ప్రవక్త (స) గారి వంశావళి

వంశావళి

మౌలానా సఫీయుర్రహ్మన్ ముబారక్పూరీ

 

రెండవ అధ్యాయం: ప్రవక్త (స) వారి వంశావళి

మరియు

దైవ దౌత్యానికి పూర్వపు విశేషాలు

ప్రవక్త (స) గారి వంశావళి

అబ్దుల్‌ ముత్తలిబ్‌ కుమారుడైన అబ్దుల్లాహ్ , మహనీయ ముహమ్మద్‌  (స)  గారి తండ్రి. వంశ పరంపర: ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లాహ్  బిన్‌ అబ్దుల్‌ ముత్తలిబ్‌ బిన్‌ హాషిమ్‌ బిన్‌  అబ్దు మునాఫ్  బిన్‌ ఖుసై  బిన్‌ కిలాబ్‌ బిన్‌ ముజ్జా బిన్‌ కఅబ్‌ బిన్‌ లువై బిన్‌ గాలిబ్‌ బిన్‌ ఫహర్‌ బిన్‌ మాలిక్‌ బిన్‌ నజర్‌ బిన్‌ కనానా బిన్‌ ఖుజైమా బిన్‌ ముద్రికా బిన్‌ ఇల్యాస్‌ బిన్‌ ముజర్‌ బిన్‌ నజార్‌ బిన్‌ మఆద్‌ బిన్‌ అద్‌నాన్‌.

మహనీయ ముహమ్మద్‌ (స)   ఖురైష్‌ వంశానికి చెందినవారు. ఖురైష్‌ వంశం అరబ్బుల్లో ఎంతో ఉన్నతమైన, ఆదరణీయమైన వంశంగా కొనియాడబడుతూ వచ్చింది. అరబ్బులు ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ )గారి జేష్ఠ పుత్రుడు అయిన ఇస్మాయీల్‌ (అ )గారి వంశానికి చెందినవారు. ఖురైష్‌ వంశీయులు కాబా గృహ నిర్వాహకులుగా హజ్‌ యాత్రీకులకు నీటి వసతి కల్పించటం, వారికి భోజన సదుపాయాలు సమ కూర్చటం లాంటి సేవలందించేవారు.

1- హాషిమ్‌

ఈయన గొప్ప కీర్తిప్రతిష్టలు గల వ్యక్తి. కాబా గృహ నిర్వాహకుడిగా ఎన్నికయ్యారు. దీనివల్ల ఈయన ఖ్యాతి మరింత వెరిగింది. హజ్‌ యాత్రికులకు భోజన సదు పాయాలు కల్పించిన మొదటి వ్యక్తిగా చరిత్ర ఈయన్ను గుర్తిస్తోంది. ఈయన గారి అసలు వేరు అమ్ర్‌. అయితే యాత్రికుల కోసం రొట్టె, మాంసం తయారు చేసి వెట్టే వారు గనక ‘హాషిమ్‌’ అన్న బిరుదు లభించింది. ఈ కారణంగానే ప్రవక్తప్రవక్త (స) గారి వంశావళి  వారి వంశాన్ని హాషిమీ అని కూడా విలుస్తారు. ఆ బిరుదే తర్వాత ఆయన వేరుగా ఖ్యాతికెక్కింది. ఖురైషుల కోసం సంవత్సరానికి రెండు ప్రయాణాలు నిర్ధారించింది కూడా ఈయనే. ఒకట: చలికాలంలో, రెండవది: ఎండా కాలంలో.

2- అబ్దుల్‌ ముత్తలిబ్‌

ప్రవక్త ముహమ్మద్‌ (స) గారి తాత, హాషిమ్‌ కుమారుడు అబ్దుల్‌ ముత్తలిబ్‌ ఖురైష్‌  వంశానికి నాయకుడు. ఈయన కాబా గృహ హజ్‌ యాత్రికుల నిర్వాహకుడు. అబ్దుల్‌ ముత్తలిబ్‌కు 10 మంది సంతానం. వారందరిలో ప్రముఖులు, ప్రసిద్ధికెక్కిన వారు – 1) అబ్దుల్లాహ్ , 2) అబూ తాలిబ్‌, 3) హమ్జా, 4) అబ్బాస్‌, 5) అబూ లహబ్‌.

