ఈ ప్రపంచంలో హక్కులు అనేకం. తల్లిదండ్రుల హక్కులు, భార్యా పిల్లల హక్కులు, బంధుమిత్రుల హక్కులు, ఇరుగుపొరుగు వారి హక్కులు, ముస్లింల హక్కులు, ముస్లిమేతరుల హక్కులు… వీటిలోని ప్రతి ఒక్కటి ముఖ్యమయినదే. కానీ, ఈ హక్కులన్నింటిలోకెల్లా మహా హక్కు – మనందరి సృష్టికర్తకు, నిజ ఆరాధ్యునికి మనమీదున్న హక్కు. ఎందు కంటే,
ఈ హక్కు మనకు ఉనికిచ్చిన వాని హక్కు, అధికారులకు అధికారి, రాజులకు రాజు అయిన అల్లాహ్‌ా హక్కు. అతల, వితల, సుతల తలా తల, రసాతల, మహాతల, పాతాల, భూలోక, భువర్లోక, స్వర్లోక, మహా లోక, జనోలోక, తపోలోక, సత్యలోక-14 లోకాలుగా చెప్పబడుతున్న ఇవే కాదు ఇంకెన్ని లోకాలున్నా అన్నింటికి అధిపతి, యజమాని (రబ్బుల్ ఆలమీన్) అల్లాహ్‌ా హక్కు. ఆయనే ప్రతి వస్తువు నిర్మాత. ఆయనే శూన్యం నుండి సృష్టి మొత్తాన్ని సృష్టించిన వాడు. ఆయనే మనల్ని అల్పమయిన బిందువుతో పట్టించి నఖ,శిఖ పర్యంతం అందంగా తీర్చిదిద్దినవాడు. మూడు చీకట్ల్ల లోపల తల్లి గర్భంలో మన యోగక్షేమా ల్ని చూసిన వాడు. భూమి మీద మనం అడుగు పెట్టక ముందే మనక్కా వాల్సిన వస్తువు సామగ్రినంతటిని సమకూర్చి పెట్టినవాడు. అంతటి ఘనాఘనుడు, మహిమాన్వితుడు, మహోన్నతుని హుక్కు ఎంత మహత్తర మయినదయి ఉంటుందో ఆలోచించండి! ఖుర్‌ఆన్ తెర లేపుతున్న ఈ యదార్థం ఎంత గొప్పదో యోచించండి! ”మరియు ఆయనే మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి, మీకేమి తెలియని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్లను, హృదయాలను తయారు చేసింది ఆయనే. మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని”. (అల్ ఇమ్రాన్:6)
మనం పుట్టినప్పుడు మనకెలాంటి లోక జ్ఞానం లేదు. అదృష్టదురదృ ష్టాలంటే ఏమిటో కూడా మనకు తెలియదు. ప్రస్తుతం మనం అనగలుగు తున్నాం, వినగలుగుతున్నాం, కనగలుగుతున్నాం, మనుగడ సాగించగలు తున్నాం. అయినా మనం ఆయన పట్ల కృతజ్ఞులుగా మనగలగ లేక పోతున్నాం!? ఇదే విషయాన్ని అల్లాహ్‌ా ఇలా ప్రశ్నిస్తున్నాడు: ”ఓ మానవుడా! పరమ దాత అయిన నీ ప్రభువును గూర్చి ఏ విషయం నిన్ను మోసంలో పడ వేసింది?”. (ఇన్ఫితార్: 6)
మరో చోట ఇలా ఉంది: ”వాస్తవానికి ఆకాశాలను, భూమిని సృష్టించడం, మానవులను సృష్టించడం కంటే ఎంతో ఘనాఘన విష యం. కానీ చాలా మంది ప్రజలకు ఇది తెలియదు”. (గాఫిర్: 57)
అల్లాహ్ మనకు ప్రసాదించిన ఈ తెలివీతేటలు, శక్తియుక్తులు ఎందు కోసం? మనం మన జీవితాన్ని ఆయనకు అంకితం చేయ డానికి, ఆయన్ను మాత్రమే ఆరాధించడానికి. ”యాదార్థం – నేను మానవులను, జిన్నాతులను పుట్టించింది కేవలం వారు నన్ను ఆరాధించడానికే”. (జారియాత్: 56)
ధర్మం నాలుగు పాదాల నడవాలని,శాంతి, సుస్థిరతల వాతావరణం నెలకొనాలని, ఎలాంటి భయం, ఆందోళనకర పరిస్థితులు ఉండ కూడదని, ప్రతి ఒక్కరూ సజావుగా వారి మనుగడ కొనసాగించగలిగే వాతావరణం నెలకొనాలని మనలోని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. దానికి మనం ఏం చేయాలో మనందరి ప్రభువయిన అల్లాహ్‌ా సెలవి స్తున్నాడు: ”వారు నన్ను మాత్రమే ఆరాధించాలి. నాకు సహవర్తులు గా ఎవరినీ కల్పించకూడదు”. (అన్నూర్: 55)
(ఇలా గనక మనం చేస్తే) ”మీలో విశ్వసించి, సత్కార్యాలు చేసే వారితో అల్లాహ్‌ా చేస్తున్న వాగ్గానం – ‘వారి పూర్వీకుల్ని భూమికి ఉత్తారాధికారులుగా చేసినట్లే వారికి కూడా తప్పకుండా ప్రాతినిథ్యం వొసగుతాడు. తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కోరకు పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తాడు. వారికున్న భయాందోలనల స్థానే శాంతిభద్రతలను కల్పిస్తాడు”. (అన్నూర్: 55)
అయితే మనిషి చేస్తున్నదేమిటి? దయానిధి అయిన అల్లాహ్‌ా సన్నిధిని వదలి చెట్టు, పుట్ట, రాయి, రప్ప, వాగు, వంకను మ్రొక్కు తున్నాడు. అవి సంతృప్తి ఇవ్వకపోతే ‘తానే స్వయంభువు’ అని బీరాలు పోతున్నాడు. ”ఏమిటి, నిన్ను మట్టితో తర్వాత వీర్య బిందు వుతో పుట్టించిన, ఆ తర్వాత నిన్ను సంపూర్ణ మానవుడిగా తీర్చి దిద్దిన ఆయన్నే (అల్లాహ్‌ానే) ధిక్కరిస్తున్నావా?” (కహఫ్: 37)
ఒక రూపాయి, అర్థ రూపాయి సహాయానికే మనం కృతజ్ఞతల్ని కోరుకుంటామే, మరి మనకు అపార అనుగ్రహాలతో సత్కరించన ఆపద్బాంధవుని యెడల ఎందుకీ కృతఘ్నత? చేసిన సహాయన్ని మరచిపోవడం మిత్ర ద్రోహం అయితే, అల్లాహ్ చేసిన అగణ్య మేళ్లను మరచి జీవించడం దైవద్రోహం కాదా? ఆయన్ను వదలి అన్యులను ఆశ్రయించడం, ఆరాధించడం మహాపరాధం కాదా?
