హజ్జ్‌ ఆశయాలు 1

హజ్జ్‌ ఆశయాలు – ”ఎవరయితే కాబా గృహపు హజ్జ్‌ చేసి హజ్జ్‌ మధ్యలో ఎలాంటి అశ్లీల చేష్టలకు, అసభ్య ప్రవర్తనకు దూరంగా ఉంటూ హజ్జ్‌ క్రియల్ని (భక్తీ ప్రపత్తులు, నియమ నిష్టలతో) పూర్తి చేెస్తారో వారు అదే రోజు తల్లి కడుపున జన్మించిన పసికందుని వలే పాపరహితులై తిరిగి వస్తారు” అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). (బుఖారీ గ్రంథం – 1521)

హజ్‌ మహాశయాలు అన్న అంశం చాలా పెద్ద అంశం. హజ్జ్‌కి వెళ్ళి వచ్చిన, వెళుతున్న, వెళ్లబోయే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం.  ఎందుకంటే ఆరాధన వఏదయినా దాని ఆశయానికి మనం చేరుకోకపోతే అది కేవలం ఓ అలవాటుగా మిగిలిపోతుంది గనక.

నిజంగా హజ్జ్‌ చేసే భాగ్యం లభించిన వారు ధన్యులు. అల్లాహ్‌ వారిని ఆహ్వానించాడు. వారు అల్లాహ్‌ ఆహ్వానాన్ని స్వీకరించి హజ్జ్‌ కోసం బయలు దేరారు. అవును ”హాజీలు, ఉమ్రా చేసేవారు అల్లాహ్‌ రాయబారులు. ఆయన వారిని పిలుపునిచ్చాడు. వారు జవాబిచ్చారు. వారు అయన్ను వేడుకున్నారు. ఆయన వారి మొరలకు ఆలకించాడు” వారు ఆయన్ను క్షమాబిక్షను వేడుకున్నారు, ఆయన వారిని మన్నించాడు” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (నసాయీ, ఇబ్ను మాజహ్‌) సుబ్హానల్లాహ్‌! అల్లాహ్‌ మనందరిని హజ్జ్‌ చేసే సద్భాగ్యాన్బి అనుగ్రహించుగాక! ఆమీన్‌.

హజ్‌ మహాశయాలు అన్న అంశం చాలా పెద్ద అంశం. హజ్జ్‌కి వెళ్ళి వచ్చిన, వెళుతున్న, వెళ్లబోయే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఆరాధన ఏదయినా దాని ఆశయానికి మనం చేరుకోకపోతే అది కేవలం ఓ అలవాటుగా మిగిలిపోతుంది గనక. హజ్జ్‌ ఇస్లాం అర్కానుల్లోని ఓ రున్క్‌. మహోన్నత ఆరాధన. అల్లాహ్‌ దాసులు ఆయన్ను చేరుకునే అత్యద్భుత సాధనం. ఈ మహారాధాన మహాశయాలు అనేకం ఉన్నప్పటికీ ఇక్కడ కొన్నింటిని మాత్రమే పేర్కొంటున్నాము.