ఆయనకు ఆరుగురు కూతుళ్ళు. 1) ఉమ్మె హకీమ్‌ 2) ఆతిఖా 3) సఫియ్యా 4) బర్రా 5) ఉర్వ 6) ఉమైమా. అబ్దుల్‌ ముత్తలిబ్‌ జీవితకాలంలో కాబా గృహానికి సంబంధించిన రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి.

అ) జమ్‌ జమ్‌ బావి త్రవ్వకం ఆ) ఏనుగుల సంఘటన

అ) జమ్‌ జమ్‌ బావి త్రవ్వకం

ఒక సుదీర్ఘ కాలం గడవటం వల్ల ‘పూడిపోయిన జమ్‌జమ్‌ బావిని వెలికి తియ్యి’ అని అబ్దుల్‌ ముత్తలిబ్‌ గారికి కలలో ఆజ్ఞావించబడటంతోపాటు, ఆ బావి స్థలాన్ని సయితం వర్ణించడం జరిగింది. అప్పుడు ఆయన బావి త్రవ్వనారంభించారు. చివరికి నీళ్ళు రానే వచ్చాయి. అప్పటి నుండి జమ్‌ జమ్‌ నీటిని హజ్‌ యాత్రికులకు త్రావించ సాగారు అబ్దుల్‌ ముత్తలిబ్‌.  ఆ) ఏనుగుల సంఘటన

క్లుప్తంగా చెప్పాలంటే అబిసీనియా చక్రవర్తి అయిన నజాషీ గవర్నర్‌గా యమన్‌లో ఉంటున్న అబ్రహా, అరబ్బులు కాబా గృహం వైపు ప్రయాణాలు చేయడం చూసి ‘సన్‌ఆ’ అనే  ప్రాంతంలో బ్రహ్మాండమైన ఓ చర్చీని నిర్మించాడు. అరబ్బులు కాబాను వదిలి ఈ చర్చీ వైపు ఆకర్షితులవ్వాలన్నది అతని ఉద్దేశ్యం. ఇది విన్న కనాన్‌ తెగకు చెందిన ఒక వ్యక్తి రాత్రి సమయంలో ఆ చర్చీలో ప్రవేశించి దాన్ని మలిన పర్చాడు (మల మూత్రాలు విసర్జించాడు.) దాంతో అబ్రహా క్రోధావేశంతో ఊగిపోయాడు.

60 వేల మంది సైనికుల్ని తీసుకుని కాబా గృహాన్ని నేలమట్టం చేసే దురుద్దేశ్యంతో బయలుదేరాడు. తన స్వారీ కోసం వెద్ద ఏనుగును ఎన్నుకున్నాడు. అతని సైన్యంలో తొమ్మిది లేదా 13 ఏనుగులున్నాయి. అబ్రహా మక్కా పట్టణం పొలిమేరలకు చేరగానే సైన్యం ముందు నడుస్తున్న ఓ ప్రత్యేక ఏనుగు హఠాత్తుగా ఆగిపోయి, నేల మీద చతికిలబడింది. శత విధాల ప్రయత్నించినా అది కదల్లేదు. విచిత్రం ఏమిటంటే- ఉత్తర, దక్షిణ, తూర్పు దిక్కుకు తివ్పి అదిలిస్తే చాలు అది పరుగెత్తేది. కాని కాబా వైపు తిప్పగానే అది మొండికేసేది. అంతలోనే అల్లాహ్  వారి మీదికి అబాబీల్‌ అనే పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు. అవి వారి మీద కంకర్రాళ్ళు విసిరేవి. దాంతో వారు పశువులు తిని తొక్కి వేసిన పొట్టులా సర్వనాశనం అయ్యారు.ప్రతి పక్షితోటే మూడు కంకర్రాళ్ళుండేవి. ఒకటి నోటిలో, రెండు కాళ్ళలో. ఆ రాళ్ళు తగిలిన ప్రతి వ్యక్తి అవయ వాలు ఊడి క్రింద పడిపోసాగాయి. వారంతా సర్వనాశనమైపోయారు. అల్లాహ్‌ా అబ్రహాను ఓ వ్యాధికి గురి చేశాడు. ఆ వ్యాధి కారణంగా అతని చర్మం చిట్లి మాంసం క్రింద పడసాగింది. దానికితోడు విపరీతమైన దురద కూడా ఉండేది. అతను ‘సన్‌ఆ’ చేరి మరణించాడు. ఏనుగుల సంఘటన ముహర్రమ్‌ నెలలో జరిగింది. అంటే దైవ ప్రవక్త (స ) గారి ఆగమనానికి, జననానికి యాభై లేదా యాభై ఐదు రోజుల ముందు అన్న మాట.  మహా ప్రవక్త (స ) గారి వితామహులు అబ్దుల్లాహ్‌ా

