అతిశయిల్లకండి!

సత్యాన్ని నమ్మి నడుచుకునే విషయంలో హద్దు మీరి ప్రవర్తించ రాదు. దేన్ని ఏ మేరకు ఆచరించమని ఆదేశించబడిందో ఆ మేరకే ఆచరిం చాలి. ధర్మంలో ఏ వస్తువుకు ఏ స్థాయి ఉందో దాన్ని ఆ స్థాయిలోనే ఉంచాలి. భక్త్తి విశ్వాసాలలో అవధులు మీరి దైవప్రవక్తను దైవత్వపు స్థానంలో ప్రతిష్ఠింపజేయడం ఎంతమాత్రం తగదు.

సత్యాన్ని నమ్మి నడుచుకునే విషయంలో హద్దు మీరి ప్రవర్తించ రాదు. దేన్ని ఏ మేరకు ఆచరించమని ఆదేశించబడిందో ఆ మేరకే ఆచరిం చాలి. ధర్మంలో ఏ వస్తువుకు ఏ స్థాయి ఉందో దాన్ని ఆ స్థాయిలోనే ఉంచాలి. భక్త్తి విశ్వాసాలలో అవధులు మీరి దైవప్రవక్తను దైవత్వపు స్థానంలో ప్రతిష్ఠింపజేయడం ఎంతమాత్రం తగదు.

”నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించడం (షిర్క్‌) ఘోరమయిన అన్యాయం”. (లుఖ్మాన్‌: 12)
కడివెడు పాలలో ఒక విషపు చుక్క వేస్తే పాలన్నీ ఎలాగయితే చెడి పోతాయో అలాగే షిర్క్‌ అనే ఆలోచన అంతరాత్మలో చోటు చేసుకుంటే అది మనిషి సకల సత్కర్మలను ఇట్టే నాశనం చేసేస్తుంది. ఇదే యదా ర్థాన్ని అల్లాహ్‌ా ఇలా తెలిజేస్తున్నాడు: ”నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులయిన ప్రవక్తల వద్దకు పంపబడిన దివ్యావిష్కృతి (హెచ్చరిక) ఇది: ‘ఒకవేళ నువ్వే గనక షిర్క్‌కు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయే వారిలో చేర్తావు”. (జుమర్‌: 65)
ఇస్లాం ధర్మానికి ఆయుపట్టు తౌహీద్‌. తౌహీద్‌ లేకపోతే ఇస్లాం లేదు, తౌహీద్‌ లేకపోతే నాకమూ లేదు, నరకమూ లేదు. తౌహీద్‌ లేకపోతే శిక్షాబహుమానాలు లేవు. తౌహీద్‌ లేకపోతే మంచీ చెడులు లేవు. తౌహీద్‌ లేకపోతే విశ్వ వ్యవస్థ లేదు. అలాంటది తౌహీద్‌ లేకుండా తౌహీద్‌ను నమ్మే ముస్లింల మధ్య ఇత్తిహాద్‌-ఐకమత్యం ఎలా సాధ్యం? అయితే ముస్లింలు అన్నింటికన్నా ఎక్కువ తూట్లు తౌహీద్‌ భావానికే పొడిచారన్నది నిజం. ధర్మోన్నతి కోసం అహిర్నశలు పరిశ్రమించిన పుణ్యాత్ములను అభిమానించే విషయంలో అతికి లోనయిన అనేకులు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) గీసిన