మొదటి ఆశయం – తౌహీద్‌

అల్లాహ్‌ అస్తిత్వంలో, అల్లాహ్‌ రుబూబియ్యత్‌ (సార్వభౌమత్వం)లో, అల్లాహ్‌ ఉలూహియ్యత్‌ (దైవత్వం)లో అల్లాహ్‌ అస్మా వస్సిఫాత్‌ (నామాలు, గుణగణాల) విషయంలో ఆయన్ను ఏకైక దైవంగా, సాటి లేని మేటిగా భావించండం. ఆయనకు తల్లిదండ్రులు గానీ, భార్యా పిల్లలుగాని, భాగస్వాములుగానీ, ప్రత్యర్థులుగాని లేరని నమ్మ డం. ఆయన మహోన్నతుడు, ఆయనకంటే మహోన్నతమయినది లేదు. ఆయన చూపుల్ని అందుకోగలడుగానీ, ఆయన్ను ఏ చూపులు అందుకో జాలవు. ఆయన సృష్టికి కావాల్సిన పోలికలు ఇచ్చేవాడేగానీ, ఆయనకు దేనితోనూ పోలిక లేదు. లక్షణాలు, గుణగణాల విషయంలో సయితం ఆయనకు మరియు సృష్టికి మధ్య ఎలాంటి పోలిక లేదు. ఆయనలోని ఏ భాగమూ ఎవ్వరిలోనూ, ఎప్పుడూను, ఎందులోనూ ప్రవేశించ లేదు. విశ్వ వ్యవస్థను నిర్విఘ్నంగా నడుపుతున్న ఆయనకు కునుకుగానీ, నిద్దురగానీ, అలసటగానీ రాదు. విశ్రాంతి అవసరం ఆయనకు అంతకన్నా లేదు. మహోన్నత అర్ష్‌కి యజమాని అయిన ఆయన మానవాకారంలో అవతరిమచాల్సిన అగత్యంగానీ, తన స్థాయిని దిగజార్చుకలోవాల్సిన అవసరంగాని ఆయనకు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరు రోజులలో విశ్వ మొత్తాన్ని సృష్టించి, అర్ష్‌ మీద అసీనుడయి ఉన్న ఆయన ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎందులోనూ, ఎవ్వరిలోనూ లేడు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎవ్వరి అవసరం, ఎప్పుడూను ఆయనకు లేదు. ప్రవక్త (స) ఆయన మాటను ఉటంకిస్తూ ఇలా అన్నారు: ”నేను భాగస్వాములందరికన్నా ఘనాపాటి నిరపేక్షాపరుణ్ణి (నాకు ఎటువంటి భాగస్వామి అవసరం లేదు). నా విషయంలో ఎవ్వరయినా, ఎవ్వరినయినా నాకు సాటి కల్పిస్తే నేను అతని ఆ షిర్క్‌ను అతనికే వదలి పెడతాను”. (ముస్లిం)

ఈ వాస్తవాన్ని గ్రహించి, ఆయన్ను మాత్రమే ఆరాధించడం కోసమే ఆయన మనల్ని పుట్టించాడు. కాబట్టి ఇస్లామీయ ఆరాధనలన్నింలోనూ సమాంతరంగా ఉన్న మహాశయం తౌహీద్‌. అంతే కాదు మానవ జీవితంలో మనిషి ఏర్పరుచుకునే ఆశయాల్లో సయితం తౌహీద్‌దే అగ్రభాగం. తౌహీద్‌ రహిత ఆరాధన అది ఎంత నిష్ఠతో పాటించబడినా, ఎన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించ బడినా, ఎంత ఉత్తమ పద్దతిలో పాటించబడినా వృధా. అలాగే తౌహీద్‌ రహిత జీవితం అది ఎంత ఘనాపాటిదయినా వృధాయే. ఈ మాహాశయ సిద్ధి కోసమే మనమున్నాము. ఈ మహాశయ నిర్వర్తన కోసమే మనకు ఉనికి నివ్వడం జరిగింది. అది లేనిది మన ఉనికికి, మన జీవితానికి అర్థమూ లేదు, పరమార్థమూ లేదు. దాసుడు హజ్జ్‌ క్రియల్ని నిర్వర్తిస్తూ అడుగడునా సంగ్ర హించే మహాశయం తౌహీద్‌. హజ్జ్‌ కోసం సంకల్పం బూనింది మొదలు హజ్జ్‌ పూర్తి చేసుకునే వరకు అతన్ని నోట అనునిత్యం, అనుక్షణం నానుతూ ఉండే నినాదం – ‘లబ్బైక్‌ అల్లాహుమ్మ లబ్బైక్‌, లబ్బైక లా షరీక లక లబ్బైక్‌, ఇన్నల్‌హమ్ద, వన్నిఅమత, లక వల్‌ముల్క్‌, లా షరీక లక్‌’.- హాజరయ్యాను ప్రభూ! నేను హాజరయ్యాను. సాటి లేని స్వామీ! నేను హాజరయ్యాను. నిశ్చ యంగా నీవు మాత్రమే స్తుతింపదగినవాడవు. ఈ వరాలన్నీ నీవు ప్రసాదించి నవే. సార్వ భౌమాధికారం కూడా నీదే. నీకు ఎవరూ సాటి లేరు. (ముస్లిం హథీసు గ్రంథం)