అబ్దుల్లాహ్  గారి తల్లి వేరు ఫాతిమా. అబ్దుల్‌ ముత్తలిబ్‌ సంతానంలోకెల్లా అందమైనవారు, ఆకర్షణ గలవారు. అబ్దుల్లాయే  అందరికన్నా ఎక్కువగా అబ్దుల్‌ ముత్తలిబ్‌కు వ్రియతముడు. ఆయన జబీహ్ గా విలువబడేవారు. అదెలాగంటే-, తనకు పది మంది కొడుకులు పుట్టాక వారిలోని ఒకరిని కాబా గృహం వద్ద బలి ఇస్తానని మొక్కుకున్నారు అబ్దుల్‌ ముత్తలిబ్‌. అందరి వేర్లు బాణాలవై వ్రాసి, ఆ బాణాలను హుబుల్‌ విగ్రహం పూజారికిచ్చారు. అతను (ఓ ప్రత్యేక పద్ధతిలో) వాటిని తిప్పగా, బాణం అబ్దుల్లాహ్  వేరున వచ్చింది. అంతే. కత్తి చేబూని అబ్దుల్లాహ్ ను బలివ్వడానికి కాబా గృహం వైపు బయలుదేరారు అబ్దుల్‌ ముత్తలిబ్‌. ఖురైష్‌ ప్రజలంతా ఆయన్ను బలివ్వద్దని వారించారు. బంధువులు, తమ్ముళ్ళు, అబూ తాలిబ్‌ కూడా అడ్టుపడ్డారు.

మరి నా మొక్కుబడి సంగతేంటి? అన్నారు అబ్దుల్‌ ముత్తలిబ్‌. మంత్రగత్తె వద్దకు వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం అడుగుదాం అని అక్కడున్నవారందరూ సలహా ఇచ్చారు. ఆ మంత్రగత్తె…”అబ్దుల్లాహ్‌ా వేరున పది ఒంటెలకు పాచికలు వేసి చూడండి. ఒకవేళ అబ్దుల్లాహ్‌ా వేరున వస్తే మరో పది చేర్చండి. ఇలా అతని ప్రభువు ప్రసన్నుడయ్యే వరకు చేయండి. ఎప్పుడైతే ఒంటెల వేరు మీద వస్తుందో అప్పుడు ఒంటెల్ని బలివ్వండి” అని సలహా ఇచ్చింది.

అబ్దుల్‌ ముత్తలిబ్‌ అక్కడ నుండి బయలుదేరారు. మంత్రగత్తె చెవ్పినట్లే పాచికలు వేశారు. అబ్దుల్లాహ్  వేరు వచ్చింది. అలా పది, పది ఒంటెల చొప్పున వెంచుకుంటూ పోయారు. ఒంటెల సంఖ్య వందకు వెరిగిన తరువాత ఒంటెల వేరు వచ్చింది. అప్పుడు ఆయనకి బదులు వాటిని బలిచ్చారు. ఆ తర్వాత అబ్దుల్‌ ముత్తలిబ్‌ వాటిని ఏ మనిషీ ముట్టకుండా, ఏ తోడేలూ దగ్గరికి రాకుండా అలాగే పడేశారు. ప్రవక్త (స ) ఓ సందర్భాన – ”నేను ఇబ్నుజ్జబీహతైన్‌”ని అని అభిప్రాయపడ్డారు. అంటే, ప్రవక్త ఇస్మాయీల్‌ (అ ) మరియు అబ్దుల్లాహ్ల పుత్రుణ్ణి అని భావం.

