ధర్మో రక్షితి రక్షితః

 

1) ఇస్లాం ప్రకృతి ధర్మం:

”అల్లాహ్‌ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావం పైన్నే (ఉండండి)” (రూమ్‌: 30)
‘ఫిత్‌రహ్‌’ అంటే సహజత్వం లేక నైజం. అల్లాహ్‌ మానవుల్ని సహజ ధర్మం-ఇస్లాంపై, అల్లాహ్‌ ఏకత్వ భావన-తౌహీద్‌పై పుట్టించాడు.పుట్టుక రీత్యా ప్రతి మనిషి నైజంలో అల్లాహ్‌ ఏకత్వం-తౌహీద్‌ భావన అంతర్లీన మై ఉంది. జన్మతః ప్రతి మనిషి అల్లాహ్‌ విధేయుడిగానే (ముస్లింగానే) ఉంటాడు. కాకపోతే మనిషి పుట్టిన తర్వాత పరిసరాల, పరివార, పండితుల, స్నేహితుల, సాహిత్య ప్రభావానికి గురవుతాడు. తాను కళ్ళు తెర చిన సమాజంలోని కుళ్ళు అతన్ని సహజ ధర్మం వైపునకు మళ్ళకుండా చేస్తుంది. ఇదే యదార్థాన్ని ప్రవక్త (స) ఇలా తెలియజేశారు: ”పుట్టే ప్రతి శిశువు ప్రకృతి ధర్మం మీదే పుడుతుంది. కానీ దాని తల్లిదండ్రులు ఆ శిశువును యూదునిగానో, క్రైస్తవయనిగానో, అగ్ని పూజారిగానో మార్చి వేస్తారు”. (బుఖారీ)

 

ధర్మో రక్షితి రక్షితః

అవి తమ అసలు స్థితిలో ఉన్నప్పుడు యూద మతంగా, క్రైస్తవ మతంగా పిలవ బడలేదు. ఇస్లాం ధర్మంగానే వాటిని పిలువడం జరిగేది. కానీ, మనిషి జోక్యంతో మార్పు చేర్పులకు గరుయిన తర్వాత వాటికి ఈ పేర్లను అంట గట్టడం జరిగింది.

హదీసే ఖుద్సీలో ఇలా ఉంది: ”నేను నా దాసులను ఏకాగ్రతా ధర్మం మీద పుట్టించాను. తర్వాత షైతానులు వచ్చి వారిని మార్గం తప్పిం చారు. నేను వారి కోసం హలాల్‌ చేసిన వాిని హరామ్‌గా, హరామ్‌ చేసిన వాటిని హలాల్‌గా నమ్మ బలికారు”. (ముస్లిం)

2) ప్రతి వ్యక్తి జన్మ హక్కు ఇస్లాం:

