అల్లాహ్ స్మరణ ఎంతో శ్రేష్ఠతరమయినది. మనిషి ఆశయాల్లోకెల్లా గొప్ప ఆశయం అల్లాహ్‌ా స్మరణ. అల్లాహ్‌ా సామిప్యాన్ని పొందే సాధనాల్లో గొప్ప సాధనం అల్లాహ్ స్మరణ. ఈ కారణంగానే అల్లాహ్‌ా స్వయంగా తన్ను స్మరిం చాలని ఖుర్ఆన్లో పలు చోట్ల ఆదేశించాడు: ”హజ్జ్ క్రియలిన్నింటినీ నిర్వర్తించిన తర్వాత అల్లాహ్‌ను ధ్యానించండి. మీ తాతముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే, ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్‌ను స్మరించుకోండి”. (అల్ బఖరహ్: 200)
అల్లాహ్ స్మరణ గురించి ఖుర్ఆన్లో ఇంత నొక్కి చెప్పడం జరిగిందంటే కారణం, అల్లాహ్ స్మరణ అనే వజ్రాయుధ అవసరం ఎప్పుడూ దాసునికి ఉంటుంది.అల్లాహ్ స్మరణ పట్ల రెప్పపాటు అలక్యం మనిషి పాలిట మహా గండంగా పరిణమిస్తుంది. ఏ ఘడినయితే మనిషి విస్మరణకు లోనవుతాడో ఆ ఘడియ అతనికి ప్రతికూలంగా తయారవుతుంది. ఆ ఘడియలో అతను పొందిన లాభంకాన్న అతనికి జరిగిన నష్టమే అధికం. ”అల్లాహ్‌ా స్మరణ పట్ల విస్మరణ గురయిన వ్యక్తిపై మేము షైతానును నియమిస్తాము, ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు”. (జుఖ్రుఫ్: 36)
”రేపు ప్రళయ దినాన అల్లాహ్ స్మరణకుగాను ఆయన ప్రసాదించే బహు మానాన్ని చూసి తన జీవితంలో అల్లాహ్ స్మరణ లేకుండా గడిపిన ఘడియల్ని తలచుకుంటూ దాసుడు చింతిస్తాడు” అన్నారు ప్రవక్త (స). అలాగే ఆయన అన్న మాట: ”ఏ వర్గమయితే ఓ చోట సమావేశమయి అల్లాహ్‌ను స్మరించకుండానే విడిపోతుందో రేపు ప్రళయ దినాన ఆసమావేశంపై కన్నీరు మున్నీరవుతుంది”. (అబూ దావూద్, హాకిమ్)
అల్లాహ్‌ను స్మరించుకోవడం అంటే ఆయనకు విధేయత చూపడమే. సంబర ఘడియల్లో తేలియాడుతున్నా, సంతాప సాగరంలో కొట్టుమ్డితున్నా సర్వకాల, సర్వావస్థల్లోనూ ఆయన్నే తలచుకోవాలి, ఆయన బాటనే నడుచు కోవాలి. ఆయన ప్రసన్నత కోసమే పాటు పడాలి.ఆయన ఇలా అంటున్నాడు: ”మీరు నన్ను స్మరించండి.నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుాంను. మరియు నాకు కృతజ్ఞతలు తెలుపండి. చేసిన మేలును మరచి ధిక్కార వైఖరిని అవలం బించకండి”. (బఖరహ్‌ా: 152)
బిస్మిల్లాహ్తో ప్రారంభించని కార్యం శుభరహితం:
ప్రవక్త (స) అన్నారు: ”అల్లాహ్ నామం (బిస్మిల్లాహ్)తో ప్రారంభించని ప్రతి పని కుష్టు రోగి వలే (శుభ రహితమయి) ఉంటుంది”. మరో సందర్భంలో ఆయన ఇలా అన్నారు: ”అల్లాహ్‌ను స్తుతించకుండా (అల్హమ్దులిల్లాహ్ అనకుండా) చేపట్టిన ప్రతి ముఖ్యమయిన పని అసంపూర్ణంగానే మిగిలిపోతుంది, పూర్తవదు”. (అబూ దావూద్) కాబ్టి మనం ఏ అవస్థలో ఉన్నా అల్లాహ్‌ను స్మరించుకుంటూనే ఉండాలి. ”మీ ప్రభువు ఉదయమూ, సాయంత్రమూ స్మరించు. లోలోపలే వినయంతోనూ, భక్తితోనూ, మెల్లగా నోితోనూ స్మరిస్తూనే ఉండు. విస్మరణ కు లోనయ్యేవారిలో నువ్వు చేరకు”. (ఆరాఫ్: 205) ఎందుకంటే ”అల్లాహ్ స్మరణ అన్నింకంటే మహత్పూర్వకమయినది, మహిమాన్వితమయిదీను” (అన్కబూత్: 45)