సహీహ్ ముస్లిం మరియు బుఖారీలోని ఓ హదీసులో హజ్రత్ మఆజ్ బిన్ జబల్ ఇలా అంటున్నారు: ”నేనో దినం ప్రవక్త (స) వారి వెనకాల సవారీ అయి ఉన్నాను. ఆయన నన్నుద్దేశించి – ”ఓ మఆజ్!” అన్నారు. ‘ఓ దైవప్రవక్తా నేను హాజరయు ఉన్నాను’ అన్నాను. అప్పుడాయన (స) – ”నీకు తెలుసా? దాసులపై అల్లాహ్‌ాకు గల హక్కు ఏమిటో? అల్లాహ్‌ాపై ఆయన దాసులకు గల హక్కు ఏమిటో?”. నేనన్నాను – ‘అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’. అందుకాయాన-”దాసులపై అల్లాహ్‌ాకు గల హక్కేమిటంటే, వారు ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. ఆయనతోపాటు ఇంకె వ్వరినీ సాటి కల్పించరాదు. మరియు అల్లాహ్‌ాపై ఆయన దాసులకు గల హక్కు ఏమిటంటే, ఆయన్ను మాత్రమే ఆరాధించి, ఆయనతో పాటు ఇతరులెవ్వరినీ సాటి కల్పించకుండా జీవితం గడిపిన వారిని ఆయన శిక్షించడు”. (ముత్తఫఖున్ అలైహి)
ఆయన దాసులమయిన మనం ఆయన ఆదేశాల హద్దుల్లోనే, ఆయన ప్రవక్త (స) బోధనల పద్దుల్లోనే జీవించాలి. ఆయన మనకు ప్రసాదిం చిన అనుగ్రహాలకుగాను క్రియాత్మకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు:”ఒకవేళ మీరు గనక కృతజ్ఞులుగా మసలు కుంటే నేను మీకు మరింత సమృద్ధిని కలుగజేస్తాను. ఒకవేళ మీరే గన కృతఘ్నతకు పాల్పడితే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినంగా ఉం టుంది”. (ఇబ్రాహీమ్:7)
క్రియాత్మకంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే ఓ విధానాన్ని ఆయనే స్వయం హదీసె ఖుద్సీలో తెలియజేస్తున్నాడు: ”నా దాసుడు నా సామీ ప్యం పొందడానికి పాటించే పద్ధతుల్లో నేను అతనిపై విధిగావించిన వాటి(ఫరాయిజ్)ది ప్రథమ స్థానం.ఇవే కాక అతను నఫిల్ (స్వచ్ఛంద) ఆరాధనల ద్వారా కూడా నా సామీప్యాన్ని పొందే ప్రయత్నం చేస్తుం టాడు. కడకు నేనతన్ని ప్రేమించసాగినప్పుడు అతను వినే చెవినయి పోతాను. అతను కనే కంటినయి పోతాను. అతను పట్టుకునే చేయి నయి పోతాను. అతను నడిచే కాలినయి పోతాను. అతను కోరిందల్లా అతనికనుగ్రహిస్తాను. అతను శరణ కోరిన వాటి నుండి అతన్ని కాపా డుతాను”.(బుఖారీ)
అంటే, అల్లాహ్‌ను అంతలా ఆరాధించే దాసుడు, అల్లాహ్‌ా ప్రేమను పొంది ఏ స్థాయికి చేరుకుంటాడంటే, ఆయన అనమన్నదే అంటాడు. ఆయన వినమన్నదే వింటాడు. ఆయన కనమన్నదే కంటాడు. ఆయన తినమన్నదే తింటాడు. ఆయన నడవమన్న దారినే నడుస్తాడు. ఆయన చేయమన్న కార్యాలే చేస్తాడు. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వెయ్యడు. ”అస్లిమ్-విధేయత చూపు” అని అల్లాహ్‌ా ఆదేశించినప్పుడల్లా ‘అస్లమ్తు-విధేయుణ్ణయ్యాను’ అంటూ క్రియా పరంగా తాను నిజ ముస్లిం అని నిరూపించుకుంటాడు.
