ఐ పి సి తెలుగు విభాగం
సలాత్: అంటే భాషాపరంగా దుఆ (ప్రార్థన) అని అర్థం.
సలాత్: షరీయతు పరిభాషలో కొన్ని ప్రత్యేకమైన క్రియలు, మాటలు. అవి తక్బీర్ (అల్లాహు అక్బర్)తో మొదలయి తస్లీమ్ (అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్) తో పూర్తవుతాయి. సలాత్ నామకరణానికి కారణం అందులో అత్యధిక శాతం దుఆ ఉండటమే.
నమాజ్ ఆదేశం పరమార్థం
1. మనిషిని అతని జీవితంలోని అసలు లక్ష్యాన్ని ఎరుక పర్చడం.
2. సకల విషయాల కారకుడు అల్లాహ్‌ా మాత్రమేనని సహాయం చేయడం, అనుగ్రహించడం,మేలు చేకూర్చడం,
బ్రతికించడం, చంపడం, ఆయన ఒక్కడికి మాత్రమే సాధ్యమన్న విషయాన్ని నమాజీకి గుర్తు చేయడం.
3. నమాజు వల్ల అతని వల్ల జరిగిన పాపాలను ప్రక్షాళనం గావించుకునే సదవకాశం లభిస్తుంది.
4.ఆత్మకు కావాల్సిన అల్లాహ్ పట్ల విశ్వాసంతో కూడిన ఉపాధి నిరంతరాయంగా దానికి అందుతూ ఉండాలి. ఏ ముస్లిం అయితే నమాజులను క్రమం తప్పకుండా పాటిస్తాడో అతన్ని ఐహిక బాధలు, సమస్యలు బలహీన పర్చజాలవు. అతని ఆత్మ విశ్వాసంలో ఎటువంటయిన మార్పు రాదు.
నమాజు ఆదేశం:
సలాత్ ఆదేశం, శాసనం రీత్యా అత్యంత ప్రాచీనమయిన ఆరాధన. ప్రవక్త ఇస్మాయీల్ (అ) గారి గురించి తెలియజేస్తూ అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు:
”’అతను తన కుటుంబీకులకు నమాజు గురించి, జకాత్ గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభువు సన్నిధిలో ప్రియతముడు” (మర్యం: 55)
పోతే, దైవప్రవక్త ముహమ్మద్ (స)వారికి దైవదౌత్యం అనుగ్రహించబడినప్పుడు (మేరాజ్‌కి పూర్వం వరకు) అయన ప్రతి ఉదయం రెండు రకాతులు, ప్రతి సంధ్యా సమయం రెండు రకాతులు చేసేవారు. అల్లాహ్‌ా, ప్రవక్త(స) వారినుద్దేశించి ఇచ్చిన ఆదేశం యొక్క సారాంశం ఇదేనని కొందరు వ్యాఖ్యానించారు.
”…….నువ్వు నీ పొరపాట్ల క్షమాపణకై వేడుకుంటూ ఉండు. సాయం సమయంలోనూ, ప్రభాత సమయంలోనూ నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, స్తోత్రం చేస్తూ ఉండు.” ( గాఫిర్:55)
ఫర్జ్ నమాజులు
ప్రతి ముస్లింపై దైవంచే విధిగావించబడిన ఫర్జ్ నమాజులు అవి: ఫజ్ర్, జుహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా.