అబ్దుల్‌ ముత్తలిబ్‌ గారు తన ముద్దుల కొడుకు వెళ్ళి కోసం వహబ్‌ బిన్‌ అబ్దు మునాఫ్‌ కుమార్తె ‘ఆమినా’ను వధువుగా ఎంవిక చేెశారు. ఆమె ఖురైష్‌ వంశస్థులో కెల్లా వంశం రీత్యాను, హోదా అంతస్థుల దృష్ట్యానూ పుణ్య స్త్రీగా, పరిగణించబడేది. ఆమె తండ్రి ‘బనూ జహ్రా’ తెగ నాయకుడు. ఆ సుగుణాల    రాసితో    అబ్దుల్లాహ్   అబ్దుల్లాహ్  వివాహం జరివించారు. కొన్నాళ్ళ తర్వాత అబ్దుల్‌ ముత్తలిబ్‌ ఖర్జూరాల కోసమని కొడుకును మదీనా పట్టణానికి పంపారు. అబ్దుల్లాహ్  అక్కడే మరణించారు. మరో కథనం ప్రకారం: అబ్దుల్లాహ్  వ్యాపార నిమిత్తం సిరియా వెళ్ళాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణంలో మదీనాలో విడిది చేశారు. అప్పుడు ఆయన జ్వరంతో బాధ పడుతూ అక్కడే కాలధర్మం చెందారు. అప్పటికి ఆయన వయసు 25 సంవత్సరాలు. మహా ప్రవక్త (స ), తల్లి కడుపులో ఉండగానేె ఈ సంఘటన జరిగింది. అబ్దుల్లాహ్  తన వెనక వదలి వెళ్ళిన ఆస్తిలో మొత్తం ఐదు ఒంటెలు, కొన్ని గొర్రెలు, ఉమ్మె ఐమన్‌గా విలువబడే ‘బరకత్‌’ అనే నీగ్రో బానిస స్త్రీ. ఆమె గారే మొదట మహా ప్రవక్త (స ) వారిని ఒడిలో తీసుకున్న అదృష్టవంతురాలు.

 

జననం – దైవ దౌత్యానికి పూర్వం 40 సంవత్సరాలు

విశ్వనాయకుడు (స ) రబీవుల్‌ అవ్వల్‌ 9వ తేది (క్రీ.శ 571 ఏవ్రిల్‌ నెల 20వ తేది) సోమవారం నాడు జన్మిం చారు. ఇబ్ను సాద్‌ కథనం ప్రకారం- మహా ప్రవక్త (స ) గారి తల్లి ఇలా అభిప్రాయపడ్డారు: ”నేను ముహమ్మద్‌ (స ) ను ప్రసవించినప్పుడు నా నుండి అనిర్వచనీయమైన ఓ అద్భుత కాంతి వెలువడింది. అది సిరియా భవనాలన్నిం టినీ వెలుగుతో నింవేసింది”. మరికొన్ని కథనాల ప్రకారం – ఆ సందర్భంగా కొన్ని విచిత్ర సంఘటనలు జరిగాయి. తరాల తరబడి మజూసీలు పూజించే అగ్ని ఒక్క సారిగా చల్లారిపోయింది. బుహైరా, సావా ప్రాంతాల్లోని విగ్రహా లయాలు కూలిపోయాయి.

మహా ప్రవక్త పుట్టారన్న శుభవార్తను తల్లి ఆమినా మొదట తాతగారైన అబ్దుల్‌ ముత్తలిబ్‌ గారికి అంద జేశారు. ఈ వార్త వినగానే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బ వుతూ ఒక్క ఉదుటున ఇంట్లో ప్రవేశించారు అబ్దుల్‌ ముత్తలిబ్‌. తర్వాత ఆ పసి విల్లవాడిని తీసుకుని కాబా గృహంలో ప్రవేశించి, అల్లాహ్‌ాకు కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ఆ బాలుడికి ‘ముహమ్మద్‌’ అని నామకరణం చేశారు. ప్రవక్త గారి తల్లి తర్వాత బాబాయి (అబూ లహబ్‌) ఇంట్లో పనికత్తెగా ఉన్న ‘సువైబా’ ఆయనకు పాలు త్రావించే భాగ్యాన్ని తన సొంతం చేసకుంది.