ఇక అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి అంటే, కేవలం నమాజు, రోజా, హజ్జ్, జకాత్-ఇవి మాత్రమే కాదు. మన జీవితానికి సంబం ధించిన ప్రతి అంగం, ప్రతి రంగం ఆయన రంగులో రంగరించాలి. దుఆ చేయడం కూడా అల్లాహ్ ఆరాధనే. మొకుబడి చెల్లించడం కూడా అల్లాహ్‌ా ఆరాధనే. భయ పడటం, ఆశలు పెట్టుకోవడం కూడా అల్లాహ్‌ా ఆరాధనే. అల్లాహ్‌ా మాటల్లో చెప్పాలంటే: ”ఇలా ప్రకటించు – నిశ్చయంగా నా నమాజు, నా సకల ఉపాసనా రీతులు (ఖుర్బానీ), నా జీవితం, నా మరణం సమస్త లోకాలకు ప్రభువయిన అల్లాహ్‌ా కొరకే”. (అన్‌ఆమ్:162)
విశ్వ ప్రభువయిన అల్లాహ్ మహా హక్కు మహత్తు గురించి తెలిసి కూడా ఎవరయినా షిర్క్‌కి పాల్పడినట్లయితే, ఆయనతోపాటు ఇతరుల్ని సాటి కల్పించి పూజించినట్లయితే వారు ఓ విషయం తెలుసకోవాలి! క్షమించరాని నేరం షిర్క్: ‘నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వా మిని కల్పించటాన్ని (షిర్క్‌ని) ఎన్నటికీ క్షమించడు. అది తప్ప దేన్న యినా తాను కోరిన వారిని క్షమిస్తాడు. అల్లాహ్‌కు సాటి కల్పించిన వాడే, వాస్తవంగా మహాపరా ధానికి పాల్పడినవాడు”. (అన్నిసా:48) ఎందుకంటే, ”నిశ్చయంగా అల్లాహ్‌ాకు భాగస్వాముల్ని కల్పించడం (షిర్క్) ఘోరాతిఘోరమయిన దౌర్జన్యం”. (లుఖ్మాన్: 13)
సర్వ కర్మ వినాశిని షిర్క్:
”ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్క్) చేసినట్లయితే నీ కర్మలన్ని వ్యర్థమయి పోతాయి. మరియు నీవు నష్టాని కి గురయిన వారిలో చేరిపోతావు”. (అజ్జుమర్: 65)
స్వర్గ అధిరోహణకి అవరోధం షిర్క్:
”వాస్తవానికి ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాముల్ని చేసేవారికి, నిశ్చయంగా అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి నివాసం నరకాగ్నియే!”. (మాయిదహ్: 72)
ప్రియ పాఠకుల్లారా! మనం బాల్యం నుండి తౌహీద్ మరియు షిర్క్ అన్న పదాలు తరచూ వింటూనే ఎదిగాము. అయితే ఆ రెండు పదాల వాస్తవ అర్థం తెలియని కారణంగా మనలోని చాలా మంది తౌహీద్‌కు దూరంగా, షిర్క్‌కి అతి దగ్గరగా జీవిస్తున్నారు. ఒక విధంగా చెప్పా లంటే షిర్క్‌నే తౌహీద్‌గా భావిస్తున్నారు. కాబట్టి మన వైఖరి మారాలి. మనలో మార్పు రావాలి. ఇలా జరగాలంటే తౌహీద్ మరియు షిర్క్ గురించి ఖచ్చితమయిన జ్ఞానం మనకుండాలి. ఈ మార్గంలో షైతాన్ పన్నే కుట్రలు, వేసే ఎత్తుగడలు, విసిరే విష వలయాలు నుండి మనం కడు అప్రమత్తంగా ఉండాలి. అందుకు అల్లాహ్‌ా ఆదేశం మనందరికి శిరోధార్యం అవ్వాలి.
”ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్య పాలనగా అల్లాహ్‌ా యెడల భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు (అల్లాహ్‌కు) విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మీకు మరణం రాకూడదు”. (ఆల్ ఇమ్రాన్: 102)
ప్రవక్తలందరూ తమ సంతానానికి చేసిన అంతిమ హితవు మనందరి కి ఆచరణీయం అవ్వాలి:
”నా బిడ్డలారా! నిశ్చయంగా అల్లాహ్ మీ కొరకు (ఇస్లాం) ధర్మాన్నే ఎన్నుకున్నాడు. కాబట్టి మీరు (అల్లాహ్‌ాకు) విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మీకు మరణం రాకూడదు సుమా!”. (అల్ బఖరహ్:132)