సరిహద్దు రేఖల్ని చెరిపే శారు. కొందరు వారిలో దైవత్వం ఉంది అని వాదిస్తే, మరికొందరు వారిని దైవానికి మరియు దాసులకు మధ్య దళారులుగా భావించారు. ఈ కారణంగా దైవపూజతోపాటు అనేక విధాల పూజలు వచ్చి చేరాయి. దేశ పూజ, జాతీయ పూజ, భాష పూజ, పదార్థ పూజ, వ్యక్తి పూజ, విగ్రహ పూజ, పూర్వీకుల పూజ, పుణ్యాత్ముల పూజ, కోరికల పూజ నేడు అన్నిటా సర్వసాధారణమయిపోయింది. విగ్రహం లేని వీధి లేదు. దర్గా లేని ఊరు లేదు. ఈ సమాధులను దర్శించడానికి పురుషులతో పాటు స్త్రీలు సయితం ఎగబడుతున్నారు. అక్కడికెళ్ళి మొక్కుబ డులు చెల్లించుకుంటున్నారు. ప్రదక్షిణలు చేస్తున్నారు. రొట్టెలు వదులుతు న్నారు. చదివింపులు చేస్తున్నారు. ఉరుసులు ఊరేగింపులు చేస్తు న్నారు. ప్రతి ప్రాంతానికో మఠాన్ని ఏర్పరచుకొని మతాధిపత్యాన్ని, మత మౌఢ్యాన్ని పెంచుతున్నారు. ఇదంతా గమనించిన ఓ కవి ఇలా అన్నాడు:
కొత్త పెళ్ళికూతురిలా ముస్తాబయి ఉన్నాయీ సమాధులు
ఆహా! ముస్లిం విగ్రహాలయాలు ఎలా సింగారించబడ్డాయో చూడు!
దీనికితోటు ఆయా దేశాల్లోని విగ్రహ భావాలు కలిగిన పాలకుల అండ వీరికి మస్తుగా లభిస్తోంది.వారు ఇటువంటి వాటిని మత సామ రస్యానికి వేదికలుగా పేర్కొని ప్రచారం చేయడమే కాక, స్వయంగా వారే హాజరయి చాదర్లు కప్పడం చేస్తుంటారు. ఇక సాహితీకారుల విష యానికొస్తే కవులు –
పై లోకాల్లో అర్ష్‌పై అసీనుడయి ఉన్నవాడే
మదీనాలో ముస్తఫాగా అవతరించినాడు
అని ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి దైవత్వాన్ని ఆపాదించే దుస్సాహసం ఒకడు చేస్తే,
అల్లాహ్‌ా అధీనంలో ఏముంది ఒఠ్ఠి తౌహీద్‌ తప్ప
మాకేం కావాలో ముహమ్మద్‌ (స) నుండి తీసుకుంటాము
అని అల్లాహ్‌కన్నా పైసా స్థాయిని (నవూజుబిల్లాహ్‌ా) ప్రవక్తకు కల్పి స్తాడు మరోకడు. ఈ పైత్యం ఎంత ముదిరిందంటే వక్ర భాష్యాలు చెప్పి ఖుర్‌ఆన్‌ దాదాపు వచనాలను ముహమ్మద్‌ (స) వారికి ఆపాదించే కుప్రయత్నం కొందరు చేస్తే, లేనిపోని హథీసులను క్రోడీకరించి ఆయన స్థాయిని పెంచే ప్రయత్నం మరికొందరు చేశారు.
