పశ్న: అల్లాహ్ దృష్టిలో అన్నిటికన్నా పెద్ద పాపం ఏది?
జ: అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్ చేయటం). అల్లాహ్‌ా సెలవిచ్చినట్లు ”నిస్సందేహంగా అల్లాహ్‌ాకు భాగ స్వాముల్ని కల్పించటం (షిర్క్ చేయటం) ఘోరమైన అన్యాయం”. (లుఖ్మాన్-13)
అన్నింటికన్నా పెద్ద పాపం ఏది? అని దైవప్రవక్త(స)ను ప్రశ్నించి నపుడు ”నిన్ను పుట్టించిన వాడు అల్లాహ్యే అయినప్పటికీ నీవు ఆయనకు భాగస్వాముల్ని కల్పించటం (అతి పెద్ద పాపం)” అని ఆయన (స) సమాధానమిచ్చారు. (బుఖారీ, ముస్లిం)
ప్రశ్న: షిర్క్ ఎన్ని రకాలు?
జ: షిర్క్ రెండు రకాలు: (1) షిర్కె అక్బర్. (2) షిర్కె అస్ఘర్.
(1) షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్ : దీనికి పాల్పడిన వారు ఇస్లాం పరిధి నుండి తొలగి పోతారు. షిర్కె అక్బర్‌కు ఒడిగట్టిన వారిని అల్లాహ్‌ా ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. అల్లాహ్ ఇలా సెల విచ్చాడు: ”తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు.” (అన్‌నిసా-48)
షిర్కె అక్బర్ నాలుగు రకాలు: (అ)దుఆ చేయటంలో, అర్థించ టంలో అల్లాహ్‌ాకు భాగస్వాముల్ని చేర్చటం. (ఆ)సంకల్పంలో ఉద్దేశ్యంలో షిర్క్‌కు పాల్పడటం. (ఇ)విధేయతలో షిర్క్‌కు ఒడి గట్టడం, అంటే అల్లాహ్ హలాల్‌గా చేసిన వాటిని హరామ్‌గా నిర్ధారించటంలో, హరామ్‌గా ఖరారు చేసిన వాటిని హలాల్‌గా చేసుకోవటంలో పండితులు చెప్పినట్లు చేయటం. (ఈ) ప్రేమా భిమానాలలో షిర్క్ అంటే అల్లాహ్‌ాను ప్రేమిస్తున్నంతగా లోకం లోని ఇతర సృష్టిరాశులను ప్రేమించటం. షిర్కె అస్ఘర్ (చిన్న)
షిర్క్): దీనికి ఒడిగట్టిన వారు ఇస్లాం పరిధి నుండి తొలగిపోరు. అయితే సాధ్యమైనంత వరకు చిన్న తరహా షిర్క్ (షిర్క్ అస్ఘర్)కి కూడా దూరంగా ఉండాలి. నలుగురికీ చూపే ఉద్దేశంతో ఒక మంచిపని చేయటం కూడా షిర్కె అస్ఘర్ లోకి వస్తుంది.
ప్రశ్న: షిర్కె అక్బర్-షిర్కె అస్ఘర్ మధ్య గల ముఖ్య తేడా ఏమిటి?
జ: రెండింటి మధ్య ఉన్న కొన్ని తేడాలివి:
షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్)కు పాల్పడినవాడు ప్రపంచంలో ఇస్లాం పరిధిలో ఉండడు. పరలోకంలోనయితే శాశ్వితంగా నరకంలో మ్రగ్గుతూ ఉంటాడు. అయితే షిర్కె అస్ఘర్ (చిన్న షిర్క్)కు పాల్పడి న వ్యక్తి ప్రపంచంలో ఇస్లాం పరిధి నుండి తొలగిపోవటంగానీ, పరలోకంలో శాశ్వితంగా నరకానికి ఆహుతి అవటంగానీ జరగదు. షిర్కె అక్బర్ మనిషి కర్మలన్నింటినీ నాశనం చేసేస్తుంది. కాని షిర్కె అస్గర్ కేవలం మనిషి చేసిన ఆ ఒక్క కర్మనే పాడు చేస్తుంది.
ప్రశ్న: షిర్కె అస్ఘర్‌కి చెందిన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా?
