తహారత్‌ నిర్వచనం

 

ఐ పి సి తెలుగు విభాగం

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ''నిస్సందేహంగా అల్లాహ్‌ తౌబా చేసుకుంటూ ఉండేవారిని, పరిశుభ్రతను ,పరిశుద్ధతను పాటించేవారిని ప్రేమిస్తాడు'' ( అల్‌ బఖర 222) దైవప్రవక్త(స)వారు ఇలా సెలవిచ్చారు:  ''శుచీ శుభ్రత విశ్వాసపు ఒక భాగం'' (ముస్లిం 223) మరో హదీసులో దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ''అయిదు విషయాలు ప్రకృతి సిద్ధమయినవి. ఖితాన్‌(ఒడుగులు) ఇస్తిహ్‌ాదాద్‌,మీసాలను కత్తిరించడం, గోర్లను కత్తిరించడం'', (బుఖారి 555ం, ముస్లిం 257)

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”నిస్సందేహంగా అల్లాహ్‌ తౌబా చేసుకుంటూ ఉండేవారిని, పరిశుభ్రతను ,పరిశుద్ధతను పాటించేవారిని ప్రేమిస్తాడు” ( అల్‌ బఖర 222)
దైవప్రవక్త(స)వారు ఇలా సెలవిచ్చారు: ”శుచీ శుభ్రత విశ్వాసపు ఒక భాగం” (ముస్లిం 223)
మరో హదీసులో దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”అయిదు విషయాలు ప్రకృతి సిద్ధమయినవి. ఖితాన్‌(ఒడుగులు) ఇస్తిహ్‌ాదాద్‌,మీసాలను కత్తిరించడం, గోర్లను కత్తిరించడం”, (బుఖారి 555ం, ముస్లిం 257)

1) తహారత్‌ నిర్వచనం

తహారత్‌ అంటే నిఘంటువ ప్రకారం శుచి,శుభ్రత అని అర్థం.’తతహ్హర్‌ బిల్‌ మా” అంటే అన్ని విధాల కల్తీల నుండి పరిశుభ్రమైన నీరు అని అర్థం. ‘తతహ్హర్‌ మినల్‌ హసద్‌’ అంటే అసూయాద్వేషాల నుండి ముక్తినొందాడు అని అర్థం.
తహారత్‌ షరీయతు పరిభాషలో: దేన్ని పొందయితే మనిషి నమాజు చేయగలడో ఆ శుభ్రత. అలాగే నమాజు ఆదేశాలతో ముడిపడి ఉన్న వాటికి కూడా తహారత్‌ అంటారు. ఉదాహరణకు వుజూ లేని వ్యక్తి వుజూ చేసుకోవడం, గుసుల్‌ తప్పనిసరి అయిన వ్యక్తి స్నానం చేయడం. దుస్తుల నుండి దేహం నుండి, స్థలం నుండి అశుద్ధతను దూరం చేయడం.
శుచీశభ్రతల విషయంలో ఇస్లాం ప్రత్యేకమయిన శ్రద్ధ చూపుతుంది. క్రింది ఆయతులు మరియు హదీసుల ద్వారా అది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”నిస్సందేహంగా అల్లాహ్‌ తౌబా చేసుకుంటూ ఉండేవారిని, పరిశుభ్రతను ,పరిశుద్ధతను పాటించేవారిని ప్రేమిస్తాడు” ( అల్‌ బఖర 222)
దైవప్రవక్త(స)వారు ఇలా సెలవిచ్చారు: ”శుచీ శుభ్రత విశ్వాసపు ఒక భాగం” (ముస్లిం 223)
మరో హదీసులో దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”అయిదు విషయాలు ప్రకృతి సిద్ధమయినవి. ఖితాన్‌(ఒడుగులు) ఇస్తిహ్‌ాదాద్‌,మీసాలను కత్తిరించడం, గోర్లను కత్తిరించడం”, (బుఖారి 555ం, ముస్లిం 257)