ఇవి విధిగావించబడిన తేది:
ప్రవక్త(స)వారిని ఏ రాత్రయితే మస్జిదె హరామ్ నుంచి మస్జిదె అఖ్సా వరకు ఇస్రా చేయించి, అక్కడి నుండి గగనాలపైకి మేరాజ్ కోసం తీసుకెళ్ళడం జరిగిందో అదే రాత్రి అయిదు పూటల ఫర్జ్ నమాజులు ఆదేశించబడ్డాయి. అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు:
”కనుక మీరు పొద్దుగూకినప్పుడు, తెల్లవారినప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడండి. భూమ్యాకాశాలలో సమస్త స్తోత్రాలకు అర్హుడు ఆయన మాత్రమే. సాయం సమయాన, మధ్యాహ్న సమయం కూడా అల్లాహ్ పవిత్రతను కొనియాడండి” (రూమ్:18)
”తనపై ఏ కార్యాలు విధి?” అని అడిగిన పల్లెవాసిని ఉద్దేశించి దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: ”రేయింబవళ్ళల్లో అయిదు పూటల నమాజు’ అది విన్న పల్లెవాసి ఇవి తప్ప ఇంకేమయినా ఉన్నాయా? అని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడు దైవప్రవక్త(స): లేవు. అయితే నఫిల్ ఆరాధనలు నువ్వు చేసుకుంటే తప్ప’ అని బదులిచ్చారు. (బుఖారి 46, ముస్లిం 11)
నమాజు వదలిన వ్యక్తి గురించిన ఆదేశం:
నమాజును వదిలే వ్యక్తి సోమరితనం లేదా నిర్లక్ష్యం వల్లనో నమాజు వదులుతాడు. లేదా దాన్ని వ్యతిరేకిస్తూ అయినా వదులుతాడు:
ఇక నమాజు విధి అన్న విషయాన్ని అంగీకరిస్తూనే సోమరితనం వల్ల దాన్ని విడనాడే వ్యక్తిని అధికారికంగా తౌబా చేసుకుని మరొక్కసారి అటువంటి పాపకార్యానికి పాల్పడకూడదని మాట తీసుకోవాలి.అయినా నెరవేర్చకపోతే అతన్ని వధించడం తప్పనిసరి అవుతుంది. అతని వధ ధర్మ పరిధులను అతిక్రమించినందుకు శిక్షగా భావించబడుతుంది. అయితే అతను ముస్లింగానే పరగణించబడతాడు. అతని మరణానంతరం శవసంస్కారంలోనూ,వారసత్వ ఆస్తి పంపిణిలోనూ ఇస్లామీయ షరీఅతునే అనుసరించాలి. ఎందుకంటే తాను పాపం చేసినా ముస్లింమే గనక.
ఇక ఎవరయితే నమాజు విధి అన్న విషయాన్ని వ్యతిరేకిస్తూ వాగ్వివాదానికి దిగినా లేదా అవహేళనగా ఏదయినా అన్నా అతను అవిధేయతకు పాల్పడినవాడయి ఇస్లాం పరిధి నుండి వైదొలుగుతాడు. అధికారికంగా అతన్ని తౌబా చేయవలసింది ఉత్తర్వులు జారి చేయాలి. తౌబా చేసుకున్నాడా, నమాజు స్థాపించాడా సరి, లేదంటే అతను ఇస్లాం పరిధి నుండి వైదొలిగాడని అంగీకరించాలి. ఒకవేళ అదే స్థితిలో మరణిస్తే ఇస్లామీయ సాంప్రదాయాననుసరించి అతనికి స్నానం చేయించడంగానీ, జనాజా నమాజు చేయిపించడం గాని చేయకూడదు. అలాగే అతని శవాన్ని ముస్లింల స్మశానంలో ఖననం చేయకూడదు. ఎందుకంటే అతను ముస్లింలోనివాడు కాదు.
జాబిర్ (ర) కథనం: నేను దైవప్రవక్త (స) వారు ఇలా చెబుతుండగా విన్నాను: ”మనిషికి మరియు షిర్క్,కుఫ్ర్కి మధ్యగల అడ్డు నమాజును వదలడమే”. (ముస్లిం 82)
ఫర్జ్ నమాజు వేళలు:
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ”నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. (నిసా:103)
1. ఫజ్ర్ నమాజ్:
– ఫజ్ర్ నమాజు వేళ ఉషోదయం నుండి మొదలవుతుంది
– సూర్యోదయం వరకు ఉంటుంది.
2. జుహ్ర్ నమాజ్
– జుహ్ర్ నమాజు వేళ సూర్యుడు ఆకాశం మధ్య నుండి వాలినప్పటి నుండి ప్రారంభమవుతుంది. దాన్నే జవాల్
అనంటారు.
– ఎండలో వస్తువు నీడ దాని అసలు నీడకన్నా రెట్టింపు పొడవు అయ్యేంత వరకు ఉంటుంది.
దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ” పొద్దువాలినప్పుడు (జవాల్ జరిగినప్పుడు) జుహ్ర్ నమాజు వేళ మొదలవుతుంది. మనిషి నీడ అతనికంటే రెట్టింపు అయ్యేంత వరకు అంటే అస్ర్ వేళ కానంతవరకు ఉంటుంది”. ( ముస్లిం 612)
3. అస్ర్ నమాజు:
– జుహ్ర్ వేళ ముగిసిన తర్వాత అస్ర్ సమయం మొదలవుతుంది.
– సూర్యాస్తమయం వరకు ఉంటుంది.
దైవప్రవక్త(స) ఇలా అన్నారు: సూర్యాస్తమయాని పూర్వం ఎవరయినా అస్ర్ నమాజు ఒక రకాతు దొరికితే అతను అస్ర్ నమాజును పొందినట్లే. (బుఖారి 554, ముస్లిం618)
మక్రూహ్: సూర్యుడు ఎర్రబడక ముందే అస్ర్ నమాజు చేసుకోవాలి. సూర్యుడు పసుపు పశ్చగా మారిన తర్వాత అస్ర్ నమాజు చేయడం మక్రూహ్‌ా. నమాజు వేళల్ని తెలిపే హదీసులో ఇలా ఉంది:
దైవప్రవక్త(స) ఇలా అన్నారు: అస్ర్ నమాజు సమయం సూర్యుడు పసుపుపచ్చగా మారనంతవరకూ ఉంటుంది.
(ముస్లిం612)
4. మగ్రిబ్ నమాజు:
– మగ్రిబ్ నమాజు వేళ సూర్యాస్తమయం నుండి ప్రారంభమవుతుంది.
– పశ్చిమ దిగ్మండలంపై అరుణకాంతి అదృశ్యమయ్యే వరకు ఉంటుంది.
దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ” మగ్రిబ్ నమాజు సమయం అరుణకాంతి పూర్తిగా అదృశయమయ్యేంత వరకు ఉంటుంది.
(ముస్లిం 612)
5. ఇషా నమాజు:
– మగ్రిబ్ వేళ ముగిగానే ఇషా సమయం మొదలవుతుంది.
– ఉషోదయం వరకు ఉంటుంది. అయితే మూడోవంత రాత్రి వరకు ఆలస్యం చేయకూడదు.
ఫజ్ర్ సాదిఖ్ – ఉషోదయం అంటే తూర్పు దిశన ఒక కాంతి ప్రసరిస్తుంది. తర్వాత ఆ కాంతి కొంచెం కొంచెం ఆకాశంపై విస్తరిస్తుంది. చివరికి సూర్యోదయం జరుగుతుంది.
ఇవి అయిదు పూటల నమాజుల వేళలు. సమయం ఉంది కదా అని నమాజుని దాని ఆఖరి వేళ వరకు ఆలస్యం చేయడం సమంజసం కాదు. ఎందుకంటే వేళ దాటిపోయే ప్రమాదం ఉంటుంది గనక. దీనికి భిన్నంగా నమాజులను వాటి మొదటి వేళలో చేయడం ఉత్తమం.
దైవప్రవక్త (స) వారిని శ్రేష్ఠకార్యాల గురించి ప్రశ్నించడం జరిగింది. అందుకాయన ”నమాజును దాని వేళకు చేయడం అంటే దాని ప్రారంభ సమయంలో చేయడం అన్నారు.” ( బుఖారి 504)
దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: సూర్యోదయానికి ముందు ఎవరికయితే ఫజ్ర్ నమాజు ఒక రకాతు లభిస్తుందో అతను ఫజ్ర్ నమాజుని పొందినట్లే, మరి ఎవరయితే సూర్యాస్తమయానికి ముందు ఒక రకాతు అస్ర్ నమాజు లభించిందో అతను అస్ర్ నమాజును పొందినట్లే. ( బుఖారి554, ముస్లిం608)
నమాజు మక్రూహ్ అయ్యే వేళలు:
మక్రూహ్‌ా తహ్రీమీకి చెందిన ఈ వేళలు
1. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు, జుమా రోజు మినహాయించి. అలాగే ఫజ్ర్ నమాజు తర్వాత నుండి సూర్యుడు ఒక బాణం పొడుగు పైకి ఎగబడే వరకు.
2. అస్ర్ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.