జ: ఉన్నాయి. ఉదాహరణకు: (1) ప్రదర్శనాబుద్ధితో సదాచరణ చేయటం. మహాప్రవక్త(స) ఇలా చెప్పారు: ”మామూలు ప్రదర్శనా భావం కూడా షిర్కే” (ఇబ్బు మాజ) (2) దైవేతరుల పేర ప్రమాణం చేయటం (3) అపశకునాలు చూడటం. అంటే పక్షుల ద్వారా, పేర్ల ద్వారా, స్థలాల దారా, పాచికల ద్వారా, బాణాల ద్వారా మొదలగునవి
ప్రశ్న: ఈ షిర్క్ జరగకముందు జాగ్రత్త పడే అవకాశం ఏదన్నా ఉందా?ఒక వేళ అది జరిగిపోతే దానికి ప్రాయశ్చిత్తం ఏమటి?
జ: పేరుప్రతిష్ఠల కోసం మంచిపనులు చేయాలన్న ప్రదర్శనాబుద్ధి (రియా) నుండి కాపాడుకునే పద్ధతి ఏమిటంటే, చిత్తశుద్ధితో దైవ ప్రసన్నతను ఆశించాలి. మనసులో లేశమైనా ప్రదర్శనాతత్వం రాకుండా ఉండటానికి క్రింద పేర్కొనబడిన దుఆ చేయాలి. దైవ ప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”ప్రజలారా! మీరు ఈ షిర్క్ నుండి మిమ్మల్ని కాపాడుకోండి”. అడిగేవాడొకడు ఇలా అడిగాడు: ‘ఓ దైవప్రవక్తా!(స) అది చీమ కదలిక కన్నా గుట్టుగా ఉన్నప్పుడు మేము దాని పట్ల ఎలా జాగ్రత్త పడేది? దానికి ఆయన(స) ఇలా సూచించారు, మీరు ఈ విధంగా ప్రార్థించండి: ‘ఓ అల్లాహ్ ! తెలిసీ మేము నీకు సహవర్తుల్ని కల్పించే చేష్ట నుండి నీ శరణు వేడుతున్నాము. తెలయని స్థితిలో గనక మా వల్ల షిర్క్ జరిగిపోతే క్షమించమని నిన్ను ప్రాధేయపడుతున్నాము’. (అహ్మద్ )
దైవేతరుల పేర ప్రమాణం చేసినందుకు పరిహారం ఏమిటి? దీని గురించి మహాప్రవక్త(స) ఇలా వక్కాణించారు:’ఎవరయినా లాత్, ఉజ్జాలపై ప్రమాణం చేస్తే వారు లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు) అని అనాలి’. (బుఖారీ,ముస్లిం)అపశకునాలు చూసినందుకు చెందే ప్రాయశ్చిత్తం గురించి చెబుతూ ఆయన(స) ఇలా అన్నారు: ‘అపశకునం మూలంగా తన సంకల్పాన్ని విరమించుకున్నవాడు షిర్క్‌కు పాల్పడ్డాడు’. మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? అని సహచరులు అడిగితే ఆయన (స) ఇలా అన్నారు: ‘మీరు ఈ దుఆ చేయండి: ”ఓ అల్లాహ్ ! నీ మేలు తప్ప మరే మేలూలేదు. నీ భాగ్యం రేఖ తప్ప మరే భాగ్య రేఖాలేదు. నీవు తప్ప మరో నిజదైవం లేనే లేడు.” (అహ్మద్ )
ప్రశ్న: నీకు ఏ మేలు ప్రాప్తించినా అది అల్లాహ్ తరపు నుంచే, మరి నీకు ఏ కీడు కలిగినా అది నీ స్వయంకృతమే అన్న దైవో పదేశంలోని మర్మం ఏమిటి?