ఇవి స్వచ్ఛమయిన తౌహీద్‌ పదాలు. సకల విధాల షిర్క్‌ నుండి ఈ పదాలు మనిషి దూరంగా ఉంచుతాయి. ఉమ్రా మరియు హజ్జ్‌ సందర్భంగా విశ్వా సులు ఈ పదాలను ఉచ్చరించాల్సిందిగా ప్రవక్త (స) వారు చెబితే, దీనికి భిన్నంగా అప్పి అవిశ్వాసులు కాబా ప్రదక్షిణ చేస్తూ ‘లబ్బైక లా షరీక లక లబ్బైక్‌’ – సాటి లేని స్వామీ! మేము హాజర య్యాము అని వారు అన్నప్పుడు – ‘మీ పాడుగాను! చాలు, చాలు, (ఈ మాట మీదే ఆగిపోండి)’ అని ప్రవక్త (స) వారు అనేవారు. అయినా వారు ఆగకుండా ఇలా అనేవారు: ”ఇల్లా షరీకన్‌ హువ లక తమ్‌లికుహు వమా మలక్‌” – కానీ ఓ భాగస్వామి; ఎవనికయితే నువ్వే అధికారాన్ని కట్ట బెట్టావో, స్వయంగా అతను దేనికి అధికారి కాదు. (ముస్లిం హథీసు గ్రంథం)

‘లా షరీక లక్‌’ అన్న వాక్యం తల్బియాలో రెండు మార్లు వచ్చింది. దాని తర్వాత లబ్బైక్‌ అని ఉంది. అలాగే ఇన్నల్‌హమ్ద, వన్నిఅమత, లక వల్‌ముల్క్‌ తర్వాత మళ్ళీ లా షరీక లక్‌ అని ఉంది. మొదటి సారి వచ్చిన లా షరీక లక్‌ – హజ్జ్‌ కోసం అల్లాహ్‌ ఇచ్చిన పిలుపుకి స్పందిస్తూ హజ్జ్‌ కోసం రావడంలో కేవలం అల్లాహ్‌ా ప్రసన్నత మాత్రమే ఉంది, ఇందులో ఎవ్వరికి ఎలాంటి భాగస్వామ్యం లేదు అన్న అర్థాన్ని గలది. తర్వాత వచ్చిన లా షరీక లక్‌ స్తుతి-స్తోత్రంలో, అనుగ్రహ – వర ప్రసాదంలో, సార్వ భౌమాధికారంలో అల్లాహ్‌కు ఎవ్వరూ సాటి లేరు అన్న అర్థాన్ని కలది. అంటే స్తుతి స్తోత్రాలన్నీ అల్లాహ్‌కే సొంతం. అనుగ్రహాలన్ని ఆయన ప్రసా దించనవే. సార్వభమాధికారం మొత్తం ఆయనకు మాత్రమే చెందినది. ఈ విషయంలో ఎవ్వరికి ఎలాంటి భాగస్వామ్యం లేదు. ఎవ్వరూ భాగస్వాములు కారు. ఈ భావార్థాన్ని ఒక హాజీ అనుక్షణం నెమరు వేసుకుంటూ ఉంటాడు. అవును ఈ విశ్వం మొత్తంలో ఒక గడ్డి పోచకు సయితం యజమా నులు కాని వారు ఎలా దైవం కాగలరు? స్వీయ కష్టనష్టాలకు అధికారులు కాలేని వారు సృష్టిరాసుల బాగోగులకు ఎలా అధికారులు కాగలరు? కూటికోసం కోటి విద్యల్ని ఆశ్రయించేవారు కోటానుకోట్ల మందికి ఉపాధిని ఎలా ప్రసాదించగలరు? ఒక సమయంలో పుట్టి మరో సమయంలో గిట్టేవారు, ఎలా పుట్టాలో, ఎక్కడ చస్తారో కూడా తెలియని వారు సృష్టి చరాచరాల జీవన్మరణాలకు ఎలా కారకులు కాగలరు? ఇది సయితం గ్రహించ లేని వారు ఎంతి అపమార్గం, అంధకారంలో ఉన్నారో ఆలోచించండి!