‘పేదరికాన్ని ఆశ్రయించి పవిత్రంగా బతికిన ప్రవక్తకు సలామ్‌
నీడ లేని నిరుపమాన నబీకి సలామ్‌’
అంటూ (పవక్త (స) వారి శరీరానికి నీడ ఉండేది కాదు ఒకడు తప్పు లో కాలేస్తే,
నీ సమాధి దర్శనం నా హృదయానికి జీవజలం
ఈసా, ఖిజర్లకన్నా నీ స్థాయి గొప్పది’
అంటూ నిజాముద్దీన్‌ ఔలియా (ఒక వ్యక్తి బహువచనం ఎందుకో?) వంటి సామమాన్య వ్యక్తికి ప్రవక్తలకన్నా గొప్ప స్థాయిని కల్పించి తప్పుని ఒప్పుగా, ఒప్పుకునేలా చేస్తాడు మరొకడు. ఇవి ఇలాంటి గతంలో కూడా జరిగాయి. తర్వాత కూడా జరుగతాయి అని తెలిసిన అల్లాహ్‌ా తన అంతిమ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:”ఇలా చెప్పెయ్యి! ఓ గ్రంథ ప్రజలారా! మీరు మీ ధర్మంలో అన్యాయంగా హద్దులు మీర కండి. పూర్వం తాము మార్గం నుండి తప్పడమేగాక, ఎంతో మందిని మార్గం నుంచి తప్పించి రుజుమార్గభ్రష్టులయిన వారి మనోవాంఛలను అనుసరించకండి”. (అల్‌ మాయిదహ్‌: 77)
సత్యాన్ని నమ్మి నడుచుకునే విషయంలో హద్దు మీరి ప్రవర్తించ రాదు. దేన్ని ఏ మేరకు ఆచరించమని ఆదేశించబడిందో ఆ మేరకే ఆచరిం చాలి. ధర్మంలో ఏ వస్తువుకు ఏ స్థాయి ఉందో దాన్ని ఆ స్థాయిలోనే ఉంచాలి. భక్త్తి విశ్వాసాలలో అవధులు మీరి దైవప్రవక్తను దైవత్వపు స్థానంలో ప్రతిష్ఠింపజేయడం ఎంతమాత్రం తగదు. పూర్వం ఇలానే గ్రంథవహులయిన క్రైస్తవులు ప్రవక్త ఈసా (అ) వారిని దైవ కుమారుని గా, దైవంగా చిత్రీకరించి ధర్మంలో అతిశయిల్లారు. సాధారణంగా మనిషి తాను అభిమానించే వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తాడు. ఈ ప్రేమ ఒక్కోసారి మనిషి చేత అపశృతులు పలికిస్తుంది. తను నమ్మే ఇమా మును, పీరును, గురువును కూడా దైవప్రవక్త వలె పవిత్రునిగా, పాప రహితునిగా భావిస్తాడు. వారు విమర్శకు అతీతులను, అపౌరుషేయు లని తలపోస్తాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే దైవ ప్రవక్తల వియంలో అతిశయిల్లిన కారణంగా యూదక్రైస్తవులు మార్గ భ్రష్టులయి దైవ అభిశాపానికి గురయితే, కౌన్‌, కిస్కా తెలియని వ్యక్తుల విషయంలో అతిశయిల్లడం ఎన్ని ప్రమాదాలకు దారి తీయ గలదో అలోచించాలి.
”అల్లాహ్‌ను వదలి వాళ్లు పిలుస్తున్న వారు ఏ వస్తువునూ సృష్టించ లేదు. పైగా వారు స్వయంగా (అల్లాహ్‌ాచే) సృష్టించబడిన వారాయె! వారు నిర్జీవులేగాని సజీవులు కారు. తాము ఎప్పుడు బ్రతికించి లేప బడతారో కూడా వారికి తెలీదు”. (అన్నహ్ల్‌: 20.21)
పై ఆయతులో ‘వారు ఎప్పుడు తిరిగి లేప బడతారో కూడా వారికి తెలీదు’ అని చెప్పబడిన మాట రాళ్ళు, రప్పలను ఉద్దేశించినది కాదు. మరణించిన మంచి వ్యక్తులకు ఉద్దేశించి చెప్పబడిన మాట. ఈ వాక్యం ద్వారా సమాధుల పూజా. దర్గా ప్రదక్షిణలు చేసేవారి చర్య నిర్ద్వందంగా ఖండించబడింది. అల్లాహ్‌ా తర్వాతి వచనంలో ఇలా సెల విస్తున్నాడు:
”(ఓ ప్రజలారా!) మీ అందరి ఆరాధ్య దైవం అల్లాహ్‌ా ఒక్కడే. అయితే పరలోకం పట్ల నమ్మకం లేని హృదయాలు ఈ విషయాన్ని తిరస్కరిస్తు న్నాయి. వారు స్వయంగా అహంకారంతో విర్రవీగుతున్నారు”. (అన్నహ్ల్‌: 22)

Related Post