ఇస్లాం చారిత్రక పాత్ర – 3

save-world

 

(జాతులు నైతికంగా అత్యంత నీచ స్థాయికి దిగజారిపోయి వాటి హృదయాలకు తుప్పు పట్టి, వారి మనో సీమలు బీటలు వారి, ఊబి నేలగా మారిపోయినప్పుడు దేవుని తరఫు నుంచి వచ్చే హెచ్చరికలు కూడా వాటికి కనువిప్పు కలిగించ లేవు. మెదళ్ళపై పడి ఉన్న భ్రాంతి దట్టమయిన తెరల కారణంగా వారికి సత్యం బోధ పడదు. సృష్టికర్త ఒక్కడే, ఆయన అద్వితీయుడు, సర్వోన్నతుడు, సర్వ శక్తిమం తుడు, ఆయనకు పోలినదేది లేదు అన్న యదార్థం వారి తలకెక్కదు. అందువల్ల వారు కనులున్నా సత్యాన్ని చూడరు, వీనులున్నా సత్యాన్ని వినరు. మనసున్నా సత్యాన్ని అర్థం చేసుకోరు. దిద్దుబాటు వైపునకు వారు రానేరారు. వారి మనసు లో ఏ కోశానా పశ్చాత్తాప భావన కలుగదు. పైగా తమ తప్పుడు విధానాలు, మిథ్యా వాదాలను సమర్థించుకోవటానికి అందమయిన ఉపమానాలు ఇస్తారు. వాటి చుట్టూ సుందర వలయాన్ని అల్లటానికి శక్తిమేర ప్రయత్నిస్తారు. అలా చేసి తమ కర్తవ్యం నెరివేరినట్టు మనసులకు మభ్య పుచ్చుతూ ఉంటారు.  చివరికి దైవ శిక్ష రానే వస్తోంది. ఏ మేధ మోజులో పడి బీరాలు పోయేవారో ఆ మేధే పని చేయని దుస్థితి ఏర్పడుతుంది, ఏ సిరిని చూసుకొని మురిసిపోయేవారో దాన్ని జప్తు చేసుకోవడం జరుగుతుంది. ఏమీ తోచని అచేతనావస్థ వారిని కాళ నాగై కాటేస్తుంది.)

….ఎందుకంటే, ఒక్కసారి ప్రవక్తకుగానీ, ఏ ఇతర వ్యక్తికిగాని దైవత్వాన్ని ఆపాదిస్తే అతడు సర్వశక్తి సంపన్నుడిగా భావించబడి దేవుని గుణగణాలను తనను తాను ఆపాదించుకుం టాడు. అప్పుడు దేవుని ఏకత్వాన్ని, లేదా ప్రథమ సూత్రం (ఫస్ట్‌ ప్రిన్సిపల్‌) నిరపేక్షత ను కొనసాగించడం తార్కికంగా వీలు పడదు. ఈ వైరుధ్యాన్ని సమన్వయ పరచే విఫల ప్రయత్నం-విగ్రహారాధకులు, ప్రకృతి పూజా రులు, యూదులు, క్రైస్తవులు, హిందువులు చేశారు. ఫలితం- విశ్వాసంలో ఉన్న నిరా డంబరత కనుమరుగయింది. త్రిమూర్తులు, త్రియేక దేవుడు, ముక్కోటి దేవతలు, మంచి దేవుడు, చెడ్డ దేముడు అన్న ఛాందసం మార్మిక భ్రాంతి రాజ్యమేలింది. పామరులకే కాక పండితులకు సయితం మింగుడు పడని ఈ సిద్ధాంతాల ఊబిలో కూరుకుపోయి దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడే ప్రజలకు సం పూర్ణ స్వేచ్ఛ ప్రదాయినిగా ఇస్లాం తన సత్తా ను చాటుకుంది. నిజం ఏమిటంటే ప్రతి ప్రాణి హృదిలో నిక్షిప్తమయి ఉన్న విషయం తౌహీద్‌ – స్వచ్ఛమయిన ఏకేశ్వరోపాసన. అయితే మనిషి పరిసరాల వల్లనో, సావాసాల వల్లనో, కుటుంబ ఒత్తిడి వల్లనో అంతరాత్మ ప్రబోధనాన్ని అణచ పెట్టి బహుదైవోపాసాల భావ ప్రవాహంలో కొట్టుకు పోతుంటాడు మనిషి. చిల్లర రాళ్ల ముందర, మిథ్యా దైవాల ముందర తలవంచడం తలవంపుగా భావిం చడు. పైగా అవేదో తన అవసరాలు తీరుస్తా యని, తన పాలిట ఆపద్బాంధవుల్లా వ్యవహరి స్తాయని మొక్కుబడులు చేసుకుంటాడు, మూఢభక్తితో ముడుపులు ఎంతో మక్కువగా చెల్లించుకుంటాడు. కాని ఒక ఘడియ తప్పక వస్తుంది. మనిషి అంతరాత్మ మేల్కొంటుంది. సత్యాన్ని గ్రహిస్తుంది. అంగీకరిస్తుంది, ఆచరి స్తుంది. మార్గవిహీనత అనే రొంపి నుండి బయట పడి నిజ మార్గదర్శన భాగ్యం అతనికి ప్రాప్తిస్తుంది. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా వివరిస్తోంది:”మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్‌ా ప్రవక్తలను శుభవార్త ఇచ్చే వారుగా, భయ పెట్టేవారుగా చేసి పం పాడు. ప్రజల మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలపై తీర్పు చేయడానికిగానూ, వారి వెంట సత్యబద్ధమైన గ్రంథాలను పంపాడు.