మహనీయ ముహమ్మద్‌ (స) హజ్జ్‌ కోసం మీఖాత్‌ చేరుకున్నాక హజ్జ్‌ సంకల్పం బూనుతూ – ”అల్లాహుమ్మ హజ్జతన్‌ లా రియా ఫీహా వలా సుమ్‌అ” – ఓ అల్లాహ్‌! నేను ఎలాంటి ప్రదర్శనా బుద్ధికి తావు లేని, ఎలాంటి పేరుప్రఖ్యాతల కోసం ప్రాకులాటకు చోటు లేని హజ్జ్‌ కోసం సంకల్పం బూనుతున్నాను అనేవారు. ఆ తర్వాత ఆయన తల్బియా పలు కులు పలుకుతూ ముందుకు సాగేవారు. అలా ఆయన మదీనా నుండి మక్కా వరకు, మక్కాలోని అరపాత్‌, మినా, ముజ్దలిఫా – ఎక్కడ విడది చేసినా ఈ పలుకులే ఆయన నాలుక మీద నానుతూ ఉండేవి. కాబట్టి హజ్జ్‌ అనునిత్యం పలుకబడే తల్బియా పలుకుల భావార్థాన్ని ఒక హాజీ సంగ్ర హిస్తూ హజ్జ్‌ క్రియల్ని నెరవేర్నిట్లయితే, అతను తన విశ్వాసంలో నిజాయితీ పరుడయి ఉంటాడు.

ప్రార్థించాలంటే అల్లాహ్‌ను మాత్రమే ప్రార్థిస్తాడు. అర్ధించాలంటే అల్లాహ్‌ను మాత్రమే అర్థిస్తాడు. నమ్మకం ఉంచాలంటే అల్లాహ్‌ మీద మాత్రమే నమ్మకం ఉంచుకతాడు. ఆయనకు మించిన కార్యసాధకుడు లేడు అని బలంగా నమ్ముతాడు. విశ్వం మొత్తం కలిసి తనకు మేలు కలుగజేయ బూనినా అల్లాహ్‌ చేయాలనుకున్న మేలుకి మించింది చేయజాలదని, విశ్వం మొత్తం కలిసి తనకు కీడు తల పెట్టదలచినా అల్లాహ్‌ తన విధిలో వ్రాసి పెట్టిన కీడుకంటే ఎక్కు కీడును కలిగించజాలదని త్రికరణ శుద్ధితో నమ్మి నడుచుకుాండు. అల్లాహ్‌ మాటల్లోనే చెప్పాలంటే – (ఓ ప్రవక్తా!) ”ఇలా అను: నిశ్చయంగా నాకు నా ప్రభువు రుజుమార్గం చూపించాడు. స్థిరమ యిన ధర్మం-ఎలాంటి వక్రతా లేనిది. అల్లాహ్‌ వైపు ఏకాగ్రతతో మరలిన ఇబ్రాహీమ్‌ విధానం అది. ఆయన ముష్రిక్కులలోని (బహుదైవ భావాలు గల వారిలోని) వాడు కాదు. ఇంకా ఇలా ప్రకించు: నిశ్చయంగా నా నమాజు, నా సకల ఉపసనారీతులు, నా జీవనం, నా మరణం – అన్నీ సర్వలోకాలకు ప్రభువయిన అల్లాహ్‌ కొరకే. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞా పాలన చేసే వారిలో నేను మొది వాడను”. (అన్‌ఆమ్‌: 161-163)

ఆ తర్వాత ఇలా ఆదేశించబడింది: ”వారిని అడుగు – వాస్తవానికి ప్రతిదానికీ ప్రభువు ఆయనే(అల్లాహ్‌యే) అయినప్పుడు నేను అల్లాహ్‌ను కాదని వేరొక ప్రభువు కోసం ప్రాకులాడాలా ఏమి?”. (అన్‌ఆమ్‌: 164).

రెండవ ఆశయం – అల్లాహ్‌ ప్రసన్నతో కూడిన విజయం మరియు ఆయన క్షమాభిక్ష ద్వారా నరక ముక్తి:

ఈ ఆశయాన్ని నెరవేర్చే ప్రవచనాలు కొన్ని ప్రవక్త ముహమ్మద్‌ (స) తెలియజేశారు: ”ఎవరయితే కాబా గృహపు హజ్జ్‌ చేసి హజ్జ్‌ మధ్యలో ఎలాంటి అశ్లీల చేష్టలకు, అసభ్య ప్రవర్తనకు దూరంగా ఉంటూ హజ్జ్‌ క్రియల్ని (భక్తీ ప్రపత్తులు, నియమ నిష్టలతో) పూర్తి చేెస్తారో వారు అదే రోజు తల్లి కడుపున జన్మించిన పసికందుని వలే పాపరహితులై తిరిగి వస్తారు” అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). (బుఖారీ గ్రంథం – 1521)

