నామకరణం: సూరహ్ తౌబహ్:
ఈ సూరహ్‌కు ‘తౌబహ్’ అని నామకరణం చెయ్యడానికి గల కారణం – ఇందులో కొందరు సహాబా పశ్చాత్తాప స్వీకరణ ప్రస్తావన ఉంది. ఈ సూరహ్ాకు గల మరో పేరు ‘అల్ బరాఅహ్’. అంటే ఇందులో అవిశ్వాసులతో స్నేహం చెయ్యకూడదన్న ఆదేశాలతో పాటు వారు ఇక మీదట నగ్నంగా కాబహ్ ప్రదక్షిణ చెయ్యకూడదు అన్న కఠిన ఆదేశం అవతరించింది.
సూరహ్ పరిచయం:
1) ఇది మదనీ సూరహ్. 128, 129వ ఆయతులు తప్ప. ఇవి మాక్కలో అవతరించాయి.
2) దీన్ని సూరహ్ మిఐన్ సూరాలలోనిది. మదనీ సూరాలలో ఇదొక్కి మాత్రమే ఆ కోవకు చెందినది.
3) దీని ఆయతుల సంక్య 129.
4) క్రమానుసారం ఇది 9వ సూరహ్.
5) ఇది సూరతుల్ మయిదహ్ తర్వాత అవతరించింది.
6) ఇది బస్మలహ్‌తో ప్రారంభమవదు.
7) ఇది హిజ్రీ శకం 9వ సంవత్సరం తబూక్ యుద్ధానంతరం అవతరించింది.
ముఖ్యాంశాలు:
బర్రా బిన్ ఆజిబ్ (ర) గారి కథనం- చివరి సారిగా అవతరించిన సూరహ్‌ా ఇది. ఈ సూరహ్‌లో ప్రారంభ వచనాలు తబూక్ యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత అవతరించింది. అప్పుడు హజ్రత్ అబూ బకర్ (ర) గారిని నాయకునిగా చేసి హజ్జ్ కోసం పంపి ఉన్నారు. ఆ సందర్భంలో ఈ ఆయతులను హజ్రత్ అలీ (ర) గారికి ఇచ్చివాటి ని మాక్క అవిశ్వాసుల ముందర చదివి విన్పించాల్సిందిగా పురమాయిం చారు.
తబూక్ యుద్ధం భయంకరమయిన ఎండల్లో సంభవించింది. కాబట్టి స్వచ్ఛమయిన విశ్వాసులు ఎవరో, కపట విశ్వాసులు ఎవరో ఈ సూరహ్ బట్ట బయలు చేసింది. ఈ సూరాలో రెండు ముఖ్యాం శాలున్నాయి. 1) ముష్రికులతో, యూద, క్రైస్తవులతో ఎలా వ్యవహ రించాలో వివరించ బడింది. 2) ఈ యుద్ధానికి సిద్ధమవ్వండి అని ఆదేశించిన సమయానికి ఖర్జూరాలు కోతకు వచ్చి ఉన్నాయి. అలాంటి సమయంలో యుద్ధానికి బయలుదేరడం ఓ గొప్ప పరీక్షకి తక్కువేమీ కాదు.
అవతరణ నేపథ్యం:
ముగ్గురు సహాబా ఈ యుద్ధంలో పాల్గొన లేదు. కారణం వారికి వద్ద ఉన్న సవారీ సౌకర్యమే. రేపు వెళదాం, మర్నాడు వెళదాం అన్న ఆలోచనలోనే ఉండి పోయారు. తర్వాత వారికి అన్ని విధాల బహిష్క రించడం జరిగింది. చివరికి వారి స్వచ్ఛమయిన తౌబహ్ కారణంగా అల్లాహ్ వారిని క్షమించాడు.
గమనిక:
ఈ సూరహ్ బస్మలహ్‌తో ప్రారంభం కాకపోవడానికి కారణం – 1) అది అల్లాహ్‌ా తరఫు నుంచి దైవ దూత జిబ్రీల్ ద్వారా ప్రవక్త (స) వారిపై అలానే అవతరించింది. 2) ఈ సూరహ్‌ా ప్రారంభ పలుకులు అల్లాహ్ ఆగ్రహాన్ని సూచించేవిగా ఉన్నాయి. అకనుక కరుణ ప్రస్తావన లేదు. అలాగే ఈ సూరహ్‌ను సూరతుల్ అన్ఫాల్ తతిమ్మాగా భావిస్తారు.