జ: ఈ దైవ వాక్యంలో ప్రస్తావించబడిన ‘హసనతిన్’కు దైవా నుగ్రహం, కలిమి, మేలు, మంచి అన్న అర్థం వస్తుంది. ‘సయ్యి అతన్’ అంటే ఆపద, కీడు, లేమి, కష్టం అన్న అర్థం వస్తుంది. నిజానికి ఇవి రెండూ అల్లాహ్‌ా తరపున నిర్థారించబడినవే ‘అను గ్రహం’ మాత్రం అల్లాహ్‌ాకు ప్రత్యేకిం చబడింది. ఎందుకంటే అది ఆయన ఉపకారమే. అయితే ‘ఆపద’ లేక ‘లేమి’ని కూడా అల్లాహ్ ఏదేని ఒక పరమార్థం దృష్ట్యా ఉత్పన్నం చేశాడు. కనుక పారమా ర్థికంగా చూస్తే ఇది కూడా అల్లాహ్ అనుగ్రహభాగ్యమే అను కోవాలి. ఎందుకంటే అల్లాహ్ ఎవరికీ అపకారం చేయడు. ఆయన చేసే ప్రతిదీ ఉపకారంతో కూడి ఉంటుంది. అందుకే మహనీయ ముహమ్మద్(స) ఇలా ప్రవచించారు: ”(ఓ ఆల్లాహ్ !) ప్రతి మేలు నీ చేతుల్లో ఉంది. అయితే కీడు మాత్రం నీకు వర్తిం చదు.” (ముస్లిం )
కనుక చెప్పొచ్చేదేమిటంటే దాసుల పనులన్నీ అల్లాహ్ చే సృజించబడినవే. కాని దాంతోపాటు దాసులు తమ చేజేతులా చేసుకున్న దాని ప్రతిఫలమే అది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ”ఎవరయితే (దైవ మార్గంలో) ఇచ్చాడో, (తన ప్రభువుకు) భయ పడుతూ ఉన్నాడో, ఇంకా సత్పరిణామాన్ని సత్యమని ధృవ పరిచాడో, అతనికి మేము సులవైన మార్గపు సౌకర్యం ఒసగు తాము. మరెవరయితే పిసినారిగా తయారై నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించాడో, సత్పరిణామాన్ని త్రోసిపుచ్చాడో, అతనికి మేము కఠిన మార్గపు సామగ్రిని సమకూరుస్తాము.” (అల్‌లైల్: 5-10)
ప్రశ్న: ”ఫలానా వ్యక్తి వీరమరణం”అని చెప్పటం సమ్మత మేనా?
జ: ఎవరయినా ఒక ప్రత్యేక వ్యక్తి గురించి, అతను అమరగతుడు అని నిర్థారించటం అంటే అతను ఖచ్చితంగా స్వర్గవాసి అని తీర్పు ఇవ్వటం వంటిదే. మహనీయ ముహమ్మద్(స) ఎవరిని స్వర్గ వాసిగా ప్రకటించారో, మరెవరిని నరకవాసి అని చెప్పారో వారిని గురించి తప్ప వేరితరుల గురించి ఈ మేరకు తేల్చి చెప్పే అనుమతి మనలో ఎవరికీ లేదు. ‘వాస్తవస్థితి’ రహస్యంగా ఉంచబడింది. ఒకవ్యక్తి మరణించే క్షణాల్లో ఏ పరిస్థితిలో మరణించాడో, అతని సంకల్పం ఎలా ఉందో మనలో ఎవరికీ తెలీదు. మనిషి కర్మలు అతని ‘ముగింపు’పై ఆధారపడి ఉన్నాయి. మనిషి మనోగతం గురించి, అతని సంకల్పం గురించి ప్రాప్తిస్తుందని ఆశించవచ్చు.
ప్రశ్న: ప్రత్యేకంగా ఒక ముస్లిం వ్యక్తినుద్దేశించి ‘అతను కాఫిర్’ అని శాసించటం ధర్మసమ్మతమేనా?
జ: ముస్లిం ‘కుఫ్ర్’కి సంబంధించిన ఏదైనా పనిని బాహాటంగా చేయనంతవరకు అతనిపై కుఫ్ర్ ,షిర్క్, నిఫాఖ్‌ల తీర్పులు జారీ చేయటం ధర్మసమ్మతం కాదు. ఇక ఆంతర్యాల సంగతంటారా! వాటి గురించి అల్లాహ్కే బాగా తెలుసు.
ప్రశ్న: అల్లాహ్ గృహం కాబా తప్ప మరోచోట ప్రదక్షిణ (తవాఫ్) చేయటం సమ్మతమేనా?
జ: కాబతుల్లాహ్ తప్ప భూమండలంలోని మరోస్థలం-అదెంత పవిత్రమైనా సరే – ప్రదక్షిణ (తవాఫ్) చేయటం ధర్మసమ్మతం కాదు. ఎవరయినా ఇతరత్రా పుణ్య క్షేత్రాలను కాబాగృహంతో పోల్చినా లేక భక్తితో ప్రదక్షిణ చేసినా అల్లాహ్ కు అవిధేయత చూపినట్లే.
