అనుపమ మాస పత్రిక సౌజన్యంతో
ఈ నెల చాలా ప్రాశస్త్యమును సంత రించుకున్న నెల. దీనికి కారణం ముఖ్యంగా ‘‘ఆకాశ గ్రంథాలన్నీ’’ ఈ నెల లోనే రావడం. ఖుర్ఆన్ కూడా ఈ వరుస లో ఆఖరి ఆకాశ గ్రంథం. మానవాళి జీవి తాలను కాంతిమంతం చేసే గ్రంథరాజ మిది. అందువల్ల మనిషి కృతజ్ఞతా పూర్వకంగా ఉపవాసాలుంటాడు. అంతే కాక ఇది దేవుని ఆజ్ఞ. దేవుడు చూపిన విధానం (కృతజ్ఞత తెలిపే విధానం). ఉపవాసాలు తప్పనిసరిగా చేయమని ఆజ్ఞ. అల్లాప్ాను సంతోషపెట్టే వారికే స్వర్గ వనంలో ప్రవేశం (అల్లాప్ా సంతోషం).
నమాజ్, దానం, ఓర్పు, సహనం. ఏది చేసినా అల్లాప్ాకై చేయాలి. ఖుర్ఆన్ మనిషి గురించే మాట్లాడుతుంది. ముఖ్య భూమిక మనిషే. మానవ జీవితంలోని ప్రతి అంశం ఇందులో చర్చించ బడిరది.
భక్తి, సోదర మానవుల ఎడల మన ప్రవర్తన, పేదసాదలకై ఆరాటం, మట్టితో చేసిన ఈ శరీరం అశాశ్వతం, అది ఉన్నంతలోనే తమ యజమాని విశ్వప్రభువు స్వామికై మంచి పనులు చేయాలి. జీవిత కాలం గురించి ఎవరికీ తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. మట్టితో చేసిన దేహాన్ని పెంచి పోషించే కృషి ఎంత చేస్తాము. ఆత్మకు సరిjైున పోషణ అందించే ప్రయత్నం చాలా తక్కు వగా చేస్తాము. ఖుర్ఆన్ చదివి ఒక్కొక్క వాక్యం, కాదు పదం అర్థంతో చదివి మన జీవితాలకై అన్వయించుకుందాం. ఇదొక మహత్తర అవకాశం. ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందించుకొని ఆచరణాత్మక సంస్క రణకై ప్రతి ముస్లిం/మనిషి కృషి చేయాలి.
విప్లవాత్మకమైన నైతిక ప్రగతికి ఇది చక్కని అవకాశం. దీన్ని సద్వినియోగం చేయనివారు, దురదృష్టవంతులు. నిరు పేదలను సరిన పద్ధతి ద్వారా అర్థం చేసుకునే అవకాశం, అన్నార్తులను ఆదు కొనే భావాలు మనిషిలో జనించాలి, మాన వీయత సానుభూతి, ప్రేమ, సోదర మానవులకై స్పందించే విశాల గుణం మేల్కొనాలి. అనాథలను ఆదరించి, అగత్యపరులకు చేయూతనందించే విధానం వెల్లువలా ఉప్పొంగాలి. దుష్కా ర్యాలకు దూరమవ్వాలి. ‘‘ఈ నెల సహనం చూపే నెల. సహనానికి ప్రతిఫలం స్వర్గం’’ అని సెలవిచ్చాడు దేవుడు.
భక్తి విశ్వాసాలు, దానం, సహనం లాంటి భావాలు క్రొత్త రూపు సంతరించు కుంటాయి. ప్రతి సంవత్సరము అనుభూతిలో మార్పు, ప్రపంచవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. చిన్న పిల్లలు సైతం (10 సం.ల లోపు) తామూ ఉపవాసముంటామని మారాం చేస్తారు. తమ చుట్టూ తాండవిస్తున్న ఆధ్యాత్మిక సంచలనాన్ని గమనించి, అందులో తాము భాగస్వాములు కావాలన్న తృష్ణ అది.