”మానవులంతా ఒకే సమాజంగా ఉండే వారు. అల్లాహ్‌ా ప్రవక్తలను శుభవార్త ఇచ్చే వారుగా, భయపెట్టేవారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలపై తీర్పు చేయడానికిగానూ, వారి వెంట సత్య బద్ధ్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే (ప్రజలే) స్పష్టమైన ఆదేశాలు ఒసగబడిన తార్వత కూడా-పరస్పర వైరభావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత అల్లాహ్‌ా విశ్వాసులకు ఈ భేదాభి ప్రాయాం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపునకు దర్శకత్వం వహించాడు. అల్లాహ్‌ా తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు”. (బఖరా: 213)

చరిత్రలో అది యూరప్‌ పాలిట అంధకార యుగం. అదే సమయంలో, భారత దేెశంలో కూడా పరిస్థితులు దయనీయంగా మారి ఉన్నాయి. వింత, విడ్డూరాచారాలు వికటిం చిన తరుణంలో అటు యూరప్‌లోనూ, ఇటు భారత దేశంలోనూ తళుక్కున మెరిసిందొక ఆశాకిరణం. అది మానవ శ్రేయానికి శుభోద యం. అబ్బాసీల , ఫాతిమీల  మరియు ఉస్మానీల  అమోఘ పాలనలో ఆసియా, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్‌లలో విద్యా సంస్కృతి గొప్పగా అభివృద్ధి చెందింది. సమర్‌ఖంద్‌, బొఖారాల నుండి పేజ్‌, కొనిడావా వరకు ఎంతో మంది పండితులు ఖగోళం, గణితం, భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాలు మొదలైనవి అభ్యసించి బోధించారు.  చర్చీ నిరంకుశత్వ మూఢ నమ్మకాల కారణంగా ఎంతో విలువైన గ్రీకు తత్వశాస్త్రం, గ్రీకు విద్య భూస్థాపితం అయింది. అప్పట్లో ఈ బృహత్తర కార్యానికి ముస్లింలు పూనుకోకుంటే, ఆ సంపద శాశ్వ తంగా నాశనమయ్యేది. అలా వారి అనితర సాధ్య సేవలు, అవిర కృషి వల్ల విరజిమ్మిన విద్యా వికాస వెలుతురు యూరపియన్లను విముక్తుల్ని చేసింది.భౌతిక, ఆధ్యాత్మిక మేధో పరమైన అభివృద్ధి దిశగా వారిని నడిపిం చింది.అరబ్బు తాత్వికులు, శాస్త్రజ్ఞుల మూలం గా నవీన కాంతులు నవ తరాలకు అందా యి. హమ్‌బోల్ట్‌  అభిప్రాయం ప్రకారం మనం వేటినైతే భౌతిక శాస్త్రాలు అంటున్నామో వాటికి నిజమైన పునాది వేసింది అరబ్బులు.

కొలతలు వీటిని గొప్ప పనిముట్లుగా అరబ్బులు అభివృద్ధికి బాట వేశారు. గ్రీకు శాస్త్రీయ అంశాలకు నవీన కాలానికి వారధి గా నిలిచారు. అల్‌ ఖండి , అల్‌హసన్‌ , అల్‌ఫారాబీ  , ఇబ్ను సీనా  అల్‌ గజాలీ  , అబూ బకర్‌ అవెంపెస్‌, అల్‌ ఫెట్రాగియోస్‌ మానవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేర్లు ఇవి. అసలు యూరోపియన్‌ భాషల్లో వచ్చిన చారిత్రక రచనల్లో అరేబియన్‌ పేర్లను ఎంతో కుదించి రాశారు.

ప్రవక్త అనుయాయులు గ్రీకు విద్యావంతుల ను గౌరవించారు. గొప్పగా అర్థం చేసుకున్నారు. వారిని ఇస్లాం స్వీకరించమని ఒత్తిడి చేయలేదు. వారిని సాదరంగా ఆహ్వానించడ మేకాక, ఆశ్రయమిచ్చారు. ఈ వాస్తవం నేపథ్యంలో ఇస్లాం ఒక ఛాందస మతంగా ప్రచా రంలో ఉన్న భావనకు చారిత్రక సమర్థన లభించదు.

