Originally posted 2013-06-01 14:48:17.
‘మనం, ఇంత కావాడానికే ఎంతో కాలం పట్టిందే! ఆ రోజా పువ్వుకు అంత కావడానికి ఎంత కాలం పట్టిందో!’ అన్న ఆత్మ సమీక్ష ఒక పూవనంలోని పువ్వు విషయంలోనే కాక మనం ఇష్ట పడి పెంచుకుంటున్న బాలవన పసి మొగ్గల విషయంలో కూడా చేసుకున్నప్పుడే తల్లిదండ్రులుగా మనం ఎదిగినట్టు! మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మనం చేపట్టే ఏ పనికయినా అవి రళ కృషి, అవిశాంత పరిశమ్ర, గట్టి పట్టుదల అవసరం. మన ఇంట ఒక మొగ్గ విర బూసిం దంటే, మనం తల్లిదండుల్రుగా అప్పుడే జన్మించామని అర్థం. మన తోటలో మనం వేసిన ఆ విత్తనం మొలకయి, మహా వృక్షాన్ని సృజించగలగాలంటే, ఆ మహా వృక్షంలోని ఒక్కొక్క కొమ్మ, ఒక్కొక్క రెమ్మ, ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క ఫలం నుండి మానవత్వపు అమృతం జాలువారాలంటే – మనం నిరంతరం మారుతూ, నేర్చుకుంటూ ఉండాలి. చేయదగిన పనులేవో, చేయకూడని పనులేవో, ఉచిత నిర్ణయాలేవో, అనుచిత నిర్ణయాలేవో వారికి అర్థమయ్యేలా బోధించాలి.
పిల్లల్ని పెంచడం ఒక కళ. కొందరు భావిస్తున్నట్టు అది తలనొప్పి ఎంత మాతం కాదు. పిల్లలతో కలిసి ఎదగడంలో అనందం ఉంది; జీవిత సార్థకత ఉంది. మనం మన పిల్లల్ని అర్థం చేసుకోవ డం అంటే పప్రంచాన్ని అర్థం చేెసుకోవటమే. అనువయిన సమయంలో, అనువయిన రీతిలో ఆహ్లాదక వాతావరణంలో, ఆకర్షణీయమయిన శైలిలో చిన్న చిన్న కథల మాధ్యమంతో వారికి జీవిత సత్యాలను బోధించాలి. వస్తువు వెల మాతమ్రే కాదు నైతిక విలువను సయితం వారికి తెలి యజేయాలి. మన పిల్లలు సమాజంలోకి వెళ్ళక ముందు వారు మన పేమ్రలో ఆనందంగా ఉండాలి. గతం, భవిష్యత్తు గురించి చింతించకుండా ఈ క్షణంలో మన పిల్లలతో పేమ్రగా ఉండటం మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి. మన భయాలు, మన ఆందోళనలు, స్వీయ సందేహాలు పిల్లలకు చేరకుండా పేమ్రను పంచడం, పేమ్రతోనే పెంచడం నేర్చుకోవడం చాలా అవసరం. అవసరమయితే వారితో కాసేపు ఆడుకొని అయినా సరే వారిని దగ్గరకు తీసు కోవాలి. ఇతరుల ముందు వారిని కించపర్చ రాదు. అలాగే వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు అనుమానంతో, అసూయతో, నిరాశతో మాట్లాడకూడని నచ్చజెప్పాలి. వెరి వెకిలింపులు, వికృత ఆనందం, అతి ఉదేక్రం, చపల స్వభావం, తొందరపాటు, మానసిక బలహీనత, వ్యర్థ కాలక్షేపం, మొదలయిన దురలవాట్లకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే, పిల్లలను మరింత పేమ్రించే, వారి కోసం మరింత సమయం కేటాయించే సమర్థత ఉన్న పేరెంట్స్ సంరక్షణలో పెరిగే పిల్లల్లో, ఆత్మ విశ్వాసం, నైపుణ్యాలు బలంగా ఏర్పడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆహ్లాదకరమయిన బాల్యం ఆరోగ్యకరమయిన సమాజానికి పునాది.
‘మనం అనుకుంటాం పత్రి పార్థ్రనా పార్థ్రనేనని. కానీ, దేవుడు నిర్ణయిస్తాడు ఏది పవితమ్రయి నదో అదే పార్థన్రని’ అన్నట్టు తల్లిదండుల్రుగా మనకు ఎన్ని మంచి ఉద్దేశాలున్నప్పటి ఎక్కడో చోట పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఆ విషయానికొస్తే నేటి తరం పిలల్లకు వారి బాల్యం లేకుండా చేస్తున్నామన్న ఆవేదన ఎంత మంది తల్లిదండుల్రకుంది? తామరాకు తల్లిదండుల్రు కొందరుంటారు. తాము చెప్పిన నీతులు నీటి బొట్లలాగా పిల్లలపై వదిలేెస్తూ ఉంటారు. ఆ నీతి వాక్యాల్ని వారు పట్టించుకోరు. కాబట్టి మనం కేవలం పాఠాలు నేర్పే బాధ గురువులుగా కాక, అనుభవాన్ని అనువైన రీతిలో, అనువైన సమయంలో, అవసరమయిన మొతాదులో చెప్పే బోధ గురువులుగా మసలుకోవాలి. విజయం, వికాసం, మానసిక పరిపక్వత లక్ష్యంగా పిల్లలను పెం చాలి. నీతి బాహ్యతను, అశ్లీలతను అసహ్యించుకునేలా వారికి తర్పీదు ఇవ్వాలి. బాల్యంలో, యవ్వ నంలో వారు చేసే సావాసాలు వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి. కాబట్టి మన పిలలు చెడు సావాసాల చెరలో బంధీలు కాకుండా జాగత్త్ర పడాలి.
‘బిందు బిందువైతే వ్యక్తి, సింధువైతే మహా శక్తి’ అన్న ఐక్యమత్య సూత్రాన్ని వారికి అర్థమయ్యేలా చెప్ప గలగాలి. దివ్వె వెలగాలంటే తైలం కావాలి. అలాగే మన పిల్లలు సత్పౌరులుగా ఎదగాలంటే కేవలం బడి పాఠాలే సరిపోవు. వాటికితోడు పరలోక చింతనా తైలం ఎంతో అవసరం. ‘లోకులు అనుకుంటారు రక్తం కార్చడమే కష్టమని. కానీ, అశువ్రులు కార్చడం అంతకన్నా కష్టం’ అని ఎందరికి తెలుసు అన్నట్టు రాతి చివరి వెళల్లో నిద మేల్కొని పిల్లల శేయ్రస్సు కోసం కడు దీనం గా కన్నీళ్ళు పెట్టుకుంటూ, వారిలో విశిష్ఠమైన పరివర్తన కలిగించమనీ, వారికి మంచి వైపు, సత్యం వైపు దారి చూపని, వారి ద్వారా కళ్ళకు చలువ పస్రాదించమని, వారిని దైవభీతిపరులకు నాయకులుగా తీర్చిద్దిమని అల్లాహ్‌ాను వేడుకోవాలి. అందుకు అనువైన కాలం రమజాను మాసం. కాబట్టి మన పిల్లల బాగు కోసం మనం వారిని మరింత పేమ్రిద్దాం! మరింత సమయమిద్దాం!!