శుభాలు పొంగి పొర్లిన వేళ…

బనూ సఅద్‌లో…

సాధారణంగా అరేబియా పట్టణ వాసుల్లో తమ విల్లల్ని పాలు త్రాగించి పోషించడానికి ఆయాలకు అప్పగించి పల్లె

వాసాలకు పంవే ఆచారం ఉండేది. కారణం –

1) పల్లెల్లో సహజ వాతావరణంలో విల్లలు వ్యాధులకు దూరంగా ఆరోగ్యంగా వెరుగుతారని, దృఢకాయులుగా,

ధైర్యవంతులుగా తయారవుతారని వారి నమ్మకం.

2) తమ విల్లలు పసితనం నుంచే స్వచ్ఛమైన అరబీ భాష నేర్చుకోవాలని, అరబీ లోకోక్తులవై ప్రావీణ్యం సాధిం చాలని.

అబ్దుల్‌ ముత్తలిబ్‌ గారు మహా ప్రవక్త (స ) కోసం ఆయాల అన్వేషణ ప్రారంభించారు. చివరికి సాద్‌ తెగకు చెందిన స్త్రీ- అబూ జువైబ్‌ కుమార్తె హలీమా, ముహమ్మద్‌ (స )కు పాలు తావించే, పోషించే బాధ్యతను స్వీకరిం చింది. ముహమ్మద్‌ (స )తో పాటు పాలు త్రాగిన వారిలో హారిస్‌ కుమారుడు అబ్దుల్లాహ్‌ా, హారిస్‌ కుమార్తె షీమా ఉన్నారు. ఆయా హలీమా ముహమ్మద్‌ (స ) ద్వారా ప్రాప్తమయిన శుభాలను కళ్ళారా తిలకించింది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, ఆమె బాల ముహమ్మద్‌ (స )ను ఒడిలో తీసుకున్న మరుక్షణమే ఆమె స్తనాలు పాలతో నిండిపోయాయి. ఆమె గొర్రెలు లావెక్కాయి. వాటి పాలు రెట్టింపయ్యింది. గొర్రెలు మేసే చోట కూడా గడ్డి దట్టంగా మొలిచింది. పూర్వం అదే నేల బీడువారి ఉండేది. మహనీయ ముహమ్మద్‌ (స ) పెరిగి పెద్ద వారవుతున్న కొద్దీ ఆ శుభాలు కూడా అధికమవ్వసాగాయి. రెండేళ్ళు నిండాక హలీమా ఆ బాలుడ్ని అమ్మ ఆమినా వద్దకు తీసుకు వచ్చింది. కాని అక్కడ అంటు వ్యాధి ప్రబలి ఉన్న కారణంగా మళ్ళీ హలీమా సాదియా, తల్లి ఆమినా కోరికవై బాల ముహమ్మద్‌ (స )ను మరోసారి తన పల్లెకు తీసుకుపోయింది.

ఇలా మహా ప్రవక్త (స ) బనూ సఅద్‌తో పల్లె వాతావరణంలో ఉండసాగారు. ఆయనకు నాలుగు లేదా ఐదు ఏళ్ళు నిండి ఉంటాయి. రొమ్ము చీల్చిన (షఖ్ఖె సదర్‌) సంఘటన జరిగింది. ముస్లిం హదీసు గ్రంథంలో హజ్రత్‌ అనస్‌ (స ) గారి కథనం ఇలా ఉంది: ”నిశ్చయంగా దైవ ప్రవక్త (స ) బాల్యంలో తోటి  విల్లలతో ఆడుకుంటూ ఉండగా, ఆయన వద్దకు జిబ్రయీల్‌ దూత వచ్చారు. వచ్చీ రాగానే ప్రవక్త (స ) గారిని పరుండబెట్టి వడిసి పట్టుకున్నారు. ఆయన రొమ్ము పరికరంతో చీల్చి గుండెకాయను బయటికి తీసారు. దాని నుండి ఓ భాగాన్ని వేరుపర్చి ఇది మీలోని షైతాన్‌ భాగం అన్నారు.  ఆ తరువాత పసిడి పళ్ళెంలో ఉంచి గుండెకాయను జమ్‌జమ్‌ జలంతో శుభ్రంగా కడిగి, దాన్ని మళ్ళీ దాని స్థానంలో వెట్టి అమర్చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన విల్లలంతా ఆయా హలీమా దగ్గరకు వచ్చి – ”ముహమ్మద్‌ హత్య చెయ్య బడ్డాడు, వెళ్ళి చూడండి” అన్నారు.

