స్వస్థత లభించేది దైవాజ్ఞతోనే
దైవప్రవక్త (స) వారి హితోక్తి: ”ప్రతి వ్యాధికి మం దుంది. వ్యాధికి తగిన మందు లభించనప్పుడు రోగికి దైవాజ్ఞతో కూడా స్వస్థత లభిస్తుంది”. (ముస్లిం)
చికిత్స విధానంలో ప్రజల మధ్య పరస్పర విరుద్ధ భావాలు ఉన్నాయి. కొంత మంది స్వస్థ త అనేది మందుమాకుల ద్వారా, నేర్పరి అయిన వైద్యుని చేతిలో ఉందని భావిస్తే, మరి కొందరు ఏవో కొన్నిటికి తప్ప అనేక వ్యాధుల కు మందుల అవసరమే లేదని,దానికి బదులు తాయెత్తులు, మంత్రతంత్రాలు సరిపోతాయని భావిస్తారు. ఇక అతి కొద్ది మంది మాత్రమే స్వస్థత అల్లాహ్‌ా ద్వారానే లభిస్తుందనే విశ్వాసం తో ఉంటారు.
చికిత్స విషయంలో ఇస్లాం దృక్పథం ఏమిటి? ఈ విషయంలో దైవ ప్రవక్త (స) ఎలాంటి ఉప దేశాలిచ్చారు? పత్యం, ఔషధ సేవనం ద్వారా లభించే స్వస్థత గురించిఆయన (స) ఏమ న్నారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధా నాలు తెలుసుకుందాం!
వైద్య తత్వశాస్త్రం
హజ్రత్ అబ్దుల్లాహ్‌ా బిన్ అబ్బాస్ కథనం ప్రకా రం దైవప్రవక్త (స) వారి ప్రవచనం: ఓ సారి దైవప్రవక్త ఇబ్రాహీమ్ (అ) దైవాన్ని ‘ప్రభూ! వ్యాధి ఎవరి తరఫు నుండి వస్తుంది?’ అని అడిగారు. అప్పుడు అల్లాహ్‌ా ‘నా తరఫు నుంచి’ అన్నాడు. మళ్ళీ ఆయన ‘మందు ఎవరి తరఫు నుంచి?’ అని ప్రశ్నించారు. ‘మందు కూడా నా తరఫు నుంచే’ అని సమాధానమిచ్చాడు అల్లాహ్‌ా. ‘అలాంటప్పుడు వైద్యుని అవసర మేంటి?’ అన్నారు ఇబ్రాహీమ్ (అ). ‘వైద్యుని చేత మందు ఇవ్వబతుంది’ అని సెలవిచ్చాడు అల్లాహ్.
పై మూడు ప్రశ్నలు, వాటి జవాబుల్లో – అరో గ్యం, చికిత్సకు సంబంధించిన ఇస్లామీయ తాత్విక భావన ఉంది. అంటే, వ్యాధి అల్లాహ్‌ా తరఫు నుండే వస్తుంది; దానికి మందు కూడా ఆ సృష్టికర్తే సృజించాడు. ఇక ఏ మందు వాడా లో అన్న విషయాన్ని మాత్రం అల్లాహ్‌ా వైద్యుల చేత చెప్పిస్తున్నాడు.
అందుకే కొందరు ముస్లిం వైద్యులు ‘హువ ష్షాఫీ’-ఆయనే స్వస్థత చేకూర్చేవాడు అని వ్రాస్తారు. అటు రోగికి, ఇటు వైద్యునికి ‘స్వస్థత’ అల్లాహ్‌ా చేతుల్లోనే ఉందని తెలియాలన్నదే దాని ఉద్దేశ్యం. వైద్యులు, వారిచ్చే మందులు దైవానుగ్రహ సాధనాలు మాత్రమే.
‘చికిత్స-అల్లాహ్‌పై భరోసా
హజ్రత్ అబూ హురైరా (ర) దైవదౌత్య కాలానికి చెందిన ఓ ముఖ్య సంఘటన తెలిపారు. దైవప్రవక్త (స) ఇద్దరు వైద్యుల్ని పిలిపించారు. వారు చాలా కాలంగా మదీనాలో ఉంటున్నారు. ఒక రోగి విషయంలో దైవప్రవక్త (స) వారితో సంప్రదించారు. అప్పుడు వైద్యులు ఇలా విన్నవించుకున్నారు.దైవప్రవక్తా! (స) మేము అజ్ఞాన కాలం నుండి వైద్యం చేస్తు న్నాము. మేము మందు మాకు వంటివీ ఇస్తాము. మంత్రిస్తాము కూడా. కాని ఇస్లాం వచ్చిన తర్వాత అన్నింటికీ అల్లాహ్‌ా పైనే భరోసా ఉంచాలని ఉపదేశించడం జరిగింది”. దైవప్రవక్త (స) ఈ మాట విని ”మీరు అల్లాహ్ పంపిన వ్యాధికి చికిత్స చేయండి. ఆయనే దానికి మందు కూడా పంపాడు. అందులో స్వస్థత కూడా ఉంచాడు” అని అన్నారు.
ఉల్లేఖనకర్త ఇలా తెలిపారు: ఆ వైద్యులు దైవప్రవక్త (స) వారి సూచన ప్రకారం (మంత్రించడం మాని) వైద్యం చేయగా ఆ రోగికి స్వస్థత చేకూరింది. (జాదుల్ మఆద్)
ఆ సందర్భంలో ఒకతను ‘దైవప్రవక్తా! మమ్మల్ని వైద్యం చేయమంటారా? లేక విధిరాత వల్లనే వ్యాధి నుంచి స్వస్థత లభిస్తుందా?’ అని అడిగాడు. దానికి దైవప్రవక్త (స) ”చికిత్స కూడా విధిరాతలోని అంతర్భాగమే” అన్నారు. (ముస్తద్రక్ హాకిమ్)
చికిత్స-విధివ్రాత
చికిత్స, స్వస్థత తాలూకు సాధారణంగా ఇలా ప్రశ్నించడం జరుగుతుంది – మందు వాడటం వల్ల విధివ్రాత మారు తుందా? మన రాతలో రాళ్ళు ఏరుకోలాని ఉంటే రత్నాలు ఏరగలమా? ఇటువంటి ప్రశ్నే కొందరు ప్రవక్త (స) వారిని అడిగారు. దానికి దైవప్రవక్త (స) ”చికిత్స కూడా విధివ్రాతే. దాని ప్రకారం లాభం చేకూరాలనే వారికి లాభం చేకూరు తుంది” అన్నారు. (అల్ జామివుల్ ముఫ్రద్)
దైవప్రవక్త (స) తన సంక్షిప్త సమాధానంతో అల్లాహ్‌ా విధిగావిం చిన వ్రాతను మనుషులు అపార్థం చేసుకున్న కారణంగానే ఇలా కుప్రశ్నలు తలెత్తుతున్నాయని, వ్యాధి, చికిత్య రెండూ విధివ్రాతలేనని సెలవిచ్చారు. ఒకవేళ బాధ అల్లాహ్‌ా తరఫు నుంచి అనుకుంటే దాని నివృత్తి కూడా ఆ వ్రాతలోని బాగమే. కాబట్టి చికిత్స చేయించడం విధివ్రాతకు వ్యతిరేకం ఎంత మాత్రం కాదు.
(‘ప్రవక్త (స) వారి వైద్య విధానం’ పుస్తకం నుండి)