ఇస్లాం ధర్మం అఖీదహ్‌ మరియు షరీఅహ్‌ మేలు కలయిక. అది సత్యబద్ధమయిన విశ్వాసంతో పాటు సత్యబద్ధమయిన ఆచరణ గలది. అది ఒక మనిషి మతి పరిధిలో, కొందరి సమిష్టి సలహా పరిధిలో పుట్టిన మతం కాదు. హిందూ ఇజానికి, యూద ఇజానికి, క్రైస్తవ ఇజానికి, బౌద్ధ, జైన ఇజానికి, కమ్యూనిజానికి నిర్మాతలున్నట్లు ఇస్లాం ధర్మానికి మనిషన్న వాడెవ్వడూ నిర్మాత కాదు. ఒక మాలో చెప్పా లంటే ఇది మ్యాన్‌ మేడ్‌ ధర్మం కాదు – ఈ రోజు ఒక విశ్వాసాన్ని ప్రవేశ పెట్టి రేపు అవసరం లేనప్పుడు దాన్ని తీసివేయడానికి. ఇది అక్షరాల గాడ్‌ మేడ్‌ ధర్మం.
‘భలే చెప్పారులేండి! అందరూ చెప్పేది అదే కదా?’ అని కొందరన వచ్చు. వారికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఒక్కటే: ”మీరు సత్యవంతులే అయితే మీ ఆధారాలను ప్రవేశ పెట్టండి”. (అన్నమ్ల్‌:64) అంతే కాదు, ఎదుటి వారి సమాధానం కోసం ఎదురు చూడకుండానే తన సత్యతకు ఆధారాలను ప్రవేశ పెడుతుంది ఇస్లాం. అ) ”ఈ గ్రంథం సకల లోకాల ప్రభువు తరఫు నుండి అవతరింపజెయ్య బడిందన్న విషయంలో సందే హానికి ఆస్కారం లేదు”. (అస్సజ్దా: 2)
అ) ”నిశ్చయంగా మేము మా ప్రవక్తలను స్పష్టమయిన నిదర్శనాలను ఇచ్చి పంపాము.వారితోపాటు గ్రంథాన్ని, ధర్మకాఁటాను కూడా అవతరింపజేశాము. ప్రజలు న్యాయంపై నిలిచి ఉండానికి”. (హదీద్‌: 25)
ఆ) ”అల్లాహ్‌ మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై గ్రం థాన్ని, హిక్మత్‌ను (ప్రవక్త (స) సున్నత్‌, ధర్మశాస్త్రాన్ని) అవతరింప జేసి, మీకు చేసిన ఉపదేశాన్ని కూడా (అవలోకనం చేసుకోండి)”. (అల్‌బఖరహ్‌: 231)
ఇ) ”(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యడానికిగాను. మేము నీ వైపునకు ఈ గ్రంథాన్ని సత్యంతో పాటు పంపాము”. (అన్నిసా: 105)
ఇంత చెప్పినా ఇంకా ఎవ్వరికయినా సందేహం ఉంటే – ఖుర్‌ఆన్‌ వారికి చేసే ఛాలెంజ్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి: ”మేము మా దాసునిపై అవతరింప జేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానముంటే, అటువిందే ఒక్క సూరానైనా (రచించి) తీసుకు రండి. మీరు సత్యవంతులే అయితే (ఈ పని కోసం) అల్లాహ్‌ను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి. ఒకవేళ మీరు గనక ఈ పని చెయ్య లేక పోతే – ఎన్నికీ అది మీ వల్ల కాని పనే”. (అల్‌ బఖరహ్‌:23, 24)
”ఏమి వారు ఖుర్‌ఆన్‌ గురించి యోచన చెయ్యరా? ఒకవేళ ఇది అల్లాహ్‌ తరఫు నుంచి గాక, ఇంకొక్కరి తరఫు నుంచి వచ్చి ఉంటే వారికి అందులో ఎంతో వైరుధ్యం కనబడేది”. (అన్నిసా: 82)

3) షరీఅతు సంరక్షణ:

క్రైస్తవం, యూదత్వం కూడా ఒకప్పుడు ఆకాశం నుండి అవతరించిన మతాలే కదా? అని కొందరు ప్రశ్నించవచ్చు. అవును, కానీ అవి తమ అసలు స్థితిలో ఉన్నప్పుడు యూద మతంగా, క్రైస్తవ మతంగా పిలవ బడలేదు. ఇస్లాం ధర్మంగానే వాటిని పిలువడం జరిగేది. కానీ, మనిషి జోక్యంతో మార్పు చేర్పులకు గరుయిన తర్వాత వాటికి ఈ పేర్లను అంట గట్టడం జరిగింది. ఇదే యదార్థాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా తెలియజేస్తుంది: ”అల్లాహ్‌ గ్రంథాన్ని రక్షించవల సిందిగా వారికి ఆజ్ఞాపించడం జరిగింది”. (అల్‌ మాయిదహ్‌:44) తమపై మోప బడిన బాధ్యతను సజావుగా నర్విర్తించాల్సింది పోయి, అందులోనే మార్పు చేర్పులకు పాల్పడ్డారు. ”వారి వద్దకు వారి గ్రంథాన్ని నిజమని ధృవీకరించే ప్రవక్త అల్లాహ్‌ తరఫు నుంచి ఎప్పుడు వచ్చినా ఆ గ్రంథవహులలోని ఒక వర్గం వారు, అల్లాహ్‌ గ్రంథాన్ని అసలు దానికి గురించి ఏమి తెలియనివారుగా వీపు వెనకాల పడ వేశారు”.(అల్‌ భకరహ్‌: 101)
ఫలితంగా అల్లాహ్‌ ధర్మ రక్షణ బాధ్యతను వారి నుండి లాక్కోడమే కాక, ఇక ప్రళయం వరకు తానే దాన్ని రక్షిస్తానని మాటిచ్చాడు: ”నిశ్చయంగా ఈ హితబోధను (గ్రంథాన్ని) అవతరింపజేసిన వారము మేమే. మరియు దీన్ని సంరక్షించే బాధ్యత సయితం మా మీదనే ఉంటుంది”. (అల్‌ హిజ్ర్‌: 9)

