ప్రవక్త (స) వారి ప్రవచనాల నీడలో

సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీదైవప్రవక్త (స) ఇలా భోధించారు: నీవు ఎక్కడ ఉన్నా దేవునికి భయపడుతూ జీవించు. చెడుకు వెనువెంటనే మంచిని చేసి దాన్ని నిర్మూలించు. ప్రజల పట్ల సద్వర్తనతో వ్యవహ రించు.
మనం ఇతరులను కష్టాల్లో ఆదుకోవాలి. వారి బాధను మన బాధగా భావించాలి. ఈ సాను భూతి, దయాగుణాలు బాధాగ్రస్తుడైన ప్రతి వ్యక్తి పట్ల వ్యక్తమవ్వాలి. తనవారైనా, పరాయి వారైనా, ఏ మతంవారైనా, ఏ జాతి వారైనా అందరి పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ వారి బాధల్లో పాలుపంచుకోవాలి. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి. రోగిని పరామర్శిం చడం, రోగికి సేవచేయడం. వంటి పనులు చేపట్టాలి.
ఎవరు తన మనస్సును దేవునికి విధేయంగా చేసి, మరణానంతర జీవితం కోసం సదా చరణ చేస్తారో వారు వివేకవంతులు. ఎవరైతే తమ మనోకాంక్షలకు దాసుడై దేవుని విష యంలో తప్పుడు ఆశలు పెట్టుకుంటారో అవివేకులు. మరణం అంటే జీవితం అంత మయిపోవడమని అర్థం కాదు. మరణం అంటే క్రియాలోకంలో నుంచి పరిణామ ప్రపంచంలోనికి ప్రవేశించడం అని అర్థం. కాబట్టి తమ దృష్టిని సత్పరిణామాల మీద ఉంచి దాని ప్రకారం తమ వైఖరిని చక్క దిద్దుకునే వారు వివేకవంతులు.
అపకారానికి ఉపకారం
బంధుత్వ సంబంధాలను పటిష్టం చేసే వ్యక్తి కేవలం ఇతరులు అలా చేసినందుకు తానూ అలా చేస్తే అది సంబంధాల పటిష్ఠత అనిపించుకోదు. తన పట్ల సంబంధాలను తెంచుకునేవారి విషయంలో సంబంధాలను మెరుగు పరిచే వాడే నిజమయిన బంధుత్వ బాధ్యతల్ని నిర్వర్తించేవాడు. మనిషికి తన బాధ్యతలు గుర్తుండాలి. తన విధుల్ని నిర్వ ర్తించేందుకు సదా ప్రయత్నిస్తూ ఉండాలి. ఇతర బంధువులు తమ బాధ్యతను గ్రహిం చినా, గ్రహించకపోయినా, తన బంధువుల కున్న హక్కుల్ని అందజేసినా, చేయకపో యినా తాను తన బాధ్యతలని మాత్రం విస్మ రించరాదు. ఇతరులు తమ పట్ల బాధ్యతలు నిర్వర్తించినప్పుడు, ఉపకారానికి ఉపకారం చేయడంలో మానవుని గొప్పతనం లేదు. ఇత రులు తన హక్కులు అందజేయకపోయినా దూరం ఉంచినా వారికి ఉపకారం చేయాలి. అదే దేవునికి ప్రీతి పాత్రమైన విషయం. బంధుత్వ బంధాలను తెంచేవాడు స్వర్గంలో ప్రవేశించడు. ఇస్లాం దృష్టిలో ఇది మహా పాపం. ఈ పాపం చేసినవారికి స్వర్గ ద్వా రాలు మూసుకు పోతాయి.
అధర్మమైన సంపాదనతో పోషించబడిన శరీరం స్వర్గంలో ప్రవేశించబడదు. స్వర్గం మనస్సుకు రుచించని విషయాలతో కప్పబడి ఉంది. నరకం మనోకాంక్షలతో కప్పబడి ఉంది. కోరికలు నెరవేరే విషయాల పట్ల మనస్సు సులభంగా లొంగిపోతుంది. అది మనస్సుకు రుచికరంగా ఉంటుంది. కాని ఫలి తంగా నరకం ప్రాప్తిస్తుంది. కారణం ఇది దేవుని అవిధేయతా మార్గం. ఉదా: మనిషి తన మనస్సుకు స్వేచ్ఛనిచ్చి మధుపానం, వ్యభి చారం, అక్రమార్జనం వంటి పాపకార్యాలు చేస్తూ పోతాడు. అలా చేసి దేవుని ఆగ్రహాన్ని ఆహ్వానిస్తాడు. చివరికి నరకానికి చేరుతాడు.