ఓ సారి ప్రవక్త (స) సభికుల్ని ఉద్దేశించి-”మీ కర్మలన్నింలో శ్రేష్ఠతరమైన కర్మను గురించి నేను మీకు తెలుపనా? అది మీ ప్రభువు దృష్టిలో అత్యంత పరిశుద్ధమయినది. అది అన్నింకంటే అధికంగా మీ అంతస్థులను పెంచేది. మీరు వెండి బంగారాలు దానం చెయ్యడంకన్నా ఎంతో మేలయినది. మీరు శత్రువులతో తలపడి వారు మీ మెడలను నరికి,మీరు వారి మెడలను నరక డంకన్నా ఎంతో గొప్పది” అన్నారు. అందుకు సహాబా ‘తప్పకుండా సెలవియ్యండి ఓ దైవప్రవక్తా!’ అన్నారు. దానికాయన ఇచ్చిన సమాధానం – ”ఆ శ్రేష్ఠ కార్యం అల్లాహ్‌ాను స్మరించడం-జిక్రుల్లాహ్ా”. (తిర్మిజీ) మరో సంద ర్భంలో ”తన ప్రభువు స్మరించే వాని, స్మరించని వాని ఉపమానం బ్రతికున్న, చనిపోయిన వ్యక్తి వింది” అన్నారు. (బుఖారీ)
బలమైన రక్షక కోట జిక్ర్:
అల్లాహ్ స్మరణ జిత్తులమారి షైతాన్ ఎత్తులను చిత్తు చేస్తుంది: ”నిశ్చయంగా అల్లాహ్‌ా భీతిపరులు తమకు ఎప్పుడయినా షైతాన్ తరఫు నుంచి చెడు తలంపు కలిగినప్పుడు అల్లాహ్‌ా స్మరణలో లీన మయిపోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది”. (ఆరాఫ్: 201)
ఈ సందర్భంగా ప్రవక్త యహ్యా (అ) చేసిన మహోపదేశం గమనార్హం: ”అల్లాహ్‌ను స్మరించవలసిందిగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. దాని ఉపమానం-ఆ వ్యక్తి వంటిది -శత్రువులు అతన్ని వెంబడించ సాగారు. అతను వారి బారి నుండి తప్పించుకు పారిపోతూ ఓ బలమైన కోటలోకెళ్లి తల దాచుకున్నాడు. (వారతన్ని ఏమి చేయలేకపోయారు.) ఆ వ్యక్తి వంటి వాడే ప్రతి దాసుడు. అతను షైతాన్ బారి నుండి తన్ను తాను కాపాడుకోవాలంటే ఒకటే మార్గం – అదే అల్లాహ్ స్మరణ, అదే బలమయిన కోట”. (తిర్మిజీ)
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) ఇలా అన్నారు: ”షైతాన్ ఆదమ్ పుత్రుని హృదయాన్ని వశ పర్చుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. ఆతను గనక అల్లాహ్ స్మరణ పట్ల విస్మరణకు లోనయితే అతనిలో అనేక సందేహాల్ని, శంకల్ని, సంశయాలను కలిపిస్తాడు. అదే అతను అల్లాహ్‌ాను స్మరిస్తే తోక ముడిచి పారి పోతాడు”. (అల్ వాబిలుస్సయ్యిబ్)
కీర్తికి కలికితురాయి జిక్ర్:
ప్రవక్త (స) అన్నారు: ”ఉదయం సాయంత్రం కరుణామయుని సదనాలలో పాల్గొనండి. అల్ల్లాహ్‌ను స్మరించండి. అల్లాహ్ దగ్గర తన స్థానమేదో తెలుసుకోవాలనుకునే వ్యక్తి-తన దగ్గర అల్లాహ్ స్థానం ఎలాంటిదో చూసుకోవాలి, దాసుడు అల్లాహ్‌కు ఎలాంటి స్థానాన్నయితే ఇస్తాడో అల్లాహ్ అతనికి (ముస్తద్రక్)
స్వర్గ వనాలు జిక్ర్ సదనాలు:
అనస్ (ర) గారి కథనం – ప్రవక్త (స) ఇలా అన్నారు: ”మీరు స్వర్గ వనాల గుండా వెళితే తనివితీరా వాిలో సేద తీరండి”. అది విన్న సహాబా ‘స్వర్గ వనం’ అంటే ఏమి? అని ప్రశ్నించారు. ”జిక్ర్ సదనాలు” అని బదులిచ్చారు ప్రవక్త (స). (తిర్మిజీ)
అబ్దుల్లాహ్ బిన్ రవాహా (ర) తన సహచరుల్లోని ఒకరి చెయ్యి పట్టుకుని – ”రండీ! ఓ ఘడియ కోసం మనం మన విశ్వాసాన్ని మెరుగు పర్చుకుందాం రండీ! మనం అల్లాహ్‌ాను స్మరించుకుందాం రండీ! ఆయన విధేయత ద్వారా మన విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసుకుందాం! బహుశా ఆయన మనల్ని తన క్షమాభిక్షకు అర్హుల్ని చేసి మనల్ని గుర్తు పెట్టుకోవచ్చు” అనేవారు.