మనిషి సంఘజీవి అన్న మాట ఎంత నిజమో, మనిషి తనకు తెలియని దానికి శత్రువు అన్న మాట కూడా అంతే నిజం.మనిషి జీవించడానికి సంఘం, సమాజం ఎంత అవసరమో, మనిషి ప్రశాంతంగా బ్రతకడానికి పరస్పర అవగాహన, సహిష్ణుత, సహనం, స్నేహ వాతావరణం అంతే అవస రం. ఈ కోణం నుండి చూస్తే మనలోని ప్రతి ఒక్కరూ ఎదుివారి గురించి, వారి మత విశ్వాసాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో భాగమే ఇస్లాంలో దైవప్రవక్తల వైశిష్ఠ్యం పట్ల అవగాహన.
మానవ మేధస్సు, మనో వాంఛలు, ప్రయత్నాలు ఇవి మాత్రమే అతన్ని విజయ బాటన పయనింపజేయడం అనేది అసాధ్యం. వీటితోపాటు దైవ మార్గదర్శకత్వపు కాంతి తోడయినప్పుడే మానవ జీవన వ్యవస్థ ఫలప్రదం కాగలదు అన్నది ఓ కాదనలేని అనివార్యమయిన యదార్థం. నిజానికి ఈ విశ్వ వ్యవస్థ అంతా దేవుని సృష్టి. మానవుడు ఆ దేవుని సృష్టిలో ప్రధాన అంశం. అతని మార్గదర్శనార్థం బుద్ధివివేకాలతోపాటు ప్రవక్తల, గ్రంథాల ఏర్పాటు కూడా చేశాడు. బుద్ది గాడి తప్పినప్పుడల్లా ప్రవక్తలనే ఈ ఉత్తమ గణం, మరియు గ్రంథం ద్వారా వారిని దారి మీదకు తీసుకు రావడం జరిగేది
ప్రవక్తల ఎంపిక:
ప్రవక్తల ఈ ఎంపికను గురించి ఖుర్‌ఆన్ ఇలా పేర్కొం టుంది: ”అల్లాహ్‌ాయే దైవదూతలలో నుంచి, మానవులలో నుంచి తన సందేశహరులను ఎంపిక చేసుకుాండు. నిశ్చయంగా అల్లాహ్‌ా అంతా వినేవాడు, అన్ని చూసేవాడు”. (అల్ హజ్జ్: 75)
ప్రతి జాతిలోనూ ప్రవక్త:
ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన మొత్తం ప్రవక్తల సంఖ్య 25. దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) వారి ప్రవచనాల ద్వారా రూఢి అయిన సంఖ్య 1 లక్ష 24 వేలు. వారిలో 315 మంది రసూల్-దైవదౌత్యం తోపాటు ధర్మశాస్త్రం సయితం ప్రసాదించబడిన వారు. 315 మంది రసూల్‌లలో అయిదుగురు వజ్ర సంకల్పులయిన ప్రవక్తలు. 1) ప్రవక్త నూహ్‌ా. 2) ప్రవక్త ఇబ్రాహీమ్ 3) ప్రవక్త మూసా 4) ప్రవక్త ఈసా (అ). 5) అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స). ప్రవక్తలు ప్రతి జాతిలోనూ వచ్చారు అంటుంది ఖుర్‌ఆన్: ”నిశ్చయంగా మేము ప్రతి సముదాయంలోనూ ఒక ప్రవక్తను ప్రభవింప జేశాము”. (నహల్; 36)
ప్రవక్తలందరి ఉమ్మడి లక్ష్యం:
”ఓ ప్రవక్తా! నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా ‘నేను తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి’ అనే సందేశాన్ని (వహీని) అతనికి పంపాము”. (అన్బియా: 25) ”ప్రజలారా! అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి”. (నహల్: 36)
ప్రవక్తల ప్రభవనానికి పరమార్థం:
”మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము. ప్రవక్తల ఆవిర్భావం తర్వాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించడానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగల కూడదని (మేమిలా చేశాము). అల్లాహ్ సర్వాధిక్యుడు, మహా వివేక”. (అన్నిసా: 165)
ప్రవక్తలు మానవ మాత్రులే:
”ఓ ప్రవక్తా! నీకు పూర్వం పంపిన ప్రవక్తలందరూ కూడా అన్నం తినేవారు. బజార్లలో సంచరిచిన వారే”. (ఫుర్ఖాన్: 20) ”ఓ ప్రవక్తా! ఇలా అను: ‘నిశ్చ యంగా నేనూ మీలాిం మానవ మాత్రడను మాత్రమే. కాకపోతే మీ అందరి ఆరాధ్యుడు ఒకే ఒక్క పూజ్యనీయుడు అన్న దివ్యావిష్కృతి నా వద్దకు పంపబడుతుంది”. (అల్ కహఫ్: 110)
ప్రవక్తలు పాపరహితులు:
”మేము గ్రంథాన్నీ, వివేకాన్నీ, ప్రవక్త పదవినీ ప్రసాదించింది వీరికే…అల్లాహ్ సన్మార్గం చూపిన వారు కూడా వీరే”. (అన్‌ఆమ్:89)
”వారంతా మా వద్ద ఎన్నుకోబడినవారు, ఉత్తములు”. (సాద్: 47)
”ఇది కరుణామయుడయిన (అల్లాహ్‌ా) చేసిన వాగ్దానం. ప్రవక్తలు చెప్పింది నిజం”. (యాసీన్: 52)
”ఒక ప్రవక్త ద్రోహానికి పాల్పడటమనేది జరగని పని”.(అల్ ఇమ్రాన్: 161)
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స):
”ప్రజలారా! ముహమ్మద్ మీ మగవారిలో ఎవరికీ తండ్రి కాడు. యాదార్థంగా ఆయన అల్లాహ్‌ా యొక్క సందేశహరుడు. ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు. అల్లాహ్‌ా ప్రతిదీ తెలిసినవాడు”. (అహ్‌ాజాబ్: 40)
ఆయన సమస్త మానవాళికి ప్రవక్త: ”(ఓ ముహమ్మద్) మేము నిన్ను సమస్త జనులకు శుభవార్తను అందజేసే వానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు”. (సబా: 28)
ఆయన సకలోకాల పాలిట కారుణ్య:
”(ఓ ముహమ్మద్) మేము నిన్ను సమస్త లోకాల పాలిట కారుణ్యంగా చేసి పంపాము”. (అన్బియా: 107)
ఆయన మానవ మహోపకారి:
”మీ వద్దకు స్వయంగా మీలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుాండు”. (తౌబహ్: 128)
ఆయన ప్రభవనం ఓ అనుగ్రహం:
”అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోప కారం-ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను వారి వద్దకు పంపాడు”. (ఆల్ ఇమ్రాన్: 164)
ఆయనపై ధర్మం సంపూర్ణమయింది:
”ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను”. (మాయిదహ్; 3)
ప్రవక్త అనుసరణే పరమావధి:
”ఈ సందేశహరుణ్ణి, నిరక్షరాసి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు (కరుణించబడతారు)……కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటునందిస్తారో, ఇంకా ఇతనితో పంపబడిన జ్యోతి (ఖూర్‌ఆన్)ని అనుసరిస్తారో వారే వాస్తవంగా సాఫల్యవంతులు”. (ఆరాఫ్: 157)