2 శుద్ధి పొందగలిగే జలాశయాల వివరాలు

1. ఆకాశం నుండి కురిసే నీరు 2. సముద్ర నీరు 3. బావి నీరు 4. కాలువల నీరు 5. చెరువుల నీరు 6. మంచు నీరు – అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిచ్చాడు: ”మేము ఆకాశం నుండి పరిశుద్ధ జలాన్నిఅవతరింపజేశాము.” (ఫుర్ఖాన్‌:48)
అబూహురైరా(ర) గారి కథనం: ఓ వ్యక్తి దైవప్రవక్త(స) వారిని ప్రశ్నించాడు: ”ఓ రసూలుల్లాహ్‌! మేము ఎక్కువగా సముద్ర యానం చేస్తుంటాము. అవసరార్థం మాతో పాటు కాసిన్ని మంచి నీరుని సయితం పెట్టుకెళతాము. ఒకవేళ ఆ మంచి నీరుతో వుజూ చేసుకుంటే దాహార్తి తీర్చుకోవడం కోసం నీళ్ళుండవు. మరి సముద్ర జలంతో మేము వుజూ చేసుకోవచ్చా?” దానికి దైవప్రవక్త(స) ”సముద్ర జలం శుద్ధమయినది. అందులోని మృత జంతువుల్ని తినటం కూడా ధర్మసమ్మతమే” అన్నారు. (అబూ దావూద్‌ 83,తిర్మిజి 69)

3 నీటి రకాలు

1. మాయె ముతహ్హిర్‌:

అల్లాహ్‌ ప్రసాదించిన సహజ స్వభావంపై గల నీరుని పరిశుభ్రమైన నీరంటారు. అది ఒక చోట ఎక్కువ కాలం నిల్వ ఉన్నా అపరిశుద్ధం కాదు. అలాగే అందులో మట్టి పడటంవల్లగాని, దుమ్ము పేరుకుపోవడం వల్లగానీ, ఎక్కువ కాలం నిల్వ ఉన్న కారణం పాచీ ఏర్పడటంవల్ల గానీ అది అపరిశుద్ధం కాదు.
అబూ హురైరా (ర) కథనం: ఓ పల్లెటూరి వ్యక్తి నిలబడి మస్జిదులోనే మూత్ర విసర్జన చేసేశాడు. అతన్ని గద్దించే నిమిత్తం ప్రజలు లేవగా, దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు: అతన్ని వదిలేయండి.(అతన్ని మూత్రం పోసుకోనివ్వండి) తర్వాత అతని మూత్రం మీద ఒక బిందె నీళ్ళు కుమ్మరించండి సరిపోతుంది. ”నిశ్చయంగా మీరు సౌలభ్యాన్ని కలుగజేసేవారుగా ప్రభ వింపజేయబడ్డారు. సంకట స్థితికి గురి చేసేవారుగా కాదు సుమా!” అన్నారు. (బుఖారి 217)
”మూత్ర స్థలం మీద నీటిని కుమ్మరించండి” అన్న ప్రవక్త(స)వారి ఆదేశం నీటిలో పరిశుభ్రపర్చే గుణం ఉందనడానికి బలమైన ఆధారం.

2. మక్రూహ్‌ అయిన పరిశుద్ధ నీరు:

సూర్యుని కిరణాలతో వేడెక్కిన నీరు ఉపయోగించడాన్ని మక్రూహ్‌గా పరగణిస్తారు కొందరు పండితులు. అటువంటి నీరు మక్రూహ్‌ అనడానికి మూడు షరతులు అవి:
– ఆ నీరు ఉష్ణోగ్రత అధికంగా ఉండే దేశాలలో ఉండాలి.
– అది లోహపు ఇత్తడి పాత్రల్లో ఉండటం – దాన్ని వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉండటం.
ఉమర్‌ (ర)గారు, అటువంటి నీటితో స్నానం చేయడాన్ని ఇష్టపడేవారు కాదన్నారు ఇమామ్‌ షాఫయీ(ర). అలాగే నేను సూర్యుని వల్ల వేడెక్కిన నీళ్ళను కేవలం ఆరోగ్యం రీత్యా మాత్రమే అసహ్యించుకుంటున్నాను అన్నారాయన. ఆయన చెప్పిన మరో మాట ఏమిటంటే అటువంటి నీరు వల్ల కుష్టువ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు.

3. మాయె తాహిర్‌ గైర్‌ ముతహ్హిర్‌: అది రెండు రకాలు:

(1) పరిశుభ్రమైనదయినప్పటికీ పరిశుద్ధం కావడానికి ఉపయోగ పడని నీరు. ఉదాహరణకు వుజూ,గుసుల్‌ కోసం ఒకసారి ఉపయోగించిన నీరు. అంటే ఈ నీరు మళ్ళీ వుజూ,గుసుల్‌ చేయడానికి పనికిరాదన్న మాట.
జాబిర్‌ (ర) కథనం: నేను అనారోగ్యంలో ఉన్నప్పుడు దైవప్రవక్త (స) వారు నన్ను సందర్శించి వుజూ చేసి మిగిలిన నీరుని నాపై కుమ్మరించారు. (బుఖారి 191, ముస్లిం1616)
అట్టి నీరు పరిశుభ్రతకోసం పనికిరాదు అనడానికి ఆధారం: అబూ హురైరా (ర) గారి కథనం: దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : ”నిల్వ ఉన్న నీటిలో అశుద్ధావస్థలో ఉండి స్నానం చేయకూడదు” అన్నారు దైవప్రవక్త (స). అందుకు అక్కడున్నవారు ఓ అబాహురైరా! మరి మేమేంచేయాలి? అని ప్రశ్నించగా ”ఆ నీటిని కొంచెం కొంచెంగా తీసుకుని స్నానం చేయండి” అని ఉపదేశించారాయన.
పై హదీసు ద్వారా తెలిసిందేమిటంటే నిల్వ ఉన్న నీరులో అశుద్ధావస్థగల వ్యక్తి స్నానం చేయడం వల్ల ఆ నీరు అశుద్ధమయిపోతుంది.
(2) పరిశుద్ధమయిన నీరేకానీ అందులో మరో పరిశుభ్రమయిన వస్తువు కల్పడం వల్ల రంగు రుచి మారిపోయిన నీరు మళ్ళీ శుభ్రపర్చడం గానీ, వేరు పర్చడంగానీ సాధ్యం కాని నీరు. అలా జరిగినప్పుడు ఆ నీరుని నీరని పిలవరు. ఉదాహరణకు చాయ్‌,కూర, జూస్‌ వగైరా. ఒకవేళ నీటిలో కల్పబడిన నీటి రుచిని,రంగుని మార్చనిదయి ఉంటే అది పరిశుద్ధమయినదే అవుతుంది. ఉదాహరణకు పూరేకులు వేయబడిన నీరు. ఒకవేళ అటువంటి వాటి వల్ల నీటి రుచిగాని, రంగు గాని మారితే, మారిన ఆ శాతాన్ని బట్టి నిర్ణయం తీసుకోబడుతుంది.

4. అశుద్ధ జలం: ఏదయిన అశుద్ధ వస్తువు పడిన నీరు. అది రెండు రకాలు:

(1) మాయె ఖలీల్‌: అంటే స్వల్ప జలం. ఒక అంచుపై మాలిన్యం పడితే దాని ప్రభావం మరో అంచుపై కూడా పడి రుచి, రంగు వాసన మారిపోయేంతటి తక్కువ పరిమాణం గల నీరు. అనగా దాదాపు 216 లీటర్ల నీరు. ఈ నీటిలో తక్కువ పరిమాణంలో మాలిన్యం పడినా రుచి,రంగు,వాసన మారిపోకపోయినా సరే అది అపరిశుభ్రం అవుతుంది.అబ్దుల్లా బిన్‌ ఉమర్‌(ర) దైవప్రవక్త(స) ఇలా చెబుతుండగా తాను విన్నానని చెప్పారు (పశువులు, తోడేళ్ళు వచ్చిపోయే) ‘అడవి, లేదా ఎడారి ప్రాంతంలో గల నీరు గురించి ఆయన్ను ప్రశ్నించడం జరిగింది. అందుకు ఆయన ఆ నీరు 216 లీటర్ల పరిమాణంలో ఉంటే అది పరిశుద్ధం అన్నారు. ( అబూదావూద్‌ 63)
అబూ హురైరా(ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు: మీలో ఎవరయినా నిద్ర నుండి మేల్కొంటే చేతులు కడుక్కోకుండా ఏ గిన్నెలోనూ పెట్టకూడదు. ఎందుకంటే అతని చేతులు నిద్రావస్థలో ఎక్కడెక్కడ వెళ్ళాయో తెలీదు గనక.          ( ముస్లిం 278)
(2) మాయె కసీర్‌: అంటే అధిక జలం. ఒక అంచుపై మాలిన్యం పడినా మరో అంచుపై దాని ప్రభావం ఉండనంతటి ఎక్కువ పరిమాణం గల నీరు. అంటే 216 లీటర్లు లేదా దానికి మించిన నీరు. ఇటువంటి నీటిలో ఏదయినా మాలిన్యం పడితే అశుద్ధమవదు. పడిన మాలిన్యం మూలంగా ఆ నీటి మూడు లక్షణాలు మారిపోతే అది అశుద్ధమయిపోతుంది. రంగు, రుచి, వాసన. పండితులందరూ ఏకీభవించడమే దీనికి ఆధారం. స్వల్ప నీటిలోగాని, అధిక జలంలోగాని ఏదయినా మాలిన్యం పడి ఆ నీటి రంగు,రుచి, వాసన మారిపోతే అ నీరు అశుద్ధమవుతుంది.

 

Related Post