జ్ఞానాన్ని పెంపొందిచుకోవడంలో, భౌతికం గా అభివృద్ధి చెందడం, రాజకీయ శక్తి కూడ గట్టుకోవడంలో ఆఫ్రికా ఫాతమీలు, స్పెయిన్‌ ఉస్మానీ పోటీ పడ్డారు. కైరో ) గ్రంథా లయంలో లక్షకు పైగా పుస్తకాలు అట్టహాసం గా విరాజిల్లాయి. కార్‌డొవోనైతే 6 లక్షల పుస్త కాలతో అగ్ర భాగాన నిలిచింది.

ప్రఖ్యాత అలెగ్జాండ్రియా గ్రంథాలయాన్ని కూల్చినట్టుగా, కాల్చినట్టుగా మోపబడే ఒక అపవాదు ఇస్లాంను చారిత్రక భయంకర విస్ఫోటనంగా చిత్రీకరిస్తుంది. తగిన ఆధారా లను క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట ఆ గ్రం థాలయానికి సంబంధించిన సంఘటనపై గిబ్బన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇలా ఉంది: ”ఉమర్‌ (ఖలీఫా (ర) వెలువరించిన ఉత్తరువు ఇస్లాం హేతువాద ధర్మ సూత్రాలకు పూర్తిగా భిన్నమైనది, విరుద్ధమైనది. యుద్ధం లో స్వాధీనం చేసుకున్న యూదుల మత గ్రం థాలు, క్రైస్తవుల మతగ్రంథాలను అగ్నికి ఆహుతి చేయవద్దని శాస్త్రజ్ఞులు, చరిత్రక రులు, కవులు, వైద్యులు, తత్వవేత్తల రచనల ను ప్రజల శ్రేయస్సుకు న్యాయసమ్మతంగా ఉపయోగించవచ్చని ఉమర్‌ ఉత్తరువు ప్రక టించింది”.

చరిత్ర రచన నిస్పాక్షిక విమర్శగా రూపొందిన ప్పటి నుండి, ఈజిప్టు అలెగ్జాండ్రియా గ్రంథా లయ కల్పిత వృత్తాంతం విశ్వసనీయతను కోల్పోయింది. విలువైన ప్రాచీన  గ్రీకు రచనలను సేకరించి భద్ర పరచడమే కాక, కాపాడి  వాటికి గొప్ప వ్యాఖ్యానం చేసి, అభివృద్ధి పర చిన ఘనత అరబ్బులకే సొంతం. ప్లేటో, అరి స్టాటిల్‌, యూక్లిడ్‌, అప్పోలొనియోస్‌, టోలెమీ, హిప్రోక్రటి, గేలెన్‌ల సంపూర్ణ రచనలు నవీన యూరప్‌ నిర్మాతలకు వారి పేర్లతోనే మొదట గా లభించింది అరబీ భాషలోనే.వారు అరబ్బు నుండి వైద్యం, గణిత శాస్త్రాలే కాక ఖగోళిక శాస్త్రాన్ని అభ్యసించారు. మనిషి కల్పనా శక్తిని విశాల పర్చడమే కాక, ప్రకృతి యాంత్రిక ధర్మాలను విశదపర్చే ఖగోళ శాస్త్రాన్ని అర బ్బులు ఎంతో జాగ్రత్తగా అభివృద్ధి పర్చారు.  కొత్త పరిశోధనా పద్ధతుల సహాయంతో భూమి చుట్టు కొలతలను కొలిచే ఖచ్చితమైన విధానాన్ని, గ్రహాల సంఖ్య వాటి థలను తెలుసుకునే ఖచ్చితమైన విధానాలను అర బ్బులు తమ సొంతం  చేసుకున్నారు. వారి చేతుల్లో ఖగోళ శాస్త్రం జ్యోతిశ్శాస్త్ర బంధనాల నుండి విముక్తమై, ఒక ఖచ్చితమైన శాస్త్రంగా అభివైద్ధి చెందింది.ప్రాచ్య దేశాలలో సృష్టి పూజారులు ఖగోళ శాస్త్రాన్ని జ్యోతిశ్శాస్త్రంగా మలిచారు.

బీజ గణితాన్ని అలెగ్జాండ్రియాకు చెందిన డైయోఫాన్తొస్‌ ఆవిష్కరించినప్పటికీ, అరబ్బుల ప్రవేశానంతరం వరకూ అది సామాన్యుల విద్యా విషయకంగా మార లేదు. నిజానికి, బీజ గణితం (అల్ జీబ్రా ) అనే పదం అరబ్‌ మూలాలను సూచిస్తుంది. కాని ఈ విషయంలో అరబ్బులు గ్రీకులకు రుణ పడి ఉన్నారు. ఈ విషయాన్ని వారు చాలా వినయంగా ఒప్పుకుంటారు కూడా.  (ఇంకా ఉంది)

Related Post