించి సజీవంగా పూడ్డి పెట్టడం వారి తప్పుడు ఆలోచనకు వారు చెల్లించుకున్న ఖరీదయితే, అదే ఆడ కూతురి పోషణ కోసం, జాఫర్‌, అలీ, అబ్బాస్‌ విం ఉద్దండులు పోటీ పడటం వారి లోని ఖరీదయిన ఆలోచనకు ఆనవాలు. అలాంటి కొన్ని వాస్తవ గాథల్ని తెలుసుకుందాం!
హజ్రత్‌ ఉమర్‌ (ర) నాలుగు వందల దీనార్లు తన వద్ద పని చేసే వ్యక్తి ఇచ్చి-”వీటిని అబూ ఉబైదా బిన్‌ జర్రాహ్‌ (ర)కు ఇచ్చి, తనకున్న అవసరాల్ని తీర్చుకోమని చెప్పు” అని పురమాయించి పంపారు. అలా అనుకోకుండా వచ్చి ఆ మొత్తాన్ని అబూ ఉబైదా(ర) – పనికత్తెకు అప్పగిస్తూ ఫలానా ఇంి వారి కోసం ఇంత, ఫలానా ఇంటి వారి కోసం ఇంత… అంటూ మొత్తం పైకాన్ని ఉమర్‌ (ర) గారి బానిస చూస్తుండగానే పంచేశారు. తన కోసం నయా పైసా ఉంచుకో లేదు. (ఇబ్ను ముబారక్‌)

విశ్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా (ర) గారు ఉపవాసంతో ఉన్నారు. ఓ యాచకుడు వచ్చి సహాయం అడగ్గా – అప్పుడు ఆమె ఇంట్లో ఒక్క రొట్టె మాత్రమే ఉంది. అది ఆ యాచకునికి ఇవ్వాల్సిందిగా పనికత్తెను పురమా యించారు. ఇంట్లో ఆ ఒక్క రొట్టె మాత్రమే ఉంది అని చెప్పినా ఆమె విన లేదు. (మాలిక్‌)
యర్‌మూక్‌ యుద్ధంలో పాల్గొని క్షతకాత్రులయి తీవ్ర దాహంతో జీవన్మరణాల మధ్య కొట్టుమ్డిడుతున్న ముగ్గురిలోని ఒకరి వద్దకు నీళ్ళు తిసుకెళ్ళి త్రాగ మని చెబితే, కాసింత దూరంలోనున్న తన సోదరుని దాహం తీర్చమని పంపగా, అతను మరో సోదరుని వద్దకు పంపాడు. మూడో వ్యక్తి వద్దకు చేరుకునే లోపు అతను షహీద్‌ అయ్యాడు. రెండో వ్యక్తి వద్దకు వస్తే తనూ అల్లాహ్‌ాకు ప్రియుడయ్యాడు. మొది సోదరుని వద్దకు వస్తే అతను కూడా అమరగతుడయ్యాడు. అలా ఒకరి కోసం ఒకరు ప్రాణ త్యాగం చేశారు. (అల్‌ బిదాయహ్‌ వన్నిహాయహ్‌)
ప్రవక్త (స) ఒక అతిథిని ఎవరు సత్కరిస్తారు అని అడగ్గా ఓ అన్సారీ సహాబీ తనతోపాటు ఇంికి తీసుకెళ్లి – అతిథి మర్యాదలు చేయాల్సిందిగా, అతిథి కోసం వంట చేయాల్సిందిగా పురమాయించాడు. ‘ఇంట్లో చిన్న పిల్ల కోసం ఓ పూటకు సరిపడే కాసింత ధాన్యం మాత్రమే ఉందండి’ అని భార్య చెప్పగా, పిల్లలు రాత్రి భోజనం అడిగితే వారిని ఏదోకి చెప్పి పడుకో బెట్టెయ్యి. వం చేసి, దీపం ఆర్పేసి అతిథికి వడ్డించు అన్నారు. పిల్లల్ని పడుకో బెట్టేసి, వంట తయారయ్యాక, అతిథిని ఆహ్వానించి దీపం సరి చేసే సాకుతో దీపాన్ని ఆర్పి వేసి ఆ దంపతులిద్దరూ అతిథితో కూర్చుని ఖాలీ ప్లేటు ముందు పెట్టుకొని తింటున్నట్లు నిస్తూ ఆ అతిథిని సత్కరించారు. అల్కాహ్‌ా ద్వారా రాత్రి సంఘటనను తెలుసుకున్న ప్రవక్త (స) వారినుద్దేశించి – ‘నిన్న రాత్రి మీ ప్రవర్త అల్లాహ్‌కు ముచ్చటేసి ఎంతగానో సంతోషిం చాడు” అని చెప్పడంతోపాటు ఆ శుభ సందర్భంగా అవతరించిన ఆయతుని సయితం చదివి విన్పించారు. ”తాము అమిత అవసరంలో ఉన్నప్పికీ తమ పై వారికే ప్రాధాన్యతనిస్తారు”. (అల్‌ హష్ర్‌: 9)
అబుల్‌ హసన్‌ అన్తాకీతోపాటు 30 మంది రాత్రి వేళ ఓ పల్లెలో ప్రోగ య్యారు. వారి దగ్గర కాసిన్ని రొట్టెలు మాత్రమే ఉన్నాయి. అందరికీ అవి సరి పోవు. ఎవరికి బాగా ఆకలి ఉంటుందో వారు తింరు అన్న సదుద్దేశ్యంతో దీపాల్ని ఆర్పి వేశారు. కాసేపు తర్వాత దీపాలు వెలిగిస్తే ఎక్కడ రొట్టెలు అక్కడే ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క రొట్టె ఎవరూ తిన లేదు.
అబ్దుల్లాహ్‌ బిన్‌ జాఫర్‌ ప్రయాణంలో ఉండగా ఖర్జూర తోటలో పని చేసే ఓ నీగ్రో బానిసను చూశారు. భోజన సమయంలో అతని వద్దకు బాగా ఆకలి మీదున్న ఒక కుక్క వచ్చింది. అతను ఒక రొట్టె వేయగా అది తినేసింది. ఇంకొకి, మరొకి అంటూ మొత్తం రొట్టెల్ని ఆ కుక్కకి పెట్టేశాడా నీగ్రో బానిస. అది గమనించిన అబ్దుల్లాహ్‌ా బిన్‌ జాఫర్‌-నీ దగ్గర ఎంత తిండుం దేమి? అని ప్రశ్నించారు. మీరు చూసిందే అన్నాడా వ్యక్తి. మరి మొత్తం ఈ కుక్కకు పెట్టేశావేమి? అని ఆరా తీయగా – ‘ఇది కుక్కలు ఉండే ప్రాంతం కాదు. పాపం చాలా దూరం నుంచి వచ్చినట్లుంది. అది ఆకలితో అలమిస్తుండగా నేనలా కడుపు నిండా భోంచేయ గలను చెప్పండి! అందుకే అంతా పెట్టేశా’. మరి నీ రోజు ఎలా గడుస్తుంది?అంటే, ఎలాగోలా గడిచిపోతుందిగా అని తాపీగా సమాధానం చెప్పి వెళ్లి పోయాడు. అతని ఆ ప్రవర్తనకు ఎంతో ముగ్దులయిన ఆయన – ”నేనిప్పటి వరకు చేసిన దానాల్ని నిందిస్తున్నాను, ఈ బానిస నాకు మించిన దానశీలి” అని లోలోన అనుకోవ డమే కాక, ఆ బానిసను, ఆ తోటను, తోటలో ఉన్న సకల వస్తువు సామగ్రిని కొని అతనికిచ్చి స్వేచ్ఛను ప్రసాదించారు. (ఇహ్యా ఉలూముద్దీన్‌) ఒక్క మాటలో చెప్పాలంటే ”వాస్తవానికి తమలోని స్వార్థప్రియత్వం (పేరాశ) నుండి కాపాడ బడిన వారే కృతార్థులు”. (అల్‌ హష్ర్‌: 9)
పై పేర్కొనబడిన గాథలన్నింలో వెర్వేరు కాలాలకు చెంది వీరందరూ ఈ స్వార్థ ప్రియత్వాన్ని వీడి సాత్వికంగా ఆలోచించారు గనక ఖరీదయిన ఆలోచనలు గల ఖరీదయిన వ్యక్తులుగా చరిత్రలో చిరస్మరణీయులయ్యారు.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.