మహోన్నత శీల శిఖరం మహా ప్రవక్త ముహమ్మద్ (స)

 ప్రపంచంలోని కుత్సిత మతులన్ని కూడబలుక్కొని కుట్రలు పన్నినా, మురికి మనస్కులు ఆయన (స) పవిత్ర జీవితం మీద బురదజల్లేందుకు ప్రయత్నించినా ఆయన (స) పట్ల మాకున్న అభిమానం ఇసు మంత యినా తగ్గదు. మా పరువుప్రతిష్ఠలకన్నా అధి కంగా ఆయన (స) కీర్తిమర్యాదల్ని కాపాడుతాము.

మానవాళికి దైవభీతినీ, నైతిక రీతిని ఉపదేశించడానికి ఆవిర్భవించిన అసంఖ్యాక మానవ రత్నాల రాసిలో అగ్రజులు మహనీయ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం). దైవ విశ్వాసం గల ఒక విశ్వాసి, ఒక ఉద్యోగి, ఒక యజమాని, ఒక కార్మికుడు, ఒక న్యాయాధిపతి, ఒక సైనికుడు-అందరూ వారి జీవితాల్లో ప్రతినిత్యం ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ఆదర్శాలు ప్రతిబింబించాలని మనస్ఫూర్తి గా కోరుకుంటారు. ఆయన (స) పట్ల మనకున్న ప్రేమ మన జాతిపౌర జీవితంలో, పరిపాలనా వ్యవస్థలో, ఆచారవ్యవహారాలలో కన్పించాలి. లేకుంటే అది నిజమైన ప్రేమ కాదు. ఆయన (స) పట్ల మనం కలిగి ఉండాల్సిన మార్యదల గురించి తెలుసుకుందాం.

మేము అల్లాహ్‌ తర్వాత సర్వలోకాలలో అందరికంటే ఎక్కువగా ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిని అభిమానిస్తాము. ఆయన వంశీయులను, ఆయన సహాబాను, ఆయన్ను అభిమానించే ప్రతి వ్యక్తినీ ప్రేమిస్తాము.

మేము ఆయన్ను మా తల్లిదండ్రులకంటే, గురువుల కంటే ఎక్కువగా గౌరవిస్తాము. ఆయన పేరు విన్న వెంటనే ఆయనపై దరూద్‌ పంపిస్తాము.
దేని గురించి ఆయన ఆదేశించారో వాటిని పాటి స్తాము. వేటి గురించి ఆయన నివారించారో, హెచ్చరిం చారో వాటికి దూరంగా ఉంటాము. ఆయన పలికి ప్రతి మాట సత్యమని విశ్వసిస్తాము.

ఆయన అడుగుజాడల్లో మా ఇహపరాల సాఫల్యం దాగుందని, ఆయన ఆదర్శాలే మాకు శిరోధార్యాలని, ఆయన అనుసరణలోనే సకల సౌభాగ్యాలు ఇమిడి ఉన్నాయని, ఆయనకు మిమచిన ఆదర్శం ఈ జగాన మరొకటి లేదని మనస్ఫూర్తిగా నమ్ముతాము. ఏ విష యంలోనూ ఆయన సంప్రదాయానికి వ్యతిరేకంగా నడుచుకోము. మా తన, ధన, మానాలు పణంగా పెట్టాల్సి వచ్చినా ఖాతరు చేయక మేము ఆయన బాట లోనే నడుస్తాము. ఆయన ఇష్టపడిన వాటన్నింటినీ మేమూ ఇష్ట పడ తాము. ఆయన ద్వేషించిన ప్రతిదాన్నీ మేమూ ద్వేషి స్తాము.

మా మధ్య ఏదేని విషయంలో విభేదాలు తలెత్తితే అల్లాహ్‌ా గ్రంథాన్ని మరియు ఆయన ఆదర్శాన్ని చివరి తీర్పుగా భావిస్తాము. ఆయన చేసిన తీర్పు న్యాయబద్ధ మయినదిగా, సత్యబద్ధమయినదిగా నమ్ముతాము. ఆయన ఇచ్చిన తీర్పు పట్ల మా హృదయాలలో ఏ విధ మయినటువంటి శంకకు, సందేహానికి తావియ్యము.

ప్రపంచంలోని కుత్సిత మతులన్ని కూడబలుక్కొని కుట్రలు పన్నినా, మురికి మనస్కులు ఆయన (స) పవిత్ర జీవితం మీద బురదజల్లేందుకు ప్రయత్నించినా ఆయన (స) పట్ల మాకున్న అభిమానం ఇసు మంత యినా తగ్గదు. మా పరువుప్రతిష్ఠలకన్నా అధి కంగా ఆయన (స) కీర్తిమర్యాదల్ని కాపాడుతాము.

నితరం ఆయన అగుజాడలే మాకు వెలుగు నీడలు. రేపు ప్రళయ దినాన ఆయన సిఫారసు మాకు లభిం చాలని, జన్నతుల్‌ ఫిర్‌దౌసిల్‌ ఆలాలో ఆయన సహ చర్య భాగ్యం మాకు ప్రాప్తించాలని ఆ పర మోన్నత ప్రభువును వేడుకుంటాము.

Related Post