”స్వీకృతి పొందిన హజ్జ్‌కు ప్రతిఫలంగా ఏది సరిపోదు; ఒక్క స్వర్గం తప్ప”.(బుఖారీ – 1773, ముస్లిం – 1349)

అమ్ర్‌ బిన్‌ ఆస్‌ (ర) ఇస్లాం స్వీకరణకు పూర్వం అడిగిన ఓ పశ్నకు సమా ధానంగా అంతిమ దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”(ఒక వ్యక్తి త్రికరణ శుద్ధితోకూడిన) ఇస్లాం స్వీకరణ గతం తాలూకు పాపాలన్నింటినీ పూర్తిగా ప్రక్షాళిస్తుందనీ, హిజ్రత్‌ పూర్వపు పాపాలన్నింని సమూలంగా తుడిచి పెడుతుందని, హజ్జ్‌ దానికి ముందు జరిగి పాపాలన్ని పుర్తిగా నిర్మూలిస్తుం దని నీకు తెలీదా?” అన్నారు. (ముస్లిం – 121) వేరోక ఉల్లేఖనంలో – ”మీరు హజ్జ్‌ మరియు ఉమ్రాలను ఒకదాని తర్వాత మరొకి చేస్తూ ఉండండి. కొలిమి ఇనుమ తుప్పును వదలగ్టొినట్లు హజ్జ్‌ పాపాలను, దారిద్య్రాన్ని ప్రక్షాళిస్తుంది”. (తిర్మిజీ)

అల్లాహ్‌ ప్రసన్నత అన్నది సకల అనుగ్రహాలకన్నా గొప్పది. అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ”విశ్వాసులయిన పురుషులూ, విశ్వాసులయిన స్త్రీలూ – వారంతా పరస్పరం మిత్రులుగా ఉంటారు. వారు మంచి గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు. జకాతును చెల్లిస్తారు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు విధేెయులయి ఉంటారు. అల్లాహ్‌ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహం గా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి. విశ్వసించిన స్త్రీపురుషులకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తానని అల్లాహ్‌ా వాగ్దానం చేసి ఉన్నాడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. శాశ్వతంగా ఉండే స్వర్గ వనాలలో పరిశుభ్రమయిన మేడలు వారి కోసం ఉంటాయి. వీటన్నింటి కన్నా గొప్పదయిన అల్లాహ్‌ ప్రసన్నత వారికి లభిస్తుంది. గొప్ప సాఫల్యం అంటే ఇదే”. (తౌబహ్‌: 72)

పై ఆయతులో ముందు అల్లాహ్‌ విధేయత, ఆయన ప్రవక్త అనుసరణ మరియు విశ్వాసుల లక్షణాలను పేర్కొన్న తర్వాత వారు పాటించే ఇస్లాం విధులను పేర్కొన్న పిదప, సంఘస్కంరణ, సమాజ హితాన్ని కోరుతూ వారు చేపట్టే కార్యాలను ప్రస్తావించిన తర్వాత వారికి తాను అనుగ్రహించేబోయే వరప్రసాదాలను పేర్కొన్నాడు. స్వర్గం, స్వర్గంలో వారి ప్రాప్తించబోయే వరా నుగ్రాల ప్రస్తావన తార్వత అతి పెద్ద అనుగ్రహం గురించి తెలియజేశాడు. ‘వ రిజ్వానుల్లాహి అక్బర్‌ – వీటన్నింకన్నా గొప్పదయిన అల్లాహ్‌ ప్రసన్నత వారికి లభిస్తుంది అని చెప్పి ఆనక ‘జాలిక హువల్‌ ఫౌజుల్‌ అజీమ్‌’ – గొప్ప సాఫల్యం అంటే ఇదే అన్నాడు. అంటే మనిషి ధర్మానుసారం జీవించి స్వర్గాన్ని పొందడం గొప్ప విజయమే కానీ, దానికన్నా ఉత్కృష్టమయిన, మహోన్నతమయిన సాఫల్యం అల్లాహ్‌ ప్రస్నతను చూరగొనటం.