అనుమానం
అనుమానానికి దూరంగా మెలగండి. ఎందు కంటే అనుమానం మహానీచమైన అబద్దం. ప్రజలదోషాలను వెతక్కండి. వెంటబడి పొంచి చూడకండి, పరస్పరం అసూయ పడకండి. ఒకరికొకర్ని ద్వేషించుకోకండి. మీరంతా సోదరులుగా మెలగండి. అనుమానం అనేది మనిషి మనస్సుకు హాని కలిగిస్తుంది, పరస్పర సంబధాల్ని భంగపరుస్తుంది. అనుమానం అంటే మనిషి ఒకరిపట్ల సరైనా ఆధారం, స్పష్టమైన కారణాలు లేకపోయినప్పటికీ దురభి ప్రాయం పెంచుకోవడం. అతనికి వ్యతిరేకం గా అపనిందలు చేయడం, కొన్ని సమయాల్లో అనుమానం ఆధారంగా అనుమానితునికి విరుద్ధంగా తీవ్రమైన చర్యలు కూడా తీసు కుంటారు. తరువాత అసలు విషయం తెలి సాక పశ్చాత్తాపం చెందుతాడు. అందువల్ల మహా ప్రవక్త(స) అనుమానాన్ని మహా నీచ మైన అబద్ధమని అభివర్ణించారు. దివ్యఖుర్‌ఆన్‌ లో కూడా అనుమానం నుండి బయట పడ మని హితువు చేయబడింది.
హృదయ సంపత్తి
సంతుష్టి, సంపదలకంటే అధిక ధనం, సాధనా సంపత్తి కాదు. అసలు సంపద హృదయ సంపత్తియే. ఈ హృదయ సంపత్తి అనేది ప్రతి ఒక్కరిలోను ఉండాలి. హృదయ సంపత్తి కలిగిన వారికి ధనం, వస్తు సంపద, లేకపోయినప్పటికీ తాము అగత్యపరులుగా భావించరు. ఈ మానసిక స్థితి వారికి నిజమైన మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఇలాంటివారు పేదరికంలోనూ రారాజుల్లా భాసిల్లుతారు.
ధనం – దానం – దయ
ధనంలో దేవుడు ఆకర్షణ పెట్టాడు. ఈ విష యంలో మానవున్ని పరీక్షీంచడం జరుగు తుంది. ఏ వ్యక్తి ధనపిసాసలో పడిపోతాడో అతని ఆశ పెరుగుతూ ఉంటుంది. ఎన్ని ధనరాసులైన అతనికి సరిపోవు.
ఏ వ్యక్తి దీనికి భిన్నంగా అత్యాశ, పేరాశ తో తన హృదయాన్ని కలుషితం కాకుండా శుద్ధంగా ఉంచుకుంటాడో, ఎంత సొమ్ము లభించినా దేవునికి కృతజ్ఞతలు తెలు పుకుంటాడో అతనికి కొంత సొమ్ము కూడా సరిపోతుంది. అందులో అల్లాహ్‌ా శుభశ్రేయా లను అనుగ్రహిస్తాడు.
ఎవరైతే కరుణ చూపరో వారికీ కరుణ చూపడం జరగదు. దైవప్రవక్త (స) ప్రవచ నాల్లో సృష్టిరాసుల పట్ల కరుణ చూపడం, మానవుల పట్ల జాతి, మతం, తేడా లేకుండా దయ చూపేవారే దైవకారుణ్యానికి అర్హులౌతారు.

మంచీ చెడు
మంచీచెడులకు ప్రమాణం ఒకరి అంద చందాలు, ఆస్తిపాస్తులు కాదు. వారి హృదయ స్థితి, ఆచరణా స్థితిగతులు. ఒకరు తన మేని చ్ఛాయ, సిరిసంపదలను చూసుకొని గర్విం చడం నిష్ప్రయోజనం. ఎందుకంటే మానవుని అసలు సౌందర్యం అతని ముఖంలో కాదు, అతని శీలంలో ఉంటుంది. అతని అసలు స్థానం అతని ధన బలం వల్ల కాదు, నైతిక బలం వల్ల నిర్ణయమవుతుంది. దేవుని వద్ద గౌరవనీ యుడు చిత్తశుద్ధి, కార్యశుద్ధి గలవాడు మాత్రమే. ఈ లక్షణాలు లేని వ్యక్తి ఎంతటి అందగాడైనా, ఎంతటి సంపన్నుడైనా దేవుని వద్ద ఎలాంటి గౌరవానికి అనర్హుడు.
తల్లి – తండ్రి
మహనీయ ముహమ్మద్‌ (స) – తల్లిదండ్రు లను ప్రేమించడం మహత్తర కార్యంగా పేర్కొన్నారు, దానికి ఎంతో పుణ్యఫలం లభి స్తుందన్నారు. తల్లిదండ్రులకు ఎంతో మక్కు వతో సేవ చేయాలని కూడా తాకీదు చేశారు. తల్లిదండ్రుల సేవ ఎంతగానో ఆయుష్షును ఉపాధినీ పెంచు తుందని తెలి పారు.
ఒక సందర్భంలో దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ”స్వర్గం తల్లి పాదాల క్రింద ఉంది” అంటే నిండు గుండెతో తల్లికి సేవ చేసి, ఆమెతో అత్యుత్తమ రీతిలో ప్రవర్తించి ఆమెను సంతోషపెట్టినట్లయితే స్వర్గం ప్రాప్తిస్తుంది. అంటే ఆమెకు సేవ చేస్తే మనం స్వర్గంలో ప్రవేశించవచ్చు అని అర్థం.

Related Post