ఉఖ్బా బిన్ ఆమిర్(ర) ఇలా అన్నారు: దైవప్రవక్త(స) మూడు సమయాల్లో నమాజు సలపకూడదని శవాల్ని పూడ్చకూడదని మమ్మల్ని వారించేవారు. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుని కాంతి బాగా తెల్ల బడేంత వరకు. మిట్టమధ్యాహ్నం వేళ నుండి పొద్దు వాలనంత వరకు. సూర్యుడు రెట్టింపయినప్పటి నుండి అస్తమించేంత వరకు.(ముస్లిం 831)
ఈ నిషేధితం అనేది ఏ కారకం లేనప్పుడే. ఒకవేళ కారకం ఉంటే, ఉదాహరణకు తహియ్యతుల్ వుజూ, మస్జిద్, మరియు ఖజా నమాజు వీటి విషయంలో మినహాయింపు ఉంది.
అనస్(ర) కథనం దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ఎవరయిన ఏదయినా నమాజు చేయడం మరచిపోతే గుర్తురాగానే చేసుకోవాలి.దానికోసం ఆ నమాజుని చేసుకోవడం తప్ప వేరే పరిహారం ఏమిలేదు.(బుఖారి 572, ముస్లిం 684)
” దైవనామ స్మరణ కోసం నమాజును స్థాపించు” (తాహా:14)
ఫర్జ్ నమాజులను తిరిగి చేయడం లేదా ఖజాను పూర్తి చేయడం:
తిరిగి చేయడం:
అంటే ఫర్జ్ నమాజుల్లోని ఓ నమాజును చేసేశాక, అందులో లోటుపాట్లు జరిగాయని తెలిస్తే దాన్ని తిరిగి మళ్ళీ చేయాలి.
ఇలా చేయడం ముస్తహబ్. ఉదాహరణకు: ఒక వ్యక్తి ఒంటరిగా జుహ్ర్‌ా నమాజు చేశాడు. తర్వాత అతను సామూహికంగా చేసే జుహ్ర్ నమాజును పొందాడు. అప్పుడు సున్నత్ పద్ధతి ఏమిటంటే అతను జుహ్ర్‌ా నమాజుని సమూహంతో కలిసి తిరిగి చేసుకోవాలి. అతను మొదట చేసిందే ఫర్జ్ అవుతుంది. తర్వాత చేసింది నఫిల్ అవుతుంది.
జాబిర్ బిన్ యజీద్ బిన్ అల్ అస్వద్(ర) తన తండ్రి ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు: ఆయన తండ్రి యౌవనస్తుడిగా ఉన్నప్పుడు దైవప్రవక్త(స) వారితో కలిసి నమాజు చేశారు. మస్జిద్ ఓ మూలలో నమాజు చేయని ఇద్దరు వ్యక్తులు కంటపడ్డారు. వారిని పిలుచుకొని రావలసిందిగా ఆదేశించారు. వారిని తీసుకురావడం జరిగింది.అప్పుడు ప్రవక్త(స) వారినుద్దేశించి : ”మీరు మాతో నమాజు చేసేందు ఏ విషయం మిమ్మల్ని ఆపింది” అని ప్రశ్నించారు. దానికి వారు:”మేము మా ప్రాంతంలో ముందే నమాజు చదువుకున్నాము” అన్నారు. అందుకు దైవప్రవక్త(స) ఇక మీదట ఇలా చేయకండి మీలోని ఒక వ్యక్తి తన ప్రాంతంలో నమాజు చేసుకొని (వేరేచోట)నమాజు చేయిపించే ఇమామ్‌ను చూస్తే అతనితోపాటు నమాజు చేయాలి. అది అతని కోసం నఫిల్ అవుతుంది. అన్నారు. (అబుదావూద్:575)
ఒకవేళ నమాజులో ఎలాంటి లోటు లేకపోతే తిరిగి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు.
ఖజా:
అంటే నమాజు వేళ అయిపోయాక ఆ నమాజుని చేయడం లేదా ఒక రకాతు కూడా చేసేంత సమయం లేకపోవడం.