మాతృమూర్తి ఒడికి

ఈ సంఘటన తరువాత ఆయా హలీమాకు ముహమ్మద్‌ (స ) గురించి చింతన ఎక్కువయింది. చివరికి ఆయన (స ) గారిని తీసుకొచ్చి తల్లి ఆమినాకి అప్పగించింది. ప్రవక్త (స ) తన శిక్షణలో ఆరేళ్ళు నిండేంత వరకూ ఉన్నారు. అమ్మ ఆమినా అనాథ ముహమ్మద్‌ (స )ను వెంట బెట్టుకుని మరణించిన తన భర్త స్మృతి చిహ్నాలు చూసి రావడానికి, భర్త సమాధిని దర్శించడానికి మక్కా నుండి బయలుదేరి, యస్రిబ్‌  (మదీనా)కి చేరుకున్నారు. ఆమెతోపాటు ఉమ్మె ఐమన్‌ కూడా ఉంది. దాదాపు ఒక నెల రోజుల పాటు అక్కడ గడివి మక్కాకు తిరుగు ప్రయాణమయ్యారు. కాని మార్గ మధ్యంలో ఓ మహమ్మారి రోగం చుట్టుముట్టింది. దాని ప్రభావంతో మదీనా మక్కాల మధ్య అబ్వా అనే ప్రాంతంలో ఆమె పరమపదించారు (అక్కడే ఆమెను సమాధి చేశారు).

పువ్వు పుట్టగానే పరిమళించినట్టు…

అబ్దుల్‌ ముత్తలిబ్‌ తమ ముద్దుల మనవడిని తీసుకుని మక్కా చేరుకున్నారు. ముహమ్మద్‌ (స ) అంటే ఆయనకు అమితమైన వాత్సల్యం. ఇప్పుడు కోడలు కూడా అసువులు బాసడం వల్ల అనాథ మనుమని పట్ల ఆయనకున్న వ్రేమ రెట్టింపయ్యింది. తన సంతానంలో అందరికన్నా ఈ మనవడికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. కాబా నీడలో అబ్దుల్‌ ముత్తలిబ్‌ కోసమని ప్రత్యేకంగా పడక (సాప) వేయబడేది. ఆయన విల్లలందరూ ఆ సాప చుట్టు కూర్చునేవారు. తండ్రి పట్ల ఉన్న గౌరవం వల్ల దానివై కూర్చునే ధైర్యం చేసేవారు కాదు. అయితే ప్రవక్త (స ) దానివై వచ్చి కూర్చునేవారు. ప్రవక్త (స ) గారి బాబాయి లందరూ కలిసి ఆయన్ను ప్రక్కకు జరపాలని ప్రయత్నించేె  వారు. అప్పుడు అబ్దుల్‌ ముత్తలిబ్‌ – ”నా బిడ్డను వదలండి. దైవ సాక్షిగా! ఇతని స్థానం మహోత్కృష్టమైనది” అంటూ తనతో కూర్చోబెట్టుకుని ఆయన వీపు తట్టేవారు. ప్రవక్త (స ) గారి వయసు ఎనిమిది సంవత్సరాల రెండు నెలలకు చేరుకోగానే, తాత గారైన అబ్దుల్‌ ముత్తలిబ్‌ మక్కాలో తనువు చాలించారు. పోతూపోతూ మనవడి పోషణాభారం ప్రవక్త (స ) గారి వెదనాన్న (ప్రవక్త గారి తండ్రి అబ్దుల్లాహ్‌ా మరియు అబూ తాలిబ్‌ ఒకే తల్లి బిడ్డలు) అబూ తాలిబ్‌కు అప్పగించి వెళ్ళారు.