అవును ఐహిక భోగభాగ్యాలయగానీ, పారలౌకిక స్వర్గసీమ అనుగ్రహాలు గానీ అన్నీ ఆయన సృష్టితాల, ఆయన వరప్రసాదాలే. అందులో ఏ ఒక్కటి ఆయన అస్తిత్వానికి, గుణానికి సంబంధించిన లేదు. వీటన్నింకి భిన్నంగా ‘అల్లాహ్‌ ప్రసన్నత’ అన్నది కేవలం ఆయనకు సంబంధించిన విషయం, అది ఆయనకే సొంతం. కాబట్టి అగణ్య అనుగ్రహాలు, అనన్య వర ప్రసాదాల న్నింకన్నా అది ఎంతో ఘనాపాటిది. దానికి మించిన వరప్రసాదం మరొ కి లేదు కనుకనే అల్లాహ్‌, అక్బర్‌ అన్న పదాన్ని తన పేరుతో జోడించాడు, తన ప్రసన్నతతో జోడించాడు. ఈ యదార్థాన్ని తెలియజేస్తూ ప్రవక్త (స) ఇలా అన్నారు: – అల్లాహ్‌ స్వర్గవాసుల్ని సంబోధిస్తూ – ”స్వర్గ వాసులరా!” అని పిలుస్తాడు. దానికి వారు ‘మేము నీ సన్నిధిలో హాజరయి ఉన్నాము. ప్రభూ! నీ ప్రతీ ఆదే శాన్ని శిరసా వహించడానికి మేము సదా సిద్దంగా ఉన్నాం, సెలవియ్యండి’ అనాంరు. అప్పుడు అల్లాహ్‌ ”మీరు నా పట్ల సంతుష్టులయ్యారా?” అని అడుగుతాడు. ‘ప్రభూ! నువ్వు మాకు నీ ఇతర దాసులకెవ్వరికీ ప్రసాదించని మహా భాగ్యాలను ప్రసాదించావు. అలాంటప్పుడు మేము ఎందుకు సంతుష్టులము కాము?’ అంటారు. అప్పుడు అల్లాహ్‌ – ”సరే, ఇప్పుడు నేను మీకు ఇంతకంటే శ్రేష్ఠమయిన మహా భాగ్యం ప్రసాదించనా?” అంటాడు. ‘ఇంతకంటే శ్రేష్ఠమయిన మహా భాగ్యం ఇంకేముంటుంది?’ అంటారు స్వర్గ వాసులు. ”వినండి, బాగా వినండి! నేను మీకు శాశ్వతంగా నా ప్రసన్నతా భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాను. ఇక ఎన్నడూ నేను మిమ్మల్ని ఆగ్రహించను”. (బుఖారీ -6549, ముస్లిం-2829).

కాబట్టి ప్రతి హాజీ, ప్రతి ముస్లిం ఈ యదార్థాన్ని అనునిత్యం గుర్తు పెట్టుకోవాలి, మనసులో శాశ్వతంగా పదిల పర్చుకోవాలి. ఒక్క అల్లాహ్‌ ప్రసన్నత తో విశ్వం మొత్తం మన వశం అవుతుందన్న ఎరుకతో జీవించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అల్లాహ్‌ ప్రసన్నత లేకుండా ప్రపంచ సంపదలన్నీ మన వద్ద ఉన్నా ఏమీ లేనట్టే. మన వద్ద ఏమీ లేకపోయినా అల్లాహ్‌ ప్రసన్నత ఉంటే అన్నీ ఉన్నట్లే!

మూడవ ఆశయం – తఖ్వా

హజ్జ్‌కి సంబంధించిన ఆయతులు తక్కువ సంఖ్యలో ఉన్నా దాదాపు ఆయ తుల్లో అల్లాహ్‌ తఖ్వా గురించి ఉపదేశించడం గమనార్హం. ఎందుకంటే దాసుడు హజ్జ్‌ సందర్భంగా తఖ్వా సామగ్రిని మూటగట్టుకునేంతగా మరే ఇతర ఆరాధనలోనూ సాధ్య పడదు. హజ్జ్‌కి సంబంధించిన ఆయతులలోని మొది ఆయతులో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ”(ప్రజలారా!) అల్లాహ్‌ యెడల తఖ్వా (భయభక్తులు) కలిగి జీవించండి. అల్లాహ్‌ కఠినంగా శిక్షించేవాడని తెలుసుకోండి”. (అల్‌ బఖరహ్‌: 196)