అన్ని మస్లక్‌ల పండితులు ఈ విషయమయి ఏకీభవించారు. నమాజును వదిలేసిన వ్యక్తి దాని ఖజా చేసుకోవాలి. దాన్ని అతను మరచి వదలినా, తెలిసి వదిలినా, క్రింది వివరణతోపాటు:
తగు కారణం వల్ల, మరచిపోవడం వల్ల, నిద్ర వల్ల, నమాజు తప్పిపోతే పాపం కాదు, అతను తక్షణమే ఖజా చేయాల్సిన అవసరమూ లేదు. అయితే ఎలాంటి కారణం లేకుండా కావాలనే నమాజును వదలి వ్యక్తికి పాపం తగలడమేకాక ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ నమాజును పూర్తి చేసుకోవాలి.
అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: దైవప్రవక్త(స)ఇలా సెలవిచ్చారు: మీలో ఎవరయినా నమాజు నుండి నిద్రపొయినా, లేదా మరుపుకి గురయినా గుర్తు వచ్చినప్పుడు చేసుకోవాలి. ఎందుకంటే అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”నీవు నా స్మరణ కోసం నమాజును స్థాపించు” (ముస్లిం 684)
నమాజు ఎవరి మీద విధి :
యుక్త వయసుకు చేరిన బుద్ధిమంతులయిన ప్రతి ముస్లిం స్త్రీ పురుషుని మీద నమాజు విధిగావించబడింది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:” ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకాగ్నికి తీసుకు వచ్చింది అని ప్రశ్నించడం జరుగుతుంది. వారిలా సమాధానం ఇస్తారు: మేము నమాజు చేసేవారము కాము”. (ముద్దస్సిర్:42,43)
– యుక్త వయసుకు చేరని బాలునిపై నమాజు విధికాదు. అయితే పిల్లోడు ఏడేండ్ల వయసుకు చేరాక అతనికి నమాజును గురించి ఆదేశిస్తూ ఉండాలి. అతను పదేండ్ల వయసుకి చేరాక వదిలితే దండించాలి. ఉద్దేశం నమాజు అలవాటు చేయడమే.
– హైజ్ మరియు నిఫాస్ వచ్చే స్త్రీలకు నమాజు ఫర్జ్ కాదు. వారికి గల అశుద్ధత కారణంగా వారు నమాజు చేయడానికి అనర్హులవుతారు గనక.
– ఒక అవిశ్వాసి ఇస్లాం స్వీకరిస్తే అతని వల్ల గతంలో తప్పిపోయిన నమాజుల్ని అతను తిరిగి పాటించాల్సిన అవసరం లేదు.
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ముగ్గురిపై ఎటువంటి విధి లేదు. పడుకున్న వ్యక్తి నిద్రమేల్కొనంత వరకు.పిల్లోడు యుక్త వయసుకి చేరనంతవరకు. మతి స్థిమితం లేని వ్యక్తికి మతి స్థిమితం కలగనంత వరకు.” ( అబూదావూద్ 4403)
పరీక్ష 10
ఖాళీ స్థలాలను పూరించండి:
(ఎ) సరిసమానం అవ్వాలి (బి) నమాజ్ (సి) అజాన్ (డి) ఫర్జ్ (ఇ) పొద్దు వాలడం (ఎఫ్) ఫజ్ర్ (జి) కన్నా పొడుగు
1.ఏ ముస్లింకి అయినా తెలిసి లేదా ఇతర ఏ కారణం వల్లనయినా సరే ………………వదలడం అనుమతించబడలేదు.
2. ఆరాధనల్లోని ఓ ఆరాధన అది తక్బీర్తో మొదలవుతుంది,తస్లీమ్తో ముగిస్తుంది. అది………………….
3. …………………నమాజు వేళ ఉషోదయం నుండి మొదలయి సూర్యోదయం వరకూ ఉంటుంది.
4. జుహ్ర్ నమాజు సమయం సూర్యుడు…………………..నప్పటి నుండి మొదలవుతుంది,ప్రతి వస్తువు నీడ
దానికి…………………….. అయ్యేంత వరకు ఉంటుంది.
సరైన సమాధానం ఎన్నుకోండి:
1. ఎటువంటి భావనవాస్థితిలో నమాజును స్థాపిస్తాము:
(అ) నిద్ర మత్తులో ఉన్నప్పుడు
(ఆ) ఏకాగ్రత ఉన్నప్పుడు
(ఇ) అహంభావానికి లోనయినప్పుడు
2.మనం నమాజుని అన్ని మర్యాదలతో పరిపూర్ణ స్థాయిలో పాటిస్తే వచ్చే మార్పు ఏమిటి?