ప్రశ్న: నక్షత్రాలను ఆశ్రయించి వర్షం కురిపించమని అర్థింటం ఎప్పుడు షిర్కె అక్బర్ అవుతుంది? ఎప్పుడు షిర్కె అస్గర్ అవుతుంది?
జ: దైవప్రణాళికతో నిమిత్తం లేకుండానే నక్షత్రాలు తమప్రభావం చూపుతామని నమ్మి, వర్షాన్ని నక్షత్రం వైపుకు అంటగట్టే వాడు షిర్కె అక్బర్ (పెద్ద తరహా షిర్క్) కు ఒడిగట్టాడు. మరెవరయితే దైవప్రణాళికననుసరించి నక్షత్రాలు రంగ ప్రవేశం చేస్తాయనీ, అల్లాహ్‌ా ఫలానా నక్షత్రాన్ని వర్షం కురవ టానికి ముఖ్య కారణంగా చేస్తాడని, ఫలానా నక్షత్రం ఆకాశంలో కనిపించినపుడు వర్షం కురుస్తుందని నమ్మకం ఉంచాడో అతని ఈ నమ్మకం అధర్మం. (హరామ్ ) అవుతుంది. ఇదే షిర్కె అస్గర్‌గా కూడా భావిం చబడుతుంది. ఎందుకంటే అతను షరీయత్ పరమయిన ఎలాంటి ఆధారం, నిదర్శనం లేకుండానే, హేతుబద్ధంగా కూడా ఎలాంటి ప్రమాణం లేకుండానే ఒక మూఢ నమ్మకాన్ని కల్పించుకున్నాడు. అయితే ఏడాదిలోని వివిధ రుతువులను, వాతావరణాన్ని ఆధారంగా చేసుకుని ముందస్తు వర్ష సూచన చేయటం సమ్మతమే.
ప్రశ్న: పాపాలు ఎన్ని రకాలు?
జ: పాపాలు రెండు రకాలు. (1) పెద్ద తరహా(కబీరా)పాపాలు.
ప్రశ్న:చిన్న తరహా(సగీరా) పాపాలు. పరిగణించే పరిస్థితులు కూడా ఉంటాయా?
జ: అవును. ఉంటాయి. మనిషి తాను చేసే పాపకార్యాలపై ఏ మాత్రం సిగ్గు పడకుండా మాటిమాటికీ చేస్తూ ఉండటం, వాటిని చాలా చిన్న తప్పులుగా భావించి నిశ్చింతగా ఉండటం, పైగా వాటి పై గర్వపడటం, పబ్లిగ్గా చేస్తూ తిరగటం-ఇలాంటివన్నీ పెద్ద పాపాల కు దారి తీస్తాయి.
ప్రశ్న: పశ్చాత్తాపం (తౌబా) గురించి ఏమని ఆజ్ఞాపించబడింది? పశ్చాత్తాపం ఎట్టి పరిస్థితిలో ఆమోదించబడుతుంది?
జ: సాధ్యమైనంత తొందరగా మనిషి తన తప్పుపై సిగ్గు పడి క్షమా పణ వేడుకోవాలి. మనిషి వల్ల తప్పు జరిగిపోవటం ఏమంత తీవ్ర మైన విషయం కాదు. తప్పు అనేది మనిషి నైజంలోనే అంతర్లీనమై ఉంది. ఈ నేపథ్యంలో మానవ మహోపకారి ముహమ్మద్ (స) ఏమ న్నారో చూడండి: ”ప్రతి మనిషి దోషమున్నవాడే. అయితే దోషుల్లో అత్యుత్తములెవరంటే తప్పు జరగ గానే పశ్చాత్తాపం చెందేవారు” (తిర్మిజి) ఆయన (స) ఇంకా ఇలా ప్రబోధించారు: ”ఒకవేళ మీరు తప్పు చేయకపోతే అల్లాహ్ మిమ్మల్ని తుదముట్టించి మీ స్థానంలో మరో సముదాయాన్ని తీసుకు వస్తాడు. వారు తప్పులు చేసి క్షమాభిక్ష (ఇస్తిగ్ఫార్) వేడుకుంటారు. అల్లాహ్ వారిని మన్నించి వదలి పెడతాడు” (ముస్లిం) అయితే చేసిన తప్పుపై సిగ్గుతో కుమిలిపోకుండా, తాను చేసింది ముమ్మాటికీ కరెక్టే అని మంకు పట్టు పట్టడం అతి పెద్ద తప్పు. పశ్చా త్తాపం చెందటంలో తాత్సారం చేయటం కూడా మంచిది కాదు. ఈ పూర్వ రంగంలో ఉన్న దైవాదేశం ఏమిటో చూడండి: ”అవివేకం వల్ల చెడు కార్యానికి పాల్పడి, (వెంటనే రుజువర్తనులై) పశ్చాత్తాప పడతాుం. పశ్చాత్తాపం చెందినవారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ ఆమోదిస్తాడు.” పశ్చాత్తాపం (తౌబా) స్వీకారయోగ్యం కావటానికి క్రింది షరతులకు కట్టుబడాలి:- (1) చేసిన తప్పు నుండి వెంటనే మరలి రావాలి. (2) గతంలో జరిగిన పాపాలపై సిగ్గుతో కుమిలిపోవాలి. (3) ఇక మీదట ఆ పాపాలకు పాల్పడబోనని దృఢ సంకల్పం చేసుకోవాలి. (4) ఒకవేళ ఆ పాపాలు సాటి మానవుల హక్కులతో ముడిపడి ఉంటే ఆ బాధితుల హక్కులు తిరిగి ఇవ్వాలి.