4) షరీఅతు పట్ల ప్రేమ:

”అల్లాహ్‌ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్ట పడక పోవడం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లాహ్‌ (కూడా) వారి కర్మలను నిష్ఫలం చేశాడు”. (ముహమ్మద్‌: 9)

అంటే వారు చేసిన ఎన్నో పనులు స్వతహాగా మంచి పనులే అయినప్ప టికీ ‘విశ్వాసం’ (ఈమాన్‌) లోపించినందు వల్ల వారికి పుణ్యఫలం దక్కకుండా చేశాడు. కాబట్టి మనిషి అల్లాహ్‌ షరిఅతును ప్రేమించాలి. ఎంతగానంటే ప్రవక్త (స) వారు చెప్పినంతగా. ‘యా రసూలల్లాహ్‌! తమరు నాకు నా ప్రాణం తప్ప తక్కిన వస్త్తువులన్నింకన్నా అధిక ఇష్టులు’ అన్నారు హజ్రత్‌ ఉమర్‌ (ర). అందుకు – ”ఎవరయినా సరే తన ప్రాణంకన్నా అధికంగా నన్ను ప్రేమించనంత వరకూ విశ్వాసి కాజాలడు” అన్నారు ప్రవక్త (స). ఈ మాట వినగానే – ‘అల్లాహ్‌ సాక్షి! ఈ క్షణం నుండి నేను తమరిని నా ప్రాణంకన్నా అధికంగా ప్రేమిస్తా నని మాిస్తున్నాను’ అన్నారు ఉమర్‌ (ర). అప్పుడు ఆయన (స) – ”ఓ ఉమర్‌! ఇప్పుడు నువ్వు విశ్వాసి అన్పించుకున్నావు” అని భుజం త్టారు. (సహీహ్‌ బుఖారీ)
వేరోక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. మీలో ఎవరయినా సరే తన తండ్రి కన్నా, సంతానం కన్నా, సమస్త జనులకన్నా అధికంగా నన్ను ప్రేమించ నంత వరకూ అతను విశ్వాసి కాజాలడు”. (బుఖారీ)
ఖుర్‌ఆన్‌ విశ్వాసుల లక్షణాన్ని తెలిజేస్తూ – ”మరియు విశ్వసించిన వారు అల్లాహ్‌ను అందరికంటే అధికంగా, ప్రగాఢంగా ప్రేమిస్తారు”. (అల్‌ బఖరహ్‌: 165)
అయినా మనం అలా చెయ్యడం లేదంటే, మనకు ఇస్లాం సంపూర్ణ శాస్త్రం కంటే ఎక్కువగా అజ్ఞాన కాలపు విధానాలనే ఇష్ట పడుతున్నా మని అర్థం. ఇదే సవాలు ఖుర్‌ఆన్‌ మనతో చేస్తుంది: ”ఏమిటి, వారు మళ్లీ అజ్ఞాన కాలపు తీర్పును కోరుతున్నారా? నమ్మకం గలవారి కోసం అల్లాహ్‌ కన్నా ఉత్తమ తీర్పు ఇవ్వగల వాడెవడుాండు”. (అల్‌ మాయిదహ్‌: 50)
హదీసులో ఇలా ఉంది: ”ఇస్లాంలోకి వచ్చి అజ్ఞాన కాలపు రాతారీతుల ను అన్వేషించేవారిని, అన్యాయంగా ఒకరిని చంపాలనుకునేవారిని అల్లాహ్‌ా అందరికన్నా ఎక్కువగా అసహ్యించుకుాండు”. (బుఖారీ)
అయినా మనం మార లేదంటే, అల్లాహ్‌ ఈ హెచ్చరిక మనకు కను విప్పు కలుగుజేస్తుంది: ప్రవక్తా!) వారికి చెప్పు: ”ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన ఆస్తి ఐశ్వర్యాలు, కుంటు పడుతుందేమోనని మీరు భయ పడే మీ వర్తకం, మీకెంతో ప్రియమయిన మీ గృహాలు – మీకు అల్లాహ్‌కన్నా, ఆయన ప్రవక్త కన్నా ఎక్కువ ప్రియ మైనవైతే అల్లాహ్‌ా తీసుకు వచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురు చూడండి”. (అత్తౌబహ్‌; 24)

5) న్యాయబద్ధత-మార్గదర్శకత్వం:

”రమాజను నెల – ఖుర్‌ఆన్‌ అవత రింప జేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకత్వం. అందులో సన్మార్గంతోపాటు సత్యాసత్యాలను వేరు పరచే స్పష్టమయిన నిదర్శనాలు ఉన్నాయి”. (అల్‌ బఖరహ్‌: 185)”ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పు చేెసేటప్పుడు న్యాయంగా తీర్పు చెయ్యండి” అని అల్లాహ్‌ మీకు గ్టిగా ఆదేశిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్‌ మీకు చేసే ఉపదేెశం ఎంతో చక్కనిది”. (అన్నిసా: 58)
”పరిపాలకుడు అన్యాయానికి ఒడిగట్టకుండా ఉన్నంత వరకూ అల్లాహ్‌ అతనికి అండగా ఉంటాడు. అతను అన్యాయానికి పాల్పడటం మొదలు పెట్టినప్పుడు అల్లాహ్‌ అతన్ని అతని మానాన వదలి పెట్టేస్తాడు”అన్నారు ప్రవక్త (స). (ఇబ్ను మాజహ్‌)

6) షరీఅతు శుభం, మోక్షం:

మనిషికి ఏది మేలు చేెస్తుందో, ఏది కీడు చేస్తుందో అల్లాహ్‌కు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. ఆయన ఇలా అంటున్నాడు: ”ఏమి, పుట్టించిన ఆయనే ఎరగకుండా ఉంటాడా? ఆయనయితే సూక్ష్మగ్రాహి, సర్వాన్ని కని పెట్టుకుని ఉన్నవాడు”. (అల్‌ ముల్క్‌: 14)
మనకు శుభం కలగాలన్నా, మనం మోక్షం పొందాలన్నా ఏం చెయ్యాలో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం!
”ఈ బస్తీలో నివసించే వాళ్ళే గనక విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము వాళ్ళ కోసం భువన గగనాల శుభాల (ద్వారాల)ను తెరిచే వాళ్లం. కాని వాళ్ళు ధిక్కారానికి పాల్పడ్డారు. అందు వల్ల వారి (చెడు) సంపాదనకు కారణంగా మేము వాళ్ళను పట్టుకున్నాము”. (ఆరాఫ్‌: 96)
”వారు గనక తౌరాతుకూ, ఇంజీలుకూ, తమ ప్రభువు తరఫున తమ వద్దకు పంపబడిన దానికి కట్టుబడి ఉంటే, వారు తమపై నుంచి, క్రింది నుంచీ పుష్కలంగా ఉపాధిని పొందుతూ హాయిగా తినేవారు”. (మాయిదహ్‌: 66)

7) షరీఆతు ధృవీకరణ:

”ఇంకా ఓ ప్రవక్తా! మేము నీ వైపునకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింప జేశాము.అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది. వాటిని పరిరక్షిస్తుంది. కాబ్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్‌ అవతరింపజేసిన ఈ గ్రంథానికి (ఖుర్‌ఆన్‌కి) అనుగుణంగానే తీర్పు చెయ్యి. నీ వద్దకు వచ్చిన ఈ సత్యాన్ని వీడి వారి మనో వాంఛలను అనుసరించకు”. (అల్‌ మాయిదహ్‌: 47,48)
ప్రతి ఆకాశ గ్రంథం తనకన్నా ముందు అవతరించిన ఆకాశ గ్రంథాల ను ధృవీకరిస్తుంది, ఖుర్‌ఆన్‌ కూడా తనకన్నా ముందు అవతరించిన దైవగ్రంథాలను ధృవీకరించింది. అవి సత్య గ్రంథాలని చెప్పింది. అయితే ప్రజలు ఆయా గ్రంథాల్లో చేసుకున్న జోక్యం కారణంగా అవి తమ ప్రామాణికతను కోల్పోయాయి. ఇప్పుడు వాిలో సారాంశాన్ని సంరక్షించే గ్రంథంగా ఖుర్‌ఆన్‌ ఉంది. ఇక మీదట ఏ విషయంలో తీర్పు చెయ్యాలన్నా ఖుర్‌ఆన్‌ ప్రకారమే చెయ్యాలి.
”తర్వాత మేము నిన్ను ధర్మానికి సంబంధించిన రాచబాటపై నిలబెట్టాము. కనుక (ఓ ముహమ్మద్‌ (స)!) నువ్వు దీనినే అనుసరించు. అజ్ఞానుల ఆకాంక్షలను అనుసరించకు”. (జాసియహ్‌: 18)