సామాజిక న్యాయం, సమానతా సూత్రాలు, ఆధ్యాత్మిక వికాసంలో దాగి ఉన్నాయి. అద్భుతమైన ఈ మాసంలో ఖుర్ఆన్ అవతరణ మానవునికి దేవు డిచ్చిన అపురూప వరం. ఒక్కొక్క వాక్యం చదివిన ప్రతి సారి క్రొత్త అర్థాన్ని అను భూతిని కల్గిస్తుంది. ఈ వాక్యాలు నాకై అవతరించాయి కాబోలు అన్న భావం మనకు ఖుర్ఆన్ చదువుతుంటే అనేక మార్లు కల్గుతుంది.
ఖుర్ఆన్ ఏం చెబుతుంది? ఇది మనిషి గురించి అతని వ్యవహారాల గురించి, మంచి చెడుల గురించి, న్యాయ అన్యాయాల గురించి, అర్థశాస్త్రం, రాజ నీతి, వివాహం విడాకులు లాంటివి అనేకం నేర్పుతుంది. తల్లిపిల్లల బంధం, బాధ్యతలు, భార్యాభర్తలు, సోదరసోదరీ మణులు, ఆస్తిలాంటి సాంఘిక విషయా లను నిర్దేశిస్తుంది.
దేవుడు ఎవరు? అతని గుణగణాలు, అతని అభీష్టం, మనిషి సాఫల్యం మొద లైన విషయ వివరణ మనముందుంచు తుంది. మనిషి సాఫల్యానికి చక్కటి రాజమార్గాలను మనముందుంచుతుంది. ఇహలోక విజయంతో పాటు పరలోక సాఫల్యం లభించే సులభమైన మార్గాలను విపులీకరించింది. అల్లాప్ా మీకు సన్మార్గం చూపించాడు. అందుగ్గాను మీరు కృత జ్ఞులయి ఉండాలి. ఉపవాసం ఒక పద్ధతి అంటోంది ఖుర్ఆన్.
ధర్మబద్ధమైన ఆహారాన్ని నిర్ణీత సమయం వరకు త్యజించమంటుంది. ఆ కాలంలో లైంగిక వాంఛలకూ దూరం. నిర్బంధమైన సైనిక శిక్షణ లాంటిది. ఇదంతా కేవలం దేవుని ప్రసన్నతకై చేయ టయే మానవ సాఫల్యం, మనిషి ఒంట రిగా ఉన్నా ఆహారం వైపు చూడడు. చిన్న పిల్లలు దాహం వేసినా మంచి నీరు త్రాగరు. ఖుర్ఆన్ వచనాలు మానవ మస్తిష్కాన్ని ఎలా రుజుమార్గం వైపునకు నడుపుతాయి అన్న దానికి అనేక ఉదాహరణలున్నాయి. చిరునవ్వుతో ఆకలి దప్పులను సహించటమే కాదు. కొట్లా టలు, పరోక్షనింద లాంటి దుర్గుణాలకు దూరంగా ఉంటారు. ఎట్టి పరిస్థితులు ఎదురైనా ‘‘అల్లాప్ా చూస్తున్నాడు, తీర్పు దినం నాడు జవాబివ్వాలి’’ అన్న భయం నిగ్రహానికి మూలం.
ప్రపంచంలోనే మానవత్వం మరచిన జాతి, ఆడ పిల్లలను సజీవ సమాధి చేసే జాతి. మద్యంతో ముఖం కడిగే జాతి దైవా దేశాలు రాగానే, మానవత్వం మూర్తీభవిం చిన జాతిగాను, ఆడపిల్ల దైవకారుణ్యంగా భావించి, మద్యాన్ని సీసాలను వీధుల్లో పారబోశారు. అటువంటి శిక్షణ ప్రవక్త మహోదయులు (స) సముఖంలో జరిగింది.