తర్వాతి ఆయతులో హజ్జ్‌ ప్రస్తావనను కొనసాగిస్తూ మళ్ళీ ఇలా ఉపదేశిం చాడు: ”(హజ్జ్‌కు అవసరమయ్యే ప్రయాణ) సామగ్రిని తోడు తీసుకెళ్ళండి. అయితే అన్నికంటే అత్యుత్తమ సామగ్రి తఖ్వా (దైవభీతి) అని బాగా తెలుసుకోండి. కనక ఓ బుద్ధిజీవుల్లారా! నా యెడల తఖ్వా కలిగి మసలుకోండి”. (అల్‌ బఖరహ్‌: 197) సూరయె బఖరహ్‌లోని హజ్జ్‌ ఆయతులను ఇలా పూర్తి చేశాడు: ”అల్లాహ్‌ యెడల భయభక్తులు (తఖ్వా) కలిగి ఉండండి. తుదకు మీరంతా ఆయన వైపనకే సమీకరించబడతారన్న యదార్థాన్ని బాగా తెలుసుకోండి”. (బఖరహ్‌: 203)

సూరయె హజ్జ్‌లో అల్లాహ్‌ హజ్జ్‌లో దాసుడు సందర్శించుకునే ఆయన చిహ్నాల గురించి ప్రస్తావిస్తూ – ”అల్లాహ్‌ చిహ్నాలను ఎవరయినా గౌరవిస్తు న్నారు అంటే అది వారి హృదయాలలోని తఖ్వా – దైవభీతి వల్లనే సుమా!”. (హజ్జ్‌: 32) అన్నాడు. హజ్జ్‌లో, అజ్హా పండుగలో చెయ్యబడే ఖుర్బానీ గురించి తెలియజేస్తూ – ”వాటి మాంసముగానీ, రక్తముగానీ అల్లాహ్‌ ఎంత మాత్రం చేరదు. అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్వా) మాత్రం తప్పకుండా ఆయనకు చేరుతుంది”. అని సెలవిచ్చాడు. (హజ్జ్‌: 37)

అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తలందరూ చేెసిన వసియతుల్లో అగ్రభాగానికి చెందిన వసీయతు తఖ్వాకు సంబంధించనదే. అల్లాహ్‌ నిర్దేశించిన సకల నిబంధనావళులలో, ఆరాధనా రీతులు-రాతలలో క్రేంద బిందువు తఖ్వా. ”అల్లాహ్‌కు భయపడుతూ (తఖ్వా కలిగి) మెలగ వలసిందిగా మేము మీకు పూర్వం గ్రంథం వొసగబడిన వారికీ, మీకూ తాకీదు చేశాము”. (అన్నిసా: 131)

అంతిమ దైవ ప్రవక్త (స) అలీ (ర) గారిని ఓ పని మీద సాగనంపుతూ చేసిన హితువుల్లో ప్రధానమయినది తఖ్వా. అలాగే అయన చేసే ప్రసంగా ల్లో, ఉపదేశాల్లో తఖ్వా పాళ్లు అదికంగా ఉండేవి. తన చివరి హజ్జ్‌ సంద ర్భంగా ఆయన ఇచ్చిన ఖుత్బాలో తఖ్వా గురించి నొక్కి వక్కాణించారు. ఎందుకంటే అల్లాహ్‌ను చేరుకునే మార్గంల్లో అత్యుత్తమ ఆధ్యాత్మిక సామగ్రి

తఖ్వాయే. ఈ కారణంగానే – ఓ వ్యక్తి ద్వితీయ ఖలీపా ఉమర్‌ (ర) గారి నుద్దేశించి – ‘ఇత్తఖిల్లాహ్‌’ – అల్లాహ్‌కు భయపడు! అని అంటే సమాధానంగా ఆయన ఇలా అన్నారు: ”ఈ మాట అనపోతే ప్రజలయిన మీలో ఎలాంటి మేలు లేనట్టే. ఈ మాటను పాలకులమయిన మేము సహృదయంతో స్వీకరించకపోతే మాలో ఎలాంటి మేలు లేనట్టే” అని. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, ఒక హాజీ హజ్జ్‌ నుండి తిరిగి వచ్చేటప్పుడు తోడు తీసుకొచ్చేె సామగ్రిలోకెల్లా శ్రేష్ఠ సామగ్రి తఖ్వాయే. కాబట్టి హాజీలయినా, హజ్జ్‌ ఇంకా చెయ్యనివారయినా అందరూ అలవర్చుకోవాల్సిన అత్యుత్తమ సుగుణం దైవభీతి-తఖ్వా. అందరూ ధరించాల్సిన అత్యుత్తమ ఆభరణం-తఖ్వా ఆభరణం. అలాటి శ్రేష్ఠతర తఖ్వాను మనకు ప్రసాదించే అత్యద్భుత సాధనం హజ్జ్‌. ఒక్క మాటలో చెప్పాలంటే, పాఠశాలలు అనేక రకాలుగా ఉంటాయి. హజ్జ్‌ తఖ్వా పాఠశాల.