ప్రశ్న: ప్రతి పాపానికి పశ్చాత్తాపం (తౌబా) చేసుకోవచ్చా? పశ్చాత్తాప గడువు ఎప్పటి వరకుంది? పశ్చాత్తాపం చెందేవాడికి లభించే ప్రతిఫలం ఏమిటి?
జ: అవును. ప్రతి పాపానికి పశ్చాత్తాపం చెందే అవకాశముంది. సూర్యుడు పడమటి దిక్కున ఉదయించేవరకూ పశ్చాత్తాపద్వారం తెరచు కునే ఉంటుంది. లేదా మనిషికి మరణఘడియలు సమీపించి అపస్మారక స్థితికి చేరక ముందు వరకూ ఈ అవకాశం ఉంటుంది. పశ్చాత్తాపం చెందేవాడు తన పశ్చాత్తాప విషయంలో సంకల్పశుద్ధి కలిగి ఉంటే అల్లాహ్ అతని పాపాలను పుణ్యకార్యాలుగా మార్చి వేస్తాడు – ఒక వేళ అతని పాపాల పుట్ట అంబరాన్ని అంటుకుంటున్నా సరే.
ప్రశ్న: ఒక ముస్లిం పరి పాలకునికి గల హక్కు ఏమిటి?
జ: సానుకూల పరిస్థిలోనూ,ప్రతికూల పరిస్థితిలోనూ పరిపాలకుని మాట వినాలి. అతని ఆజ్ఞల్ని మనస్ఫూర్తిగా శిరసావహించాలి. ఒకవేళ అతను వేధించినా సరే అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయ కూడదు. అతన్ని శపించకూడదు. అతను పాపం, అవిధేయత కార్యాలు చేయమని ఆజ్ఞాపించకుండా ఉన్నంతవరకూ అతనికి విధేయులై మసలుకోవాలి. అతని విధేయతను దేవుని విధేయతలో ఒక భాగంగా భావించాలి. పరిపాలకుని యోగ క్షేమాలను కోరతూ ప్రార్థించాలి. ఒక వేళ ఏ ముస్లింకయినా పాపకార్యానికి సంబంధించి ఆజ్ఞాపిస్తే దాన్ని పాలించకూడదు. సత్కార్యాలలో హృదయపూర్వకంగా సహకరించాలి. శిరసావహించాలి. ఈ విషయమై మహనీయ ముహమ్మద్(స) ఏమని ఉపదేశించారో చూడండి: ”అమీర్ (నాయకుని) మాట వినండి, అతనికి విధేయులై ఉండండి, ఒకవేళ మీ వీపుపై కొరడా ఝళిపించబడినా, మీ సొమ్ము తీసేసుకో బడినా సరే-మీరు అతని మాట వినండి, విధేయతచూపండి.” (ముస్లిం)
ప్రశ్న: మంచీ-చెడుల విషయంలో దేవుని యుక్తికి సంబంధించి విన్న వించుకోవటం సమంజసమేనా?
జ: అవును. మంచీ-చెడుకి సంబంధించి యుక్తిని అర్థించటం సబబే. కాని ఈ అర్థింపు విశ్వాసాన్ని (ఈమాన్) ఆచరణను, మానసిక స్థిమి తాన్ని అనిశ్చితికి లోను చేయకుండా ఉండాలన్నది షరతు.