8) షరీఅతు అనుసరణ:

(ప్రజలారా!) మీ ప్రభువు తరఫు నుండి మీకు వొసగబడిన దానిని మీరు అనుసరించండి”. (ఆరాఫ్‌:3)
”వొసగబడినది’ అంటే ఖుర్‌ఆన్‌ మరియు ప్రామాణిక హథీసులు అని అర్థం. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నేను ఖుర్‌ఆన్‌ మరియు దాని లాిందే మరొకి ఇచ్చి పంప బడ్డాను”. (మిష్కాత్‌) కనుక ఈ రెంటిని అనుసరించడం తప్పనిసరి.

9) షరీఅతు స్థాపన:

”కనుక (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు తోడు! వారు తమ పరస్పర వివాదాలన్నింలో నిన్ను తీర్పరిగా చేసుకోనంత వరకూ, తర్వాత నువ్వు వారి మధ్య చెప్పిన తీర్పు పట్ల వారు తమ మనసులలో ఎలాిం సంకోచానికి, అసంతృప్తికి ఆస్కారం ఇవ్వకుండా మనస్ఫూర్తి గా శిరసా వహించనంత వరకూ – వారు విశ్వాసులు కాజాలరు”. (అన్నిసా: 65)
”అల్లాహ్‌ అవతరింప జేసిన దాని ప్రకారం తీర్పు చెయ్యనివారే పాపాత్ములు”. (అన్నిసా: 47)

10) షరీఅతు విశిష్ఠత:

”నా మార్గాన్ని అవలంబించేవాడు దారి తప్ప డంగానీ, ప్రయాసకు లోనవ్వడంగానీ జరుగదు. అయితే నా ధ్యానం పట్ల విముఖత చూపిన వాడి బ్రతుకు దర్భరమయి పోతుంది. ప్రళయ దినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము”. (తాహా: 123, 124)

11) ఇస్లామీయ శాస్త్రానికి, కృత్రిమ సిద్ధాంతాలకి మధ్య వ్యత్యాసం

+ మానవ నియమావళికి బదులు దైవ నియమావళి.
+ ఇస్లామీయ శాసనోల్లంఘనకు శిక్ష ప్రపంచంలోనూ పరలోకంలోనూ ఉంటుంది. అదే కృత్రియ శాసనోల్లంఘనకు శిక్ష ప్రపంచంలో మాత్రమే ఉంటుంది.
+ ధర్మ శాస్త్రానికి, సంబంధించిన ఆదేశాలు అన్ని కాలాల, ప్రాంతాల ప్రజలకు అమలు పర్చేందుకు అనుకూలంగా ఉంాయి. అవే కృత్రిమ సిద్ధాంతాలు- అవి కేవలం కొందరి అభిప్రాయాలు, మరియు అనుభవాలు మాత్రమే. అవి ఏక కాలంలో అందరికి ఉపయోగ పడజాలవు.

ఇస్లామీయ శాస్త్ర నియమాలు

+ ఇహపరాల్లో దైవ దాసులకు శ్రేయోసాఫల్యాలను ఇవ్వడం
+ నైతిక విలువలు, దైనందిన చర్యలు నియమాలు అందజేయడం.
+ సౌలభ్యాన్ని కలుగజేయడం, ఇబ్బందికరమైన స్థితిని తొలగించడం.
+ న్యాయ సంస్థాపన.

అఖీదహ్‌:

విశ్వాస పరమయిన ఆదేశ నియమాలు. అల్లాహ్‌ను ఎలా విశ్వ సించాలి? దైవదూతలను ఎలా విశ్వసించాలి? దైవగ్రంథాలను ఎలా విశ్వసిం చాలి? దైవ ప్రవక్తలను ఎలా విశ్వసించాలి? మరణానంతర జీవితాన్ని ఎలా విశ్వసించాలి? మంచీ-చెడు విధిరాతలను ఎలా విశ్వసించాలి? ఏ స్థాయి గౌరవం ఎవరికి ఎలా ఇవ్వాలి? తదితర విషయాలతో కూడిన విశ్వాస పరమయిన వివరణ.
షరీఅహ్‌: అల్లాహ్‌ తన దాసుల కోసం ఖుర్‌ఆన్‌ మరియు హదీసుల ద్వారా నిర్దేశించిన ఆరాధనా పరమైన, ఆచరణ పరమైన నియమాలు.
ఫిఖహ్‌: వివరణాత్మకమైన ఆధారాల ద్వారా గ్రహించబడిన షరీయతులోని ఆదేశాల జ్ఞానం. మరోలా చెప్పాలంటే మానవ మేధ అవగాహన మేరకు షరీయతు ఆదేశాలను క్రియా రూపం ఇవ్వడం.