మమతకు మారు వేరయిన వెదనాన్న సంరక్షణలో

అబూ తాలిబ్‌ తన భ్రాతృజుడ్ని అల్లారు ముద్దుగా వెంచారు. ప్రవక్త (స ) గారి పట్ల ఈయనకు ప్రత్యేక వ్రేమాభిమానాలు, అవ్యాజానురాగాలుండేవి. ఒక్కోసారి తన కన్న కొడుకులవై కూడా ప్రవక్త (స ) గారికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. అంతే కాదు, ప్రవక్త (స ) గారి ద్వారా ప్రార్థన చేయిస్తే మేఘాలు వర్షించేవి. ప్రవక్త (స ) గారి బాల్యంలో ఒకసారి మక్కాలో కరువు రక్కసి ఆవహించింది. తీవ్ర ఆందోళన చెందిన ఖురైషులంతా అబూ తాలిబ్‌ వద్దకు వచ్చి, ‘మీరు వర్షం కోసం దైవాన్ని ప్రార్థించండి’ అని విన్నవించుకున్నారు. ఆయన బయలుదేరారు. ఆయనతోపాటు బాల ముహమ్మద్‌ (స ) కూడా ఉన్నారు. బాల ముహమ్మద్‌ (స )ను కాబా గోడకు ఆనిచ్చి కూర్చోబెట్టారు. తరువాత వర్షం కోసం ప్రార్థించగా కొన్ని క్షణాల్లో దట్టమైన మేఘాలు క్రమ్ముకున్నాయి. ఆకాశం నుండి వర్షం కురిసింది. వీధులన్నీ ఏరులై పారాయి.

బుహైరా – రాహిబ్‌ (సన్యాసి)

దైవ ప్రవక్త (స ) గారికి పన్నెండు ఏండ్లు నిండగానే అబూ తాలిబ్‌ ఆయన్ని వెంటబెట్టుకొని వ్యాపార నిమిత్తం సిరియా వెళ్ళారు. చివరికి (ఈ వర్తక బృందం) బస్రా పట్టణం చేరుకుంది. ఈ పట్టణంలో బుహైరా వేరుతో విలువబడే ‘జర్‌జిస్‌’ అనేె ఓ సన్యాసి ఉండేవాడు. వర్తక బృందం సేద తీర్చుకోవడానికి అక్కడ ఆగింది. ఇది తెలుసుకున్న తను వెళ్ళి వారికి స్వాగతం పలికాడు. ఎంతో మర్యాదగా ప్రవర్తించాడు. వారందరికీ విందు ఇచ్చి తగురీతిలో సత్కరించాడు. తను గతంలో ఎన్నడూ వారి వద్దకు వచ్చిన దాఖలాలు లేవు. అతను ప్రవక్త (స ) వారిని ఆయన గుణవిశేషాల ఆధారంగా పసిగట్టాడు. ప్రవక్త (స ) గారి చెయ్యి పట్టుకుని ఇలా అభిప్రాయపడ్డాడు: ”ఈ అబ్బాయి విశ్వనాయకుడు, ఈ బాలుడ్ని అల్లాహ్‌ా సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యంగా చేసి పంపాడు”. ఈ విషయం నీకెలా తెలుసు? అని అబూ తాలిబ్‌ ప్రశ్నించగా ”ఈ కనుమ గుండా మీరు ప్రవేశించి నప్పుడు ఇక్కడున్న ప్రతి రాయి, ప్రతి చెట్టు సాష్టాంగపడసాగాయి. అలా అవి కేవలం ఒక ప్రవక్తకు మాత్రమే సజ్దా చేస్తాయి. అలాగే రెండు  భుజాల  మధ్యనున్న  ఆవిల్‌  లాంటి దైవ దౌత్య ముద్రతో ఆయన్ను గుర్తు పట్టాను. ఆయన ప్రస్తావన మా గ్రంథాల్లో సయితం వచ్చింది. ఇక ఈ అబ్బాయిని తీసుకెళ్ళండి. ఇంకెప్పుడూ ఈయన్ను ఇలా వెంటబెట్టుకుని సిరియా దేశానికి వెళ్ళకండి. బహుశా యూదులు ఇతనికి హాని తలవెట్టవచ్చు” అని హెచ్చరించాడు. ఆ తరువాత అబూతాలిబ్‌ కొందరు సేవకులను తోడు చేెసి ముహమ్మద్‌ (స )ను మక్కాకు వాపసు పంవించారు.

 

Related Post