నాల్గవ ఆశయం – అల్లాహ్‌ స్మరణ:

హజ్జ్‌ గురించి ఉపదేశిస్తూ – ”ఆ నిర్ణీత దినానలో అల్లాహ్‌ నామాన్ని స్మరించాలని”. (హజ్జ్‌: 28) అన్నాడు అల్లాహ్‌. ”నిశ్చయంగా కాబా గృహ ప్రదకిణ, సఫామర్వాల మధ్య సయీ, జమరాత్‌లపై కంక ర్రాళ్ళు రువ్వడం (తదితర హజ్జ్‌ క్రియలు) మహోన్నతుడయిన అల్లాహ్‌ ను స్మరించుకోవడానికే నిర్దేశించ బడ్డాయి” అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). (ముస్నద్‌ అహ్మద్‌)

మఆజ్‌ బిన్‌ అనస్‌ అల్‌ జుహ్నీ (ర) గారి కథనం – ఓ వ్యక్తి దైవప్రవక్త (స) వారిని ఇలా అడిగాడు: ‘పుణ్యం రీత్యా జిహాద్‌లో ఏది గొప్పది?’ అందు కాయన (స) – ”ఏ జిహాద్‌లోనయితే ప్రజలు అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తారో అది” అన్నారు. ‘పుణ్యం రీత్యా ఉపవాసంలో ఏది గొప్పది?’ అని కోరగా – ”ఏ ఉపవాసంలోనయితే ప్రజలు అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తారో అది” అని సమాధానమిచ్చారు. ఆ తరరావత నమాజు గురించి, జకాతు గురించి, హజ్జ్‌ గురించి, సద్ఖా గురించి అడిగాడా వ్యక్తి.అన్నింటికీ ఒకే సమాధానం ఇచ్చారు: ”ఆయా ప్రార్థనావస్థలో అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తారో అది” అని. (ఈ సంభాషణ సాంతం విన్న) హజ్రత్‌ అబూ బకర్‌ (ర) ఉమర్‌ (ర) గారినుద్దేశించి – ‘ఓ హఫస్‌ తండ్రీ! అల్లాహ్‌ను స్మరించే వారు మొత్తం మేలును మూట కట్టుకుపోయారే!’ అన్నారు. అది విన్న ప్రవక్త(స) ”అవును” అన్నారు. (ముస్నద్‌ అహ్మద్‌-15614)

ఈ వచనం దృష్ట్యా హజ్జ్ చేసే వారిలో సయితం పుణ్యం రీత్యా అందరూ ఒకే స్థాయికి చెందిన వారయి ఉండరు. వారిలో కొందరు అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించేవారుంటారు. మరికొందరు తక్కువగా స్మరివంచే వారుంటారు. ఇంకొందరు ఏమరుపాటుకి గురయిన వారుంటారు. యదార్థమేమి టంటే, అల్లాహ్‌ ధ్యానానికి మించినది ఈ జగాన మరొకటి లేదు. ”నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ మహోత్కృష్టమయినది, మహోన్నత్త మయినది”. (అన్‌కబూత్‌: 45)

ఈ కారణంగానే ప్రవక్త (స)వారు అన్నారు:”అల్లాహ్‌ స్మరణ లేకుండా ఎక్కువ మ్లాడకండి. దీని వల్ల హృదయం బండబారి పోతుంది. ఇక హృదయ కాఠిన్యం గలవాడు అల్లాహ్‌కు అందరికన్నా బహు దూరం గా ఉంటాడు”. (తిర్మిజీ)

 

Related Post