(అ) సతతం శ్రమించే మన ఆత్మలు నెమ్మదిని,శాంతిని పొందుతాయి.
(ఆ) సున్నితమైన మన హృదయాలు జడపదార్థాలుగా మారతాయి
(ఇ)
3. మగ్రిబ్ నమాజు సమయం:
(అ) సూర్యాస్తమయం తర్వాత మొదలయి అరుణ ఛాయలు తొలిగేంత వరకు ఉంటుంది.
(ఆ) సూర్యాస్తమయం తర్వాత మొదలయి ఉషోదయం వరకు ఉంటుంది.
(ఇ) అరుణ ఛాయలు కనుమరగైనప్పటి నుండి ఉషోదయం వరకు ఉంటుంది.
4.ఎలాగయితే ఆహారపానియాలు ఆత్మకు ఆహారమో అలాగే నమాజు మన దేహాలకు ఆహారం:
(అ) అవును
(ఆ) కాదు
5. జమాఅత్‌తో చేసే నమాజు ముస్లిం సమైక్యతకు చిహ్నము.
(అ) అవును
(ఆ) కాదు
6.ఫజ్ర్ నమాజు వేళ ఉషోదయం మొదలు ఉదయం 11 గంటల వరకు ఉంటుంది.
(అ) అవును
(ఆ) కాదు
7. అస్ర్ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు నఫిల్ నమాజులు చేయడం మక్రూహ్‌ా.
(అ) అవును
(ఆ) కాదు
8.సోమరితనం నమాజును వదిలే అనుమతిలోని ఓ అనుమతి.
(అ) అవును
(ఆ) కాదు
19.ఖజా ఓ నమాజును దాని వేళలో ఎక్కువ పుణ్యం పొందే నిమిత్తం తిరిగి మళ్ళీ చేయడం.
(అ) అవును
(ఆ) కాదు
0.అయిదు పూటల నమాజులను నిరాకరించే వ్యక్తి కాఫిర్ అవుతాడు.
(అ) అవును
(ఆ) కాదు
11. సూర్యుడు నడి ఆకాశం నుండి వాలినప్పటి నుండి జుహ్ర్‌ా నమాజు వేళ మొదలవుతుంది.
(అ) అవును
(ఆ) కాదు.
12. నడిరాత్రి సమయం నమాజు నిషేధించబడిన సమయం.
(అ) అవును
(ఆ) కాదు
13. ఓ అబ్బాయి జుహ్ర్ నమాజు మస్జిద్లో చేశాడు. నమాజు అయ్యాక మరో జమాఅతును నమాజ్ చేస్తూ వారితో పాటు
పాల్గొని నమాజు చేశాడు. అతను రెండవసారి చేసిన నమాజు:
(అ) ఖజా అవుతుంది
(ఆ) తిరిగి మళ్ళీ చేయడం (ఇఆదా) అవుతుంది
14.ఓ స్త్రీకి మగ్రిబ్ నమాజు మిస్ అయింది. మరియు ఇషా సమయం కూడా మొదలయిపోయింది. ఇక ఆమె మగ్రిబ్
నమాజును…………………..చేయాలి.
(అ) ఇఆదా
(ఆ) ఖజా
15. ఖాలిద్ అనే వ్యక్తి మరణించాడు. అతను నమాజ్ ఫర్జ్ అన్న విషయాన్ని వ్యతిరేకించాడు. తౌబా కూడా చేసుకోలేదు.
అతన్ని ముస్లింల స్మశానంలో ఖననం చేయవచ్చు.
(అ) చేయవచ్చు
(ఆ) చేయకూడదు
16. దలాల్ అనే అమ్మాయి అస్ర్ నమాజు పూర్తి చేసుకోగానే తన ఫజ్ర్ నమాజు చదవలేదని గుర్తు వచ్చింది. ఇప్పుడు
ఫజ్ర్ నమాజు చేసే………………………..
(అ) అనుమతి ఉంది
(ఆ) అనుమతి లేదు