ఇస్లామీయ శాస్త్ర (ఫిఖహ్‌) మూలాలు:

+ ప్రధమ స్థాయి మూలాలు: ఖుర్‌ఆన్‌ మరియు హదీసు.
+ ద్వితీయస్థాయి మూలాలు: ఏకగ్రీవం, అంచనా. (ఇజ్మా, ఖియాస్‌) ఇస్లామీయ ఫిఖహ్‌ పాక్షికాలు
ఫిఖహ్‌ పుస్తకాలు (వేటిలోనైతే ఖుర్‌ఆన్‌ మరియు హదీసు ద్వారా, ఇజ్మా మరియు ఖియాస్‌ ఆధారంగా ఆదేశాలుాంయో అవి) వాిలో ఆదేశాలను ఏడు భాగాలుగా విభజించారు.
1) ఆరాధనలు: ఆరాధనల కోసం చేసే శుచీశుభ్రతలు, నమాజ్‌, ఉపవాసం, జకాత్‌,హజ్‌
2) వ్యక్తిగత విషయాలు: కుటుంబ పరమైనవి-వివాహం, విడాకులు, వంశావళి, పోషణ, వారసత్వ ఆదేశాలు మొదలగునవి.
3) వ్యవహారాలు: ప్రజా సంబంధాలు, వ్యాపారం, లాభం, వ్యవసాయానికి సంబంధించిన ఆదేశాలు
4) పరిపాలన ఆదేశాలు: రాజ్య పరిపాలన, ప్రజా శ్రేయం సంరక్షణ, న్యాయ సంస్థాపన, అన్యాయ నిర్మూలన, తత్సంబంధిత ఆదేశాలు.
5) శిక్షలు: నేరస్థులకు సంబంధించిన శిక్షలు, దాంపత్యం, వ్యభిచారం, అత్యాచారం వగైరాకి సంబంధించిన శిక్ష మరియు ఆదేశాలు.
6) బైట వ్యవహారాలు: విదేశ వ్యవహారాలు, యుద్ధం మరియు ఒప్పందాలకు సంబంధించిన ఆదేశాలు.
7) నీతి నియమావళి: సభా, సంభాషణ, భోజన, ఆహ్వాన మర్యాదలు.

12) షరీఆతు పరిపూర్ణం:

”ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరి పూర్ణం చేశాను. ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదిం చాను”. (అల్‌ మాయిదహ్‌: 4)
”నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్‌ వద్ద సమ్మతమయిన ధర్మం”. (ఆల్‌ ఇమ్రాన్‌: 19)
”ఇక మీదట ఎవరయినా ఇస్లాంను కాదని మరో మతాన్ని అన్వేెషిస్తే అతని ధర్మం స్వీకరించ బడదు. అలాంటి  వ్యక్తి పరలోకంలో నష్ట పోయినవారిలో చేరి పోతాడు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 85)

కొన్ని అభ్యంతరాలు:

1) ఇన్ని కోట్ల మంది ప్రజలు మార్గభ్రష్టులేనా?
”భూమిపై నివసించే అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు మసలు కున్నావంటే వారు నిన్ను అల్లాహ్‌ మార్గం నుంచి తప్పించేస్తారు. వారు వట్టి ఊహలను అనుసరిస్తారు. కేవలం అంచనాలతో మ్లాడుతారు”. (ఖుర్‌ఆన్‌-6:116)

2)ముస్లింలు చంద్రుణ్ని కొలుస్తారా?
”రేయింబవళ్ళూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలో నివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికి గానీ సాష్టాంగ ప్రణామం (సజ్దా) చేయకండి! నిజంగా మీరు అల్లాహ్‌ా దాస్యం చేెసేవారే అయితే వీటన్నింనీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగ పడండి”. (ఖుర్‌ఆన్‌-41:37)
3) ముస్లింలు నిజ దైవాన్ని విశ్వసిస్తారు కదా మరి వారికి రోగాలు, వారి దేశాల్లో యుద్ధాలు ఎందుకు?
”మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంాము – భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము). మరియు సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి….. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉంటాయి”. (ఖుర్‌ఆన్‌-2:55-57)

Related Post